ప్రతి ద్రవ్యోల్బణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆర్థిక శాస్త్రంలో ప్రతి ద్రవ్యోల్బణం అనగా వస్తువుల మరియు సేవల సాధారణ ధరల స్థాయి తగ్గటం.[1] వార్షిక ద్రవ్యోల్బణ శాతం సున్నా కంటే (నెగటివ్ ద్రవ్యోల్బణ శాతం) తగ్గినప్పుడు ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అప్పుడు డబ్బు యొక్క అసలు విలువ పెరిగి, అదే డబ్బుతో ఎక్కువ వస్తువులు కొనటానికి వీలవుతుంది. దీన్ని ద్రవ్యోల్బణం శాతం తగ్గినప్పుడు ఏర్పడే ద్రవ్యోల్భణ జాడ్యముగా (అంటే ద్రవ్యోల్బణం తగ్గుతుంది కాని పాసిటివ్ గానే ఉంటుంది) అని పొరపాటుగా అనుకోకూడదు.[2] ద్రవ్యోల్బణం డబ్బు యొక్క అసలు విలువని ఏవిధముగా కాలక్రమేపి తగ్గిస్తుందో, దానికి భిన్నంగా ప్రతి ద్రవ్యోల్బణం డబ్బు యొక్క అసలు విలువని పెంచుతుంది. డబ్బు - ఒక దేశీయ లేదా ప్రాంతీయ అర్థిక వ్యవస్థలో చలామణి అవుతున్న డబ్బు (మరియు ద్రవ్యసంబంధమైన కొలమానం).

ప్రస్తుతం, ఆధునిక ఆర్ధికవ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణం ఒక సమస్య ఎందుకంటే దానివల్ల ఒక ప్రతి ద్రవ్యోల్బణ మురి (క్రింద వివరించబడిన ) కి దారి తీస్తుందని ప్రధానమైన అర్థికవేత్తలు సాధారణముగా నమ్ముతున్నారు.[3] ప్రతి ద్రవ్యోల్బణానికి మాంద్యానికి మరియు గ్రేట్ డిప్రెషన్ కు సంబంధం ఉంది. బ్యాంకులు ఖాతాదారులకు డబ్బు తిరిగి ఇవ్వలేక పోయాయి. మరియు, ఆర్ధిక వ్యవస్థని ద్రవ్య విధానము స్థిరపరచడాన్ని ప్రతి ద్రవ్యోల్బణం, ధన వల అనే ఒక ప్రక్రియ ద్వారా అడ్డుకుంటుంది. అయితే, చరిత్రలో అన్ని ప్రతి ద్రవ్యోల్బణం నెలకొన్న సందర్భాలు అర్థిక అభివృద్ధి తక్కువుగా ఉన్న సమయాలతో ముడిపడి ఉండలేదు.[4]

విషయ సూచిక

సాంప్రదాయ పదము[మార్చు]

ప్రతి ద్రవ్యోల్బణం అనే పదానికి సంప్రదాయక అర్థికవేత్తలు మరొక అర్థం చెప్పేవాళ్ళు. దాని ప్రకారం, ఈ పదము ద్రవ్యోల్బణం మరియు ఋణం తగ్గడాన్ని చూపిస్తుంది; అనేక ఆస్ట్రియా-సిద్ధాంతాన్ని పాటిస్తున్న ఆర్ధికవేత్తలతో సహా కొందరు అర్థికవేత్తలు ఇంకా ఇదే అర్థములో అ పదాన్ని వాడుతున్నారు.[5] ఈ రెండు అర్దాలకు సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ద్రవ్య సరఫరా తగ్గినప్పుడు (ద్రవ్య వేగం మారడంలేదు అని అనుకుంటే) అది సాధారణ ధరల స్థాయి తగ్గడానికి కారణమవుతుంది.

ప్రతి ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలు[మార్చు]

IS/LM పద్ధతి ప్రకారం (అంటే, దాయం మరియు పొ దుపు సమన్వయం/ గదు ఇష్టత మరియు ద్ర వ్య సరఫరా సమన్వయం పద్ధతి), సరకులు మరియు ఆసక్తికు సంబంధించిన సరఫరా-గిరాకి రేఖలో జరిగే మార్పే, ముఖ్యంగా మొత్తం గిరాకి స్థాయి తగ్గటమే, ప్రతి ద్రవ్యోల్బణానికి కారణం. అనగా, మొత్తం అర్థికవ్యవస్థ ఎంత మేరకు కొనడానికి సిద్ధంగా ఉందో మరియు సరకుల ధరలు ఎంత మేరకు తగ్గుతాయో అంత తగ్గుదల ఉంటుంది. సరకుల ధర తగ్గ్గుతూ ఉంది కనుక, వినియోగదారులు తమ కొనుగోలుని మరియు వాడకాన్ని ఇంకా ధరలు దగ్గే వరకు ఆలస్యం చేయడానికి ప్రేరేపిస్తుంది. అందువల్ల ఆర్థిక కలాపాలు మరిన్ని తగ్గి, ప్రతి ద్రవ్యోల్బణ మురికి కారణమవుతాయి.

దీనివల్ల సామర్ధ్యం వృధా అవుతుంది కనుక, పెట్టుబడి కూడా తగ్గి, మొత్తము గిరాకి మరింత తగ్గడానికి దారి తీస్తుంది. ఇదే ప్రతి ద్రవ్యోల్బణ మురి అంటే. మొత్తం గిరాకి తగ్గుదలని నివారించడానికి కేంద్ర బ్యాంకు ద్రవ్య సరఫరాని విస్తరించడం ద్వారా కానీ ఆర్ధిక అధికారులు గిరాకి పెంచడం ద్వారా కానీ ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉన్న వడ్డీ రేటులకంటే తక్కువ రేటులో ఋణం పొందటం ద్వారా ప్రోత్సాహం ఇవ్వడం ఒక మార్గం.

ద్రవ్యోల్బణానికి దీనికి విరుద్ధ ప్రభావం ఉండి, తరుచూ మాంద్యానికి ముందు ఏర్పడుతూ ఉంటుంది.[ఉల్లేఖన అవసరం] ఉదాహరణకి, ఈ అత్యావసర వస్తువుల ధరలు 2008 మాంద్యానికి ముందు ఆకాశాన్ని అంటాయి.

ఇటీవలి కాలపు ఆర్ధిక ఆలోచనా విధానం ప్రకారం, ద్రవ్యోల్బణం ఆపదతో ముడిపడి ఉంది: ఆస్తుల మీద రాబడి (ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని) సూన్యం కంటే తగ్గినప్పుడు, పెట్టుబడిదారులు మరియు కొనుగోలుదారులు భద్రమైన పెట్టుబడి పత్రాలలో కూడా పెట్టుబడి పెట్టకుండా నగదుని దాచిపెట్టుకుంటారు. ఇది సిద్ధాంత పరంగా ఒక ధన వల అనే పరిస్థితికి దారి తీస్తుంది. దీనికి ఆచరణలో ఎంత మేరకు సాధ్యం అనేది చాల వివాదాస్పదంగా ఉంది. ఒక కేంద్రీయ బ్యాంకు సాధారణంగా డబ్బుకి సూన్యాని కంటే తక్కువ వడ్డీ వసూళ్లు చేయడం సాధ్యం కాదు. సున్నా వడ్డీ వసూళ్లు చేయడం కూడా కొద్దిగా ఎక్కువ వడ్డీ వసూళ్లు చేయడం కంటే తక్కువ ప్రోత్సాహం ఇస్తుంది. ఒక మూసిన ఆర్ధిక వ్యవస్థలో సున్నా వడ్డీ వసూళ్లు చేయడం అంటే ప్రభుత్వ పెట్టుబడి పత్రాల మీద సూన్యం రాబడి లేదా తక్కువ కాలపు పెట్టుబడుల మీద సూన్యాని కంటే తక్కువ రాబడి ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక తెరిచిన ఆర్ధిక వ్యవస్థలో, ఇది ఒక క్యారి వర్తకాన్ని సృష్టించి డబ్బు విలువని తగ్గించి, దిగుమతి ధరలని పెంచుతుందే కాని అదే స్థాయిలో ఎగుమతిని ప్రోత్సాహించదు.

