ప్యాసింజర్ నేమ్ రికార్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యాత్రా పరిశ్రమలో, కంప్యూటర్ రిజర్వేషన్ సిస్టం (CRS) యొక్క డేటా బేస్ (ప్రామాణిత సమాచార సంపుటి) లో ఒక ప్రయాణీకుడు లేదా ప్రయాణీకుల సమూహం యొక్క ప్రయాణ కార్యక్రమాన్ని కలిగి ఉండే రికార్డుని ప్యాసింజర్ నేమ్ రికార్డు (PNR ) అని అంటారు. ప్రయాణీకులు బహుళ వైమానిక కంపెనీల ద్వారా తమ గమ్యాన్ని చేరవలసి వచ్చిన సందర్భాల్లో (‘’ఇంటర్ లైనింగ్, వైమానిక కంపెనీల మధ్య స్వచ్చంద వ్యాపారాత్మక ఒప్పందం’’) రిజర్వేషన్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనుటకు, వైమానిక కంపెనీలు మొట్టమొదటగా PNR అనెడి యోచనని ప్రవేశపెట్టాయి. ఈ ప్రయోజనం కోసం, PNR యొక్క విషయం మరియు తయారీ నమూనా కొరకు ఒక ప్రమాణాన్ని IATA నిర్వచించినది.

ఒక ప్రయాణీకుడు, తన ప్రయాణ కార్యక్రమాన్ని బుకింగ్ ద్వారా స్థిరపరచుకున్నప్పుడు, యాత్రా ఏజెంట్ లేదా యాత్రా వెబ్ సైట్ వినియోగదారుడు, వారు ఉపయోగించే కంప్యూటర్ రిజర్వేషన్ సిస్టంలో PNRని సృష్టిస్తారు. ఇది అమేడియస్, సబ్రే, వరల్డ్ స్పాన్ లేదా గెలీలియో వంటి గ్లోబల్ డిస్ట్రిబ్యుషన్ సిస్టంలలో ఒక పెద్ద చిహ్నాత్మక వ్యవస్థ, కానీ ఒక వైమానిక కంపెనీతో నేరుగా బుకింగుని ఏర్పాటు చేసుకున్నచో, ఆ వైమానిక కంపెనీ CRS యొక్క డాటా బేస్‌లో కూడా PNR ఉంటుంది. ఈ PNRని ప్రయాణీకుని మరియు అనుసంధాన ప్రయాణ కార్యక్రమం యొక్క మాస్టర్ PNR అని అంటారు. నిర్దేశిత డేటా బేస్‌లో PNRని రికార్డు లోకేటర్(కోడ్) ద్వారా గుర్తిస్తారు.

ప్రయాణ మార్గంలోని వివిధ భాగాలను, మాస్టర్ PNR ను కలిగినవారు ఇవ్వని సందర్భంలో, PNR సమాచారాన్ని గూర్చిన కాపీలు, ప్రయాణాన్ని సమకూర్చే వైమానిక కంపనీల యొక్క CRS లకు పంపబడతాయి. వారు బాధ్యత వహించిన ప్రయాణకార్యక్రమం యొక్క భాగాన్ని నిర్వహించుటకు ఈ CRSలు, మూల PNR యొక్క కాపీలను వారి స్వంత డేటాబేస్‌లో తెరుస్తారు. చాలా వైమానిక కంపెనీల CRSలు, ఏదో ఒక GDSని కలిగి ఉండుట వలన, PNR యొక్క పంపకాన్ని అనుమతిస్తుంది.

కాపీ చేయబడిన PNRల యొక్క రికార్డు లోకేటర్లను, మాస్టర్ PNRను కలిగి ఉన్న CRSకు తిరిగి సమాచారమందివ్వబడుటతో అన్ని రికార్డులు ఒకే విధంగా ఉంటాయి. దీని వలన, ఏదైనా CRSలలోని యాత్ర యొక్క స్థితిగతులలో మార్పులు సంభవించినపుడు, PNR యొక్క ఎప్పటికప్పటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనుటకు వీలుంటుంది.

అయితే PNRలను ప్రారంభంలో విమానయానం కొరకు ప్రవేశపెట్టగా, ప్రస్తుతం వాటిని హోటల్ , అద్దె కార్లు, రైల్వేలు మున్నగు వాటి బుకింగ్ కొరకు కుడా వాడుతున్నారు.

