ప్రగతివాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Progressivism

ప్రభుత్వ చర్యల ద్వారా చేయాల్సిన మార్పులను లేదా సంస్కరణలను ఆశిస్తున్న రాజకీయ వైఖరినే ప్రగతి వాదం అంటారు. తరచుగా ప్రగతి వాదాన్ని కన్జర్వేటివ్ లేదా రియాక్షనరీ భావజాలానికి వ్యతిరేకంగా చూడొచ్చు.

ఇంటిలోను, పని వద్ద విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే వారికి సహాయం చేయాలన్న ఆసక్తి ఉన్న సెటిల్మెంట్ వర్కర్స్ మరియు సంస్కరణ వాదుల కారణంగా ప్రగతి వాద ఉద్యమం[ఎక్కడ?][ఎప్పుడు?]మొదట నగరాల్లో ప్రారంభమైంది. బాలకార్మిక వ్యవస్థను, ఇంటి అద్దెలను క్రమబద్ధీకరించాలని సంస్కరణ వాదులు వాదించారు. మహిళలకు పని ప్రదేశంలో మంచి పరిస్థితులు కల్పించాలని పిలుపునిచ్చారు.

పారిశ్రామికీకరణ ద్వారా తీసుకొచ్చిన పలు మార్పులకు లభించిన స్పందన అనుసరించి…యునైటెడ్ స్టేట్స్ లో, ప్రగతి వాదం అనే పదం 19 వ శతాబ్దం చివరలో మొదలై 20వ శతాబాబ్దానికి కొనసాగింది. ఈ పారిశ్రామికీకరణ సామాజిక, ఆర్థిక విషయాల్లో ప్రాచీన భూస్వామ్య పద్ధతికి, విప్లవాత్మక సోషలిజం మరియు రాజకీయ అరాచకత్వానికి బదులుగా ఒక ప్రత్యామ్నాయంగా పారిశ్రామికీకరణను పేర్కొనవచ్చు. ప్రోగ్రసివ్ పార్టీ వంటి రాజకీయ పార్టీలు 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రగతివాదాన్ని సుస్థిరం చేశాయి. అమెరికా అధ్యక్షులు థియోడర్ రూజ్వెల్ట్, ఉడ్రో విల్సన్, ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్, మరియు లిండన్ బెయిన్స్ జాన్సన్ ల హయాంలో అమెరికాలో ప్రగతి వాదం బాగా పుంజుకుంది.[1]

ప్రగతి వాదం అనే పదం వామ పక్ష రాజకీయాలకు సంబంధించినదైనప్పటికీ యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో ప్రగతివాదం అనే పదం కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉపయోగించాయి. ఐర్లాండ్ లోని ప్రోగ్రెసివ్ డెమోక్రాట్లు సెంటర్-రైట్ లేదా క్లాసికల్ లిబరల్ అయినప్పటికీ ప్రగతివాదం అనే పేరును స్వీకరించారు. యూరోపియన్ యూనియన్లోని యూరోపియన్ ప్రోగ్రెసివ్ డెమోక్రాట్లు వైవిధ్యమైన రాజకీయ వర్గం. 1942-2003 మధ్య కాలంలోని చాలా కాలం కెనడాలో ఉన్న అతి పెద్ద కన్వజర్వేటివ్ పార్టీ.. ప్రోగ్రసివ్ కన్సర్వేటివ్ పార్టీ.

చరిత్ర[మార్చు]

18వ శతాబ్దంలో వచ్చిన వివేకవంతమైన ఆలోచనలతో ప్రగతి అనే భావం ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది.

