ప్రకాష్ సింగ్ బాదల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రకాష్ సింగ్ బాదల్
8వ పంజాబ్ ముఖ్యమంత్రి
In office
మార్చి 1, 2007 – మార్చి 16, 2017
అంతకు ముందు వారుఅమరిందర్ సింగ్
తరువాత వారుఅమరిందర్ సింగ్
In office
ఫిబ్రవరి 12, 1997 – ఫిబ్రవరి 26, 2002
అంతకు ముందు వారురజిందర్ కౌర్ భట్టల్
తరువాత వారుఅమరిందర్ సింగ్
In office
జూన్ 20, 1977 – ఫిబ్రవరి 17, 1980
అంతకు ముందు వారురాష్ట్రపతి పాలన
తరువాత వారురాష్ట్రపతి పాలన
In office
మార్చి 27 1970 – జూన్ 14, 1971
అంతకు ముందు వారుగుర్నమ్ సింగ్
తరువాత వారురాష్ట్రపతి పాలన
ప్రతిపక్ష నాయకుడిగా
In office
అక్టోబరు 2, 1972 – ఏప్రిల్ 30, 1977
అంతకు ముందు వారుజస్విందర్ సింగ్ బ్రార్
తరువాత వారుబలరామ్ జఖర్
In office
జూన్ 7, 1980 – అక్టోబర్ 7, 1983
అంతకు ముందు వారుబలరామ్ జఖర్
తరువాత వారుగుర్బిందర్ కౌర్ బ్రార్
In office
ఫిబ్రవరి 26, 2002 – మార్చి 1, 2007
అంతకు ముందు వారుచౌదరి జగ్జిత్ సింగ్
తరువాత వారురజిందర్ కౌర్ భట్టల్
వ్యక్తిగత వివరాలు
జననం1927 డిసెంబరు 8
ముక్త్సర్ జిల్లా, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
మరణం2023 ఏప్రిల్ 25(2023-04-25) (వయసు 95)
మొహాలీ, పంజాబ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీశిరోమణి ఆకాలీదళ్
ఇతర రాజకీయ
పదవులు
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్
జీవిత భాగస్వామిసురీందర్ కౌర్ (1959–2011)
సంతానంసుఖ్‌బీర్ సింగ్ బాదల్
ప్రీనీత్ కౌర్
నివాసంబాదల్, పంజాబ్, భారతదేశం
నైపుణ్యంరాజకీయ నాయకుడు

ప్రకాష్‌ సింగ్ బాదల్ (1927 డిసెంబరు 8 - 2023 ఏప్రిల్ 25) భారత రాజకీయ నాయకుడు. ఈయన 1970-71, 1977-80, 1997-2002, 2007-2017 లలో పంజాబ్ రాష్ట్రానికి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయన సిక్కుల కేంద్రీకృత పార్టీ శిరోమణి అకాలీదల్ పార్టీకి చెందినవాడు. ఈయన ఆ పార్టీకి 1995 నుండి 2008 వరకు అధ్యక్షునిగా వ్యవహరించాడు. తరువాత ఈయన స్థానంలో అతని కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ అద్యక్ష బాధ్యతలను చేపట్టాడు.[1] శిరోమణి అకాలీదల్ పార్టీ విధేయునిగా ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజిమెంటు కమిడీ, శిరోమణి గురుద్వారా పరబందక్ కమిటీ[2] లపై అతని ప్రభావం ఉంది. 2015లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ను అందుకున్నాడు.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1927 డిసెంబరు 8న మాలౌట్ సమీపంలోని అబుల్ ఖురానాలో ధిల్లాన్ జాట్ వంశంలో జన్మించాడు.[3][4] ఈయన లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో పట్టభద్రుడయ్యాడు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

ఈయన తన రాజకీయ జీవితాన్ని 1947లో ప్రారంభించాడు. ఈయన పంజాబ్ రాజకీయాల్లోకి చేరక ముందు విలేజ్ బాదల్ గ్రామానికి సర్పంచ్ గా, లాంబి బ్లాక్ సమితి ఛైర్మన్ గా పనిచేశాడు. ఈయన 1957 లో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా పంజాబ్ విధానసభకు ఎన్నికయ్యాడు[6]. ఈయన సమాజ అభివృద్ధి, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ శాఖ మంత్రిగా పనిచేశాడు[6]. ఈయన 1969 లో తిరిగి విధాన సభకు ఎన్నికయ్యాడు. ఈయన 1972, 1980, 2002 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు[7][8] ఈయన 1957  నుంచి రాష్ట్ర విధాన సభకు మొత్తం 10 సార్లు ఎన్నికయ్యాడు. కానీ 1992 ఫిబ్రవరి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు. ఈయన 1997 ఎన్నికలలో అతను లాంబి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  నాలుగు పర్యాయాలు వరుసగా విజేతగా నిలిచాడు. ఈయన 1977 లో ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు.

