ప్రజానాట్యమండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dr.Garikapati Rajarao, Praja Natya Mandali
ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు డా గరికపాటి.రాజారావు

సామ్య సిధ్దాంతాల పునాదితో దైనందిన జీవితంలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలపై జనబాహుళ్యానికి అవగాహన కల్పించే ఆశయంతో ప్రజానాట్యమండలి స్ధాపించబడింది. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బావుటా ఎగురవేసింది ప్రజానాట్యమండలి. ఇప్పిటికీ వీధి నాటకాలతో తన సందేశాన్ని వినిపిస్తూనే ఉంది. 1943లో స్థాపించబడింది

సంస్ధాపకులు[మార్చు]

ప్రజానాట్యమండలి స్దాపకులలో ప్రముఖులు డా. గరికపాటి రాజారావు గారు.[1] ఆయన 1915 ఫిబ్రవరి 5న కోటయ్య, రామలింగమ్మలకు రాజమండ్రిలో జన్మించారు. వృత్తి రీత్యా డాక్టర్. వామపక్ష భావజాలానికి చదువుకునే రోజుల్లోనే ఆకర్షితులయ్యారు. ఆయన నటుడు, ప్రయోక్త, రచయిత. ఆయన ప్రజానాట్యమండలికి నిర్వహాకులుగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సుంకర వాసు రెడ్డి గారు రచించిన "మా భూమి" నాటకానికి దర్శకత్వం వహించి అందరి మన్ననలు పొందారు. 108 దళాలుగా ఏర్పర్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈయన రూపొందించిన నాటకాలలో కొన్ని - జై భవాని, పశ్చాతాపం, ఖిల్జీ రాజ్యపతనం, ముందడుగు, భయం, పరివర్తన, ఈనాడు, అల్లూరి సీతారామరాజు మున్నగున్నవి.
పరితాపం, వీరనారి, పశ్చాతాపం మున్నగు నాటకాలు రచించారు.
1953 లో నిర్మితమైన పుట్టిల్లు చిత్రానికి దర్శక నిర్మాత. ఈ చిత్రం ద్వారా జమున, అల్లు రామలింగయ్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. విమర్శకుల ప్రశంసలందుకున్నా, ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతం కాలేదు. దానితో రాజారావు ఆర్థికంగా చితికి పోయారు. ఐనా, వారు సంఘ సేవ ఆపలేదు. బీద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసే వారు. తరువాతి కాలంలో వారు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు.

మహోన్నత వేదిక[మార్చు]

ప్రజా నాట్య మండలి ద్వారా ప్రాచుర్యం పొందిన వారు ఎందరో. ముందు తరం నటులు, సాంకేతిక నిపుణులు ప్రజానాట్యమండలి నుండి వచ్చిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరు - జమున (నటి) ,జి.వరలక్ష్మి, కోవెలమూడి ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, బొల్లిముంత శివరామకృష్ణ, కాకరాల మున్నగు వారు.
బుర్రకథ పితామహ షేక్ నాజర్, వారి బృందంలో కర్నాటి లక్ష్మీనరసయ్య ప్రజానాట్యమండలికి చెందిన వారే.

వనరులు[మార్చు]