దేశాల వారీగా[మార్చు]

ఆస్ట్రేలియా[మార్చు]

గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ప్రగతివాదం అనే పదం వినియోగంలో ఉంది. ఈ ప్రగతి వాదాన్ని మూడో మార్గంగా భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఈ ప్రగతి వాదం అనే పదం ఎంతో జనాకర్షణ పొందింది. మరియు తరచుగా సామాజిక విశాల భావాలుగల ప్రాంతాల్లో ఈ పదాన్ని వినియోగిస్తున్నారు. ఉదారత్వం అనే పదం స్వేచ్ఛా విపణులు, చిన్న ప్రభుత్వాలతో అనుసంధానమైంది. ఇతర పదాల్లో.. ముఖ్యమైన ఉదారవాదంగా ఇతర పదాల్లో వర్ణించవచ్చు. ప్రగతివాదం అంటే ప్రభుత్వం కోసం ప్రధాన పాత్రను సమర్థించేది అని చెప్పవచ్చు. కానీ కేంద్రీయ ప్రణాళికలో దాని ప్రమేయం ఉండదు.

ఆస్ట్రేలియాలో మొత్తం 12 శాతం[2][3] పోలింగ్ తో, తొమ్మది మంది సెనేటర్లతో, మరియు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభకు కొత్తగా ఎన్నికైన ఒక సభ్యుడితో కలిపి (2010 ఆస్ట్రేలియా సమాఖ్య ఎన్నికలో ఎన్నికయ్యాడు) దేశంలో మూడో పెద్ద రాజకీయ పార్టీగా ఉన్న “ది ఆస్ట్రేలియన్ గ్రీన్స్’ పార్టీ.. గ్రాస్ రూట్ ప్రజాస్వామ్యం మరియు పార్టిసిపేటరీ డెమోక్రసీతోపాటు ప్రగతి వాద భావాలను సమర్థించింది.

కెనడా[మార్చు]

20వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన తర్వాత పశ్చిమ కెనడా ప్రవాహంగా వచ్చిన రాజకీయ భావాలను స్వీకరించడం ప్రారంభించింది. యూనియనిస్ట్ గవర్నమెంట్ ఆఫ్ రాబర్ట్ బోర్డన్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన థామస్ క్రెరార్ 1920లో ది ప్రోగ్రసివ్ పార్టీ ఆఫ్ కెనడాను స్థాపించారు. 1919లో క్రెరా ర్ బోర్డన్ మంత్రి మండలి నుంచి తప్పుకున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి థామస్ వైట్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రైతుల సమస్యలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే కారణంతో క్రెరార్ రాజీనామా చేశారు. ప్రోగ్రసివ్ పార్టీకి తొలి నాయకుడిగా అవతరించిన క్రెరార్.. 1921 ఎన్నికల్లో పార్టీ తరఫున 65 సీట్లు సొంతం చేసుకునేలా ముందుకు నడిపించారు.దీంతో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న కన్సర్వేటివ్ పార్టీ కంటే ముందంజంలో ఉండి దేశంలో రెండో పార్టీగా నిలిపారు. ప్రోగ్రసివ్ లు ప్రాదేశికంగా ఉన్న పలు రాష్ట్రాల్లో ఉన్న రైతుల పార్టీలతో దగ్గరి సంబంధాలను కూడా నెరిపారు. అయితే ప్రోగ్రసివ్ లు తమ అధికారాన్ని కాపాడుకోలేక పోయారు. ప్రోగ్రసివ్ మద్దతు దారులైన ఎంపీలు, ఓటర్లు.. ఉదారవాదులు మరియు కో ఆపరేటివ్ కామన్ వెల్త్ ఫెడరేషన్ (తర్వాతి కాలంలో న్యూ డెమోక్రటిక్ పార్టీ) వైపు చూడటంతో ప్రోగ్రసివ్ పార్టీ నిస్సారంగా మారింది.

