ప్రజా సంగీతం
స్వరూపం
ప్రజా సంగీతం (Popular music) అంటే ఎక్కువ మంది ఆదరించే సంగీతం. [1] సంగీత పరిశ్రమ ద్వారా ఈ సంగీతం ఎక్కువమందికి చేరువవుతుంది. ఈ సంగీత శైలి, రూపాలు ఎటువంటి సంగీత శిక్షణ లేకపోయినా ప్రదర్శించగలరు, ఆస్వాదించగలరు.[2] ప్రజా కళల్లో ఒక భాగమైన ఈ సంగీతం సాంప్రదాయ సంగీత కళ కంటే భిన్నమైనది.[3][4][5] సాంప్రదాయ సంగీత కళ చాలా కాలం పాటు లిఖితరూపంలోనూ, రికార్డింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందిన తర్వాత రికార్డుల ద్వారానూ వ్యాప్తి అవుతూ వచ్చింది.
పాపులర్ మ్యూజిక్‌నే కొన్ని సార్లు పాప్ మ్యూజిక్ అంటుంటారు కానీ రెండూ ఒకటి కావు. పాపులర్ సంగీతం అనేది చాలా మంది ప్రజలకు నచ్చే అనేక రకాల సంగీత రీతులను సూచించే ఒక సాధారణ పదం.[6] పాప్ సంగీతం సాధారణంగా పాపులర్ సంగీతంలో ఒక నిర్దిష్ట సంగీత శైలిని సూచిస్తుంది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Definition of "popular music"". Collins English Dictionary. ఒరిజినల్ నుండి 2019-03-27 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-11-15.
- ↑ Popular Music. (2015). Funk & Wagnalls New World Encyclopedia
- ↑ Arnold, Denis (1983). The New Oxford Companion Music, Volume 1: A-J. Oxford University Press. p. 111. ISBN 978-0-19-311316-9.
- ↑ Arnold, Denis (1983). The New Oxford Companion to Music, Volume 2: K-Z. Oxford University Press. p. 1467. ISBN 978-0-19-311316-9.
- ↑ Philip Tagg (1982). "Analysing popular music: theory, method and practice" (PDF). Popular Music. 2: 37–67. CiteSeerX 10.1.1.628.7469. doi:10.1017/S0261143000001227. S2CID 35426157. ఒరిజినల్ నుండి 2019-04-12 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-10-13.
- ↑ Allen, Robert. "Popular music". Pocket Fowler's Modern English Usage. 2004.
- ↑ Laurie, Timothy (2014). "Music Genre As Method". Cultural Studies Review. 20 (2), pp. 283-292.