ద్రవ్యసంబందమైన సిద్ధాంతం ప్రకారం, ప్రతి ద్రవ్యోల్బణం ద్రవ్య వేగాన్ని తగ్గించడానికి లేక లావాదేవీల సంఖ్యని తగ్గించడానికి సంబంధించింది. ఇది ద్రవ్య సరఫరాని గణనీయంగా తగ్గిస్తుంది, బహుశా మారకం రేటులో తగ్గుదల వల్ల కాని లేక ఒక సువర్ణ ప్రమాణాన్ని పాటించడానికి కాని లేక ఇతరత్రా ద్రవ్య అవసరాల మేరకు కాని ఉంటుంది.

ప్రతి ద్రవ్యోల్బణం సాధారణంగా ప్రతికూలంగా భావించబడుతుంది ఎందుకంటే అది సంపదని స్థిర ఆస్తులని ఋణంతీసుకునే వాళ్ల మరియు పెట్టుకునేవాళ్ల చేతులనుండి నగదు మరియు ఆస్తులని అస్థిర రూపేణ దాచుకునేవాళ్ళు మరియు పెట్టుకునేవాళ్ళకు మారుతుంది కనుక. ఈ అర్థములో, ఇది ద్రవ్యోల్బణానికి వ్యతిరేకం (లేదా, అత్యధికంగా ఉంటె అతిఎక్కువ ద్రవ్యోల్బణం). ఇది నగదు ఉంచుకునే వాళ్లకు మరియు అప్పు ఇచ్చేవాళ్లకు (పొదుపు చేసేవాళ్లు) ప్రతికూలంగాను ఋణం తీసుకునేవాళ్లకు మరియు తక్కువ కాలపు వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఆధునిక ఆర్ధికవ్యవస్థలలో గిరాకి కుప్పకూలడం మూలాన (సాధారణంగా ఎక్కువ వడ్డీ రేటుల కారణంగా) ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీనికి మాంద్యం తోనూ మరియు (అరుదుగా) దీర్ఘకాల స్తబ్దత తోనూ సంబంధం ఉంది.

ఆధునిక ఆర్ధికవ్యవస్థలలో, ఋణ కాల పరిమితులు పెరగడం కారణంగానూ మరియు అన్ని రకాల పెట్టుబడులలో ఋణం ఇవ్వడం సామాన్యంగా ఉండటం కారణంగానూ ప్రతి ద్రవ్యోల్బణానికి సంబంధించిన జరిమానాలు పెరిగాయి. ప్రతి ద్రవ్యోల్బణం పెట్టుబడులకు మరియు వ్యయానికి ప్రతికూలంగా ఉంటుంది కనుక ఇది సాధారణంగా మొత్తం గిరాకి కూలడానికి దారి తీస్తుంది. ఎందుకంటే, లాభాలు సూన్యానికి తక్కువ ఉంటాయని అనుకున్నప్పుడు మరియు భవిష్యత్తులో ధరలు తక్కువ ఉంటాయని అనుకున్నప్పుడు పెట్టుబడి మరియు వ్యయం తగ్గుతుంది. "దాగి ఉన్న ద్రవ్యోల్బణం" ప్రమాదం లేకుండా, ద్రవ్యాన్ని పెట్టుబడి పెట్టకుండా వ్యయం చేయకుండా అలాగే అట్టిపెట్టుకొని ఉండటమే ఉత్తమం కావచ్చు.

అయితే ప్రతి ద్రవ్యోల్బణం దృఢ నగదు ఆర్ధిక వ్యవస్థలలో ఏర్పడే సహజమైన పరిస్థితి. ద్రవ్య సరఫరా పెరుగుదల రేటుకు, సున్నానికంటే ఎక్కువ ఉండే జనాభా (మరియు సాధారణ ఆర్ధిక) పెరుగుదలకు పొంతన లేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది జరిగినప్పుడు, మనిషి ఒక్కొక్కరికి అందుబాటులో ఉండే నగదు తగ్గి, డబ్బు కొరత పెరుగుతుంది; కావున, నగదు యొక్క కొనుగోలు శక్తీ పెరుగుతుంది. 19వ శతాబ్దం చివరలో నెలకొన్న పరిస్థితి ప్రతి ద్రవ్యోల్బణం మరియు ఈ పరిస్థితులలో జరిగిన ఆర్ధిక అబివృద్దికి ఒక ఉదాహరణ.

ఉత్పత్తి రంగంలో సమర్ధత పెరిగి సరకుల ధర దగ్గినప్పుడు కూడా ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఉత్పత్తి సమర్ధత ఎందుకు పెరుగుతుందంటే వస్తువుల మరియు సేవల తయారీదారులుకు ఉత్పత్తి పద్ధతిని మెరుగు పరచడం ద్వారా ఎక్కువ లాభం వస్తుందని ప్రేరణ ఉంటుంది. మార్కెట్ లో పోటి వల్ల తరచు ఉత్పత్తిదారులు వాళ్లు ఖర్చులో చేసిన ఆదాలో కొంత భాగాన్ని వాళ్లు తయారు చేసిన వస్తువల ధర తగ్గించడానికి వాడతారు. ఇది జరిగినప్పుడు, వినియోగదారులు ఈ వస్తువులకు తక్కువ ధర చెల్లిస్తారు; అందువల్ల కొనుగోలు శక్తి పెరగడంతో ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి పెరగడం మంచిదేకాని, అది నిజంగా ఇబ్బందులు కలిగించవచ్చు. ఎప్పుడంటే ఒకరి నికర ఆస్తుల విలువ నగదు రూపేణ కాకుండా ఇల్లు, భూమి మరియు ఇతర ఆస్తుల రూపేణ ఉన్నప్పుడు. ఇది అప్పు బాధని ఇంకా పెంచుతుంది. ఎలాగంటే - కొంత కాలం ప్రతి ద్రవ్యోల్బణం నెలకోన్న తరువాత - అప్పుని తీర్చే సమయములో చేసే చెల్లింపుల యొక్క కొనుగోలు శక్తి అప్పు తీసుకున్న సమయములో ఉన్న విలువకంటే ఎక్కువ కాబట్టి. అందువల్ల, ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఋణం యొక్క వడ్డీ రేటు చాల రెట్లు పెంచే ప్రక్రియలాగ భావించవచ్చు. గ్రేట్ డిప్రెషన్ సమయములో మాదిరిగా, ప్రతి ద్రవ్యోల్బణం ఏడాదికి సగటుగా 10% ఉన్నప్పుడు, 0% ఋణంకూడా ఆకర్షణీయంగా ఉండదు ఎందుకంటే అ ఋణాన్ని 10% కంటే ఎక్కువ విలువగల డబ్బుతో తిరిగి తీర్చాలి కనుక. ఎందుకంటే

సాధారణ పరిస్థితుల్లో, ఫెడ్ మరియు ఇతర అనేక కేంద్ర బ్యాంకులు స్వల్ప-కాల వడ్డీ రేటుకు - యునైటెడ్ స్టేట్స్ లో ఒక రోజు రాత్రికి కేంద్ర నిధుల రేటు- ఒక గమ్యం నిర్ణయించడం ద్వార విధానాన్ని అమలు చేస్తాయి. బయిట నిధుల మార్కెట్ లో పెట్టుబడి పత్రాలని కొనడం అమ్మడం ద్వారా ఈ గమ్యాన్ని చేరుకుంటాయి. స్వల్ప-కాల వడ్డీ రీతి సూన్యానికి చేరినప్పుడు, కేంద్రీయ బ్యాంకు ఇంకా వడ్డీ రేటు గమ్యాన్ని తగ్గించడం ద్వారా విధానాన్ని కొనసాగించడం సాధ్యం కాదు.

