ప్రకాష్ భండారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రకాష్ భండారి

ప్రకాష్ భండారి (జననం: 1935, నవంబర్ 27) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1954-55లో పాకిస్తాన్లో పర్యటించాడు, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలపై టెస్ట్ క్రికెట్ ఆడాడు. భండారి 3 టెస్టులలో పాల్గొని 19.25 సగటుతో 77 పరుగులు సాధించాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 39 పరుగులు. 63 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలతో 2552 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 227 పరుగులు

క్రికెట్ కెరీర్లో[మార్చు]

భండారి దాడి చేసే కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఆఫ్ బ్రేక్ బౌలరు. అతను 1951-52, 1956-57 మధ్య ఆల్ ఇండియా పోటీలలో ఢిల్లీ పాఠశాలల తరపున, ఢిల్లీ విశ్వవిద్యాలయం తరపున ఆడాడు. ఆ సీజన్లలో చివరి రోహింటన్ బారియా ట్రోఫీ ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్‌లో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించాడు. భండారి 1953-54లో సిల్వర్ జూబ్లీ ఓవర్సీస్ క్రికెట్ జట్టుతో భారత ఎలెవన్ తరఫున ఆడాడు. 1956 లో సిలోన్‌లో పర్యటించాడు.

భండారి 1954/55 లో పాకిస్తాన్‌లో పర్యటించాడు. మూడుసార్లు పన్నెండవ ఆటగాడుగా ఉన్నాక, కరాచీలో జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో మైదానం లోకి దిగాడు. 19 పరుగులు చేశాక, ఖాన్ మొహమ్మద్ బౌలింగులో ఔటయ్యాడు. అతను న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులలో కూడా ఆడాడు. 1954-55లో ఢిల్లీలో న్యూజిలాండ్‌పై అతని అత్యధిక స్కోరు 39, అక్కడ అతను 8 వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. బాపు నాదకర్ణితో కలిసి 73 పరుగులు చేశాడు.

1961–62 రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో, బెంగాల్ రెండవ ఇన్నింగ్స్‌లో డిక్లరేషన్ కోసం వెళ్ళే క్రమంలో ఉండగా, రాజస్థాన్‌పై 60 నిమిషాల్లో అతను సెంచరీ సాధించాడు.[1] ఆ సమయానికి ఇది భారత క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ అని భావిస్తారు. కాని 1915-16లో కెన్ గోల్డీ[2] చేసిన 60 నిమిషాల సెంచరీ, 1923-24లో అహ్సాన్-ఉల్-హక్[3] చేసిన 40 నిమిషాల సెంచరీలు ఆ తరువాత వెలుగు లోకి వచ్చాయి. ఒకే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేసి, ఏడు వికెట్లు తీశాడు. 1957/58 లో పాటియాలాపై ఢిల్లీ తరఫున అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు 227 పరుగులు చేశాడు. అదే మ్యాచ్‌లో 81 పరుగులకు తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.

అతడు టాటా గ్రూపులో పనిచేశాడు.


బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://cricketarchive.com/Archive/Scorecards/25/25326.html
  2. http://cricketarchive.co.uk/Archive/Scorecards/9/9485.html
  3. http://cricketarchive.co.uk/Archive/Scorecards/11/11053.html