వ్యవహారికంగా, "PNR" అనేది రికార్డుని గుర్తించుటకు ఉపయోగించేటి ఆరు-అక్షరాంకాల ఏకమైన రికార్డ్ లోకెటర్ (కోడ్) ని కుడా సూచిస్తుంది.

PNR యొక్క భాగాలు[మార్చు]

సాంకేతికపరంగా, బుకింగుని పూర్తి చేయుటకు PNR కొరకు ఐదు భాగాలు అవసరమైనవి. అవి:

 • ప్రయాణీకుని (ల) పేరు.
 • యాత్రా ఏజెంట్ లేదా వైమానిక కంపెనీ కార్యాలయాల సంప్రదించు వివరాలు. (ఒక బుకింగు కొరకు ఒకదాని కంటే ఎక్కువ సంప్రదింపు నంబర్లు ఉండవచ్చు కానీ కనీసం ఒక నంబరు ఉండాలి, మరియు ఏజెన్సీ లేదా వైమానిక కంపెనీ కార్యాలయానికి మొదటి ప్రాదాన్యతనిచ్చుట ప్రామాణిక పద్ధతి).
 • టిక్కెట్టు వివరాలు, టిక్కెట్టు నంబరు లేదా టిక్కెట్టు కాల వ్యవధి.
 • కనీసం ఒక విభాగం యొక్క మజిలీ చిట్టా అయినా, జాబితాలోని ప్రయాణీకులందరికీ ఒకటే అయి ఉండాలి.
 • బుకింగు చేస్తున్న వ్యక్తి యొక్క పేరు.

ఈ స్థాయిలో బుకింగు పూర్తైన తరువాత, CRS ఇచ్చిన ఒక ప్రత్యేక ఆల్ఫా-న్యూమరిక్ (అక్షర-సంఖ్యల) రికార్డు లోకేటర్, మున్ముందు ఎటువంటి మార్పులు చేసినా మారదు (బహుళ-వ్యక్తుల PNR చీలిన సందర్భంలో తప్పించి). ప్రతి వైమానిక కంపెనీ వారి స్వీయ బుకింగ్ రికార్డుని ఒక ప్రత్యేకమైన రికార్డు లోకేటర్ తో సృష్టించుకొంటాయి, ఇది CRS మరియు వైమానిక కంపెనీ (ల) మధ్యనున్న సేవా స్థాయి ఒప్పందాన్ని బట్టి, CRSకి పంపించబడుతుంది మరియు బుకింగులో నిలువ చేయబడుతుంది.

పై జాబితా కనీసంగా అవసరమైనవి కాగా, వైమానిక కంపెనీలు మరియు యాత్రా ఏజెంటు ఇరువురూ కూడా, విస్తారమైన పరిమాణంలో ఉన్న ఇతర సమాచారాన్ని సమర్ధవంతమైన యాత్ర కొరకు ఉపయోగించుకొంటారు. వాటిలో కొన్ని:

