ప్రజాశక్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Prajasakti title.gif
ప్రజాశక్తి మొదటి పేజీ
రకంప్రతి దినం దిన పత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యం‌ప్రజాశక్తి సాహితీ సంస్థ
సంపాదకులుఎం వి ఎస్ శర్మ
స్థాపించినది1942-06-13 (‌వారపత్రిక),మద్రాసు, 1945-12-03 (దినపత్రిక)విజయవాడ, 1951-11-21 (వారపత్రిక), 1981-08-XX (దినపత్రిక)
రాజకీయత మొగ్గుకమ్యూనిజం
ముద్రణ నిలిపివేసినది1948-04-22 నుండి 1951-11-20 (వారపత్రిక) మరల ఇంకొన్నాళ్లు
కేంద్రంవిజయవాడ
జాలస్థలిప్రజాశక్తి అధికారిక వెబ్‌సైటు

ప్రజాశక్తి హైదరాబాదులోని ప్రజాశక్తి సాహితీ సంస్థచే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక. ఇది స్వాతంత్ర్యోద్యమ కాలములో 1942లో మద్రాసులో కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికగా ఆవిర్భవించింది.[1] 1945 నుండి ఈ పత్రిక విజయవాడనుండి ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు ప్రభుత్వ ఆగ్రహానికి గురై 1948లో నిషేధించబడింది. 1969లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. 1981లో దినపత్రికగా మారి 2014వ సంవత్సరము వరకు 10 సంచికలకు ఎదిగినది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత మార్కిస్టు -లెనినిస్టు భావజాల సమూహానికి పత్రికగా కొనసాగుతున్నది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ప్రజాశక్తి ఆంధ్ర ప్రాంతానికి పరిమతమైనది, తెలంగాణ లో మార్చి 25, 2015 నుండి నవతెలంగాణ పేరుతో వస్తున్నది.

చిహ్నం[మార్చు]

ప్రఖ్యాత కవి, చిత్రకారుడు అడవి బాపిరాజు తొలి పత్రికా చిహ్నం తయారు చేశారు. ఆతరువాత ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో సుత్తీ కొడవలి తొలగించబడింది.

సంపాదకత్వం[మార్చు]

తొలిదశలో మద్దుకూరి చంద్రశేఖరరావు, కంభంపాటి సత్యనారాయణ (సీనియర్) తుమ్మల వెంకటరామయ్య, పుచ్చలపల్లి సుందరయ్య,చలసాని ప్రసాదరావులు సంపాదకవర్గ సభ్యులుగా పనిచేశారు.ఆ తరువాత వి.ఆర్.బొమ్మారెడ్డి సంపాదకత్వం వహించాడు. ఆ తరువాత మోటూరు హనుమంతరావు గారు ఎడిటర్ గా పనిచేసాడు.ఆయన ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గా 15 ఎళ్ళుగా పనిచేసారు. ఆయన ఎంపీ, శాసన సభ్యులు గానూ పనిచేసారు. ఆ తరువాతి కాలంలో వీ.శ్రీనివాసరావు, ఎస్. వినయకుమర్ ఎడిటర్ గా పనిచేసారు. కొంతకాలం తెలకపల్లి రవి సంపాదకుడుగా ఉన్నాడు. 2014 జూన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వత రెండు రాష్ట్రాలకు గాను రెండు వెర్వేరు ఏడిషన్లను నిర్వహించటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాశక్తి ఎడిటర్ గా పాటూరు రామయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రజాశక్తి ఎడిటర్ గా సుంకరి వీరయ్య వున్నారు.

అనుబంధాలు[మార్చు]

ప్రస్తుతం ప్రజాశక్తి ఎడిటర్ గా మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ గారు ఉన్నారు.

ప్రజాశక్తి బుక్ హౌస్[మార్చు]

ప్రజాశక్తి బుక్ హౌస్ 80,000 పైగా పుస్తకాలు ప్రచురించి పెద్ద పుస్తక ప్రచురణ సంస్థగా అభివృద్ధి చెందింది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ప్రజాశక్తి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 420–421.{{cite book}}: CS1 maint: extra punctuation (link)

బయటి లింకులు[మార్చు]