ప్యూమా ఏజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Puma AG Rudolf "rudi" Dassler Sport
రకంAktiengesellschaft (మూస:FWB)
స్థాపితం1924 as Gebrüder Dassler Schuhfabrik
(registered in 1948)[1]
వ్యవస్థాపకు(లు)Rudolf Dassler
ప్రధానకార్యాలయంHerzogenaurach, Germany
సేవా ప్రాంతముWorldwide
కీలక వ్యక్తులుJochen Zeitz (CEO and Chairman of the management board)
Melody Harris-Jensbach (deputy CEO)
Klaus Bauer (COO)
François-Henri Pinault (Chairman of the supervisory board)
పరిశ్రమClothing and consumer goods manufacture
ఉత్పత్తులుFootwear, sportswear, sports goods, fashion accessories
ఆదాయం2.461 billion (2009)[2]
నిర్వహణ రాబడి€192.4 million (2009)[2]
లాభము€128.2 million (2009)[2]
ఉద్యోగులు9,650 (end 2009)[2]
ఆదాయంPPR
వెబ్‌సైటుwww.puma.com

అధికారికంగా ప్యూమా (PUMA) అనే బ్రాండ్ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్యూమా ఏజీ రుడాల్ఫ్ డాస్లెర్ స్పోర్ట్ (Puma AG Rudolf Dassler Sport) జర్మనీకి చెందిన ఒక ప్రధాన బహుళజాతి సంస్థ, ఇది ఉన్నత శ్రేణి అథ్లెటిక్ షూలు, జీవన సరళి పాదరక్షలు మరియు ఇతర క్రీడా సామాగ్రి (దుస్తులు, బూట్లు, ఇతరాలు)ని ఉత్పత్తి చేస్తుంది. 1924లో గెబ్రూడెర్ డాస్లెర్ షూఫ్యాబ్రిక్ అనే పేరుతో అడాల్ఫ్ మరియు రుడాల్ఫ్ డాస్లెర్ ఈ సంస్థను స్థాపించారు, ఈ ఇద్దరు సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో 1948లో సంస్థ చీలిపోయింది, దీని ఫలితంగా అడిడాస్ (Adidas) మరియు ప్యూమా అనే రెండు సంస్థలు ఏర్పడ్డాయి. ప్యూమా ప్రస్తుతం జర్మనీలోని హెర్జోజెనౌరాచ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంది.

ఈ కంపెనీ ఫుట్‌బాల్ షూలకు ప్రసిద్ధి చెందింది, ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారులు పీలే, యుసెబియో, జోహాన్ క్రుయిజఫ్, ఎంజో ఫ్రాన్సెస్కోలీ, డియెగో మారడోనా, లోథర్ మాథ్యూస్, కెన్నీ డాల్‌గ్లిష్, డీడైర్ డెస్‌ఛాంప్స్ మరియు గియాన్ల్యూగి బఫన్ తదితరులకు ప్యూమా స్పాన్సర్‌గా వ్యవహరించింది. జమైకా పరుగు వీరుడు ఉసేన్ బోల్డ్‌కు కూడా ప్యూమా స్పాన్సర్‌గా ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, కంపెనీ సూడో బాస్కెట్‌బాల్ షూలతో ప్రసిద్ధి చెందింది, 1968లో ఈ షూలను పరిచయం చేసింది, చివరకు న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు వాల్ట్ "క్లైడ్" ఫ్రాజీర్‌‌ పేరును స్వీకరించడంతోపాటు, ప్రచార భాగస్వామ్యం కోసం జో నామత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

తన సోదరుడి నుంచి విడిపోయిన తరువాత, రుడాల్ఫ్ డాస్లెర్ మొదట కొత్తగా ఏర్పాటు చేసిన కంపెనీకి రుడా అనే పేరును నమోదు చేశారు, అయితే తరువాత కంపెనీ పేరును ప్యూమాగా మార్చారు.[3]:31 ప్యూమా మొట్టమొదటి వ్యాపార చిహ్నం (లోగో)లో ఒక చతురస్రం మరియు డి (D) అక్షరం గుండా దూకుతున్న మృగం ఉంటుంది, 1948లో కంపెనీ పేరుతోపాటు, ఈ చిహ్నాన్ని నమోదు చేశారు. ప్యూమా షూ నమూనాలపై ఒక ప్రత్యేకమైన "ఫార్మ్‌స్ట్రైప్" (ప్రత్యేకమైన చార)[3] ఉంటుంది,[3]:33 దుస్తులు మరియు ఇతర ఉత్పత్తులపై కూడా ఉండే ఈ చారపై వ్యాపార చిహ్నం ముద్రిస్తున్నారు.

కంపెనీ లామైన్ కౌయాట్, ఎమీ గార్బెర్స్ మరియు ఇతరులు రూపకల్పన చేసిన లైన్స్ షూలు మరియు క్రీడా దుస్తులు అందిస్తుంది. 1996 నుంచి ప్యూమా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను వేగవంతం చేసింది. అమెరికాకు చెందిన క్రీడా దుస్తులు తయారు చేసే బ్రాండ్ లోగో అథ్లెటిక్‌లో ప్యూమాకు 25% వాటా ఉంది, లోగో అథ్లెటిక్‌కు అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ మరియు అసోసియేషన్ ఫుట్‌బాల్ లీగ్‌ల లైసెన్స్‌లు ఉన్నాయి. 2007 నుంచి ప్యూమా ఏజీ ఫ్రాన్స్‌కు చెందిన విలాసవస్తువుల తయారు చేసే గ్రూపు పిపిఆర్ (PPR)లో భాగంగా ఉంది.