 • ప్రయాణ రుసుము వివరాలు, మరియు టిక్కెట్టుకి వర్తించునట్టి ఏవైనా ఇతర ఆంక్షలు.
 • ఉపయోగించిన చెల్లింపుల యొక్క రూపం, ఎందుకనగా ఇది సాధారణంగా టిక్కెట్టు ఉపయోగించని యెడల చేయవలసిన వాపసుని నిర్బంధిస్తుంది.
 • మరిన్ని సంప్రదింపు వివరాలు, ఏజెన్సీ ఫోన్ నంబరు మరియు చిరునామా, ప్రయాణీకుని చిరునామా మరియు ఉద్దేశించిన గమ్యం యొక్క అదనపు సంప్రదింపు ఫోన్ నంబర్లు వంటివి.
 • వయసు వివరాలు అసలు ప్రయాణానికి సుసంగతమైనవేనా అనునవి, ఉదా., తోడెవ్వరూ లేని పిల్లలు లేదా సహాయం అవసరమైన వృద్ధ ప్రయాణీకులు. ** పైన చెప్పిన మొదటి మెట్టు సమయంలో పేరుని నమోదు చేసేటపుడు ఇటువంటి వివరాలను జతపరచవలెను***
 • తరచుగా విమానంలో ప్రయాణించే వారి వివరాలు.
 • ప్రత్యేక భోజన అవసరాలు, సీటింగు ఇష్టతలు, చక్రాలకుర్చీలు (వీల్ చైర్లు), మరియు అట్టి ఇతర అభ్యర్ధనలైన "ప్రత్యేక సేవా అభ్యర్ధనలు" (స్పెషల్ సర్వీసు రిక్వేస్ట్స్, SSR).
 • ఒక నిర్దేశిత వైమానిక కంపెనీ లేదా బుకింగ్ లోనున్న అన్ని వైమానిక కంపెనీలకు పంపించబడిన సమాచారం, "వికల్పమైన సేవల ఆదేశాలు" (ఆప్షనల్ సర్వీస్ ఇన్స్ట్రక్షన్స్, OSI), మెరుగైన సేవలను అందించేందుకు సహాయపడుతుంది. ఈ సమాచారం టిక్కెట్టు నంబర్లు, స్థానిక సంప్రదింపు వివరాలు (ఫోను విభాగం కేవలం కొన్ని ఎంట్రీలకు మాత్రమే పరిమితమైనది), మరియు ప్రయాణీకుల భాష లేదా వారి యొక్క బలహీనతలు వంటి ఇతర వివరాలను కలిగి ఉంటుంది.
 • విక్రయదారుల వ్యాఖ్యానాలు. వైమానిక కంపెనీ చేసే విక్రేతల వ్యాఖ్యానాలు (వెండార్ రిమార్క్స్, VRs), బుకింగు లేదా అభ్యర్ధన పూర్తైన వెంటనే, స్వయంచాలితంగా సంభవిస్తాయి. ఇవి సాధారణంగా వైమానిక కంపెనీ యొక్క స్వీయ రికార్డు లోకేటర్ (కోడ్) ను, ప్రత్యేక అభ్యర్ధనల యొక్క సమాధానాలు, మరియు టిక్కెటింగ్ కాల వ్యవధుల పై ఇచ్చిన సలహాలను కలిగి ఉంటాయి. ఇవి సామాన్యంగా వైమానిక కంపెనీ ద్వారా ఏజెంటుకి పంపించబడగా, ఏజెంటు VRని వైమానిక కంపెనీకి పంపుట కూడా సాధ్యపడుతుంది.

ఇటీవలి కాలంలో, నేరస్తులను లేదా తీవ్రవాదుల జాడను అన్వేషించే పరిశోధకులకు సహాయపడేందుకు వైమానిక కంపెనీలు మరింత సమాచారాన్ని అందించుట, అనేక ప్రభుత్వాలకు అవసరమైనది. వాటిలో కొన్ని:

 • ప్రయాణీకుని లింగం
 • పాస్ పోర్ట్ వివరాలు- జాతీయత, సంఖ్య, మరియు ముగింపు (ఎక్స్పైరీ) యొక్క తారీఖు.
 • జన్మస్థలం మరియు జన్మించిన తేది.
 • వాచ్ లిస్ట్‌లో మినహాయించిన సంఖ్య

నిల్వచెయ్యడం[మార్చు]

అత్యధిక వైమానిక కంపెనీలు మరియు యాత్రా ఏజెన్సీలు, వారి యొక్క PNR డేటాబేస్‌లను కంప్యూటర్ రిజర్వేషన్ సిస్టం (CRS) లేదా గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (GDS) కంపెనీలైన సబ్రే, గెలీలియో, వరల్డ్ స్పాన్ మరియు అమేడియస్‌లలో ఉంచుటకు ఇష్టపడతాయి.

ఆంతరంగిక వ్యవహారాలు[మార్చు]

కొన్ని ఆంతరంగిక సంస్థలు PNR కలిగిన వ్యక్తిగత దత్తాంశాలు (డేటా) యొక్క పరిమాణం మీద ధ్యాస పెడతాయి. బుకింగుని పూర్తి చేయుటకు అవసరమైన కనిష్ఠ డేటా చాలా స్వల్పం కాగా, సున్నిత స్వభావం కలిగిన మరింత సమాచారాన్ని PNR చిహ్నాత్మకంగా కలిగి ఉంటుంది. ఇందులో ప్రయాణీకుని పూర్తి పేరు, జన్మించిన తేదీ, ఇంటి మరియు కార్యాలయ చిరునామా, టెలిఫోన్ నంబరు, e-మెయిల్ చిరునామా, క్రెడిట్ కార్డు వివరాలు, అదే విధంగా అత్యవసరంగా సంప్రదించుటకు పేర్లు మరియు వ్యక్తిగత సమాచారం.

