Jump to content

పౌరశాస్త్రం

వికీపీడియా నుండి

పౌరుల, వారి హక్కులు, బాధ్యతల అధ్యయనానికి సంబంధించిన సమగ్ర అధ్యయన శాస్త్రమే పౌరశాస్త్రం. ఇది రాజకీయ శాస్త్రంలో ఒక భాగం. ఆంగ్లంలో సివిక్స్ (Civics)గా పిలువబడే ఈ పదం లాటిన్ పదమైన సివికస్ నుండి ఉద్భవించింది. "పౌరునికి సంబంధించింది" అని దీని అర్ధం. ప్రపంచ వ్యాప్తంగా పౌర శాస్త్రానికి మంచి గుర్తింపు ఉంది. ప్రాచీన రోమన్ కాలంలో ఈ పదం సివిక్ క్రౌన్ ( లాటిన్ : కరోనా సివికా ) ను కూడా సూచిస్తుంది , ఇది తోటి పౌరుల ప్రాణాలను కాపాడిన రోమన్లకు ఇచ్చే ఓక్ ఆకుల దండ. [1] పౌర శాస్త్ర అధ్యయనాలను ప్రాచీన చైనాలో కన్ఫ్యూషియస్ సిద్దాంతాలతోనూ, పురాతన గ్రీస్‌లో ప్లేటో ప్రతిపాదించిన సిద్ధాంతాల నుండి గుర్తించవచ్చు.

నిర్వచనం

[మార్చు]

మెరియం-వెబ్‌స్టర్ నిఘంటువు పౌర శాస్త్రాన్ని "పౌరుల హక్కులు మరియు విధులను అధ్యయనం చేసే జ్ఞాన శాఖ అనీ, ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో విశ్లేషణ" అని నిర్వచిస్తుంది. Dictionary.com పౌర శాస్త్రాన్ని "పౌరుల హక్కులు, డిమాండ్ల శాస్త్రం" అని నిర్వచిస్తుంది.

మూలాలు

[మార్చు]