చరిత్ర[మార్చు]

నేపథ్యం[మార్చు]

క్రిస్టోఫ్ వాన్ విల్‌హెల్మ్ డాస్లెర్ ఒక షూ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేసేవారు, ఆయన భార్య పాలిన్ న్యూరెంబర్గ్ నగరం నుంచి 20 km (12.4 mi) దూరంలో ఉన్న హెర్జోజెనౌరాచ్‌లోని బావారియా పట్టణంలో ఒక చిన్న లాండ్రీని (చాకలి కొట్టు) నడిపేవారు. వారి కుమారుడు రుడాల్ఫ్ డాస్లెర్ పాఠశాల నుంచి బయటకు వచ్చిన తరువాత షూ కర్మాగారంలో తండ్రితో కలిసి పని చేయడం మొదలుపెట్టారు, తరువాత వారికి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనేందుకు పిలుపువచ్చింది. యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తరువాత, రుడాల్ఫ్ ఒక పార్సెలీన్ కర్మాగారంలో ఒక నిర్వహణాధికారి ఉద్యోగం పొందారు. తరువాత న్యూరెంబర్గ్‌లో ఒక తోలు టోకు వ్యాపారంలో ఉద్యోగం పొందారు.

ఇంటికి దూరంగా గడపడంతోపాటు, ఇతరుల కోసం పనిచేసి అలసిపోవడం వలన 1924లో రుడాల్ఫ్ తిరిగి హెర్జోజెనౌరాచ్ వచ్చారు, అప్పటికే తన చిన్న సోదరుడు అడాల్ఫ్‌ను, ముద్దుపేరు "అడి", సొంతగా షూ కర్మాగారాన్ని స్థాపించడంతో రుడాల్ఫ్ దానిలో చేరారు. వారు కొత్త వ్యాపారానికి గెబ్రూడెర్ డాస్లెర్ షూఫ్యాబ్రిక్ (డాస్లెర్ బ్రదర్స్ షూ ఫ్యాక్టరీ ) అనే పేరు పెట్టారు. ఈ వ్యాపారాన్ని వారు తమ తల్లి లాండ్రీలో ప్రారంభించారు, అయితే ఆ సమయంలో, పట్టణంలో విద్యుత్ సరఫరాపై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో, ఈ సోదరులు కొన్నిసార్లు తమ పరికరాలను నడిపేందుకు స్థిరంగా ఉండే సైకిల్‌ను తొక్కడం ద్వారా వచ్చే శక్తిని ఉపయోగించేవారు.[4]

1936 వేసవి ఒలింపిక్స్ సమయానికి అడి డాస్లెర్ స్పైక్‌లతో నింపిన ఒక సూట్‌కేస్‌తో బావారియా నుంచి ప్రపంచంలో మొట్టమొదటి మోటారు వాహనమార్గాల్లో ఒకటైన రోడ్డుపై ఒలింపిక్ గ్రామానికి చేరుకున్నాడు, అక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల పరుగు వీరుడు జెస్సీ ఒవెన్స్ వాటిని ఉపయోగించేలా ఒప్పించగలిగాడు, ఒక ఆఫ్రికన్ అమెరికన్‌కు లభించిన మొదటి స్పాన్సర్‌షిప్ ఇదే కావడం గమనార్హం. ఒవెన్స్ నాలుగు బంగారు పతకాలు గెలుచుకున్న తరువాత, అతని విజయం డాస్లెర్ షూలకు ప్రపంచ ప్రసిద్ధ క్రీడాకారుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఈ సోదరులకు ఉత్తరాలు వచ్చాయి, ఇతర జాతీయ జట్లకు శిక్షణ ఇచ్చేవారు డాస్లెర్ షూలు కావాలని లేఖల ద్వారా ఆసక్తి చూపారు. వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో, డాస్లెర్ సోదరులు రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఏడాదికి 200,000 జతల షూలను విక్రయించే స్థాయికి ఎదిగారు.[5]

కంపెనీ చీలిక మరియు ప్యూమా ఏర్పాటు[మార్చు]

ఇద్దరు సోదరులు నాజీ పార్టీలో చేరారు, అయితే రుడాల్ఫ్ మాత్రమే పార్టీకి బాగా సన్నిహితంగా మెలిగారు. యుద్ధం సందర్భంగా, సోదరుల మధ్య పెరిగిన విభేదాలు 1943లో మిత్రదేశాల బాంబు దాడి సందర్భంగా తారాస్థాయికి చేరుకున్నాయి, ఈ బాంబు దాడి సమయంలో అడి మరియు ఆయన భార్య ఒక బాంబు రక్షణ స్థావరంలోకి వెళ్లే సమయానికే రుడాల్ఫ్ మరియు ఆయన కుటుంబం ఈ స్థావరంలో ఉంది.మిత్రరాజ్యాల యుద్ధ విమానాలను ఉద్దేశించి అడి తీవ్ర అవమానకర పదజాలంతో దూషించాడు, అయితే రుడాల్ఫ్ ఈ దూషణలను తనను మరియు తన కుటుంబాన్ని ఉద్దేశించనవని భావించాడు.[3]:18 తరువాత రుడాల్ఫ్‌ను అమెరికా సైనికులు బంధించినప్పుడు ఆయనను వారు వాఫెన్ ఎస్ఎస్ సభ్యుడిగా అనుమానించారు, అయితే రుడాల్ఫ్ తన సోదరుడి వలన బంధీగా చిక్కినట్లు భావించాడు.[6]