1854లో పరిస్థితులకు వెళితే.. కెనడాలో కన్సర్వేటివ్ పార్టీ చాలా పురాతనమైంది. అయితే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో 1935లో జరిగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో నాయకత్వ లేమి, కొత్త సిద్ధాంతాల లేమితో మిగిలిపోయింది. అయితే ఆ ప్రావిన్స్ కు చెందిన ప్రోగ్రసివ్ యునైటెడ్ ఫార్మర్స్ పార్టీకి చెందిన దీర్ఘ కాల నేత, మేనిటోబా రూపకర్త జాన్ బ్రాకెన్.. కన్సర్వేటివ్ పార్టీకి నాయకుడిగా ఉండటానికి ఒక షరతు మీద అంగీకిరించాడు. ఆ షరతు ఏంటంటే కన్సర్వేటివ్ పార్టీ తన పేరుకు ప్రోగ్రసివ్ అనే పదాన్ని జత చేయడం. దీంతో కన్సర్వేటివ్ పార్టీ ప్రోగ్రసివ్ అనే పదాన్ని చేర్చింది. 2003లో ఆ పార్టీ వచ్ఛిన్నమయ్యే వరకు ఆ పేరుతోనే కొనసాగింది. పేరు మారినప్పటికీ చాలా మంది మాజీ ప్రోగ్రసివ్ పార్టీ వ్యక్తులు ఇతర పార్టీలకు మద్దతు కొనసాగించారు.

భారతదేశం[మార్చు]

భారతదేశంలో జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో మనుగడ సాగిస్తున్న ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. ది నేషనల్ డెమోక్రటిక్ ఎలయెన్స్ (ఎన్ డీఏ), ది యునైటెడ్ ప్రోగ్రసివ్ ఎలియెన్స్ (యుపిఎ)లు రెండు ప్రధాన రాజకీయ కూటములు. భారత్లో గతంలో వామపక్ష రాజకీయ పార్టీల ప్రభావం ఉండి వారి యొక్క భావాలతో సోషలిజం లేదా కమ్యునలిజం వైపు మొగ్గు చూపేది. కానీ 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక ఈ రెండు రాజకీయ పార్టీలు.. పెట్టుబడి దారీ విధానంవైపు మరింత మొగ్గు చూపే వారి రైట్ వింగ్ సంస్కరణలుగా వాటికవే చూపించుకున్నాయి. కమ్యూనిజం అనేది వాస్తవ పాశ్చాత్య ప్రగతి వాద ఉద్యమంలో ఎలాంటి ప్రధాన పాత్ర పోషించని కారణంగా భారత్ లో ప్రగతివాదం నిర్వచనాన్ని విభిన్నంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సామాజిక స్థాయిలో భారత్ లోని వామపక్ష పార్టీలు పశ్చిమ దేశాల్లో ప్రగతి వాదంగా భావించే ఎలాంటి విధానాలను బలపర్చలేదు. .. ప్రగతి వాదం కాని భారత రాజకీయ పార్టీల కంటే .. కుల వ్యవస్థ, కార్మికుల హక్కులు, మహిళల హక్కుల విధానలు అనేవి ప్రగతి వాదానికి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ వామపక్షాలు ఆ దిశగా కృషి చేయలేదు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్లు వరుసగా ఎన్ డీఏ, యుపిఎలలో ప్రధాన సభ్యులుగా ఉన్నాయి.

న్యూజిలాండ్[మార్చు]

న్యూజిలాండ్ లోని ప్రగతిశీల పార్టీ జిమ్ ఆండర్టన్ నేతృతంలో ఉంది. ఆ పార్టీ కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని పేర్కొంది. అవి: ఉద్యోగ కల్పన, పూర్తి ఉపాధి, పర్యావరణం, ఉచిత విద్య, మరియు ఉచిత ఆరోగ్య రక్షణ మరియు ఆల్కహాల్ చట్ట బద్ద వినియోగ వయసును 20 ఏళ్లకు పెంచడు.[4] 2005 నుంచి 2008 మధ్య కాలంలో రెండు మరియు మూడో దఫాలుగా పాలించిన ఐదో లేబర్ గవర్నమెంట్ ఆఫ్ న్యూజిల్యాండ్ కూటమిలో ప్రోగ్రసివ్ పార్టీ ఓ చిన్న సభ్య పార్టీగా ఉండేది. ఈ భాగస్వామ్యం 2008 ఎన్నికల తర్వాత ప్రతి పక్షంలో కూడా కొనసాగింది.[5]

ప్రోగ్రసివ్ గ్రీన్ పార్టీ 1995లో స్థాపించారు. ఆర్థికంగా సంప్రదాయ భావాలు, బ్లూ-గ్రీన్ పర్యావరణ పార్టీగా చెప్పుకుంటూ అవతరించింది. అయితే 1996 ఎన్నికల్లో అథమంగా పనితీరు ప్రదర్శించింది. ఆ తర్వాత ఎలాంటి ఎన్నికల్లో పోటీ పడలేదు. ప్రస్తుతం తెరమరుగైంది.

