ప్యాంక్రియాటిక్ క్యాన్సర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Pancreatic Cancer
Classification and external resources
Illu pancrease.svg
ICD-10C25
ICD-9157
OMIM260350
DiseasesDB9510
MedlinePlus000236
eMedicinemed/1712
MeSHD010190

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది క్లోమగ్రంథిలో జరిగే అనూహ్య పరిణామాల (మలిగ్నంట్ నియో ప్లాస్మ్) వల్ల వస్తుంది. 2010 చివరికల్లా అమెరికాలో 43,140 మంది దీని బారిన పడతారని మరియు 36,౮౦౦ మంది ఈ వ్యాధితో చనిపోతారని అంచనా వేయబడింది.[1] ఫలితాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన వారిలో వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత 5 ఏళ్ల వరకు బతికే వారు కేవలం 5శాతం మందే ఉంటున్నారు. పూర్తిగా కోలుకోవడం అనేది ఇప్పటికీ చాలా అరుదు.[2]

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లలో 95 శాతం అడినోకార్కినోమాల వల్లే వస్తాయి.మూస:ICDO మిగతా 5శాతం అడినోస్క్వామస్ కార్కినోమాలు, సిగ్నెట్ రింగ్ సెల్ కార్కినోమాలు, హెపటాయిడ్ కార్కినోమాలు, కొల్లాయిడ్ కార్కినోమాలు, అన్ డిఫరెన్షియేటెడ్ కార్కినోమాలు మరియు భారీ కణాలతో కూడిన అన్ డిఫరెన్షియేటెడ్ కార్కినోమాలు ఉంటాయి.[3] ప్యాంక్రియాటిక్ ఎండోక్రిన్ ట్యూమర్ల కంటే కూడా ఎక్సోక్రిన్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్లు సర్వసాధారణం. మొత్తం కేసుల్లో ఎండోక్రిన్ ట్యూమర్ల కేసులు ఒక శాతం మాత్రమే ఉంటాయి.[4][5]

వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు[మార్చు]

ప్రజెంటేషన్[మార్చు]

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను కొన్నిసార్లు సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు[6] కనిపించవు. తర్వాత కూడా ప్రత్యేకంగా ఎలాంటి లక్షణాలు బయటపడవు. రకరకాల సమస్యలు మాత్రం కనిపిస్తాయి.[6] అందుకే వ్యాధి తీవ్ర స్థాయికి చేరిన తర్వాత కానీ ఇది బయటపడదు.[6] సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.

 • పొత్తి కడుపు పైభాగంలో నొప్పి ఉంటుంది. అది వెన్నువైపునకు[6] కూడా వస్తుంది. (శరీరంలోని కార్కినోమాలో లేదా క్లోమగ్రంథి చివరలో దీన్ని గమనించారు)
 • ఆహారం రుచించకపోవడం మరియు వికారం, వాంతులు.[6]
 • గుర్తించదగిన స్థాయిలో బరువు తగ్గడం.
 • ప్యాంక్రియాస్ నుంచి విడుదలయ్యే క్లోమరసాన్ని క్యాన్సర్ కణాలు అడ్డుకున్నప్పుడు (60శాతం కేసుల్లో ఇలా జరుగుతుంది) బాధలేని జాండిస్ (చర్మం/ కళ్లు పసుపురంగులోకి మారడం, మూత్రం రంగు మారడం[6]) వస్తుంది. శరీరంలోని కొవ్వు నిల్వల్లో తేడాలకు కూడా ఇది కారణం కావచ్చు.
 • శరీరంలోని ఏ ప్రాంతంలోనైనా రక్త నాళాల్లో హఠాత్తుగా రక్తం గడ్డకట్టడం వల్ల ఆ ప్రాంతం వాచినట్లుగా కనిపిస్తుంది. ఇది కూడా కొన్నిసార్లు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణం కావచ్చు.
 • మధుమేహం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం జరగవచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న చాలా మందిలో వ్యాధి నిర్ధారణ కావడానికి కొన్ని నెలల ముందే, కొన్ని సందర్భాల్లో కొన్నేళ్ల ముందే మధుమేహం వస్తుంది. పెద్దవారిలో మధుమేహం వచ్చిందంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి అదో హెచ్చరికగా పరిగణించవచ్చు.[7]
 • ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల నిరాసక్తంగా మారవచ్చు. వైద్య సహాయం అవసరం కావచ్చు. కొన్నిసార్లు క్యాన్సర్ నిర్ధారణకు ముందే ఇది ప్రదర్శితమవుతుంది. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం మాత్రం తెలియడం లేదు.[8]

కారణాలు[మార్చు]

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి దారితీసే కారణాలు:[6][9]