డబ్బు సరఫరాని నియంత్రించడానికి చేపట్టే మామూలు పద్ధతులు ఉపయోగకరంగా ఉండవు ఎందుకంటే స్వల్ప-కాల వడ్డీ రేటు సూన్యానికి తగ్గించడం కూడా "నిజమైన" వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది; అందువల్ల ద్రవ్య సరఫరాని పెంచడానికి ఆస్తులని కొనడం లేక పరిమాణపరంగా సడలింపు (డబ్బుని ముద్రించడం) వంటి ఇతర ప్రక్రియలని చేపట్టవలసిన అవసరం ఉంటుంది. 2002లో ప్రస్తుత యునైటెడ్ స్టేట్స్ ఫెడేరల్ రిసర్వ్ అధ్యక్షుడైన బెన్ బేర్నాంక్, "...సరిపోయే పరిమాణంలో డబ్బుని వ్యవస్థలో పంపించడం ద్వారా ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఎట్టుకేలకు తిరోగమనం పొందేలా చేయవచ్చు" అని అన్నారు.[6]

ఆర్ధిక వ్యవస్థలో ఏ "కటినత్వాలు" లేనప్పుడు, ప్రతి ద్రవ్యోల్బణం ఒక మంచి పరిణామం ఎందుకంటే ధరలు తగ్గుదల వల్ల ఆర్ధికవ్యవస్థ యొక్క ప్రయత్నాల్లో ఎక్కువ భాగం ఇతర కార్యకలాపాలకి మళ్ళించబడి, ఆర్ధికవ్యవస్థ యొక్క మొత్తం ఉత్పత్తిని పెంచుతుందని దృఢ ద్రవ్య పద్ధతిని ఆదరించేవాళ్లు వాదిస్తారు. కొందఋ ఆర్ధికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని విమర్శించి, కటినత్వం కనుక లేకపోతే ద్రవ్యోల్బణం అయినా ప్రతి ద్రవ్యోల్బణం అయినా ఏ ప్రభావమూ చూపించదని చెపుతారు.

ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితి నెలకొన్న సమయాలు నగదు అట్టి పెట్టుకొనే వాళ్లకంటే నగదు అట్టి పెట్టుకొనే వాళ్లకే అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఈ సమయాల్లో జనాకర్షణ భావాలు పెరుగుతాయి, 19వ శతాబ్దం చివరిలో జరిగినట్లుగానే. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ లోని జనాకర్షణవాదులు దృఢ ద్రవ్య నియమాలని తొలగించి, ఎక్కువ ద్రవ్యోల్బణం (బాగా విస్తారంగా దొరుకుతుంది కనుక) కలిగించే వెండి లోహం మీద ఆధారబడిన ద్రవ్య నియమాని పాటించాలని కోరుకున్నారు.

ప్రతి ద్రవ్యోల్బణ మురి[మార్చు]

ధర తగ్గుదల వల్ల ఉత్పత్తి తగ్గి, దానివల్ల గిరాకి మరియు జీతాలు తగ్గి, దానివల్ల ధర ఇంకా తగ్గుతున్నప్పుడు ప్రతి ద్రవ్యోల్బణ మురి అనే పరిస్థితి ఏర్పడుతుంది.[7] సాధారణ ధర స్థాయిలో తగ్గుదలలు ప్రతి ద్రవ్యోల్బణం అని పిలవబడుతుంది కాబట్టి, ధరల తగ్గుదల ఒక విషవలయానికి దారి తీసినప్పుడు, అంటే ఒక సమస్య దాన్నే పెంచుతున్నప్పుడు, ప్రతి ద్రవ్యోల్బణ మురి ఏర్పడుతుంది. కొందరు గ్రేట్ డిప్రెషన్ని ప్రతి ద్రవ్యోల్బణ మురి అని భావిస్తారు. ప్రతి ద్రవ్యోల్బణ మురిలు నిజంగా జరగుతాయా అనేది వివాస్పదం.

ప్రతి ద్రవ్యోల్బణ మురి అనేది 19వ శతాబ్ద నాటి సాధారణ అపరిమిత వివాదం యొక్క ఆధునిక స్థూల ఆర్ధికవ్యవస్థ యొక్క అంశం. దీనికి సంబంధించిన మరొక అభిప్రాయము ఏమంటే, అతి ఎక్కువ అప్పు నిర్విరామముగా ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడటానికి కారణం కావొచ్చు అనే ఇర్వింగ్ ఫిషర్ యొక్క సిద్ధాంతం.

అతి ఎక్కువ ద్రవ్యోల్బణానికి ప్రతిస్పందన[మార్చు]

అతి ఎక్కువ ద్రవ్యోల్బణం ఒక ద్రవ్యాన్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడు, జనం వాళ్లు పొదుపు చేసిన డబ్బుని వేరే ద్రవ్యాలలో మార్చడానికి హడావిడి పడుతారు. అప్పుడు ఇతర ద్రవ్యాలలో కూడా ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడవచ్చు. దానికి భిన్నంగా, అతి ఎక్కువ ద్రవ్యోల్బణానికి కారణమౌతున్న విధానాలని హటాత్తుగా ఉపసంహరించినప్పుడు, జనానికి అ ద్రవ్యం మీద నమ్మకం పెరిగి, కొద్ది కాలం ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడవచ్చు.

ప్రతి ద్రవ్యోల్బణానికి కారణాలు[మార్చు]

ప్రధాన ఆర్ధికశాస్త్రంలో ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడటానికి రెండు కారణాల సంయోగం కావచ్చు. ఒకటి, వస్తువుల సరఫరా మరియు గిరాకి. ఇంకొకటి, ద్రవ్య సరఫరా మరియు గిరాకి. ముఖ్యంగా, ద్రవ్య సరఫరా తగ్గడం మరియు వస్తువుల సరఫరా పెరగడం. చారిత్రాత్మకంగా, ప్రతి ద్రవ్యోల్బణ ఘటనలు ఎక్కువగా ద్రవ్య సరఫరా పెరగకుండా వస్తువుల సరఫరా పెరగడం (ఉత్పత్తి సామర్ధ్యం పెరగడం వల్ల) లేదా (గ్రేట్ డిప్రెషన్ లో మాదిరిగా మరియు బహుశా 1990ల మొదటిలో జపాన్ లో మాదిరిగా) వస్తువుల గిరాకి తగ్గి ద్రవ్య సరఫరా కూడా తగ్గడం వంటి సందర్పాలతో ముడిపడి ఉన్నాయి. బెన్ బేర్నాంక్ చేపట్టిన గ్రేట్ డిప్రెషన్ గురించిన విశ్లేషణలు ప్రకారం గిరాకి తగ్గుదలకు ప్రతిస్పందనగా ఆనాటి ఫేడేరల్ రిసర్వ్ ద్రవ్య సరఫరాని తగ్గించినప్పుడు ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడడానికి తోడ్పడింది.