ఉక్రెయిన్[మార్చు]

ది ప్రోగ్రసివ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఉక్రెయిన్. (Prohresivna Sotsjalistychna Partiya Ukrayiny /Progressivnaya Sotsialističeskaja Partiya Ukrajiny, Прогресивна соціалістична партія України) 1995లో ఉక్రెయిన్లో ఏర్పడిన ఒక రాజకీయ పార్టీ. దీనిని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఉక్రెయిన్ లో ఆకర్షణీయ నేతగా గుర్తింపు పొందిన నటాలివా విట్రెంకో స్థాపించారు. ది ప్రోగ్రసివ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఉక్రెయిన్ (పీఎస్ పీయు) విప్లవ వామపక్ష ప్రజా పార్టీ. ఇదియూరోపియన్ యూనియన్కు ప్రత్యామ్నాయం కోసం రష్యా, బెలారస్ లకు మద్దతు నిస్తోంది. పీఎస్ పీయు సంప్రదాయ బద్ధంగా నాటో వ్యతిరేక, ఐఎంఎఫ్ వ్యతిరేక, రష్యా అనుకూల వేదికగా ప్రచారం చేసింది. 1998 పార్లమెంటరీ ఎన్నికల్లో ఈ పార్టీ 4 శాతం ఓట్లను సాధించింది. 1999 అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసిన నటాలియా విట్రెంకో మొదటి రౌండ్ లో 10.97 శాతం ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు.

2002లో శాసన పార్లమెంటరీ ఎన్నికల్లో పీఎస్ పీయూ.. పార్టిజా ఓస్విట్జన్ ఉక్రెయినీతో కలిసి నటాలియా విట్రెంకో బ్లాక్ ఎలియన్స్ ను ఏర్పాటు చేసింది. అయితే ఇది 3.2 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. వెర్కోయ్ నా రడాలో అడుగు పెట్టేందుకు కావాల్సిన కనీస 4 శాతం ఓట్లు కూడా రాలేదు. మాటల్లో పీఎస్ పీయూ ఉక్రెయిన్ అధ్యక్షుడు లియోనిడ్ కుచ్మాకు వ్యతిరేకి. కానీ ఉక్రెయిన్ ప్రధానమంత్రి విక్టర్ యనుకోవిచ్ ను మాత్రం 2002 నుంచి మద్దతునిస్తోంది. 2004 అధ్యక్ష ఎన్నికల వరకూ కొనసాగింది. 2004లో ఆరంజ్ విప్లవం తర్వాత కొత్త అధ్యక్షుడు విక్టర్ యుస్చెంకోకు వ్యతిరేకంగా.. ఉక్రెయిన్ మాజీ ప్రాసిక్యూటర్ గెన్నడీ వాసిల్యేయ్ నేతృత్వంలోని డెర్జావా (రాష్ట్రం) తో పీఎస్ పీయూ చేతులు కలిపింది.

2006 పార్లమెంటరీ ఎన్నికల్లో పీపుల్స్ అపోజిషన్ బ్లాక్ ఆఫ్ నటాలియావిట్రెంకో పేరుతో పోటీ పడినప్పటికీ పార్లమెంట్ లో స్థానాలు పొందడంలో విఫలమైంది. 2007పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి పార్లమెంట్ లో అడుగు పెట్టేందుకు విఫలమైంది.