 • వయసు (ప్రధానంగా 60ఏళ్ల పైబడిన వారు) [6]
 • పురుషులు (మహిళలకంటే పురుషులకే ఈ వ్యాధి వచ్చే అవకాశం 30శాతం ఎక్కువ)
 • పొగ త్రాగడం సిగరెట్ పొగ తాగడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 1.74శాతం పెరుగుతాయి. ఒక దశాబ్ధం పాటు పొగ తాగనివారు, చాలా ఎక్కువగా పొగతాగిన వారి మధ్య ఈ వ్యాధి వచ్చే అవకాశం శాతం 1.2శాతంగా ఉంది.[10]
 • కూరగాయలు, పళ్లు తక్కువగా తీసుకోవడం[11]
 • మాంసాహారాన్ని ఎక్కువగా స్వీకరించడం[12]
 • చక్కెర కలిసిన తీపి పానీయాలు ఎక్కవగా తాగడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం 1.87శాతం ఎక్కువ.[13] మమూలుగానే పానీయాలను తీపిగా మార్చే ఫ్రక్టోజ్ వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి.[14]
 • స్థూలకాయం[15]
 • మధుమేహం మెల్లిటస్ కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు దారితీసే లక్షణమే. ఇంతకుముందే చెప్పినట్టు మధుమేహం అనేది ఆ వ్యాధి రావడానికి హెచ్చరికలాంటిది.
 • క్లోమగ్రంధి తీవ్రంగా వాపురావడం కూడా జరగవచ్చు. అయితే ఇది సాధారణంగా వచ్చిన దాఖలాలు లేవు. వంశపారపర్యంగా వచ్చే లక్షణాల వల్ల వ్యక్తుల్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కవు.
 • హెలికోబ్యాక్టర్ పైలోరీకి ఇన్ఫెక్షన్ సోకడం
 • కుటుంబ చరిత్ర, కుటుంబంలో ఎవరికైనా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే మిగతావారికి కూడా ఆ వ్యాధి వచ్చే అవకాశం 5 నుంచి 10శాతం ఎక్కువగా ఉంటుంది. మరో తరం వారికి వ్యాపింప చేస్తూ ఈ వ్యాధి రావడానికి కారణమయ్యే జన్యువులను ఇంకా గుర్తించలేదు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు ఈ క్రింది సిండ్రోమ్ లతో సంబంధముంది:

ఆటోసోమల్ రిసెస్సివ్ అటాక్సియా తెలంగెక్టాసియా మరియు ఆటోసోమల్ ప్రభావంతో BRCA2 జన్యువులో జరిగే పారంపర్య సంయోగాలు, ట్యూమర్ నిరోధిత జన్యువు STK11 లో జరిగే సంయోగాలతో వచ్చే PALB2 జన్యువు ప్యూట్జ్ – జెగెర్స్ సిండ్రోమ్, వంశపారంపర్యంగా వచ్చే నాన్ పోలిపోసిస్ కాలన్ క్యాన్సర్ (లించ్ సిండ్రోమ్), ఫ్యామిలియల్ అడినోమాటస్ పొలిపోసిస్ మరియు ట్యూమర్ నిరోధిత జన్యువు CDKN2Aలో జరిగే సంయోగాల ఫలితంగా వచ్చే ఫ్యామిలియల్ అటిపికల్ మల్టిపుల్ మోల్ మెలనోమా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సిండ్రోమ్ (FAMMM-PC) [2][16]

 • చిగుళ్లు చెడిపోవడం లేదా పీరియోడాంటల్ వ్యాధి[17]

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పూర్తి జన్యుక్రమాన్ని ఛేదించడానికి ఆస్ట్రేలియా, కెనడా మరియు అంతర్జాతీయ క్యాన్సర్ జీనోమ్ సంఘం సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.[ఆధారం కోరబడింది]

ఆల్కాహాల్[మార్చు]

మధ్యం సేవించడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుందా అనేది వివాదాస్పదంగానే ఉంది. తీవ్రమైన క్లోమగ్రంధి వాపు రావడానికి ఎక్కువగా మద్యం సేవించడం ప్రధాన కారణం. ఇదే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు దారితీస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి ఆల్కాహాల్ తీసుకోవడంతో వచ్చే క్రానిస్ ప్యాంక్రియాటిటిస్ కన్నా మిగతా రకాలుగా వచ్చే క్లోమగ్రంధి వాపుకన్నా అంత ఎక్కువ ప్రమాదకారి కాదు.[18] దీని మధ్య సంబంధం అంత ప్రభావవంతంగా ఏమీ లేదు మరియు అనేక పరిశోధనలు దీన్నే ధ్రువీకరిస్తున్నాయి.[19][20][21][22]

ఆల్కాహాల్ తీసుకోవడం పెరిగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని మరికొన్ని పరిశోధనలు సంబంధాన్ని[23] వెల్లడిస్తున్నాయి.[24][25] రోజుకు నాలుగు అంతకంటే ఎక్కువ డ్రింకులు తీసుకునే వారిలో[26][27][28] ఈ ప్రమాదం అత్యధికంగా ఉంటుంది.[29] అయితే రోజుకు[22][30] 30గ్రాముల వరకు ఆల్కాహాల్ తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంతగా పెరగదు. అందువల్ల ఎక్కువ మంది అమెరికన్లు అంతగా హానిచేయని మోతాదులోనే ఆల్కాహాల్ తీసుకుంటారు.[28]

