ప్రతాప్ కేశరి దేవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతాప్‌కేశరి దేవ్

పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలు, ఇంధన శాఖ మంత్రి
పదవీ కాలం
2022 జూన్ 5 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2000 - 2014
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం ఔల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1971 డిసెంబర్ 21
కేంద్రపడా జిల్లా, ఒడిశా, భారతదేశం
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు శరత్ కుమార్ దేబ్
జీవిత భాగస్వామి అవంతిక సింగ్

ప్రతాప్‌కేశరి దేవ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఔల్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలు, ఇంధన శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

ప్రతాప్ కేశరి దేవ్ బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ఔల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎఎన్నికయ్యాడు. ఆయన 2004, 2009, 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేడీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ప్రతాప్ కేశరి దేవ్ 02 ఆగష్టు 2012 నుండి 21 మే 2014 వరకు ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమం, ఐటీ శాఖ సహాయ మంత్రిగా, తిరిగి 2022 జూన్ 5న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలు, ఇంధన శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

మూలాలు[మార్చు]

  1. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.