1948లో, ఈ ఇద్దరు సోదరులు వ్యాపారంలో చీలిపోయారు. రుడాల్ఫ్ తరువాత హై హిల్‌ను విడిచిపెట్టి సొంత కంపెనీని ప్రారంభించేందుకు ఆరాచ్ నది రెండో వైపు వెళ్లారు. ఈ చీలిక తరువాత అడాల్ఫ్ సొంతగా స్పోర్ట్స్‌వేర్ కంపెనీని ప్రారంభించారు, ఈ కంపెనీకి తన ముద్దు పేరు "Adi" మరియు తన చివరి పేరులోని మొదటి మూడు అక్షరాలు "Das"లను కలిపి Adidas అనే పేరు పెట్టారు. రుడాల్ఫ్ తన పేరులో మొదటి రెండు అక్షరాలు "Ru" మరియు చివరి పేరు డాస్లెర్‌లో మొదటి రెండు అక్షరాలు "Da"లను కలిపి Ruda అనే ఒక కొత్త కంపెనీని స్థాపించారు. రుడాల్ఫ్ తన కంపెనీ పేరును 1948లో ప్యూమా షూఫ్యాబ్రిక్ రుడాల్ఫ్ డాస్లెర్‌ గా మార్చారు.[7]

సోదరుల మధ్య విభేదాలు చివరకు పట్టణంలో చీలికకు దారితీశాయి. 1948 నుంచి, ఈ పట్టణం ఒక చిన్న-బెర్లిన్ మాదిరిగా మారింది. స్థానికుల్లో బ్రాండ్ విధేయత ఉచ్ఛస్థితికి చేరుకుంది; అనేక దుకాణాలు, బేకరీలు మరియు బార్లు అనధికారికంగా రుడాల్ఫ్ ప్యూమా లేదా అడాల్ఫ్ యొక్క అడిడాస్‌కు మద్దతుదారులుగా గుర్తింపు పొందాయి. పట్టణం యొక్క రెండు ఫుట్‌బాల్ క్లబ్‌లు కూడా చీలిపోయాయి; ఏఎస్‌వీ హెర్జోజెనౌరాచ్ క్లబ్ మూడు చారలకు (అడిడాస్) మద్దతు ఇవ్వగా, 1 ఎఫ్‌సి హెర్జోజెనౌరాచ్ రుడాల్ఫ్ యొక్క పాదరక్షలకు మద్దతు ఇచ్చింది.[8] చిన్న పనులు చేసుకునే చేతి వృత్తులవారిని రుడాల్ఫ్ తన ఇంటికి ఆహ్వానించినప్పుడు వారు ఉద్దేశపూర్వకంగా అడిడాస్ పాదరక్షలను ధరించేవారు, అలా అడిడాస్ పాదరక్షలు ధరించినవారిని రుడాల్ఫ్ చూస్తే వారిని తన ఇంటి బేస్‌మెంట్‌కు పంపి ఒక జత ఉచిత పాదరక్షలు ఉచితంగా ఇచ్చేవారు.[6] విడిపోయిన తరువాత ఇద్దరు సోదరుల మధ్య తిరిగి సఖ్యత కుదరలేదు, అయితే ఇద్దరినీ ఒకే స్మశానవాటికలో సమాధి చేశారు, మిగిలిన అన్ని విషయాల్లో వారు ఒకరికొకరు బాగా దూరమయ్యారు.

కంపెనీ యొక్క విలక్షణ చారల నమూనాతో ప్యూమా క్రీడా-జీవన సరళి షూ జత

ప్రారంభ సంవత్సరాలు మరియు అడిడాస్‌తో పోటీ[మార్చు]

విడిపోయిన తరువాత, ప్యూమా మరియు అడిడాస్ కంపెనీలు ఒకదానితో ఒకటి తీవ్ర స్థాయిలో పోటీపడ్డాయి. ఈ పోటీ చివరకు హెర్జోజెనౌరాచ్‌ను రెండుగా చీల్చాయి, చివరకు పట్టణం పేరు "ది టౌన్ ఆఫ్ బెంట్ నెక్స్" (కిందకు చూసే వ్యక్తుల పట్టణం) - ఎందుకంటే బాటసారులు ఎవరి పాదరక్షలు ధరించారో చూసేందుకు దాదాపుగా అందరూ అవతలివారి పాదాలు చూస్తూ వెళ్లేవారు.[9]

1948లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జరిగిన మొట్టమొదటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పశ్చిమ జర్మనీ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన పలువురు సభ్యులు ప్యూమా బూట్లు ధరించారు, యుద్ధం తరువాత పశ్చిమ జర్మనీకి తొలి గోల్ సాధించిన హెర్బెర్ట్ బుర్డెన్‌స్కీ కూడా ఈ బూట్లు ధరించాడు. నాలుగేళ్ల తరువాత, 1952 వేసవి ఒలింపిక్స్‌లో 1500 మీటర్ల పరుగు వీరుడు లగ్జెంబర్గ్‌కు చెందిన జోసీ బార్థెల్ ఫిన్లాండ్‌లోని హెల్సింకీలో ప్యూమా బూట్లు ధరించి బంగారు పతకం సాధించాడు, తద్వారా ప్యూమా యొక్క తొలి స్వర్ణ పతక విజేతగా అతను గుర్తింపు పొందాడు.