తమ ఫలితాలు అనేక అంశాల పై ఆధారపడి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.[27][31] ఆల్కాహాల్ వినియోగానికి క్యాన్సర్ కు మధ్య సంబంధం ఉన్నా అది ఆల్కాహాల్ పై కాకుండా దాని తయారీలో వాడే మూలకాల మీద ఆధారపడి ఉంటుంది.[32] వైట్ వైన్ తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని ఓ డచ్ పరిశోధనలో తేలింది.[33]

“రోజుకు 30 అంతకన్నా ఎక్కువ మోతాదులో ఆల్కాహాల్ వినియోగిస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని మా పరిశోధనలు స్థిరంగా చెబుతున్నాయి” అని అనేక విశ్లేషణల సారాంశం.[34]

వ్యాధి నిర్ధారణ[మార్చు]

మైక్రోసిస్టిక్ అడినోకార్కినోమా ఆఫ్ ది ప్యాంక్రియాటిక్ హెడ్.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన వారిలో ఎక్కువ శాతం నొప్పి, బరువు తగ్గడం లేదా కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.[35]

వ్యాధి ముదిరిన రోగుల్లో 80 నుంచి 85శాతం మందిలో నొప్పి ఉంటుంది. పొత్తికడుపు ఎగువ భాగంలో నొప్పి అనిపిస్తుంది. అది నెమ్మదిగా వెనకవైపు పాకుతున్నట్టు ఉంటుంది. ఇది మామూలుగా ఉండొచ్చు లేదా తినడం ద్వారా మరింత బాధాకరంగా మారొచ్చు. ఇక బరువు తగ్గడం తీవ్రంగా ఉండొచ్చు. ఇది అనోరెక్సియా, ఆకలిలేక పోవడం, డయేరియా లేదా స్టెటోరియాలతో సంబంధం కలిగి ఉండొచ్చు. దురద, మూత్రం రంగు మారడం వంటి లక్షణాలతో కామెర్లు కనిపించవచ్చు. స్థానికంగా విడదీయలేని విధంగా ఉండే వ్యాధి ఉన్న వారిలో సుమారు ఒకటిన్నర వంతు వారిలో బాధాకరమైన కామెర్లు ఉంటాయి. శస్త్రచికిత్స ద్వారా తొలగించగలిగే విధంగా వ్యాధి సోకిన రోగుల్లో సుమారు ఒకటిన్నర వంతు వారికి బాధలేని విధంగా కామెర్లు ఉంటాయి.

క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ప్రాథమిక అంచనా ఉంటుంది. క్లోమగ్రంధి లేదా దాని తోకభాగంలో ఏర్పడే సమస్యలను నొప్పి, బరువు తగ్గడం ద్వారా గుర్తించవచ్చు. ఇక గ్రంథి ముందు భాగంలో సమస్య ఉంటే వారిలో స్టెటోరియా, బరువుతగ్గడం మరియు కామెర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటీవలే మధుమేహం, థ్రాంబోఫ్లెబిటీస్ (బయటకు కనిపించే విధంగా గుర్తులు) రావడం లేదా గతంలో క్లోమగ్రంధిలో వాపు రావడం వంటి లక్షణాలు గమనించవచ్చు. క్లోమరస నిల్వల్లో తేడాలు జాండీస్ ను ధ్రువీకరిస్తాయి మరియు బాధారహితంగా పిత్తాశయం వాపు రావడం కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు గట్టి సంకేతం. అందులో చేరే పిత్తాశయం రాళ్లను గుర్తించడానికి కూడా ఇది పనికిరావచ్చు. అలసిపోవడం, చిరాకు, కడుపులో నొప్పి వల్ల ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటివి కూడా ఉండొచ్చు. ఇంతవరకు చెప్పిన లక్షణాలన్నింటినీ పరిశీలిస్తూ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను గుర్తించవచ్చు.

కాలేయ పనితీరును పరీక్షించడం వల్ల మిశ్రమ ఫలితాలు పొందవచ్చు. క్లోమరసానికి అడ్డంకులు ఏర్పడటం (కంజక్తేడ్ బిలిరూబిన్, Y-గ్లుటమైల్ ట్రాన్సపెప్టిడేజ్ మరియు అల్కలిన్ ఫాస్పటేజ్ స్థాయిల్లో పెరుగుదల). CA19-9 (కార్బోహైడ్రేట్ ఆంటిజెన్ 19.9) అనేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు దారితీసే ట్యూమర్లను పసిగట్టే మార్కర్ గా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో సున్నితత్వం మరియు నిర్దిష్టత్వం ఉండదు. నిరోధ స్థాయి 37U/ml కు మించి వాడినప్పుడు వ్యాధిని గుర్తించడానికి ఈ మార్కర్ కు 77శాతం సున్నితత్వం మరియు 87శాతం నిర్దిష్టత్వం ఉంటాయి. తొలిదశలో CA 19-9 సాధారణంగానే ఉండొచ్చు కానీ క్లోమరసానికి నిరోధాలు కలగడం వలన దీని స్థాయిల్లో పెరుగుదల కనిపించవచ్చు.[36] కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT స్కాన్) మరియు ఎండోస్కోపిక్ ఆల్ట్రాసౌండ్ (EUS) వంటి వాటితో వచ్చే చిత్రాలను పరిశోధించి క్యాన్సర్ తయారైన ప్రాంతాన్ని, దాని రూపాన్ని గుర్తించవచ్చు.