ప్రతి ద్రవ్యోల్బణం యొక్క మూల రకాలు[మార్చు]

ప్రతి ద్రవ్యోల్బణం నాలుగు రకాలుగా ఉండవచ్చు. రెండు గిరాకి పక్షంలో మరియు రెండు సరఫరా పక్షంలో:

 • పెరుగుదల ప్రతి ద్రవ్యోల్బణం. (వస్తువుల సరఫరాలో పెరుగుదల. CPI తగ్గడం.)
 • నగదు నిలువ చేసుకోవటం (దాచిపెడ్డడం) ప్రతి ద్రవ్యోల్బణం (ఎక్కువ నగదుని ఆదా చేయడం. ద్రవ్య వేగం తగ్గడం. ద్రవ్య గిరాకి పెరగడం)
 • బ్యాంకు ఋణ ప్రతి ద్రవ్యోల్బణం. (దివాలా వల్ల బ్యాంకు ఋణ సరఫరాలో తగ్గుదల లేదా కేంద్ర బ్యాంకు యొక్క ద్రవ్య సరఫరా తగ్గడం)
 • జప్తుకు సంబంధించిన ప్రతి ద్రవ్యోల్బణం (బ్యాంకు పెట్టుబడులను జప్తు చేయడం లేదా స్తంభింపచేయటం. ద్రవ్య సరఫరాలో తగ్గుదల)

ద్రవ్య సరఫరా పక్ష ప్రతి ద్రవ్యోల్బణం[మార్చు]

ద్రవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే, ప్రతి ద్రవ్యోల్బణం ముఖ్యంగా ద్రవ్య వేగంలో లేదా/మరియు సగటుగా ఒక వ్యక్తికి ద్రవ్య సరఫరాలో తగ్గుదల వల్ల ఏర్పడుతుంది.[ఉల్లేఖన అవసరం]

ఋణ ప్రతి ద్రవ్యోల్బణం[మార్చు]

ఆధునిక ఋణ-ఆధారిత ఆర్ధిక వ్యవస్థలలో, (కేంద్ర బ్యాంకు) వడ్డీ రేటు పెంచదాన్ని ప్రారంబించడం వల్ల ప్రతి ద్రవ్యోల్బణ మురి ఏర్పడవచ్చు. (అంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి). దీని ద్వారా, ఒక ఆస్తి బుడగ తయారువచ్చు లేదా సామర్ధ్యానికి మించి ఉత్పత్తి పెరిగి ఉన్న ఒక శాసన ఆర్ధికవ్యవస్థ కూలిపోవచ్చు. ఒక ఋణ-ఆధారిత ఆర్ధికవ్యవస్థలో, ద్రవ్య సరఫరా తగ్గినప్పుడు, ఋణంఇవ్వడం గణనీయంగా తగ్గి, ద్రవ్య సరఫరా ఇంకా వేగంగా తగ్గుతుంది. దీని మూలాన వస్తువులకి గిరాకి తీవ్రంగా తగ్గుతుంది. గిరాకి తగ్గడంతో సరఫరా అపరితముగా పెరిగి ధరలు కూడా తగ్గుతాయి. ఇది ఒక ప్రతి ద్రవ్యోల్బణ మురిగా తయారయి, ధరల తయారి ఖర్చుకంటే తగ్గిపోతాయి. ఎంత ధర తగ్గించినా సరిపోను లాభం రాకపోయేసరికి, వ్యాపారాలు మూతబడుతాయి. బ్యాంకుల ఆస్తుల విలువ, తాకట్టు పెట్టె సమయముతో పోల్చుకుంటే, గణనీయంగా తగ్గిపోతాయి. ఆ ఆస్తులని అమ్మితే, సరఫరా ఇంకా పెరిగి పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఈ ప్రతి ద్రవ్యోల్బణ మురిని ఆపడానికి లేదా వేగాన్ని తగ్గించడానికి, బ్యాంకులు అనేక సార్లు సరిగ్గా రాబడి లేని ఋణాలని తిరిగి వసూళ్లు చేయకుండా నిలిపివేస్తున్నాయి (జపాన్ లో ఈ మధ్య జరిగినట్లు). ఇది కేవలం తాత్కాలిక చర్యే, ఎందుకంటే అప్పుడు ఋణం ఇవ్వడానికి డబ్బు ఉండదు కనుక ఋణాన్ని తగ్గించవలసి ఉంటుంది. దీనివల్ల గిరాకి మళ్ళీ తగ్గుతుంది.

'అధికారిక' ద్రవ్య కొరత యొక్క ప్రభావాలు[మార్చు]

అస్థిరమైన ద్రవ్య ఆర్ధికవ్యవస్థలలో, పరివర్తకం మరియు డాలరైసేషణ్ వంటి ఇతర ప్రత్యామ్నాయ నగదు ఏర్పాటులు సాధారణంగా చేయబడుతాయి. అందువల్ల 'అధికారిక'ద్రవ్యానికి కొరత ఏర్పడినప్పుడు కూడా (లేదా అసాధారణంగా అవిశ్వసనీయంగా ఉన్నప్పుడు), వర్తకం కొనసాగించవచ్చు. (ఉదాహరణకి ఈ మధ్య కాలంలో, రష్యా మరియు అర్జంటినాలో జరిగిన)[ఉల్లేఖన అవసరం] ఎందుకంటే ఇటువంటి ఆర్ధికవ్యవస్థలలో కేంద్ర ప్రభుత్వం, అ ఉద్దేశం ఉన్నా కూడా, సరిగ్గా అంతర్గత ఆర్ధికవ్యవస్థని నియంత్రించలేక పోతాయి. అందువల్ల, అధికారిక ద్రవ్యాన్ని పొందడానికి జనానికి ఏ అవసరము ఉండదు, దిగుమతి చెల్లింపులు తప్ప. ఇటువంటి ఆర్ధికవ్యవస్థలలో, పరివర్తనము ఒక సంరక్షిత సుంకం లాగ వ్యవహరిస్తుంది. అంతర్గత ఉత్పత్తి యొక్క అంతర్గత వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.[ఉల్లేఖన అవసరం] ఇది గనులు మరియు తవ్వడం వంటి కార్యకలాపాలకు ప్రేరణగా ఉంటుంది ఎందుకంటే, ఇటువంటి ఆర్ధికవ్యవస్థలలో డబ్బు సంపాదించడానికి ఒక సులభమైన మార్గం, దాన్ని భూమినుండి తవ్వి బైటకు తీయడమే కాబట్టి.

ప్రత్యేక ఏర్పాటులు (?)[మార్చు]

కేంద్ర బ్యాంకు నామమాత్ర వడ్డీ రేటుని సూన్యానికి తగ్గించిన పిమ్మట, ఇంకా వడ్డీ రేటుని తగ్గించి గిరాకీని ప్రేరేపించడం సాధ్యం కాదు. ఇదే ప్రసిద్ధ ధన వల. ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితి ఉన్నప్పుడు, సూన్యానికి వడ్డీ రేటులో ఋణంఇవ్వడానికి మరియు ద్రవ్య సరఫరాని (కృత్రిమంగా) పెంచడానికి కొన్ని "ప్రత్యేక ఏర్పాటులు" అవసరం. ఈ సూన్యపు వడ్డీ రేటు కూడా అతి ఎక్కువ నిజమైన వడ్డీ రేటుగా ఉంటుంది, ఎందుకంటే సూన్యాని కంటే తక్కువ ద్రవ్యోల్బణ రేటు ఉంటుంది కనుక.