యునైటెడ్ స్టేట్స్[మార్చు]

యునైటెడ్ స్టేట్స్ లో పలు ప్రగతి శీల పార్టీలు వెలుగులోకి వచ్చిన కాలాలు ఎన్నో. వీటన్నిటిలో మొదటిది 20వ శతాబ్దం ప్రారంభంలోనిది.[6] బాగా గుర్తింపు పొందిన.. ప్రగతి శీల పార్టీ ఈ కాలంలోనే అవతరించింది. దీనిని 1912లో అధ్యక్షుడు థియోడర్ రూజ్ వెల్ట్ స్థాపించాడు. ఆధునిక అమెరికా చరిత్రలో ప్రోగ్రసివ్ పార్టీ మూడో అతి పెద్ద విజయవంతమైన పార్టీగా నిలిచింది. 1924లో స్థాపించిన ప్రగతి శీల పార్టీ, 1948లో స్థాపించిన ప్రగతి శీల పార్టీ 1912లో ప్రగతి శీల పార్టీకంటే తక్కువ స్థాయిలోనే విజయం సాధించాయి. రాష్ట్రాల స్థాయిలో కూడా అమెరికాలో రెండు గుర్తించదగిన ప్రగతి శీల పార్టీలున్నాయి. అవి: ది విస్కాన్సిన్ ప్రోగ్రసివ్ పార్టీ, మరియు వెర్మాంట్ ప్రోగ్రసివ్ పార్టీ. ఈ వెర్మాంట్ ప్ర్రోగ్రసివ్ పార్టీ ఇప్పటికీ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం పలు ఉన్న స్థానాలను అధిరోహించింది.

ప్రస్తుతం అమెరికాలోని అధిక శాతం ప్రగతి శీల రాజకీయ నేతలు డెమోక్రటిక్ పార్టీ లేదా గ్రీన్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ తో అనుబంధం కలిగున్నారు. యుఎస్ కాంగ్రెస్ లో ది కాంగ్రెసనల్ ప్రోగ్రసివ్ కౌకస్.. బ్లూ డాగ్స్ కౌకస్ ను స్థాపించిన పలు కన్సర్వేటివ్ డెమోక్రాట్లకు తరచుగా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. మూస:Cn-span

యునైటెడ్ కింగ్‌డమ్[మార్చు]

యునైటెడ్ కింగ్ డమ్ లో తమకు తాము ప్రగతి శీల పార్టీలుగా చెప్పుకునే పలు పార్టీలున్నాయి. అవి: లేబర్ పార్టీ (యుకె), ది లిబర్ డెమాక్రాట్స్, ది స్కాటిష్ నేషనల్ పార్టీ మరియు గ్రీన్ పార్టీ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్. ప్రస్తుతం కన్సర్వేటివ్స్ మరియు లిబరల్ డెమోక్రాట్స్ కూటమి కూడా తాము ప్రగతి శీల వాదులుగా పేర్కొంటుంది. ఉదార వాదాలుగా గల రైట్ వింగ్ పార్టీతో భాగస్వామ్యంతో గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినప్పటికీ లిబరల్ డెమోక్రాట్లు అనుబంధ కూటమికి ఎన్నో ప్రగతి శీల అంశాలను పరిచయం చేసినదిగా గుర్తింపు పొందారు.[1]

స్కాట్లాండ్[మార్చు]

ది ప్రోగ్రసివ్ పార్టీ అనేది 20వ శతాబ్దంలో స్కాటిష్ స్థానిక ప్రభుత్వంలో మనుగడ సాగించి ప్రస్తుతం కనుమరుగైన మున్సిపల్ పొలిటికల్ ఆర్గనైజేషన్ పేరు. ఇది యూనియనిస్ట్ పార్టీ, స్కాటిష్ లిబరల్స్, మరియు స్వతంత్రుల ఆధారంగా ఉంది.

