Coordinates: 17°26′25″N 78°29′43″E / 17.4403125°N 78.4953125°E / 17.4403125; 78.4953125

ప్యాట్నీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్యాట్నీ
సమీపప్రాంతం
ప్యాట్నీ is located in Telangana
ప్యాట్నీ
ప్యాట్నీ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
ప్యాట్నీ is located in India
ప్యాట్నీ
ప్యాట్నీ
ప్యాట్నీ (India)
Coordinates: 17°26′25″N 78°29′43″E / 17.4403125°N 78.4953125°E / 17.4403125; 78.4953125
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 003
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

పాట్నీ (పాట్నీ సర్కిల్), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాదులో వాణిజ్య కేంద్రంగా ఉంది.

చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతంలో పాట్నీ మోటార్స్, చారిత్రాత్మక మహబూబ్ కళాశాల ఉన్నాయి.[1] 1862లో సోమసుందరం ముదలియార్ అనే వ్యక్తి ప్రాథమిక విద్య కోసం ఇక్కడ మొదటి ప్రభుత్వ పాఠశాలను స్థాపించాడు. 1893లో చికాగోకు బయలుదేరే ముందు స్వామి వివేకానంద పెద్ద సభలో ప్రసంగించాడు.[2] ఈ కళాశాల భవనాన్ని వారసత్వ భవనంగా హుడాప్రకటించింది.[3]

ఈ ప్రాంతంలో అనేక బట్టల దుకాణాలు ఉన్నాయి. పాట్నీలోని దుకాణాలు చీరల కోసం ప్రత్యేకంగా ప్రాచూర్యం పొందాయి.[4] తాజ్ మహల్, హోటల్ తాజ్ ట్రిస్టార్, తాజ్ బెల్సన్స్, గ్రాండ్ మినర్వా వంటి రెస్టారెంట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, జనరల్ పోస్ట్ ఆఫీస్, మంజు సినిమా థియేటర్, కాష్ ఫర్నిచర్ మాల్, స్వాప్నలోక్ కాంప్లెక్స్ ఉన్నాయి.

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో జగదీష్ నగర్ కాలనీ, చంద్రనగర్ కాలనీ, సింధీ కాలనీ, రసూల్‌పుర, పైగా కాలనీ, సికింద్రాబాదు, పారడైజ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్యాట్నీ మీదుగా సికింద్రాబాద్, సనత్‌నగర్, ఆల్విన్ కాలనీ, భరత్ నగర్, బోరబండ, కొండపూర్ నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[5] ఇక్కడికి సమీపంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Forum for better Hyderabad". : Forum For A Better Hyderabad. Archived from the original on 2016-03-03. Retrieved 2021-02-02.
  2. "A reason to celebrate". : The Hindu, Hyderabad. 2006-06-17. Archived from the original on 2012-11-09. Retrieved 2021-02-02.
  3. "64th Meeting Minutes,". : Hyderabad Urban Development Authority. 2006-05-27. Archived from the original on 21 July 2011. Retrieved 2021-02-02.
  4. "Hyderabad: A Dazzling Array of Shopping Possibilities". : Pushpitha Wijesinghe. 2010-06-24. Archived from the original on 25 July 2011. Retrieved 2021-02-02.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-02.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్యాట్నీ&oldid=4149838" నుండి వెలికితీశారు