ఋణ ప్రతి ద్రవ్యోల్బణానికి ఉదాహరణలు[మార్చు]

ఈ చక్రాన్ని గ్రేట్ డిప్రెషన్ సమయములో చాల విస్తృతంగా జరిగాయి. అంతర్జాతీయ వర్తకం తీవ్రంగా తగ్గి, సరకులకు గిరాకి తీవ్రంగా తగ్గుతుంది. అందువల్ల ఉత్పత్తి సామర్ధ్యంలో చాల భాగం వాడకుండా ఖాళీగా ఉండి, వరుసగా బ్యాంకు విఫలాలు జరుగుతాయి. 1990 ప్రారంభంలో జపాన్ లో స్టాక్ మార్కెట్ మరియు భూమి మార్కెట్ రెండు కూలిపోయినప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి రాకుండా మరియు అనేక బ్యాంకులు విఫలం కాకుండా, జపాన్ ప్రభుత్వం చాల ఘోరమైన పరిస్థితిలో ఉన్న అనేక సంస్థలని స్వయంగా తమ ఆధీనములోకి తీసుకోవడం వల్ల చేయగలిగింది. ఈ వ్యవహారాలు గురించి తీవ్రమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి.

2000 అనంతరం ఉన్న మాంద్యం సమయములో తీవ్రమైన ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడే ప్రమాదాలు[మార్చు]

2000 అనంతరం ఏర్పడిన మాంద్యం సమయములో అమెరికాలో తీవ్రమైన ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడే ప్రమాదం ఉందని అనేక ఆర్ధికవేత్తలు అభిప్రాయపడ్డారు. అందువల్ల కేంద్ర బ్యాంకైన ఫెడేరల్ రిసర్వ్ 2001 నుండి వడ్డీ రేటులని పెంచకుండా "సర్దుబాటు చేసుకుంటూ" రావడం సరైన చర్యే అని వాళ్లు భావిస్తున్నారు.

ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఎదురుకోవడం[మార్చు]

1930ల వరకు ప్రతి ద్రవ్యోల్బణం అదంతట అదే తగ్గిపోతుందని ఆర్ధికవేత్తలు సాధారణంగా నమ్మేవాళ్లు. ధరల తగ్గినప్పుడు, సహజంగానే గిరాకి పెరుగుతుందని, బైట జోక్యం లేకుండానే ఆర్ధికవ్యవస్థ పరిస్థితిని సరిచేసేస్తుంది.

ఈ అభిప్రాయం 1930 గ్రేట్ డిప్రెషన్ సమయములో వ్యతిరేకించబడింది. ఆర్ధిక వ్యవస్థ అదంటత అదే ప్రతి ద్రవ్యోల్బణాని సరి చేసుకోలేదని, ప్రభుత్వాలు మరియు కేంద్ర బ్యాంకులు పన్ను తగ్గించడం వల్ల కాని ప్రభుత్వ వ్యయం పెంచడం ద్వారా కాని గిరాకీని పెంచడానికి చురుకైన చర్యలు తీసుకోవాలని కేనేశియన్ ఆర్ధికవేత్తలు వాదించారు. కేంద్ర బ్యాంకు యొక్క రిసర్వ్ అవసరాలు ఎక్కువగా ఉండేవి. అప్పుడు రిసర్వ్ అవసరాలని తగ్గించడం ద్వారా మరియు "బయిట" మార్కెట్ కలాపాల (ఉదారహణకు, ప్రభుత్వ ఖజాన పెట్టుబడి పత్రాలని నగదు పెట్టి కొనడం) ద్వారా ఋణంకూలి పోవడం ద్వారా (ఋణంద్రవ్యం యొక్క ఒక రూపం) ప్రైవేట్ రంగంలో ద్రవ్య సరఫరా తగ్గుదలని నివారించవచ్చు.

ద్రవ్య సంబందమైన అభిప్రాయాలు పెరుగుతూ ఉండడంతో, ప్రతి ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి వడ్డీ రేటులని తగ్గించి (అంటే, ద్రవ్యం యొక్క "ఖరీదుని" తగ్గించడం), గిరాకీని విస్తరించడం మీదే దృష్టి పెట్టేవాళ్లు. 1990ల ప్రారంభంలో మరియు 2000-2002లో స్టాక్ మార్కెట్లు కూలిన తరువాత, జపాన్ మరియు USలో చేపట్టిన సర్దుబాటు విధానాలు గిరాకీని పెంచడంలో విఫలమయినప్పుడు ఈ అభిప్రాయానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్తుల ధరల మీద ద్రవ్య విధానాల యొక్క (ద్రవ్యోల్బణ) ప్రభావం గురించి ఆర్ధికవేత్తలు ఇప్పుడు కలత పడుతున్నారు. ఎక్కువ కాలం నిజమైన రేటులు తక్కువగా ఉండటం యొక్క ఫలితం ఏమంటే ఆస్తుల ధరల ఎక్కువ ఉండి, ఋణంఎక్కువగా పెరిగిపోవడమే. అందుకని, రేటులని తగ్గించడం ఒక తాత్కాలిక ఉపశమనమే. దీనివల్ల చివరగా ఋణ ప్రతి ద్రవ్యోల్బణ సంక్షోభానికి దారి తీస్తుంది.

ప్రతి ద్రవ్యోల్బణానికి ఉదాహరణలు[మార్చు]

యునైటెడ్ కింగ్డం[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం సమయములో, సువర్ణ ప్రమాణం నుండి బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ తొలగించబడింది. ఈ విధాన మార్పుకి ప్రేరణ మొదటి ప్రపంచ యుద్ధానికి కావాల్సిన ఖర్చు కోసం; ద్రవ్యోల్బణం మరియు బంగారం ధర పెరగడం, దీని ఫలితాల్లో ఒకటి. దీనితోపాటు పౌండ్ యొక్క అంతర్జాతీయ పరివర్తన రేటు తగ్గింది. యుద్ధం తరువాత, పౌండ్ సువర్ణ ప్రమాణంలో తిరిగి చేరినప్పుడు, అది యుద్ధానికి ముందు నెలకొన్న బంగారం ధర మీద ఆధారపడి ఉంది. అది బంగారం యొక్క తుల్యంశ ధరకంటే ఎక్కువగా ఉండి కనుక, అనుకున్న పౌండ్ యొక్క విలువని అనుగుణంగా ఉండటానికి ధరలు తగ్గించడానికి అవసరం ఏర్పడింది.

UKలో, ప్రతి ద్రవ్యోల్బణం 1921లో సుమారుగా 10%, 1922లో 14%, 1930ల ప్రారంభంలో 3-5%గా ఉండేది.[8]

యునైటెడ్ స్టేట్స్ లో ప్రతి ద్రవ్యోల్బణం[మార్చు]

ప్రధాన ప్రతి ద్రవ్యోల్బణాలు[మార్చు]

యునైటెడ్ స్టేట్స్ లో మూడు ముఖ్యమైన ప్రతి ద్రవ్యోల్బణ దశలు నెలకొన్నాయి.