జాతీయ రాజకీయ పార్టీలు అరుదుగా స్థానిక రాజకీయాల్లో పాల్పంచుకుంటాయి. కానీ లేబర్ పార్టీ అవతరణ.. స్థానిక ప్రభుత్వం యొక్క పార్టీ రాజకీయతకు దారి తీసింది. మొదట లేబర్ పార్టీ స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో పాల్గొనడాన్ని. . ఇతర జాతీయ పార్టీల ముందు ప్రగతి శీల వాదులు వ్యతిరేకించారు.

ప్రగతి వాదులు అనధికార సరళీకృత వాదులుగా, యూనియనిస్టులుగా, స్వతంత్రులతో కూడిన అనుబంధ కూటమిగా రూపొందారు. వారి పట్టణ ప్రాంతాలపై వారు చూపించే విశిష్ట ప్రాధాన్యతకు అదనంగా.. ప్రగతి వాద వర్గాల మరో పార్శ్వం కార్మిక విధానాలు మరియు నియంత్రణకు వ్యతిరేకంగా కదిలింది. దీంతోపాటు కార్మిక వ్యతిరేక ఓటు చీలికను నిరోధించాలనే బలమైన సంకల్పం కలిగున్నాయి.

ప్రగతి శీల బృందాలు 1928లో ఎడిన్ బర్గ్ లో, 1936లో గ్లాస్గోవ్ లో అవతరించాయి. తర్వాత పలు నగరాలు పట్టణాలకు విస్తరించాయి. మున్సిపల్ సోషలిజాన్ని, శ్రమ నియంత్రణను విధానలను వ్యతిరేకించే చిన్న వ్యాపారస్తులే సభ్యలుగా ఉండేవారు. వాళ్లే దాదాపు 50 ఏళ్లపాటు (అంటే.. 1972 చివర్లో ఎడిన్ బర్గ్ కౌన్సిల్ 21 మంది ప్రగతి శీల వాదులు, 9 మంది కన్సర్వేటివ్ లు, 33 మంది లేబర్, మరియు 5 గురు ఉదారవాదులు ఎన్నికయ్యే వరకు) స్కాటిష్ స్థానిక పాలనపై ఆధిపత్యం చెలాయించారు.

ఇతర రాజకీయ భావాలకు సంబంధం[మార్చు]

ఉదారవాదం[మార్చు]

ప్రగతి శీల (ప్రోగ్రసివ్) అనే పదం ప్రస్తుతం తరచుగా “సరళీకరణ లేదా ఉదారత’ అనే దానికి బదులుగా వినియోగిస్తున్నారు. ఈ రెండు కొన్ని మార్గాల్లో ఒకే అర్థాన్నిచ్చేవైనప్పటికీ అవి రెండు వేరు. విభిన్న రాజకీయ సిద్ధాంతాలున్నవి. ఒకదానికొకటి పరస్పరం మార్చకూడదు. ఈ అనిశ్చితికి.. రాజకీయ వర్గాలు రెండు కోణాల్లో ఉండటమే కొంత మేర కారణంగా చెప్పవచ్చు. సామాజిక సరళీకరణం అనేది ఆధునిక ప్రగతి వాదానికి సంబంధించింది. కానీ ఆర్థిక సరళీకరణం (మరియు దీని సంబంధ అక్రమం) అలాంటిది కాదు. స్టాఫ్ ఆఫ్ ది సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ సీనియర్ సలహాదారు జాన్ హాల్పిన్ ప్రకారం.. “ప్రగతివాదం అనేది రాజకీయాలవైపు కదిలించే ఓ దృక్పథం. సరళీకరణలాగా సుదీర్ఘ కాలం ఉండే భావం జాలం కాదు. కానీ చారిత్రక నేపథ్యం ఉన్న భావన. అది ప్రపంచాన్ని ఒక శక్తి శీలంగా అంగీకరిస్తుంది.’ ప్రగతి శీల వాదలు ప్రగతి తత్వాన్ని రాజకీయ ప్రపంచంవైపు కదలించే వైఖరిగా చూస్తారు. ఇది కన్సర్వేటిజమ్ వర్సెస్ లిబరలిజం కంటే విస్తృతమైంది. తప్పుగా భావించే మరియు వైరుధ్య భావాల స్వేచ్ఛను తొలగించేదిగా చెప్పవచ్చు.[7][8]