“PNR డేటా యొక్క సులభతరమైన ప్రపంచవ్యాప్త పంపకాన్ని అనుకూలపరచుటకు,” రూపకల్పించబడినట్టి CRS-GDS కంపెనీలు “ దత్తాంశ నిలువ చేయు గిడ్డంగులు (డేటావేర్హౌసులు) మరియు డేటా సంకలితాలుగా పని చేస్తాయి, మరియు ప్రయాణ (ట్రావెల్) డేటాతో వీటికి గల సంబంధానికి సారూప్యమైనది, రుణ సంస్థల (క్రెడిట్ బ్యూరోలు)కు అందుబాటులో ఉన్న ఆర్ధికపరమైన డేటా”.[1] రద్దు చేయబడిన లేదా పూర్తయిన యాత్ర రికార్డును చెరపివేయదు ఎందుకనగా “PNRల యొక్క కాపీలు ప్రస్తుతమున్న స్థలం నుంచి పాత పత్రాల నిలువ పద్ధతికి 'పరిహరించ'బడతాయి, మరియు CRSలు, వైమానిక కంపెనీలు, యాత్రా ఏజెన్సీలు వీటిని కాలపరిమితి లేకుండా అట్టేపెట్టుకుంటాయి.”[2] ఇంకా, PNR డేటా కొరకు దరిదాపుగా ఎట్టి ఆంక్షలు లేని అందుబాటుని అనుమతించుటకు CRS-GDS కంపెనీలు, వెబ్ సైట్లని పోషిస్తాయి - తరచుగా, టిక్కెట్టు మీద ముద్రించబడిన రిజర్వేషన్ నంబరు ద్వారానే సమాచారం అందుబాటులో ఉంటుంది.

అదనంగా, “బిల్లింగు, మీటింగు, మరియు డిస్కౌంట్ ఎలిజిబిలిటీ (తగ్గింపు అర్హత) కోడ్ లతో, PNRలు ప్రయాణీకుల మధ్య అనుసంధానతల యొక్క నమూనాల మీద వివరమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది. మతపరమైన భోజన అధిగణ్యతలు మరియు స్పెషల్ సర్వీసు రిక్వెస్ట్స్ (ప్రత్యేక సేవా అభ్యర్ధన)లను PNRలు కలిగి ఉండి శారీరక మరియు వైద్యపర స్థితిగతుల వివరాలను వర్ణిస్తాయి (ఉదా., "వీల్ చైర్ ఉపయోగం, ప్రేగుల మరియు తిత్తిని నియంత్రించగలదు") - ఐరోపా సంఘం మరియు కొన్ని ఇతర దేశాల్లో “సున్నితమైన” వ్యక్తిగత డేటాగా ప్రత్యేక సంరక్షిత హోదా కలిగిన సమాచార విభాగాలు.”[3] [4] అవి కలిగిన సున్న్నిత స్వభావం ఉన్న సమాచారంతో పాటుగా, వైద్యపర మరియు ఆర్ధిక రికార్డులకు వర్తించిన ఆంతరంగిక సంరక్షణకు PNRలు సాధారణంగా అర్హమైనవని గుర్తించబడలేదు. దీనికి బదులుగా, వీటిని వ్యాపారాత్మక లావాదేవీల డేటా యొక్క రూపంగా వ్యవహరిస్తారు.[3]

USA మరియు ఐరోపా సంఘం మధ్య PNR బదిలీల యొక్క నియంత్రణ[మార్చు]

PNRల యొక్క గమ్యత మరియు బదిలీలు ఐరోపా డేటా సంరక్షణ చట్టం యొక్క పరిధిలోకి వస్తాయి. ఆర్ధిక సహకారం మరియు అభివృద్ధి సంస్థ (ఆర్గనైసేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డవలప్మేంట్,OECD) యొక్క 1980 ఆంతరంగిక సూచనల మేరకు మరియు డేటా సంరక్షణ మీద 1995 ఐరోపా సంఘం జారీ చేసిన ఆజ్ఞ ప్రకారం, సమానమైన డేటా సంరక్షణ చట్టాలు కలిగిన దేశాలకు మాత్రమే బదిలీ PNRలు బదిలీ చేయబడతాయి.[5] ఇంకా, ప్యాసింజర్ డేటాని చట్టప్రకారం జరిపించు యాజమాన్యాలకు ప్యాసింజర్ డేటాని కేవలం దృష్టాంత ప్రాతిపదిక మీద, అనగా ఎక్కడైనా అసాధారణమైన సందేహం వచ్చిన సందర్భంలో, మాత్రమే అందుకొనుటకు అనుమతి ఉంటుంది.