1960 వేసవి ఒలింపిక్స్‌లో జర్మనీ స్ప్రింటర్ ఆర్మిన్ హారీ 100 మీటర్ల స్ప్రింట్ ఫైనల్‌లో ప్యూమా పాదరక్షలు ధరించేందుకు కంపెనీ నగదు చెల్లించింది. దీనికి ముందు హారీ అడిడాస్ బూట్లు ధరించాడు, ఆపై అడాల్ఫ్‌ను నగదు కోరాడు, అయితే అడిడాస్ యజమాని అడాల్ఫ్ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చాడు. ఈ జర్మనీ క్రీడాకారుడు ప్యూమా బూట్లు ధరించి బంగారు పతకం గెలిచాడు, అయితే పతాక ప్రదాన వేడుక కోసం అడిడాస్‌తో చేతులు కలిపాడు - ఈ విధంగా ఇద్దరు డాస్లెర్ సోదరులకు అతను షాక్ ఇచ్చాడు. ఒక ఎత్తుగడతో రెండు కంపెనీల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలని భావించాడు, అయితే అడి తీవ్ర ఆగ్రహం చెంది ఈ ఒలింపిక్ ఛాంపియన్‌ను నిషేధించారు.[5]

పీలే ఒప్పందం మరియు తరువాతి వ్యవహారాలు[మార్చు]

1970 ఫిఫా ప్రపంచ కప్‌కు కొన్ని నెలల ముందు ఆర్మిన్ డాస్లెర్ మరియు ఆయన బంధువు హోర్స్ డాస్లెర్ "ది పీలే ప్యాక్ట్" గా వర్ణించబడిన ఒప్పందాన్ని ఖరారు చేశారు. అడిడాస్ మరియు ప్యూమా రెంటింటికీ దూరంగా ఉండాలని బ్రెజిల్‌కు చెందిన అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ పీలేకు ఈ ఒప్పందం సూచించింది. అయితే, ఆర్మిన్ ఈ సూపర్‌స్టార్‌ను స్పాన్సర్ చేయడం వలన కలిగే ఆర్థిక మరియు వ్యాపార ప్రయోజనాలు గణనీయంగా ఉంటాయని గుర్తించారు. జర్మనీకి చెందిన ఈ క్రీడా షూ తయారీ కంపెనీ గురించి అవగాహనను పెంచేందుకు మరియు దానికి ప్రచారం కల్పించడానికి తమ ఉత్పత్తులను ధరిస్తే $120,000 చెల్లిస్తామని ప్యూమా ప్రతినిధి హాన్స్ హెన్నింగ్సెన్ చేసిన విజ్ఞప్తికి పీలే అంగీకరించారు.[5] 1970 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రారంభ విజిల్ సమయంలో పీలే తన షూలేసులను కట్టుకునేందుకు ఒక చివరి-రెండో విజ్ఞప్తితో రిఫరీని నిలువరించారు, తద్వారా అతను ధరించిన ప్యూమా షూలు కోట్లాది మంది టెలివిజన్ వీక్షకుల కళ్లలో పడేలా చేశారు.[3]:82 ఇది హార్స్ డాస్లెర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది, తద్వారా భవిష్యత్ శాంతి ఒప్పందాలు రద్దు చేయబడ్డాయి.

రెండేళ్ల తరువాత, 1972 వేసవి ఒలింపిక్స్ సందర్భంగా, ప్యూమా ఉగాండాకు చెందిన 400 మీటర్ల హర్డిల్స్ విజేత జాన్ అకీ-బువాకు రన్నింగ్ షూలు అందించింది. అకీ-బువాను ఉగాండా సైనిక ప్రభుత్వం బహిష్కరించడంతో, ప్యూమా అతనికి జర్మనీలో ఆశ్రయం కల్పించింది, జర్మనీ సమాజంలో అతడు మరియు అతని కుటుంబాన్ని కలిసిపోయేందుకు సాయం అందించింది, అయితే చివరకు అకీ-బువా ఉగాండా తిరిగి వెళ్లారు.

మే 1989లో, రుడాల్ఫ్ కుమారులు ఆర్మిన్ మరియు జెర్డ్ డాస్లెర్ ప్యూమాలో తమ 72 శాతం వాటాను స్విస్ వ్యాపార సంస్థ కోసా లీబెర్మాన్ ఎస్ఏకు విక్రయించేందుకు అంగీకరించారు.[10]

1986లో ప్యూమా ఒక పబ్లిక్ కంపెనీగా మారింది, ఆ తరువాత బోర్స్ మ్యున్‌చెన్ మరియు ఫ్రాంక్‌ఫర్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో నమోదయింది.

ప్రస్తుత రోజు[మార్చు]

ఒక షాపింగ్ కేంద్రంలో ప్యూమా దుకాణం

ప్యూమా ఏజీలో సుమారుగా 9,204 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు, 80కిపైగా దేశాల్లో కంపెనీ తన ఉత్పత్తులను పంపిణీ చేస్తుంది.[ఎప్పుడు?] 2003 ఆర్థిక సంవత్సరంలో, కంపెనీ ఆదాయం 1.274 బిలియన్‌ల వద్ద ఉంది. 2002 ఏనిమ్ సిరీస్ Hungry Heart: Wild Striker కు ప్యూమా బ్రాండ్‌ను ప్రదర్శించే జెర్సీలు మరియు క్రీడా దస్తులతో ఈ సంస్థ వ్యాపార స్పాన్సర్‌గా ఉంది.