ప్రభుత్వ ప్రధాన బాధ్యత హక్కుల పరిరక్షణే అనే నమ్మకంతో ఏర్పడేదే సాంస్కృతిక సరళీకరణ అని చెప్పవచ్చు.[clarification needed] సరళ వాదులను తరచుగా.. కన్సర్వేటివ్స్ రైట్ వింగ్స్ కు వ్యతిరేకంగా వామ పక్ష వాదులు[ఉల్లేఖన అవసరం]గా పిలుస్తారు. ది ప్రోగ్రసివ్ స్కూల్ సమకాలీన రాజకీయ ఆలోచనలకు విశిష్ట విభాగంగా.. కొన్ని ప్రధాన సరళ భావాలకు విరుద్ధంగా ఉండే కొన్ని నిర్దిష్ట సెంటర్ – లెఫ్ట్, లెఫ్ట్-వింగ్ అభిప్రాయాల దిశగా మొగ్గు చూపుతుంది. ఆధునిక సరళీకరణ, ప్రగతివాదం ఇప్పటికీ ఒకే విధమైన పలు విధానాలకు మద్దతు ఇస్తున్నప్పటికీ.. (ఉదా: చివరి అవకాశంగా యుద్ధ భావన)

అమెరికా ప్రగతి శీల వాదులు అంతర్జాతీయ వాణిజ్యానికి మద్దతునిచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రగతి శీల ట్యాక్సేషన్ ను సమర్థించారు. పెరుగుతున్న కార్పొరేషన్ల ప్రభావాన్ని వ్యతిరేకించారు. ప్రగతి శీలురు అంతర్జాతీయ ప్రమాణాలతో వామ పక్ష- సరళీకృత వాదంతో ఒప్పందం కుదుర్చుకుని.. వ్యవస్థీకృత శ్రామిక విధానాన్ని, వర్తక సంఘాలకు మద్దతునిచ్చారు. వారు సాధారణంగా జీవన వేతనం పరిచయడం చేయడానికి ఆకాంక్షించారు. మరియు తరచుగా అంతర్జాతీయ ఆరోగ్య రక్షణ విధానం ఏర్పాటుకు మద్దతునిచ్చారు. ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్ లోని ప్రగతిశీలురు[ఉల్లేఖన అవసరం] .. మెయిన్ స్ట్రీమ్ సరళవాదుల కంటే ఎక్కువగా పర్యావరణం కోసం కృషి చేశారు. సరళ వాదులు, ప్రగతి శీలురు తరచుగా ఏకాభిప్రాయంలో ఉంటారు. సాధారణంగా లార్జ్ టెంట్ విధానం ఉన్న డెమోక్రటిక్ పార్టీ ప్రాథమిక ఓటర్లు ఒకే విధమైన లేక సమీప భావం జాలం గల ఓటింగ్ సమూహంగా కలుస్తారు. ఎందరో ప్రగతి వాదులు గ్రీన్ పార్టీ లేదా వెర్మాంట్ ప్ర్రోగ్రసివ్ పార్టీ వంటి స్థానిక పార్టీలకు కూడా మద్దతునిస్తారు. కెనడాలో సరళవాదులు సాధారణంగా నేషనల్ లిబరల్ పార్టీకి, ప్రగతి వాదులు మానిటోబా, సస్కాట్చెవాన్, బ్రిటిష్ కొలంబియాలో ప్రాదేశిక ఎన్నికల్లో విజయం సులభంగా సాధించే న్యూడెమోక్రటిక్ పార్టీకి మద్దతునిస్తారు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • సెంటర్ – లెఫ్ట్
 • రాజ్యాంగబద్ధమైన అర్థశాస్త్రం
 • రాజకీయ ఆర్థిక వ్యవస్థ
 • మూల చట్టం ప్రకారం పాలన
 • స్వతంత్ర మీడియా కేంద్రం
 • ప్రగతి శీల విద్య
 • సాంఘిక ప్రజాస్వామ్యం
 • సంక్షేమ రాజ్యం