సెప్టెంబర్ 11, 2001 దాడుల పిమ్మట, తీవ్రవాద దాడులను పరిశోధించుటకు మరియు అరికట్టుటకు PNRలు (నిలువ చేసిన మరియు ప్రస్తుతమున్న రెండింటినీ) అమూల్యమైన సాధనాలుగా US ప్రభుత్వం నిర్ధారించినది. దాని ప్రకారంగా, US డిపార్టుమెంటు ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ (DHS) బ్యూరో ఆఫ్ కస్టంస్ అండ్ బోర్డర్ ప్రోటేక్షన్ (సరిహద్దు రక్షణ మరియు కస్టం సంస్థ) ద్వారా PNRల యొక్క సేకరణ, బదిలీ మరియు నిలుపుదలలను US ప్రభుత్వం కోరింది.

మే 2004లో, US ప్రభుత్వం చర్చించిన 2004 ప్యాసింజర్ నేమ్ రికార్డు డేటా ట్రాన్స్ఫెర్(బదిలీ) ఒప్పందం (అలియాస్. US-EU PNR ఒప్పందం) - ఐరోపా కమీషన్ తో రక్షణ కల్పించు PNR బదిలీ ఒప్పందం. ముఖ్యంగా, ఐరోపా కమీషన్ దృష్టిలో, డేటా సేకరించబడుటకు కారణమైన ప్రయోజనాల మేరకు మాత్రమే బదిలీలను మరియు వాడుకొనుటను చేసినంత కాలం, అట్టి PNR బదిలీలకు వెచ్చించిన రక్షణ స్థాయి, 1995 EU డేటా డైరేక్టివ్ (ఆదేశం) కోరిన "పర్యాప్తత" యొక్క ప్రామాణికాన్ని తృప్తిపరుస్తుంది. ఇట్టి ప్రయోజనాలు పరిమితమై ఉన్నట్టి "అరికట్టుట మరియు ఎదుర్కొనుట: తీవ్రవాదం మరియు సంబంధిత నేరాలను; అంతర్-జాతీయ నైజం కలిగిన వ్యవస్థాగత నేరాలతో కలిపి ఇతర తీవ్రమైన నేరాలను; మరియు అట్టి నేరాలకు జారీ అయిన వారెంట్లు లేదా కస్టడీ నుంచి పారిపోవుట."[6] US-EU-PNR ఒప్పందం ప్రకారం US యాజమాన్యాలకు PNR డేటాను ఐరోపా వైమానిక కంపెనీలు విమానం పైకెగిరిన 15 నిముషాలలోపుగా అందివ్వవలసి ఉంటుంది. 2006 మే 30లో ఐరోపా కోర్ట్ ఆఫ్ జస్టీస్ (న్యాయస్థానం) ద్వారా ఈ ఒప్పందాన్ని చట్టపరమైన అధికార లోపం వలన బలహీనపరచగా, ఐరోపా కౌన్సిల్ ఈ ఒప్పందాన్ని, న్యాయస్థానం శాసించిన తుదిగడువు 2006 సెప్టెంబరు 30 లోపుగా, న్యాయసూత్రాలను పునరుజ్జీవపరచుటకు కృషి చేసింది.[7]

2007 జూలైలో, సరిక్రొత్త, వివాదాస్పదమైన [8], PNR ఒప్పందం US మరియు EUల మధ్య సంతకం చేయబడింది.[9] కొంత కాలం తరువాత, బుష్ పరిపాలన కాలంలో, EU సిటిజన్స్ (పౌరులు) డేటా [10] యొక్క రక్షణ గురించి స్టేట్ వాచ్ నుంచి అక్కర నిమిత్తం 1974 ప్రైవసీ ఆక్ట్ నుంచి డిపార్టుమెంటు ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కొరకు, ఆగమన మరియు నిష్క్రమణ పద్ధతి (అరైవల్ అండ్ డిపార్చర్ సిస్టం, ADIS) కొరకు మరియు ఆటోమేటడ్ టార్గెట్ సిస్టం కొరకు మినహాయింపు ఇచ్చారు.