పాథాలజీ[మార్చు]

మైక్రోగ్రాఫ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ డక్టల్ అడినోకార్కినోమా (ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క అతిసాధారణ రకం).H&E ఒత్తిడి.

చర్మంలోనికి పంపించి పెర్క్యుటేనేయాస్ సూదితో భయాప్సీ చేయడం లేదా రేడియాలజీ ప్రకారం అనుమానిత కణజాలాన్ని శస్త్రచికిత్స ద్వారా వేరు చేసి పరిశీలించడం ద్వారా ఈ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించవచ్చు. సూదితో భయాప్సీ చేసే పద్ధతిలో దృశ్యాల ద్వారా దిశా నిర్దేశం చేయడానికి ఎండోస్కోపిక్ అల్ట్రా సౌండ్‌ను తరుచుగా వాడతారు.[37]

మామూలు నుంచి తక్కువగా వైరుధ్యం ఉన్నగ్రంథి సంబంధిత నిర్మాణాన్ని సూక్ష్మదర్శినితో పరిశీలించడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్వసాధారణ స్వరూపాన్ని (డ్యూయల్ అడినోకార్కినోమా) తెలుసుకోవచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు హెపటోబిలియరీ క్యాన్సర్ల (ఉదా. చోలాంజియోకార్కినోమా) మరియు కొన్ని స్టమక్ క్యాన్సర్లకు ఉండే ఇమ్యునోహిస్టోకెమికల్ ప్రొఫైల్ ఉంది. అందుకే క్లోమగ్రంథిలో కనిపించే కణితి అందులోనుంచే పుట్టిందని ఎప్పుడూ నిర్ధారణగా చెప్పలేకపోవచ్చు.

సాధారణ క్లోమగ్రంథి మైక్రోగ్రాఫ్స్, ప్యాంక్రియాటిక్ ఇంట్రాఎపిథెలియల్ నియోప్లాసియా (ప్యాంక్రియాటిక్ కార్కినోమా రూపాంతరాలు) మరియు ప్యాంక్రియాటిక్ కార్కినోమా.H&E ఒత్తిడి.

కొలోరెక్టల్ కార్కినోమా వలెనే ప్యాంక్రియాటిక్ కార్కినోమా కూడా ఏదైనా అంగంలోని చెడిపోని భాగం నుంచే పుడుతుంది. అంటే ఇది ప్రినియోప్లాస్మ్ - నియోప్లాస్మ్ - కార్కినోమా క్రమాన్ని పాటిస్తుందని భావిస్తున్నారు. ప్రోటోటిపికల్ కొలోరెక్టల్ క్యాన్సర్‌లో అడినోమోటోసిస్ పాలిపోసిస్ కొలీ జన్యువు రూపాంతరంతో కొలోరెక్టల్ మ్యూకోసా నుంచి అభివృద్ధి చెందే టాబ్యులర్ అడినోమాలో ఈ వ్యాధి మొదలవుతుంది. ప్యాంక్రియాటిక్ అడినోకార్కినోమాలో ప్రినియోప్లాస్టిక్ ప్రాంతం అనేది ప్యాంక్రియాటిక్ ఇంట్రాపిథేలియల్ నియోప్లాసియా 1ఎ (PanIN1a) మరియు ప్యాంక్రియాటిక్ ఇంట్రాపిథేలియల్ నియోప్లాసియా 1b (PanIN1b), నియోప్లాస్టిక్ ప్రాంత ప్యాంక్రియాటిక్ ఇంట్రాపిథేలియల్ నియోప్లాసియా2 (PanIN2) మరియు ప్యాంక్రియాటిక్ ఇంట్రాపిథేలియల్ నియోప్లాసియా3 (PanIN3).

