Jump to content

పోలవరం జిల్లా

Coordinates: 17°26′20″N 81°46′30″E / 17.439°N 81.775°E / 17.439; 81.775
వికీపీడియా నుండి
పోలవరం జిల్లా
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన స్పిల్ వే ముందు భాగం వైమానిక దృశ్యం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన స్పిల్ వే ముందు భాగం వైమానిక దృశ్యం
ఆంధ్రప్రదేశ్ లో పోలవరం జిల్లా
ఆంధ్రప్రదేశ్ లో పోలవరం జిల్లా
పటం
Coordinates: 17°26′20″N 81°46′30″E / 17.439°N 81.775°E / 17.439; 81.775 రాష్ట్రం
దేశం భారతదేశం
ప్రాంతంఉత్తరాంధ్ర
ఏర్పడింది2025 డిసెంబరు 30
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రధాన కార్యాలయంరంపచోడవరం
అతిపెద్ద నగరంరంపచోడవరం
జనాభా3,49,953
పరిపాలనా విభాగాలు
భాష
 • అధికారిక భాషతెలుగు
అక్షరాస్యత
కాల మండలంUTC+05:30 (IST)

పోలవరం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో 2025 కొత్తగా ఏర్పడిన ఒక జిల్లా. ఈ జిల్లా ముఖ్యపట్టణం రంపచోడవరం. [1][2] ఈ జిల్లా ఏర్పాటుకు 30 రోజులలోగా ప్రజలనుండి అభ్యంతరాలు, సూచనలు 30 రోజులలోపు తెలియుజేయుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన జి.ఓ.ఆర్.టి. సంఖ్య 1492, తేదీ:2025 నవంబరు 27న ప్రాథమిక ప్రకటన జారీచేసింది.

ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై మంత్రివర్గం 2025 డిసెంబరు 30న సమీక్షించిన తరువాత, జిల్లా కార్యకలాపాలు 2025 డిసెంబరు 31 నుండి అమలులోకి తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన జి.ఒ.ఎమ్.యస్. సంఖ్య: 517 రెవెన్యూ (ల్యాండ్స్ -IV) శాఖ 2025 డిసెంబరు 30న ఫైనల్ నోటిఫికేషన్ జారీచేసింది.

ఆ నాటి నుండి ఈ జిల్లా ఉనికిలోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి 12 మండలాలను విభజించగా ఈ జిల్లా ఏర్పడింది.[3]

శబ్దవ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న బహుళార్ధసాధక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు పేరు మీద ఈ జిల్లాకు పేరు పెట్టారు.

చరిత్ర

[మార్చు]

2025 డిసెంబరు 31న, రంపచోడవరం డివిజనను అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి వేరు చేయబడింది. గతంలో పోలవరం జిల్లా ప్రాంతం తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉండేది.[4]

జిల్లాలోని పరిపాలనా విభాగాలు

[మార్చు]

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని, రంపచోడనరం రెవెన్యూ డివిజను నుండి 8 మండలాలు, చింతూరు రెవెన్యూ డివిజను నుండి 4 మండలాలు విభజించి మొత్తం 12 మండలాలు ఈ జిల్లాలో చేర్చారు.

రాజకీయాలు

[మార్చు]

పోలవరం జిల్లాలో ఒక పార్లమెంటరీ నియోజకవర్గం, ఒక శాసనసభ నియోజకవర్గం ఉన్నాయి.

పార్లమెంటరీ నియోజకవర్గం

[మార్చు]

శాసనసభ నియోజకవర్గం

[మార్చు]
నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు రిజర్వ్ చేయబడింది

(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)

నియోజకవర్గం
53 రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం[5] ఎస్.టి. అరకు లోక్‌సభ నియోజకవర్గం

జిల్లాలోని మండలాలు

[మార్చు]

ఈ జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 831 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో 80 నిర్జన గ్రామాలు. జిల్లా మొత్తం జనాభా 4,01,433. వారిలో పురుషులు 1,96,232 మంది ఉండగా, స్త్రీలు 2,05,201 మంది ఉన్నారు.

జిల్లా లోని మండలాలు, గ్రామాలు , జనాభా గణాంకాలు
వ.సంఖ్య రెవెన్యూ డివిజను మండలం మొత్తం రెవెన్యూ గ్రామాలు నిర్జన గ్రామాలు నిర్జన గ్రామాలు పోను పురుషులు స్త్రీలు మండల జనాభా

(2011

రిమార్కులు
1 రంపచోడవరం రెవెన్యూ డివిజను రంపచోడవరం 76 3 73 19,185 20,166 39,351
2 దేవీపట్నం 46 2 44 13,669 14,509 28,178
3 వైరామవరం 78 3 75 7,342 7,938 15,280 వై.రామవరం మండలం నుండి 48 గ్రామాలు విభజించి, 2025 అక్టోబరులో ఏర్పడిన గుర్తేడు మండలంలో విలీనమయ్యాయి
4 గుర్తేడు 59 9 50 6,471 6,995 13,466 వై రామవరం మండలం నుండి 48 గ్రామాలు విభజించగా గుర్తేడు మండలం 2025 అక్టోబరులో ఏర్పడింది
5 అడ్డతీగల 99 11 88 18,686 18,555 37,241
6 గంగవరం 60 6 54 12,393 13,519 25,912
7 మారేడుమిల్లి 71 13 58 10,166 9,341 19,507
8 రాజవొమ్మంగి 62 1 61 19,102 20,480 39,582
1 చింతూరు రెవెన్యూ డివిజను ఎటపాక 73 8 65 44,029 45,019 89,048 (తెలంగాణ విభజించక ముందు ఎటపాక మండలం భద్రాచలం మండలం పేరుతో ఉంది. భద్రాచలం మండంలోని అన్ని గ్రామాలు (భద్రాచలం పట్టణం తప్ప) పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయబడ్డాయి
2 చింతూరు 89 9 80 20,667 21,359 42,026
3 కూనవరం 56 8 48 12,351 13,894 26,245
4 వరరామచంద్రపురం 62 7 55 12,171 13,426 25,597
మొత్తం 831 80 751 1,96,232 2,05,201 4,01,433

మూలాలు

[మార్చు]
  1. G.O.MS.No. 517, REVENUE (LANDS-IV)DEPARTMENT, Dated: 30-12-2025
  2. Ahmed, Syed (2025-12-30). "ఏపీలో అమల్లోకి కొత్త జిల్లాలు..! నోటిఫికేషన్-రేపటి నుంచి ఆ రెండూ ..!". Telugu.oneindia. Retrieved 2025-12-30.
  3. ABN. "District Reorganization: అన్నమయ్య.. అటూ ఇటూ". Andhrajyothy Telugu News. Retrieved 2026-02-13.
  4. "Andhra Pradesh Cabinet approves formation of two new districts, headquarters status for Madanapalle". The New Indian Express (in ఇంగ్లీష్). 30 December 2025.
  5. "District-wise Assembly-Constituencies". ceoandhra.nic.in.