1993 నుంచి సీఈవో మరియు ఛైర్మన్ జోచెన్ జీట్జ్ కంపెనీకి నేతృత్వం వహిస్తున్నారు. అక్టోబరు 2007లో ఆయన కాంట్రాక్టును మరో నాలుగేళ్లపాటు, అంటే 2012 వరకు పొడగించారు.[11]

ఒక ఉన్నత శ్రేణి స్నీకర్‌లను తయారు చేసేందుకు జపనీస్ ఫ్యాషన్ గురు మిహరా యాసుహిరోతో ప్యూమా చేతులు కలిపింది.[12]

ఔత్సాహికుల డ్రైవింగ్ షూలు మరియు రేస్ సూట్‌లను తయారు చేసే ప్రధాన సంస్థగా ప్యూమా గుర్తింపు పొందింది. ఫార్ములా వన్ మరియు ముఖ్యంగా NASCAR రెండింటికీ ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. 2006 ఫిఫా ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఇటాలియన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు స్పాన్సర్ హక్కులను గెలుచుకోవడంలో ప్యూమా విజయవంతమైంది, తద్వారా ఈ జట్టు సభ్యులు ప్యూమా తయారు చేసిన దస్తులు ధరించారు. ప్యూమా-ఫెరారీ మరియు ప్యూమా-బీఎండబ్ల్యూ షూలను తయారు చేసేందుకు ఫెరారీ మరియు బీఎండబ్ల్యూ(BMW)లతో భాగస్వామ్యం కూడా ఈ విజయానికి దోహదపడింది. మార్చి 15, 2007న ప్యూమా మొదటి నూతన 2007/2008 శ్రేణి యూనీఫామ్‌లను ఒక క్లబ్ కోసం తయారు చేసింది, బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ గ్రెమియో లేజర్ సెవన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి క్లబ్‌గా గుర్తింపు పొందింది, 2006 ప్రపంచ కప్‌లో ఇటలీ ధరించినవాటి మాదిరిగానే ఇవి ఉంటాయి. గ్రెమియో మరియు ఇతర బ్రెజిల్ క్లబ్‌లు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన మొదటి క్లబ్‌లుగా గుర్తింపు పొందాయి, ఎందుకంటే యూరోపియన్ క్లబ్‌ల కంటే వీరి సీజన్ ఆరు నెలల ముందుగానే ప్రారంభమవుతుంది. ప్యూమా బేస్‌బాల్ క్లీట్‌లను కూడా తయారు చేస్తుంది, డెట్రాయిట్ టైగర్స్ అవుట్‌ఫీల్డర్‌గా ఉన్న జానీ డామోన్ వారి ప్రతినిధిగా ఉన్నాడు. "డిఎఫ్ఆర్ మెటల్స్"గా పిలిచే సొంత క్లీట్ అతనికి ఉంది.

ప్రసిద్ధ కింగ్[మార్చు]

2008లో, ప్యూమా ఒక ప్రత్యేక వార్షిక ఎడిషన్ కింగ్ XL (రోమన్ సంఖ్యల్లో XL అంటే 40)తో కింగ్ యొక్క 40వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది,[13] పోర్చుగీసు ఫుట్‌బాల్ క్రీడాకారుడు యూసెబియోకు గౌరవసూచకంగా ఈ వేడుకలను జరిపింది, యూసెబియో ప్రసిద్ధ కింగ్ షూలను ధరించి 1968లో 42 గోల్స్ సాధించాడు, తద్వారా యూరప్ అగ్రగామి స్కోరర్‌గా గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్నాడు. పీలే, మేరియో కెంపెస్, రూడి వోలెర్, లోథర్ మాథ్యూస్, మాసిమో ఒడ్డో మరియు డియెగో మారడోనా వంటి ఆటగాళ్లు ఇష్టపడే షూ కింగ్ కావడం గమనార్హం. కింగ్ శ్రేణిలో కొత్త వెర్షన్‌లను విడుదల చేయడం ప్యూమా కొనసాగించింది, 2009లో ఇటాలియన్ సాకర్ చరిత్రకు సంబంధించిన వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఒక వెర్షన్‌ను విడుదల చేసింది, ముఖ్యంగా రెండు ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టుకు కోచ్‌గా ఉన్న విట్టోరియో పోజ్జో కోసం ప్యూమా కింగ్ XL ఇటాలియాను విడుదల చేసింది.[14]

2010లో ప్యూమా కింగ్ మరోసారి ఒక ఫుట్‌బాల్ దిగ్గజానికి వేడుకలు నిర్వహించింది. ఈసారి డియెగో మారడోనాకు గౌరవసూచకంగా సంబరాలు జరిపిందియ ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం 50వ పుట్టినరోజును పురస్కరించుకొని ప్యూమా కింగ్ డియెగో ఫైనల్ ఫుట్‌బాల్ బూట్‌లను విడుదల చేసింది. అర్జెంటీనా జాతీయ ఫుట్‌బాల్ జట్టు యొక్క లా ఆల్బిసెలెస్టీ యొక్క రంగుల్లో ఈ ఎడిషన్‌ను తయారు చేసింది.