మొదటిది 1836లో ఏర్పడిన మాంద్యం. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో ద్రవ్యం, గ్రేట్ డిప్రెషన్ లో ఉన్నట్లుగా, 30% క్షీణించింది. ఈ "ప్రతి ద్రవ్యోల్బణం" రెండు నిర్వచనాలని సంతృప్తి చేస్తుంది. అంటే, ధరల్లో తగ్గుదల మరియు అందుబాటులో ఉన్న ద్రవ్య పరిమాణంలో తగ్గుదల.

రెండోది, అంతర్ యుద్ధం తరువాత నెలకొన్నది. దీన్ని కొన్ని సార్లు గ్రేట్ డిఫ్లేషణ్ అని కూడా పిలుస్తారు. ఇది బహూశ సువర్ణ ప్రమాణంలో తిరిగి చేరడం వల్ల అయి ఉండవచ్చు. అంతర్ యుద్దమప్పుడు ముద్రించిన కాగిత ద్రవ్యాన్ని విరమించారు.

1873-96 నాటి గ్రేట్ సాగ్, ఈ జాబితాలో మొదట్లో చేర్చ వచ్చు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అప్పుడు ఖర్చు-తగ్గించే మరియు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే సాంకేతిక అంశాలు వాడబడ్డాయి. ఇది వదలకుండా ఉండి, నిపుణులని కలవరపెట్టింది. దీన్ని పరిష్క రించడానికి కాదు సరి కదా, కేవలం అర్థం చేసుకోవడానికి కూడా రాజకీయవేత్తల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇది ఒక తరానికి సరిపోను పెట్టుబడి పత్రాల విలువని అందించింది. అదే సమయములో ఎప్పటిలాగే చెల్లింపులు ఆగిపోవడం మరియు తొందరగా అప్పుని తిరిగి అడగడం ద్వార అజాగ్రత్తగా ఉన్న ఋణదాతలు నష్టపోయారు. మిల్టన్ ఫ్రీడ్మన్ ప్రకారం, 1875-1896 మధ్య ధరలు యునైటెడ్ స్టేట్స్ లో ఏడాదికి 1.7% మరియు బ్రిటన్ లో ఏడాదికి 0.8% పడిపోయాయి. [2]

మూడో సందర్భము 1930-1933 మధ్య ఏర్పడింది. ప్రతి ద్రవ్యోల్బణం ఏడాదికి సుమారు 10%గా ఉంది. యునైటెడ్ స్టేట్స్ లో కొంత భాగము గ్రేట్ డిప్రెషన్లో మునిగి, బ్యాంకులు విఫలమయి నిరుద్యోగము 25%కు పెరిగింది.

1836లో ఉన్నట్లుగానే, గ్రేట్ డిప్రెషన్ సమయపు ప్రతి ద్రవ్యోల్బణం కూడా ఉత్పత్తిలో హటాత్తుగా ఏర్పడిన పెరుగుదల వల్ల కలగలేదు. దీనికి కారణాలు ఏమంటే, ఋణం (ద్రవ్యం) లో ఏర్పడిన అపరిమతమైన సంగ్రహం, దివాళాలు మూలాన నగదుకు విపరీతమైన గిరాకి ఏర్పడటం మరియు ఫేడేరల్ రిసర్వ్ సరైన చర్యలు తీసుకోకపోవటం మూలాన బ్యాంకులు ఒకటి తరువాత ఒకటి విఫలమవ్వడం (ఎందుకంటే బ్యాంకులు నగదుకు ఏర్పడిన ఆకస్మిక గిరాకిని తట్టుకోలేక - ఫ్రాక్షనల్-రిసర్వ్ బ్యాంకింగ్ చూడండి). ఫిషర్ సమీకరణ ప్రకారం (పైన చూడండి), ఒకే సమయములో ద్రవ్య సరఫరా (ఋ ణం) మరియు ద్రవ్య వేగం రెండూ తగ్గాయి. ఇది ఎంత తీవ్రంగా ఉందంటే, ద్రవ్య సరఫరాని పెంచడానికి ఫెడిరల్ రిసర్వ్ ఎన్ని చర్యలు తీసుకున్నా ధరలో ప్రతి ద్రవ్యోల్బణం గట్టిగా నెలకొన్నది.

స్వల్ప ప్రతి ద్రవ్యోల్బణాలు[మార్చు]

యునైటెడ్ స్టేట్స్ చరిత్ర అంతట, ద్రవ్యోల్బణం సున్నాకి చేరువయి, స్వల్ప కాలాలు సున్నా కంటే క్రిందకు దిగింది (ద్రవ్యోల్బణం సున్నాకి తగ్గుతే ప్రతి ద్రవ్యోల్బణం). 19వ శతాబ్దములో మరియు 20వ శాతాబ్దములో ప్రపంచ యుద్ధం IIకు ముందు ఇది చాల సాధారణంగా ఉండేది.

2007-2010 నాటి ఆర్ధిక సంక్షోభంలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ లో ప్రస్తుతం ప్రతి ద్రవ్యోల్బణం నెలకొని ఉండొచ్చు అని కొందరు ఆర్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారు; ఋణ-ప్రతి ద్రవ్యోల్బణం సిద్దాంతానితో పోల్చండి. వినియోగదారుల ధరలు, ఏడాది-ఏడాదికి ఆగస్టు 2009 వరకు వరుసగా ఆరు నెలలు తగ్గుతూ వచ్చాయి, ముఖ్యంగా శక్తి ధరలు బాగా తగ్గడం వల్ల.[ఉల్లేఖన అవసరం] అక్టోబరు, 2008లో వినియోగదారుల ధరలు 1% తగ్గాయి. 1947 తరువాత, ఇదే USలో అతి పెద్ద ఒక-నెల తగ్గుదల. అ చరిత్ర మల్లి నవంబరు 2008లో, 1.7% తగ్గుదలతో, తిరగ రాయబడింది. దీనికి స్పందిస్తూ, ఫేడేరల్ రిసర్వ్ వడ్డీ రేటులని తగ్గించుకుంటూ పోయి, 2008 డిసెంబరు 16 నాటికి వడ్డీ రేటు సున్నానికి దగ్గిరలోకి చేరింది.[9] 2008 చివరలో మరియు 2009 మొదట్లో, US ప్రతి ద్రవ్యోల్బణ మురిలో అడుగు పెట్టొచ్చని కొందరు ఆర్ధికవేత్తలు భయపడ్డారు.[ఉల్లేఖన అవసరం] యునైటెడ్ స్టేట్స్ ఒక ప్రతి ద్రవ్యోల్బణ మాంద్యంలో అడుగు పెట్టొచ్చని నోరియాల్ రోవ్బిని అనే ఆర్ధికవేత్త చెప్పి, దానికి "స్టాగ్-ప్రతి ద్రవ్యోల్బణం" అని పేరు పెట్టారు.[10] ఇది 2008 వసంతం మరియు వేసవి కాలాలలో పెద్ద భయమైన స్టాగ్ఫ్లేషణ్కు వ్యతిరేకమైనది. తరువాత యునైటెడ్ స్టేట్స్ లో కొలవగలిన ప్రతి ద్రవ్యోల్బణం మొదలయింది. మొదటి సారిగా మార్చిలో -0.38%గా నమోదైన ప్రతి ద్రవ్యోల్బణం, జూలై కల్లా -2.10%కు చేరుకుంది. వేతన విషయంలో, అక్టోబరు 2009లో కోలరాడో రాష్ట్రం, ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉన్న రాష్ట్ర కనీస వేతనాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 1938 తరువాత, ఒక రాష్ట్రం తమ కనీస వేతనాన్ని తగ్గించడం ఇదే మొదటి సారి.[11]