వ్యాధి నిర్ధారణ పరీక్ష[మార్చు]

2009 సెప్టెంబరులో క్యాన్సర్ నిరోధ పరిశోధన జర్నల్ సంచిక, టెక్సాస్ విశ్వవిద్యాలయం M.D. ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు మైక్రో RNAలను కనుగొన్నారు. వీటికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగుల నుంచి తీసుకున్న రక్త నమూనాల్లోని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో సంబంధముంది. దీంతో ఈ వ్యాధిని త్వరగా గుర్తించడానికి కొత్త మార్గం లభించింది. రక్తంలో miR-155 అధిక స్థాయిల్లో ఉన్నట్లు నిర్ధారణ అయితే దాన్ని క్యాన్సర్‌ రావడాన్ని సూచించే ఓ బయోమార్కర్‌గా చెప్పుకోవచ్చని గుర్తించారు. అలాగే వ్యాధి వృద్ధి చెందుతున్న క్రమంలో రక్తంలో miR 196a పెరుగుతున్నట్టు నిర్ధారణ అయింది. miR-21, miR-210, miR-155 మరియు miR-196a అనే నాలుగు miRNA బయో మార్కర్లను ఉపయోగించి పరిశోధన సాగింది. ఇందులో 28 మంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగుల నమూనాలు మరియు 19 ఆరోగ్య నియంత్రణల పై అధ్యయనం చేసి 64శాతం సున్నితత్వం మరియు 89శాతం కచ్చితత్వం సాధించారు.[38]

నివారణ[మార్చు]

అమెరికన్ క్యాన్సర్ సంఘం ప్రకారం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నిరోధించడానికి ఎలాంటి స్థిరమైన నిబంధనలు లేవు. అయితే సిగరెట్ తాగడం 20 నుంచి 30శాతం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లకు కారణమని నివేదికలు వస్తూనే ఉన్నాయి.[39]

ఆరోగ్యకరమైన బరువు మరియు పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాల వినియోగం పెంచుతూ రెడ్ మీట్‌ను తగ్గించాలని ACS సిఫార్సు చేస్తుంది. అయితే ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నిరోధిస్తుందని కానీ లేదా తగ్గిస్తుందని కానీ ఎలాంటి స్థిరమైన సాక్ష్యాలూ లేవు.[40][41] ఈ వ్యాధికి దారితీసే కచ్చితమైన విషయాలను నిరూపించేందుకు 2006లో దాదాపు 80వేల అంశాల పై చేసిన విస్తృత అధ్యయనం సత్ఫలితాలని ఇవ్వలేదు.[42] చిన్న కేస్ కంట్రోల్ స్టడీస్‌లోనే దీనికి సంబంధించిన సాక్ష్యాలు నిరూపితమయ్యాయి.[11]

విటమిన్ డి తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ (ఇతర క్యాన్సర్లు కూడా) వచ్చే ప్రమాదం 50శాతం మేర తగ్గుతుందని సెప్టెంబరు 2006లోనే జరిగిన ఓ సుదీర్ఘ అధ్యయనం తేల్చింది. అయితే విటమిన్ డి తీసుకోవడంలో ఉండే సమస్యలు, చెప్పుకోదగ్గ లాభాలు మరియు ఖర్చును ఈ అధ్యయనం తేల్చాల్సిన అవసరం ఉంది.[43][44][45]

2007 జూన్ 1న ప్రచురితమైన అధ్యయనంతో పాటు అనేక పరిశోధనల్లో బి12, బి6 వంటి బి విటమిన్లను, ఫోలేట్ తీసుకోవడం వల్ల కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తేలింది. అయితే బి విటమిన్లను ఆహారంతో పాటే తీసుకోవాలి. విటమిన్ టాబ్లెట్ల రూపంలో తీసుకుంటే పనికిరాదు.[46][47]

చికిత్స[మార్చు]

శస్త్ర చికిత్స[మార్చు]

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు ఇచ్చే వైద్యం ఆ క్యాన్సర్ దశ పై ఆధారపడి ఉంటుంది.[48] క్లోమగ్రంథి తల భాగంలో ఏర్పడిన క్యాన్సర్లకు సర్వ సాధారణంగా విపుల్ పద్ధతి ద్వారా శస్త్ర చికిత్స చేస్తారు. ఈ ప్రక్రియలో క్లోమగ్రంథి తలభాగాన్ని మరియు డ్యూడినం కర్వ్‌ను రెండింటినీ తొలగిస్తారు. పొట్ట నుంచి జెజునమ్ (గ్యాస్ట్రో-జేజునోస్టమీ) కు ఆహారం వెళ్లడానికి బైపాస్‌ను ఏర్పాటుచేస్తారు. క్లోమరసాన్ని బయటకు పంపడానికి జేజునమ్ నుంచి సిస్టిక్ డక్ట్‌ (కొలేకిస్టో జేజునాస్టమీ) కు ఓ లూప్‌ను జతపరుస్తారు. రోగులు పెద్ద శస్త్ర చికిత్సను తట్టుకోగలిగితే మరియు క్యాన్సర్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా స్థానికంగానే ఉంటే ఈ శస్త్ర చికిత్స చేస్తారు. అందువల్ల చాలా తక్కువ కేసుల్లో మాత్రమే ఈ పద్ధతి పాటిస్తారు.