ఫిబ్రవరి 2008 లో, యురోపియన్ యూనియన్ అంతర్గత వ్యవహారాల కమిషన్ యొక్క అధ్యక్షుడైన జోనాథన్ ఫాల్ PNR కి సంబంధించిన US ద్వైపాక్షిక పాలసీ గురించి ఫిర్యాదు చేసాడు[11]. ముందస్తుగా బ్రస్సెల్స్ ని సంప్రదించకుండా, ఫిబ్రవరి 2008 లో US ప్రభుత్వం, వీసా పరిత్యాగ స్కీం మార్పిడిని, మేమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) గా చెక్ రిపబ్లిక్తో కుదుర్చుకున్నది.[8] US లో తక్కువ స్థాయి డేటా రక్షణ వలన ప్రధానంగా వాషింగ్టన్ మరియు బ్రస్సెల్స్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, ముఖ్యంగా US 1974 ప్రైవసీ ఆక్ట్ వలన విదేశీయులకు ప్రయోజనం చేకూరని కారణంగా. EUలో డేటా ప్రైవసీని నియంత్రించేది వ్యక్తిగత డేటా యొక్క 95/46/EC రక్షణ శాసనం, మరియు యురోపియన్ విధానాలతో చేరు విధంగా మారిన US రక్షణ కల్పించు (సేఫ్ హార్బర్) ఏర్పాటు, ఇప్పటికీ రక్షణా లోపం అభియోగం మీద వివాదాస్పదంగా ఉంది. ద్వైపాక్షిక MOU కొరకు సంప్రదించిన ఇతర దేశాలలో యునైటెడ్ కింగ్డం, ఎస్టోనియా, జర్మనీ మరియు గ్రీస్ కలవు[12].

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ముందస్తు ప్రయాణీకుల సమాచార వ్యవస్థ

సూచనలు[మార్చు]

 1. ఎలక్ట్రానిక్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ సెంటర్, ప్రైవసీ & హ్యూమన్ రైట్స్ – యాన్ ఇంటర్నేషనల్ సర్వే అఫ్ ప్రైవసీ లాస్ అండ్ డెవలప్ మెంట్స్ 2004, 81.
 2. ఏకాంతం & మానవ హక్కులు, 81.
 3. 3.0 3.1 ఏకాంతం & మానవ హక్కులు, 80.
 4. చూడండి ఎడ్వర్డ్ హస్బ్రోక్, “వాట్ ఇజ్ ఇన్ ఎ ప్యాసింజెర్ నేమ్ రికార్డు(PNR)?,” http://hasbrouck.org/articles/PNR.html
 5. ఆర్గనైజేషణ్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్, ఏకాంత మరియు వ్యక్తిగత డేటా ప్రవాహం యొక్క రక్షణ నిభందనలు (సెప్టెంబర్ 23, 1980), ఇక్కడ లభిస్తుంది http://www.oecd.org/document/18/0,2340,en_2649_34255_1815186_1_1_1_1,00.html
 6. సంవిధానం మరియు PNR డేటాను వివిధ వైమానిక సంస్థలు, US హోమ్ ల్యాండ్ డిపార్టుమెంటు సెక్రటరీ, బ్యూరో అఫ్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ కు పంపించుటకు యురోపియన్ సమూహమునకు మరియు US మధ్య ఒప్పందం. కౌన్సిల్ దిరేక్టివే డైరేక్తివ్ 2004 O.J. (L 183) 94 (EC).
 7. చూడండి BBC న్యూస్: EU కోర్ట్ అన్నుల్స్ డేటా డీల్ విత్ US మరియు జడ్జ్ మెంట్ అఫ్ ది కోర్ట్ అఫ్ జస్టిస్ ఇన్ జాయింట్ కేసెస్ C-317/04, C-318/04 పార్లమెంట్/కౌన్సిల్ (పత్రిక ప్రకటన, pdf) ఆన్ లైన్.
 8. 8.0 8.1 ఎ డివైడెడ్ యూరోప్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఇట్స్ పర్సనల్ డేటా వాంటెడ్ బై ది US, Rue 89 , 4 మార్చ్ 2008(in English)
 9. చూడు [1].
 10. స్టేట్ వాచ్, US చేంజెస్ ది ప్రైవసీ రూల్స్ టు ఎక్సేమ్షణ్ యాక్సెస్ టు పర్సనల్ డేటా సెప్టెంబర్ 2007
 11. బ్రుస్సేల్స్ అటాక్స్ న్యూ US సెక్యూరిటీ డిమాండ్స్, యురోపియన్ అబ్సర్వర్. ఇవి కూడా చూడండి స్టేట్ వాచ్ న్యూస్ లెటర్ ఫిబ్రవరి 2008
 12. స్టేట్ వాచ్, మార్చ్ 2008

బాహ్య లింకులు[మార్చు]