హాంగ్ కాంగ్ లో ప్రతి ద్రవ్యోల్బణం[మార్చు]

1997 చివరిలో నెలకొన్న ఆసియా ఆర్ధిక సంక్షోభం అనంతరం, హాంగ్ కాంగ్లో ఒక దీర్ఘమైన ప్రతి ద్రవ్యోల్బణ దశ మొదలయింది. అది 2004 సంవత్సరపు 4వ త్రైమాసికం వరకు కొనసాగింది.[3] సంక్షోభం తరువాత, అనేక తూర్పు ఆసియా ద్రవ్యాల విలువ తగ్గాయి. హాంగ్ కాంగ్ డాలర్, US డాలర్తో జత చేయబడింది. వినియోదారుల ధరలలో ప్రతి ద్రవ్యోల్బణం ద్వారా ఈ వ్యత్యాసం పూర్తిచేయబడింది. మెయిన్ ల్యాండ్ చైనా నుండి వచ్చిన చౌక వస్తువుల వల్ల మరియు బలహీనమైన వినియోగాదారుల విశ్వాసం వల్ల ఈ పరిస్థితి ఇంకా క్షీణించింది. గిన్నిస్ ప్రపంచ రికార్డ్ ల ప్రకారం 2003లో అతి తక్కువ ద్రవ్యోల్బణం నెలకొన్న దేశం, హాంగ్ కాంగ్. [4]

జపాన్ లో ప్రతి ద్రవ్యోల్బణం[మార్చు]

1990 మొదట్లో ప్రతి ద్రవ్యోల్బణం ప్రారంభమయింది. బ్యాంక్ అఫ్ జపాన్ మరియు ప్రభుత్వం వడ్డీ రేటులని తగ్గించి, దీనిని నివారించడానికి ప్రయత్నించాయి. (వాళ్ల 'పరిమాణ సడలింపు' సిద్ధాంతంలో ఒక భాగం) కాని దశాబ్ద కాలంగా ఇది సఫలం కాలేదు. జూలై 2006లో, సున్నా- రేటు విధానం ముగిసింది.

జపాన్ లో ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడటానికి వ్యవస్థా పరమైన కారణాలలో కొన్ని:

 • తగ్గిన ఆస్తి ధరలు ఈక్విటిలలో మరియు భూమి ధరలలో ఒక పెద్ద ధర బుడగ 1980లలో జపాన్ లో నెలకొన్నది. (1989 చివరిలో ఉచ్చస్తాయికి చేరింది) ఆస్తుల విలువలు తగ్గినప్పుడు, ద్రవ్య సరఫరా తగ్గి, ప్రతి ద్రవ్యోల్బణానికి కారణమైంది.
 • దివాళా తీసిన సంస్థలు: బ్యాంకులు, భూమి మీద పెట్టుబడి పెట్టిన సంస్థలకు మరియు వ్యక్తులకు ఋణాలు ఇచ్చాయి. భూమి ధరలు దగ్గినప్పుడు, ఈ ఋణాలని తిరిగి చెల్లించలేక పోయారు. బ్యాంకులు భూమిని స్వాధీనం తీసుకోవచ్చు కాని అది ఋణానికి పూర్తిగా సరిపోదు. ఆస్తుల ధరలు పెరుగుతాయనే నమ్మకంతో, బ్యాంకులు ఈ నిర్ణయాన్ని వాయిదా వేశాయి. దేశీయ బ్యాంకింగ్ నియమకర్తలు ఈ జాప్యాలని అనుమతించారు. కొన్ని బ్యాంకులు ఋణాన్ని తిరిగి ఇవ్వలేని సంస్థలకు ఇంకా ఎక్కువ ఋణాలని ఇస్తాయి. ఇలాగ కొనసాగుతున్న ప్రక్రియని "రాబట్టలేని నష్టాలని" కొనసాగించడమని పిలుస్తారు. ఈ ఆస్తులని పూర్తిగా మళ్ళీ విలువ కట్టి అమ్మే వరకు (నష్టాన్ని రాబట్టిన తరువాత), అది ఆర్ధిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ శక్తిగా కొనసాగుతుంది. ఈ ప్రక్రియని వేగవంతం చేయడానికి మరియు ఈ ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఆపడానికోసం దివాళా చట్టాలని, భూమి బదిలీ చట్టాలని మరియు పన్ను చట్టాలని మెరుగుపరుచాలని ది ఎకానమిస్ట్ సూచించింది.
 • దివాళా తీసిన బ్యాంకులు: "ప్రదర్శన-లేని" ఋణాలు, అంటే చెల్లింపులు లేని ఋణాలు (కాని ఇంకా వదిలేయని ఋణాలు) ఎక్కువుగా ఉన్న బ్యాంకులు, ఇంకా ఋణాలు ఇవ్వలేవు; అవి, చెడ్డ ఋణాల వల్ల ఏర్పడిన నష్టానికి బదులు నగదు రిసర్వ్ ని పెంచుకోవాలి.
 • దివాళా తీసిన బ్యాంకుల భయాలు: బ్యాంకులు విఫలమౌతాయని భయపడి జపాన్ ప్రజలు, బ్యాంక్ ఖాతాలో తమ డబ్బుని జమ చేయడానికంటే బంగారం లేదా (యునైటెడ్ స్టేట్స్ లేదా జపాన్ యొక్క) ప్రభుత్వ ఖజాన పత్రాలని కొనడానికే ఇష్టపడుతారు. దీనివల్ల ఋణం ఇవ్వడానికి మరియు ఆర్ధిక అభివృద్ధికు డబ్బులు ఉండవు. డబ్బు ఆదా చేయడం వల్ల వినియోగం తగ్గుతుంది కాని అ డబ్బు ఆర్ధిక వ్యవస్థలో కొత్త పెట్టుబడిని ప్రోత్సాహించడానికి సరైన రూపంలో రావు. భూమిని సొంతం చేసుకోవడం వల్ల కూడా జనం ఆదా చేస్తారు. దీనివల్ల భూమి ధర పెరిగి, అభివృద్ది తగ్గుముఖం పట్టుతుంది.
 • దిగుమతి చేసిన ప్రతి ద్రవ్యోల్బణం: చైనా మరియు ఇతర దేశాలనుండి జపాన్ చౌకైన వినియోగ వస్తువులు, ముడి పదార్ధాలని దిగుమతి చేస్తుంది (తక్కువ వేతనము మరియు వేగవంతమైన అభివృద్ది మూలాన). అందువల్ల, దిగుమతి చేసిన వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. దేశీయ ఉత్పత్తిదారులు, పోటిలో ఉండటానికి, ఈ ధరలకు సరిపోయే విధంగా తమ ధరలని తగ్గించాలి. దీనివల్ల ఆర్ధికవ్యవస్థలో అనేక వస్తువల ధరలు తగ్గి, ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, నవంబరు 2009లో జపాన్ ప్రతి ద్రవ్యోల్బణ దశకు చేరింది. బ్లూమ్బెర్గ్ L.P. అక్టోబరు 2009లో వినియోగదారుల ధరల, దాదాపు ఒక రికార్డ్ అయిన 2.2% తగ్గాయి.[12]

ఐర్లాండ్ లో ప్రతి ద్రవ్యోల్బణం[మార్చు]