PPR యొక్క కొనుగోలు[మార్చు]

ఫిబ్రవరి 2007లో, 2006 చివరి మూడు నెలల కాలంలో ప్యూమా తమ లాభాలు 26% మేర క్షీణించి €32.8 మిలియన్లకు ($43 మిలియన్లు; £22 మిలియన్లు) పడిపోయాయని ప్రకటించింది. విస్తరణ కారణంగా జరిగిన అధిక వ్యయాలు కారణంగా ఎక్కువగా లాభాలు క్షీణించినట్లు కంపెనీ పేర్కొంది, వాస్తవానికి విక్రయాలు €480.6 మిలియన్లకు పెరిగాయని తెలియజేసింది.[15]

ఏప్రిల్ 2007 ప్రారంభంలో, ప్యూమా వాటాల్లో ప్రతివాటా విలువ €29.25 మేర పెరిగి లేదా సుమారుగా 10.2% వృద్ధి చెంది €315.24కు చేరుకుంది.[16] ఏప్రిల్ 10, 2007లో ఫ్రెంచ్ రీటైలర్ మరియు గుక్కీ బ్రాండ్ యజమాని పినౌల్ట్-ప్రింటెంప్స్-రెనౌట్ (PPR) తాము ప్యూమాలో 27% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది, తద్వారా PPR పూర్తిస్థాయి కొనుగోలుకు మార్గం సుగమం చేసుకుంది. ప్యూమాకు ఈ ఒప్పందంలో €5.3 బిలియన్ల విలువ కట్టారు. ప్రతి వాటాకు €330 చెల్లించి చిన్న వాటా కొనుగోలు పూర్తికాగానే ప్యూమాను తాము స్నేహపూరితంగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామని PPR తెలిపింది. ప్యూమా బోర్డు ఈ చర్యను స్వాగతించింది, కంపెనీ యొక్క ఉత్తమ ప్రయోజనాలకు ఇది మంచి చర్య అని అభిప్రాయపడింది.[17] జులై 17, 2007న PPR ప్యూమాలో 62.1 % వాటాను పొందింది.

ప్యూమాలో PPR అతిపెద్ద వాటాదారుగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఇది ఒక స్వతంత్ర సంస్థగా కార్యకలాపాలు సాగిస్తుంది.

వివాదం[మార్చు]

స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించే సంస్థలు మరియు కార్మిక హక్కుల సంస్థలు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోని కర్మాగారాల్లో ప్యూమా యొక్క ఉపాధి పద్ధతులను విమర్శిస్తున్నాయి, చైనా, టర్కీ, ఎల్ సాల్వడార్ మరియు ఇండోనేషియాలోని కర్మాగారాల్లో ప్యూమా పాటిస్తున్న విధానాలు వివాదాస్పదమయ్యాయి.[18][19][20]

కాలక్రమం[మార్చు]

 • 1920: రుడాల్ఫ్ డాస్లెర్ మరియు ఆయన సోదరుడు అడాల్ఫ్ క్రీడా షూలు తయారు చేయడం ప్రారంభించారు.
 • 1924: గెబ్రూడెర్ డాస్లెర్ షూఫ్యాబ్రిక్‌కు జర్మనీలోని హెర్జోజెనౌరాచ్‌లో శంకుస్థాపన.
 • 1948: ప్యూమా షూఫ్యాబ్రిక్ రుడాల్ఫ్ డాస్లెర్ (అక్టోబరు 1)కు శంకుస్థాపన, ఆటమ్ (ATOM) అనే ప్యూమా యొక్క మొదటి ఫుట్‌బాల్ షూ విడుదల.
 • 1949: తొలగించదగిన స్టడ్‌లతో ఫుట్‌బాల్ షూలను తయారు చేయాలనే ఆలోచన రుడాల్ఫ్ డాస్లెర్‌కు వచ్చింది. వాటి అభివృద్ధి మరియు ఉత్పత్తిపై పని చేయడం ఆయన ప్రారంభించారు.

సెప్ హెర్బెర్జెర్ వంటి, అనేక మంది ఫుట్‌బాల్ నిపుణులు వీటి తయారీలో పాలుపంచుకున్నారు.

