ప్రతాపగౌడ పాటిల్
| ప్రతాపగౌడ పాటిల్ | |||
| పదవీ కాలం 2008 – 2021 | |||
| ముందు | కొత్త నియోజకవర్గం ఏర్పాటు | ||
|---|---|---|---|
| తరువాత | బసనగౌడ తుర్విహాల్ | ||
| నియోజకవర్గం | మాస్కీ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1955 అక్టోబరు 1 మాస్కీ , కర్ణాటక, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (మే 2021–ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (మే 2021 వరకు) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ప్రతాపగౌడ పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు మాస్కీ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ప్రతాపగౌడ పాటిల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో మాస్కీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి తిమ్మప్ప పై 7643 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2013 శాసనసభ ఎన్నికలలో ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కర్ణాటక జనతా పక్ష అభ్యర్థి మహదేవప్ప గౌడపై 19147 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
ప్రతాపగౌడ పాటిల్ 2018 శాసనసభ ఎన్నికలలో మాస్కీ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బసనగౌడ తుర్విహాల్పై 213 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయనపై శాసనసభ్యుడిగా అనర్హత వేటు పడిన తరువాత 2021లో జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి బసనగౌడ తుర్విహాల్ చేతిలో 30,606 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]
ప్రతాపగౌడ పాటిల్ 2023 శాసనసభ ఎన్నికలలో మాస్కీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి బసనగౌడ తుర్విహాల్ చేతిలో 13,053 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Disqualified Karnataka MLAs, barring Roshan Baig, join BJP". The Economic Times. 2019-11-14. Retrieved 2020-04-13.
- ↑ "Karnataka bypolls: BJP wins Belagavi, Basavakalyan; Congress takes Maski" (in ఇంగ్లీష్). The Indian Express. 3 May 2021. Archived from the original on 19 April 2025. Retrieved 19 April 2025.
- ↑ "Karnataka Assembly Elections 2023: Maski". Election Commission of India. 13 May 2023. Archived from the original on 22 April 2025. Retrieved 22 April 2025.