Jump to content

ప్రతాప్‌రావు భోసలే

వికీపీడియా నుండి
ప్రతాప్‌రావు భోసలే
ప్రతాప్‌రావు భోసలే


పదవీ కాలం
1967 – 1985
ముందు దాదాసాహెబ్ జగ్తాప్
తరువాత మదన్‌రావ్ పిసల్
నియోజకవర్గం వాయ్

పదవీ కాలం
1999 – 2009
ముందు యశ్వంతరావు చవాన్
తరువాత హిందూరావు నాయక్ నింబాల్కర్
నియోజకవర్గం సతారా

వ్యక్తిగత వివరాలు

జననం (1934-10-25)1934 అక్టోబరు 25
భుంజ్, సతారా జిల్లా, బొంబాయి ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 2024 మే 19(2024-05-19) (వయసు: 89)
భుంజ్, సతారా జిల్లా, మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (యు)
జీవిత భాగస్వామి శాంతాబాయి భోసలే
సంతానం మదన్ భోసలే[1]
నివాసం భుంజ్, సతారా జిల్లా, మహారాష్ట్ర , భారతదేశం
పూర్వ విద్యార్థి జగన్నాథ్ బరూహ్ కళాశాల
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రతాప్‌రావు బాబూరావు భోసలే (25 అక్టోబర్ 1934 - 19 మే 2024) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన వాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై వసంత్‌దాదా పాటిల్ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి & మరాఠీ భాష శాఖ మంత్రిగా పని చేసి, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రతాప్‌రావు భోసలే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పోటీ చేసి 1967 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1972, 1978, 1980 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

ప్రతాప్‌రావు భోసలే 1984 లోక్‌సభ ఎన్నికలో సతారా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 1989, 1991 లోక్‌సభ ఎన్నికలో వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1997లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

మరణం

[మార్చు]

ప్రతాప్‌రావు భోసలే వృధ్యాప సమస్యల కారణంగా 89 ఏళ్ళ వయస్సు అనారోగ్యంతో బాధపడుతూ 2024 మే 19న మరణించాడు.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Sharad Pawar begins poll manoeuvring in Maharashtra, in talks with key leaders" (in ఇంగ్లీష్). India Today. 5 September 2024. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  2. "Maharashtra CM Babasaheb Bhosale faces dissent from party MLAs" (in ఇంగ్లీష్). India Today. 30 July 2013. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  3. "सातारा : काँग्रेसचे ज्येष्ठ नेते, माजी मंत्री प्रतापराव भोसले यांचं निधन" (in మరాఠీ). 19 May 2024. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  4. "Former Congress MP Prataprao Bhosale passes away; Nana Patole expresses grief" (in ఇంగ్లీష్). Deccan Herald. 19 May 2024. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  5. "ग्रामीण विकासाचा ध्यास घेतलेले नेतृत्व" (in మరాఠీ). Marathi News Esakal. 20 May 2024. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  6. "Former Congress MP Prataprao Bhosale passes away; Patole expresses grief" (in ఇంగ్లీష్). Outlook India. 19 May 2024. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.