 • 1952: సూపర్ ఆటమ్ పరిచయం.
 • 1953: ఆటమ్‌ల తరువాతి ఉత్పాదన: బ్రాసిల్ (BRASIL)' అభివృద్ధి
 • 1958: ప్యూమా సంతకం ఉండే "ఫార్మ్‌స్ట్రైప్" పరిచయం, స్వీడన్‌లో ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా వీటిని ఆవిష్కరించారు.
 • 1959: ప్యూమా-స్పోర్ట్స్‌షూఫ్యాబ్రికెన్ రుడాల్ఫ్ డాస్లెర్ కేజీ అనే పేరుతో కంపెనీ ఒక పరిమిత భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది.
 • 1960: అధునాతన వల్కనీకరణ ఉత్పాదన పద్ధతిని కంపెనీ పరిచయం చేసింది.
 • 1966: వెంబ్లే (WEMBLEY) ఆవిష్కరణ, ఇది ప్యూమా కింగ్‌కు ముందు వచ్చిన మోడల్.
 • 1968: ప్రసిద్ధ కింగ్ ఆవిష్కరణ. వెల్‌క్రో ఫాస్టెనెర్స్‌తో స్పోర్ట్స్ షూలను తయారు చేసిన మొదటి సంస్థగా ప్యూమా గుర్తింపు పొందింది.
 • 1974: రుడాల్ఫ్ డాస్లెర్ మరణించారు. ఆయన కుమారులు ఆర్మిన్ మరియు జెర్డ్ కంపెనీ యాజమాన్యాన్ని చేపట్టారు.
 • 1976: విప్లవాత్మక S.P.A.-సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు.
 • 1986: ఒక వాటా కార్పొరేషన్‌గా రూపాంతరం.
 • 1989: ట్రినోమిక్ (TRINOMIC) స్పోర్ట్ షూ వ్యవస్థ ఆవిష్కరణ.
 • 1990: ఇన్‌స్పెక్టర్ (INSPECTOR) పరిచయం, ఇది బాలల షూలకు ఉద్దేశించిన ఒక పెరుగుదల నియంత్రణ వ్యవస్థ.
 • 1991: డిస్క్ సిస్టమ్ స్పోర్ట్స్ షూ ఆవిష్కరణ.
 • 1992: DM 20 మిలియన్లకుపైగా మూలధన పెరుగుదల, వాటా మూలధనం DM 70 మిలియన్‌లకు పెరిగింది.
 • 1993: జోచెన్ జీట్జ్ ఛైర్మన్ మరియు సీఈవోగా నియమించబడ్డారు, ప్రోవెంటస్/ఆరిట్మోస్ బి.వి. ప్రధాన వాటాదారుగా మారింది.
 • 1994: 1986లో కంపెనీ యొక్క ఐపీవో సమయం నుంచి మొట్టమొదటి లాభం నమోదయింది.
 • 1996: జర్మన్ ఎం-డాక్స్ (M-DAX) ఇండెక్స్‌లో ప్యూమా నమోదయింది; సెల్ (CELL) సాంకేతిక పరిజ్ఞానం మొదటి ఫోమ్-ఫ్రీ మిడ్‌సోల్‌ను పరిచయం చేశారు.
 • 1997: సెల్‌ఎరేటర్ (CELLERATOR) ఆవిష్కరణ.
 • 1998: స్పోర్ట్స్ మరియు ఫ్యాషన్‌లను విలీనం చేసిన ప్యూమా. డిజైనర్ జిల్ శాండర్‌తో కంపెనీ ఒక భాగస్వామ్యాన్ని ప్రారంభించింది.
 • 1999: US జాతీయ ఫుట్‌బాల్ లీగ్ (NFL) యొక్క అధికారిక ఆన్‌-ఫీల్డ్ సరఫరాదారుగా మారిన ప్యూమా.
 • 2000: పోర్షి మరియు స్పేర్కోలతో భాగస్వామ్యంతో మంటల నిరోధక పాదరక్షల ఉత్పత్తి.
 • 2001: స్కాండినేవియా ట్రిటోర్న్ గ్రూపు కొనుగోలు.
 • 2002: షుడోహ్ ఆవిష్కరణ.
 • 2003: మోనార్కీ/రెజెన్సీ అనే ప్రధాన వాటాదారు తమ వాటాలను ఒక విస్తృత హోదా గల వ్యవస్థాగత పెట్టుబడిదారులకు విక్రయించింది..
 • 2004: ప్రపంచ-ప్రసిద్ధ డిజైనర్ ఫిలిప్ స్టార్క్‌తో సంయుక్త భాగస్వామ్యం.
 • 2005: మేఫెయిర్ వెర్మోజెన్స్‌వెర్‌వాల్టుంగ్స్‌జెసెల్‌షాఫ్ట్ ఎంబిహెచ్ మొత్తం 16.91% వాటాలను కొనుగోలు చేసింది.
 • 2006: డౌ జోన్స్ సస్టైనబిలిటీ సూచిలో కంపెనీ నమోదు; ఎస్.ఏ.ఎఫ్.ఈ పరిచయం, ఇది సామాజిక మరియు పర్యావరణ ప్రమాణాలను నిరంతరం మెరుగుపరిచేందుకు అభివృద్ధి చేసిన ఒక నిర్దిష్ట సాధనం. అలెగ్జాండర్ మెక్‌క్వీన్‌తో సహకారంతో షూ సేకరణ. ఇటలీ ప్రపంచ గెలుచుకుంది, ఇటలీ సాకర్ (ఫుట్‌బాల్) జట్టుకు ప్యూమా స్పాన్సర్‌గా ఉండటంతో, జట్టులోని అనేక మంది ఆటగాళ్లు ప్యూమా ఉత్పత్తులను ధరించారు.
 • 2007: పినాల్ట్-ప్రిన్‌టెంప్స్ రెడౌట్ స్వచ్ఛంగా పబ్లిక్ వాటాల కొనుగోలు; జోచెన్ జీట్జ్ యొక్క కాంట్రాక్టును ఐదేళ్లపాటు పొడిగింపు.
 • 2008: మెలోడీ హారిస్-జెన్స్‌బాచ్ డిప్యూటీ సీఈవోగా నియామకం; డిజైనర్ మరియు కళాకారుడు హుస్సేన్ చాలయన్ క్రియేటివ్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు, ప్యూమా కంపెనీ చాలయన్ యొక్క వ్యాపారం మరియు హుస్సేన్ చాలయన్‌లో అధిగ భాగం వాటాను కొనుగోలు చేసింది.
 • 2010: న్యూకాజిల్ యునైటెడ్, మథర్‌వెల్, హిబెర్నియాన్, బర్న్‌లే & ప్రెస్టోన్‌లకు 2010-11 సీజన్ నుంచి రెండేళ్లపాటు కిట్‌లు సరఫరా చేసేందుకు ఒప్పందాలపై సంతకాలు.