గమనికలు[మార్చు]

 1. "Progressivism". The Columbia Encyclopedia, Sixth Edition. 2001-05. మూలం నుండి 2008-06-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-11-18. Cite web requires |website= (help)
 2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-05-31 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-05-23. Cite web requires |website= (help)
 3. http://au.acnielsen.com/news/200512.shtml
 4. "Policies". New Zealand Progressive Party. మూలం నుండి 2010-04-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-03-27. Cite web requires |website= (help)
 5. అండర్టన్ టు స్టే విత్ లేబర్, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎన్ జెడ్ హెరాల్డ్
 6. కేథరీన్ కాక్స్, పీటర్ సి. హోలోరాన్ మరియు అలెన్ లెస్సాఫ్ ప్రోగ్రెసివ్ ఎరా యొక్క చారిత్రక డిక్షనరీ (2009)
 7. "What Is Progressivism?". Andrew Garib. Retrieved 2006-11-16. Cite web requires |website= (help)
 8. "Progressive versus Liberal". Untergeek.com. Retrieved 2006-11-16. Cite web requires |website= (help)

సూచనలు[మార్చు]

 • టిన్ డాల్, జార్జ్ అండ్ షి, డేవిడ్ ఇ.. అమెరికా: ఏ నేరేటివ్ హిస్టరీ. డబ్ల్యు. డబ్ల్యు. నోర్టన్ అండ్ కో ఇంక్ (ఎన్ పి): పూర్తి ఆరో ప్రచురణ, 2003. ఐఎస్ బిఎన్ 0-393-92426-2
 • లాకాఫ్, జార్జి. డోన్ట్ థింక్ ఆఫ్ యాన్ ఎలిఫెంట్: నో యువర్ వాల్యూస్ అండ్ ఫ్రేమ్ ది డి బేట్. చెల్సియా గ్రీన్ పబ్లిషింగ్, 2004. ఐఎస్ బిఎన్ 1-931498-71-7
 • కెల్లెహెర్, విలియ్ జె.. ప్రోగ్రసివ్ లాజిక్: ఫ్రేమింగ్ ఎ యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ ఆఫ్ వాల్యూస్ ఫర్ ప్ర్రోగ్రసివ్స్. ది ఎంపథిటిక్ సైన్స్ ఇన్ స్టిట్యూట్, 2005. ఐఎస్ బిఎన్ 0-9773717-1-9
 • లింక్, ఆర్థర్ ఎస్. అండ్ మెక్ కార్మిక్, రిచర్డ్ ఎల్.. ప్రోగ్రసివిజమ్ (అమెరికన్ హిస్టరీ సిరీస్). హర్లాన్ డేవిడ్ సన్. 1983 ఐఎస్ బిఎన్ 0-88295-814-3
 • క్లొపెన్ బర్గ్, జేమ్స్ టి. అన్ సర్టెయిన్ విక్టరీ: సోషల్ డెమోక్రసీ అండ్ ప్రోగ్రసివిజమ్ ఇన్ యూరోపియన్ అండ్ అమెరికన్ థాట్. 1870-1920. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్., యుఎస్ ఎ, 1988. ఐఎస్ బిఎన్ 0-19-505304-4
 • మెక్ గెర్, మైఖేల్., ఎ ఫియర్స్ డిస్కంటెంట్: ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది ప్రోగ్రసివ్ మూవ్ మెంట్ ఇన్ అమెరికా, 1870-1920 (2003)
 • షూట్జ్, ఆరన్., సోషల్ క్లాస్, సోషల్ యాక్షన్, అండ్ ఎడ్యుకేషన్. ది ఫెయిల్యూర్ ఆఫ్ ప్రోగ్రసివ్ డెమోక్రసీ. పాల్ గ్రేవ్, మెక్ మిలన్, 2010. ఐఎస్ బిఎన్ 978-0230105911 పరిచయం

బాహ్య లింకులు[మార్చు]