పోలవరపు కోటేశ్వరరావు
Jump to navigation
Jump to search
పోలవరపు కోటేశ్వరరావు | |
---|---|
జననం | వీరమాచినేని వారి పాలెం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లా | 1929 జూలై 26
మరణం | 2008 మార్చి 2 | (వయసు 78)
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు రచయిత |
గుర్తించదగిన సేవలు | కృష్ణాతరంగాలు, రాజముద్రిక |
పిల్లలు | 3 కుమారులు, 1 కుమారుడు |
పోలవరపు కోటేశ్వరరావు తెలుగు రచయిత. నాటికలు, నాటకాలు, నవలలు, కథలు, నృత్యరూపకాలు, యక్షగానాలు, బుర్రకథలు మొదలైన ప్రక్రియలలో 100కు పైగా గ్రంథాలను రచించాడు. ఇతడు కృష్ణా జిల్లా, దివిసీమ సమీపంలోని శ్రీకాకుళం శివారు వీరమాచినేనివారిపాలెంలో 1929, జూలై 26న జన్మించాడు.
రచనలు
[మార్చు]- అక్షరాన్వేషణ (జీవితచరిత్ర)
- కొండవీటి ప్రాభవం - శ్రీనాథుని వైభవం
- కాకుళయ్య కథలు
- కృష్ణాతరంగాలు
- మావూరి మనుషులు
- లచ్చుమయ్య కథలు
- రాజముద్రిక
- నాటి గాధలు - నేటి కథలు
- మనము - మన నృత్యాలు
- చినబాబు
- మహాత్మా జిందాబాద్ (నాటిక)
- నృత్యారాధన - హిందూ దేవతలు
- కృష్ణవేణి
- చాటుకవిసార్వభౌమ శ్రీనాథుని చాటువులు
- శ్రీనాథులవారొచ్చారు (నాటిక)
- ఆముక్తమాల్యద - ఆంధ్రమహావిష్ణువు అను రాయలు-రంగన్న(నాటిక)
- సోమూరి జీవితం
- కృష్ణా గోదావరి బేసిన్ - నూనె, సహజవాయు సంపద
పురస్కారాలు
[మార్చు]- 1998లో ఆంధ్రపదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారాన్ని అందుకున్నాడు.[1]
- 2006లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఏటుకూరి వెంకటనరసయ్య మెమోరియల్ ఎండోమెంట్ అవార్డు.[2]
మరణం
[మార్చు]ఇతడు తన 79 యేళ్ల వయసులో విజయవాడలో 2008, మార్చి 2వ తేదీన మరణించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-07. Retrieved 2020-07-07.
- ↑ సంపాదకుడు (1 April 2008). "పోలవరపు కోటేశ్వరరావు" (PDF). సాహిత్య ప్రస్థానం. 6 (30): 16. Retrieved 7 July 2020.