క్లోమగ్రంథి తోక భాగంలో వచ్చిన క్యాన్సర్లను డిస్టల్ ప్యాంక్రియాటెక్టమీ అనే ప్రక్రియ ద్వారా తొలగిస్తారు.[48] ఇటీవల స్థానికంగా తయారయ్యే ప్యాంక్రియాస్ క్యాన్సర్లను లాపరోస్కోపిక్ వంటి తక్కువ ప్రభావం చూపే పద్ధతులను అనుసరించి తొలగిస్తున్నారు.[49]

శస్త్ర చికిత్స తర్వాత జెమ్‌సిటబిన్‌తో కూడిన అడ్జువంట్ కీమోథెరపీ చేస్తారు. దీంతో ఐదేళ్ల జీవితకాలాన్ని పెంచవచ్చని (సుమారు 10 నుంచి 20 శాతం) అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే శస్త్ర చికిత్స తర్వాత రోగి ఫిట్‌గా ఉంటేనే దీన్ని చేస్తారు. (ఓటిల్ మొదలైనవారు. JAMA 2007, నియోప్టొలెమాస్ మొదలైనవారు. NEJM 2004, ఓటిల్ ఎట్ ఆల్. ASCO proc 2007). ఇంటర్‌ఫెరాన్‌ను ఉపయోగించి క్యాన్సర్‌కు చికిత్స చేసే విధానంపై వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఓ పరిశోధన చేస్తోంది. ఇది జీవిత కాలాన్ని మరింత పెంచే మార్గాన్ని చూపుతోంది. తీవ్రంగా చర్చ జరుగుతున్న రేడియేషన్ థెరపీ దీనికి అదనం. అమెరికాలోని కొన్ని వర్గాలు ఈ రేడియేషన్ థెరపీకి అనుకూలంగా తురుచూ మాట్లాడుతుంటాయి. అయితే ఐరోపా‌లోని వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తాయి. ఎందుకంటే ఈ పద్ధతి ద్వారా ఏమైనా జీవితకాలం పెంచే లభాలున్నాయా అనే దాని పై భారీ స్థాయిలో అధ్యయనం జరగలేదు.[50]

వ్యాధి ఇతర ప్రాంతాలకు పాకడం, డ్యూడినమ్ లేదా కాలోన్‌పై ఒత్తిడి పెంచడం వంటి పరిస్థితుల్లో వ్యాధి తీవ్రత తగ్గించడానికి కూడా శస్త్ర చికిత్స చేస్తారు. ఈ సందర్భాల్లో బైపాస్ సర్జరీ ద్వారా అడ్డంకులు తొలగించి జీవిత ప్రమాణాన్ని మెరుగుపరచవచ్చు కానీ ఇది వ్యాధి తగ్గించడానికి ఉద్దేశించినది కాదు.[37]

రసాయన చికిత్స[మార్చు]

వ్యాధి నిర్మూలన సాధ్యం కాని రోగుల్లో దాని తీవ్రతను తగ్గించడానికి కీమోథెరపీని ఉపయోగించి వారి జీవిత ప్రమాణాలు పెంచవచ్చు మరియు ఎక్కువకాలం బతకడానికి అవకాశాలను పెంచవచ్చు. ఓ వైద్య పరిశోధన తర్వాత జీవిత ప్రమాణాలు పెరుగుతాయని తేలడంతో జెమ్‌సిటబిన్‌ను 1998లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ తుదిదశకు చేరుకున్న రోగుల జీవిత నాణ్యత కూడా ఈ విధానంతో 5వారాల వరకు పెరిగింది. ఇది FDA అనుమతి పొందిన తొలి కిమోథెరపీ మందుగా చెప్పవచ్చు. అది కూడా ప్రాథమికంగా బతికించలేని వైద్య పరిశోధనాంశం కావడం గమనార్హం. జెమ్‌సిటబిన్‌ను నరాల్లోకి పంపించి ప్రతి వారం గమనిస్తారు. ఆక్సాలిప్లేటిన్ (Gem/Ox) జతచేరడం వల్ల లాభం చేకూరినట్టు చిన్న పరిశోధనల్లో తేలింది. అయినా ఇది ఇప్పటికీ ప్రామాణిక థెరపీ కాదు.[51] GEMOX అనేది జెమ్‌సిటబిన్‌ ఒక్కదానిపైనే (పాప్లిన్ ఎట్ ఆల్., JCO 2009, లోవెట్ ఎట్ ఆల్. JCO 2005) ఆధిపత్యం చూపించడంలో విఫలమైందని ఇటీవలే ప్రచురించిన అధ్యయనం ECOG 6201 తేల్చింది. ఫ్లూరోరాసిల్‌ (5FU) ను కూడా ఇందులో కలపవచ్చు. ఏదిఏమైనప్పటికీ ఈ చేర్పు వల్ల (బెర్లిన్ ఎట్ ఆల్. JCO 2002) జీవితకాలం పెంచే ఎలాంటి లాభం చేకూరడం లేదని ఏ భారీ అధ్యయనమూ వెల్లడించలేదు. ఇప్పటి వరకు ప్రచురణ కాని ఓ పరిశోధన చూపించిన దాన్ని బట్టి (p=0.08) జెమ్‌సిటబిన్‌కు క్యాపెసిటబిన్‌ను కలపడం ద్వారా చెప్పుకోదగ్గ లాభం ఉంటుందని తేలింది (కన్నింగామ్ మొదలైనవారు. JCO 2009). ఏమైనప్పటికీ మెటా అనాలిసిస్ ప్రకారం కాంబినేషన్ థెరపీ, ముఖ్యంగా దృఢంగా ఉన్న రోగుల్లో (PS 0-1) ప్రయోజనకరంగా ఉంటుందని తేలింది (సుల్తానా మొదలైనవారు. BJC 2009, కన్నింగామ్ మొదలైనవారు. JCO 2009).