ముఖ్యమంత్రి గా ప్రస్థానం

[మార్చు]

ఈయన నాలుగు పర్యాయాలుగా పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1970 లో మొదటిసారి ఒక భారత రాష్ట్రానికి అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు[9]. ఈయన మొట్టమొదట 1970 మార్చిలో పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆకాలీదళ్ - సంత్ ఫతే సింగ్, జన సంఘ్ ల సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించాడు. 1970 జూన్ లో, పంజాబ్లో హిందీ స్థలం గురించి వారి విభేదాలపై జనసంఘ్ నుంచి ఈయన ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈయన ప్రభుత్వం మెజారిటీని నిరూపించడానికి జూలై 24 న అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా అందులో ఐదవ వంతు ఎమ్మెల్యేలకు అవసరమైన మద్దతు లేకపోవడం వల్ల అవిశ్వాస తీర్మానం అంగీకరించబడలేదు[10]. 2007 పంజాబ్ రాష్ట్ర ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో 117 సీట్లకు గాని 67 గెలువగా, ఈయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు[11]. ఇందులో ఈయన గృహ, పట్టణాభివృద్ధి, ఎక్సైజ్ & టాక్సేషన్, పవర్, పర్సనల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్, ఎంప్లాయ్‌మెంట్, లీగల్ & లెజిస్లేటివ్ అఫైర్స్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను ఈయనే నిర్వహించాడు. ఈయన హయాంలో ఉచిత అంబులెన్స్ సర్వీస్[12], తల్వాండి సాబో థర్మల్ ప్లాంట్ వంటి అనేక పథకాలను ప్రారంభించాడు[13][13]. 2012 ఎన్నికల్ల శిరోమణి అకాలీదళ్, భారతీయ జనతా పార్టీ కలిపి 117 సీట్లకు గాను 68 సీట్లు గెలిచారు. ఈయన 2012 మార్చి 14 న పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈయన 1959లో సురిందర్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సుఖ్బీర్ సింగ్ బాదల్, పర్నీత్ కౌర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె క్యాన్సర్ కారణంగా 2011లో మరణించింది[14].

మరణం

[మార్చు]

ప్రకాశ్ సింగ్ బాదల్ వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 95 ఏళ్ల వయసులో మొహలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2023 ఏప్రిల్ 25న మరణించాడు.[15][16]

మూలాలు

[మార్చు]
 1. Bains, Satinder (31 January 2008). "Sukhbir Badal becomes youngest president of Shiromani Akali Dal". Punjab Newsline. Archived from the original on 28 నవంబరు 2010. Retrieved 10 December 2010.
 2. SAD-Sant Samaj combine sweeps SGPC elections. Tribuneindia.com. Retrieved on 17 October 2015.
 3. Mohan, Archis (31 January 2012). "Close race for Badal & rival". The Telegraph. Calcutta, India.
 4. Bakshi, S.R. Parkash Singh Badal:Chief Minister of Punjab. APH Publishing Corporation, 1998, p. 11.
 5. Gopal, Navjeevan (15 March 2012). "Literate, under middle, ninth passed all in new cabinet". Indian Express. Retrieved 2 June 2014.
 6. 6.0 6.1 "The grand old man of Akali politics" Archived 2013-10-17 at the Wayback Machine, CNN-IBN, 2 March 2007.
 7. Punjab Polls 2012. Tribuneindia.com (26 December 2011). Retrieved on 17 October 2015.
 8. Parkash Singh Badal. pbplanning.gov.in.
 9. The Badals of Punjab
 10. Arora, Subhash Chander (1990). Turmoil in Punjab Politics (1st ed.). New Delhi: Mittal Publications. pp. 131–140. ISBN 81-7099-251-6. Retrieved 2 June 2014.
 11. Punjab Assembly Election 2007 Results Archived 8 మే 2013 at the Wayback Machine. indian-elections.com
 12. Badal launches free ambulance service. dayandnightnews.com. April 2011
 13. 13.0 13.1 Talwandi Sabo thermal plant okayed. The Hindu (10 December 2007). Retrieved on 2015-10-17.
 14. "Surinder Kaur Badal dead: Former Punjab CM Prakash Singh Badal's wife passes away", The Economic Times (24 May 2011), Retrieved 2011-10-25.
 15. Namasthe Telangana (25 April 2023). "పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
 16. A. B. P. Desam (25 April 2023). "పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కన్నుమూత". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.