స్పాన్సర్‌షిప్[మార్చు]

ప్యూమా దేశీయంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కార్యక్రమాలు మరియు గుర్తింపు ఇచ్చే కార్యక్రమాలకు స్పాన్సర్‌గా ఉంది. ఫుట్‌బాల్‌లో మూలాల నుంచి, కంపెనీ అనేక మంది ఫుట్‌బాల్ క్రీడాకారులు మరియు జాతీయ ఫుట్‌బాల్ జట్లకు ప్యూమా స్పాన్సర్‌గా నిలిచింది; ప్యూమాకు ముఖ్యంగా ఆఫ్రికాలో ఎంతో ఆదరణ ఉంది. అనేక ప్రీమియర్ లీగ్ జట్లకు ప్యూమా స్పాన్సర్‌గా ఉంది, ముఖ్యంగా ప్రసిద్ధ న్యూకాజిల్ యునైటెడ్ మరియు టోటెన్‌హామ్ హాట్స్‌పుర్ (రెండు జట్లకు 2010/11 సీజన్ ముగింపు వరకు) జట్లకు ఒక స్పాన్సర్‌గా కొనసాగుతుంది.

ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్‌లో ప్యూమాకు హాథోర్న్ ఫుట్‌బాల్ క్లబ్ మరియు వెస్ట్ కోస్ట్ ఈగిల్స్ జట్లతో సుదీర్ఘ వ్యాపార అనుబంధం ఉంది, వీటితోపాటు బ్రిస్బేన్ లయన్స్‌తో కూడా కంపెనీకి సంబంధాలు ఉన్నాయి. హాథోర్న్‌తో ముఖ్యంగా, ప్యూమా 1980వ దశకం నుంచి క్లబ్ యొక్క దుస్తుల స్పాన్సర్‌గా ఉంది, క్లబ్ యొక్క అత్యంత విజయవంతమైన శకాల్లో కూడా ప్యూమా స్పాన్సర్‌గా వ్యవహరించింది.

రెడ్ బుల్ రేసింగ్ ఫార్ములా వన్ రేసింగ్ జట్టుకు ప్యూమా స్పాన్సర్‌గా ఉంది.2010 కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో ఈ జట్టు

కొనుగోళ్లు[మార్చు]

2010 మార్చి 10న ప్యూమా కోబ్రా గోల్ఫ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది, కాలిఫోర్నియాలోని కార్ల్స్‌బాడ్‌లో ఉన్న కోబ్రా గోల్ఫ్‌ను ఫార్చ్యూన్ బ్రాండ్స్ ఇంక్స్ నుంచి కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, ఎటువంటి ఆర్థిక వివరాలు తెలియజేయలేదు. నియంత్రణ సంస్థల ఆమోదాన్ని పొందిన ఈ ఒప్పందం ద్వితీయ త్రైమాసికంలో ముగియనుంది.[21]

గమనికలు[మార్చు]

సూచనలు
 1. Adidas Group History
 2. 2.0 2.1 2.2 2.3 "Annual Report 2009" (PDF). Puma AG. Retrieved 31 July 2010. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 3.2 3.3 3.4 Smit, Barbara (2009). Sneaker Wars. New York: Harper Perennial. ISBN 978-0-06-124658-6.
 4. "The Town that Sibling Rivalry Built, and Divided". Deutsche Welle – dw-world.de. 3/7/06. Retrieved 6 November 2010. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 5. 5.0 5.1 5.2 హౌ అడిడాస్ అండ్ ప్యూమా వర్ బోర్న్
 6. 6.0 6.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; DW అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 7. "Puma AG Rudolf Dassler Sport". Fundinguniverse.com. Retrieved 6 november 2010. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
 8. "The Town that Sibling Rivalry Built, and Divided". dw-world.de. 3/7/06. Retrieved 8 November 2010. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 9. Ramachandran, Arjun (18/9/09). "Town divided by tale of two shoes". The Sydney Morning Herald. Retrieved 6 November 2010. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 10. "Dasslers sell Puma to Cosa. (Armin and Gerd Dassler, Puma AG, Cosa Liebermann Ltd., sports clothing trade)". Text " Daily News Record " ignored (help); Text " Find Articles at BNET.com" ignored (help); Cite news requires |newspaper= (help)[dead link]
 11. ప్యూమాస్ న్యూస్ ఆర్కైవ్ (9 అక్టోబరు 2007)
 12. ప్యూమా స్నెయకెర్‌పెడియా
 13. ప్యూమా కింగ్ XL 40 యానివర్శరీ ఎడిషన్ సాకర్ క్లీట్ స్టార్స్ | సాకర్
 14. ప్యూమా కింగ్ XL ఇటాలియా రివ్యూ సాకర్ క్లీట్ 101 | సాకర్
 15. "Puma sees sharp fall in profit". BBC News. 19 February 2007. Retrieved 22 May 2010.
 16. "Puma's shares surge on bid rumour". BBC News. 5 April 2007. Retrieved 22 May 2010.
 17. "Gucci-firm PPR buys stake in Puma". BBC News. 10 April 2007. Retrieved 22 May 2010.
 18. http://www.chinalaborwatch.org/2008615.htm
 19. "Fair Trade". change.org. Retrieved 12 November 2010. Cite web requires |website= (help)
 20. "Eliminating Child Labour from the Sialkot Soccer Ball Industry" (PDF). greenleaf-publishing.com. Retrieved 12 November 2010. Unknown parameter |formate= ignored (help); line feed character in |title= at position 25 (help); Cite web requires |website= (help)
 21. "Puma acquires Cobra Golf". 10 March 2010. Retrieved 11 March 2010. Cite news requires |newspaper= (help)
గ్రంథ పట్టిక

బాహ్య లింకులు[మార్చు]

మూస:MDAX companies