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తుదిదశలో ఉన్న 569 మంది రోగుల పై కెనడియన్ నేతృత్వంలో జరిగిన ఫేజ్-3 పరిశోధనల ప్రకారం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ తీవ్రతను తగ్గించడానికి జెమ్‌సిటబిన్‌తో పాటు ఎర్లోటినిబ్ (టార్సెవా) ను ఉపయోగించడానికి అమెరికన్ FDA లైసెన్స్ మంజూరు చేసింది. జెమ్‌సిటబిన్/ఎర్లోటినిబ్ పనితీరును జెమ్‌సిటబిన్/ప్లాసిబో చర్యతో పోల్చడమే కాకుండా, జీవిత కాల పెరుగుదల, కణితి ప్రతిస్పందన, జీవించే రేటులో మెరుగుదల (మూర్ మొదలైనవారు. JCO 2005) ను ఈ అధ్యయనం ప్రదర్శించింది. ఈ మిశ్రమంతో జీవితకాల మెరుగుదల నాలుగు వారాల కంటే తక్కువగా ఉంది. దీంతో ఎర్లోటినిబ్‌ను జెమ్‌సిటబిన్‌తో కలిపి చికిత్స చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందన్నదాని పై కొందరు క్యాన్సర్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అడ్జువెంట్ మరియు నియోఅడ్జువెంట్ సెట్టింగ్‌లోని పై మిశ్రమాల ప్రభావాలను ప్రస్తుత కొత్త అధ్యయనాలు పరిశోధిస్తున్నాయి.[52] ఆంటియాన్‌జియోజెనెసిస్ ఏజెంట్ బెవాసిజుమాబ్ (అవాస్టిన్) ను కీమోథెరపీకి కలపడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తుదిదశకు చేరుకున్న రోగుల జీవిత కాలాన్ని పెంచడంలో ఎలాంటి వృద్ధి కలగలేదని ఓ అధ్యయనం తేల్చింది (కిండ్లర్ మొదలైనవారు). దీనివల్ల ఎక్కువ రక్త పోటు, కడుపు మరియు ఇంటెస్టిన్స్‌లో రక్తస్రావం వంటి సమస్యలు రావచ్చు.

వ్యాధిని అంచనా వెయ్యటం[మార్చు]

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ నిర్ధారణ అయిన రోగుల్లో ఈ వ్యాధిని ముందే పసిగట్టడం కష్టం. ఎందుకంటే మొదట్లో ఈ క్యాన్సర్ ఎలాంటి లక్షణాలనూ ప్రదర్శించదు. దీనివల్ల స్థానికంగా ఇది తీవ్రస్థాయికి చేరుకున్న తర్వాత కానీ లేదా మెటాస్టాటిక్ వ్యాధిగా మారిన తర్వాత గానీ ఇది నిర్ధారణ కాదు. వ్యాధిని గుర్తించిన తర్వాత రోగి జీవిత కాలం మూడు నుంచి ఆరు నెలలగా ఉంటుంది. 5శాతం కంటే తక్కువ మంది రోగులు 5ఏళ్లు జీవిస్తారు.[53] 2007లో అమెరికాలో 37,170 కేసులను నిర్ధారిస్తే అందులో 33,700మంది చనిపోయారు. అన్ని క్యాన్సర్లలో కంటే కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లోనే మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఇది అమెరికాలో మహిళలు, పురుషుల్లో ఎక్కువ మంది ప్రాణాలు తీస్తున్న నాలుగో పెద్ద క్యాన్సర్‌గా ఉంది. కొత్త కేసుల్లో 2.5శాతం ఉన్నప్పటికీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో ప్రతి ఏటా 6శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి.[54]

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ అప్పుడప్పుడు మధుమేహానికి దారితీయవచ్చు. ఇన్సులిన్ ఉత్పత్తి దెబ్బతినవచ్చు మరియు మధుమేహం రావడం క్యాన్సర్‌ వచ్చే ప్రమాదానికి హెచ్చరిక వంటిదని సూచిస్తారు.[55]

సాంక్రమిక రోగ విజ్ఞానం[మార్చు]

2004లో ప్రతి లక్ష మందిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో సంభవించిన వయసు ప్రామాణిక మరణాలు.[56][128][129][130][131][132][133][134][135][136][137][138][139][140]

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "Pancreatic Cancer — National Cancer Institute, U.S. National Institutes of Health (Accessed 10 May 2009)". Cancer.gov. Retrieved 2009-09-15.
 2. 2.0 2.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 3. "Types of Tumors". Johns Hopkins University. Retrieved 2009-09-05.
 4. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 5. "Endocrine Neoplasms".
 6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 6.7 "What You Need To Know About Cancer of the Pancreas — National Cancer Institute". 2002-09-16. p. 4/5. Retrieved 2007-12-22.
 7. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 8. Carney CP, Jones L, Woolson RF, Noyes R, Doebbeling BN (2003). "Relationship between depression and pancreatic cancer in the general population". Psychosomatic Medicine. 65 (5): 884–8. doi:10.1097/01.PSY.0000088588.23348.D5. PMID 14508036.CS1 maint: Multiple names: authors list (link)
 9. "ACS :: What Are the Risk Factors for Cancer of the Pancreas?". Archived from the original on October 12, 2007. Retrieved 2007-12-13.
 10. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 11. 11.0 11.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 12. "Red Meat May Be Linked to Pancreatic Cancer". Journal of the National Cancer Institute. WebMD. 2005-10-05. Retrieved 2008-03-05.
 13. "Soft Drink and Juice Consumption and Risk of Pancreatic Cancer: The Singapore Chinese Health Study".
 14. "Cancer cells slurp up fructose, U.S. study says". Reuters. 2010-08-02. Retrieved 2010-08-02.
 15. "Obesity Linked to Pancreatic Cancer". American Cancer Society. Cancer Epidemiology, Biomarkers & Prevention (Vol. 14, No. 2: 459–466). 2005-03-06. Archived from the original on February 5, 2008. Retrieved 2008-03-05.
 16. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 17. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 18. క్యాన్సర్ రీసెర్చ్ UK ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నష్టాలు మరియు కారణాలు
 19. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆన్ ఆల్కహాల్ అబ్యూజ్ మరియు ఆల్కాహాలిజం ఆల్కాహాల్ మరియు క్యాన్సర్ - ఆల్కాహాల్ అలర్ట్ నెం 21-1993
 20. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కాఫీ అండ్ ఆల్కాహాల్ డు నాట్ పోజ్ ఎ రిస్క్‌ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్
 21. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 22. 22.0 22.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 23. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 24. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 25. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 26. స్కాటెన్‌ఫెల్డ్, డి. మరియు జె. ఫ్రౌమెని, ఈడీ. క్యాన్సర్ ఎపిడెమియాలజీ అండ్ ప్రివెన్షన్. 2nd ed., ed. Vol. 1996, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్: ఆక్స్‌ఫర్డ్‌[page needed]
 27. 27.0 27.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 28. 28.0 28.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 29. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 30. "Pancreatic cancer risk factors". Info.cancerresearchuk.org. 2008-11-04. Retrieved 2009-09-15.
 31. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 32. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 33. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 34. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 35. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 36. Frank J. Domino M.D. (2007). 5 minutes clinical suite version 3. Philadelphia, PA: Lippincott Williams & Wilkins.[page needed]
 37. 37.0 37.1 ఫిలిప్ అగోప్, "ప్యాంక్రియాటిక్ క్యాన్సర్". ACP PIER & AHFX DI Essentials. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్‌. 4 Apr 2008. 7 ఏప్రిల్ 2009 న వినియోగించబడింది.[page needed]
 38. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).[dead link]
 39. "Can Cancer of the Pancreas Be Prevented?". American Cancer Society. Archived from the original on October 12, 2007. Retrieved 2007-12-13.
 40. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 41. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 42. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 43. "Health | Vitamin D 'slashes cancer risk'". BBC News. 2006-09-15. Retrieved 2009-09-15.
 44. "Vitamin D May Cut Pancreatic Cancer". Webmd.com. 2006-09-12. Retrieved 2009-09-15.
 45. [1][dead link]
 46. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 47. United Press International (2 June 2007). "Pancreatic cancer risk cut by B6, B12". Retrieved 5 September 2009.
 48. 48.0 48.1 "Surgical Treatment of Pancreatic Cancer". Johns Hopkins University. Retrieved 5 September 2009.
 49. "Laparoscopic Pancreas Surgery". Johns Hopkins University. Retrieved 5 September 2009.
 50. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 51. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 52. "FDA approval briefing" (PDF). Retrieved 2009-09-15.
 53. "WHO | Cancer". Who.int. Retrieved 2009-09-15.
 54. Jemal A, Siegel R, Ward E, Murray T, Xu J, Thun MJ (2007). "Cancer statistics, 2007". CA. 57 (1): 43–66. doi:10.3322/canjclin.57.1.43. PMID 17237035.CS1 maint: Multiple names: authors list (link)
 55. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 56. [127]

బాహ్య లింకులు[మార్చు]