జనవరి 2009లో దేశంలో ధరలు, 2008 నాటితో పోలిస్తే, 0.1% తగ్గి ప్రతి ద్రవ్యోల్బణం నెలకొందని ఫిబ్రవరి 2009లో ఐర్లాండ్ యొక్క సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రకటించింది. 1960 తరువాత ఐర్లాండ్ ఆర్ధిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణం నెలకొనడం ఇదే మొదటి సారి. మొత్తం వినియోగ ధరలు నెలలో 1.7% తగ్గాయి.[13]

RTÉ రేడియోకు ఇచ్చిన ఒక భేటిలో ఐర్లాండ్ ఆర్ధిక మంత్రి బ్రియాన్ కేనిహాన్ ప్రతి ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావించారు. RTÉ ప్రకారం, "శిశు సంక్షేమం, ప్రభుత్వ రంగ వేతనం మరియు వృత్తిపరమైన ఫీజులలో బడ్జెట్ కోతని నిర్ణయించినప్పుడు, ప్రతి ద్రవ్యోల్బణం గురించి ఆలోచించాలని ఐర్లాండ్ ఆర్ధిక మంత్రి బ్రియాన్ కేనిహాన్ చెప్పారు. ఈ సంవత్సరం జీవన ఖర్చు నేల-నెల మీద 6.6% తగ్గిందని లేనిహాన్ చెప్పారు."

ఈ భేటి ముఖ్యమైనది ఎందుకంటే ప్రతి ద్రవ్యోల్బణం గురించి చెప్పినప్పుడు దాన్ని మంత్రి ఒక చెడుగా సూచించలేదు. కొన్ని ఉఫహారాలకు కోత విధించినప్పుడు ప్రతి ద్రవ్యోల్బణాన్ని కూడా ఒక సమాచారం లాగ తీసుకుంటూ మంత్రి వాదించారు. ప్రతి ద్రవ్యోల్బణం యొక్క చెడు ఆర్ధిక ప్రభావం అని చెప్పబడుతున్న విషయాన్ని ఈ ప్రభుత్వ సభ్యుడు అసలు సూచించలేదు. ఒక పెద్ద ఆర్ధిక మంత్రి ప్రతి ద్రవ్యోల్బణాన్ని గురించి మాట్లాడుతూ, దాన్ని ఏ విధంగా తప్పించాలో అనే విషయం గురించి మాట్లాడకుండా ఉండటం ఈ ఆధునిక కాలములో ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా తీసుకుంటారో అనేదానికి ఒక ఉదాహరణ.[14]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఉపప్రమాణాలు[మార్చు]

 1. రాబర్ట్ J. బారో మరియు విట్టోరియో గ్రిల్లి (1994), యూరోపియన్ మాక్రో ఎకనామిక్స్ , చాప్. 8, p. 142. ISBN 9057024071
 2. Sullivan, Arthur (2003). Economics: Principles in action. Upper Saddle River, New Jersey 07458: Pearson Prentice Hall. p. 343. ISBN 0-13-063085-3. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 3. [10] ^ హుమ్మల్, జేఫ్ఫ్రీ రోజర్స్. "డెత్ అండ్ టాక్సస్, ఇంక్లుడింగ్ ఇంఫ్లేషన్: ది పబ్లిక్ వెర్సస్ ఏకనామిస్ట్స్" (జన 2007). [1]
 4. ఫెడేరల్ రిసర్వ్ బ్యాంక్ అఫ్ మిన్నేపోలిస్ కు చెందిన అండ్రూ అట్కేసన్ మరియు పాట్రిక్ J. కేహో డిఫ్లేషన్ మరియు డిప్రెషన్: ఈస్ దేర్ యన్ ఏమ్పిరికల్ లింక్?
 5. ది ఆస్ట్రియన్ థియరీ ఆఫ్ ది ట్రేడ్ సైకిల్ - లుడ్విగ్ వాన్ మిసెస్ pg 40-45
 6. డిఫ్లేషన్: మేకింగ్ షూర్ "ఇట్" దసింట్ హప్పెన్ హియర్ నేషనల్ ఎకనామిస్ట్స్ క్లబ్, వాషింగ్టన్, D.C. ముందు నవంబర్ 21, 2002 నాడు గవర్నర్ బెన్ S. బెర్నంకే యొక్క విమర్శలు.
 7. ప్రతి ద్రవ్యోల్బణ మురి గురించి ప్రొఫ్. క్రుగ్మన్
 8. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ త్రైమాసిక ద్రవ్యోల్బణ నివేదిక ఫిబ్రవరి 2009 p33 చార్ట్ A
 9. http://www.federalreserve.gov/newsevents/press/monetary/20081216b.htm FRB: పత్రికా విడుదల
 10. http://www.forbes.com/2008/10/29/stagnation-recession-deflation-oped-cx_nr_1030roubini.html గెట్ రెడీ ఫర్ 'స్తాగ్-డిఫ్లేషణ్'
 11. అల్దో స్వల్ది వ్రాసిన కలోరాడో మినిమం వెజ్ సెట్ టు ఫాల్, ది డెన్వర్ పోస్ట్, 10/13/2009
 12. జపాన్ రిలీసస్ స్టిములస్ పాకేజ్ అస్ రికవరీ వీకన్స్ (అప్డేట్3)
 13. RTÉ న్యూస్ - డిఫ్లేషన్ హిట్స్ ఎకానామి; 1స్ట్ టైం ఇన్ 49 యియర్స్
 14. RTÉ న్యూస్ - డిఫ్లేషన్ ఎ ఫాక్టర్ ఇన్ బడ్జెట్ కట్స్ - లేనిహన్
 • బెన్ S. బెర్నంక్. డిఫ్లేషన్: మేకింగ్ షూర్ "ఇట్" డసంట్ హేప్పెన్ హియర్. USA ఫెడేరల్ రిసర్వ్ బోర్డ్. 2002-11-21. రూపొందించబడింది 2008-09-24. (వెబ్సైటు http://www.webcitation.org/5bdTTiZhUలో పెట్టబడింది)
 • మైకేల్ బోర్దో & ఆంధ్రూ ఫిలర్దో, డిఫ్లేషన్ అండ్ మానిటరి పాలిసి ఇన్ ఎ హిస్టోరికల్ పెర్స్పెక్టివ్: రేమేమ్బెరింగ్ ది పాస్ట్ ఆర్ బెయింగ్ కన్డెండ్ టు రిపీట్ ఇట్?, ఎకనామిక్ పాలిసి లో, అక్టోబరు 2005, pp 799–844.
 • జార్జ్ ఏర్బర్, ది రిస్క్ అఫ్ డీఫ్లేషన్ ఇన్ జర్మనీ అండ్ ది మానిటరి పాలిసి అఫ్ ది ECB.: సెసిఫో ఫోరం 4 లో (2003), 3, pp 24–29
 • చార్ల్స్ గుడ్హార్ట్ మరియు బోరిస్ హోఫ్మంన్, డిఫ్లేషన్, క్రెడిట్ అండ్ అసెట్ ప్రైసస్ :డిఫ్లేషన్ - కరంట్ అండ్ హిస్టోరికల్ పెర్స్పేక్టివ్స్, eds. రిచర్డ్ C. K. బర్డేకిన్ & పియరీ L. సిక్లోస్, కేంబ్రిడ్జ్ యునివర్సిటి ప్రెస్, కేంబ్రిడ్జ్, 2004.
 • ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్, డిఫ్లేషన్: డిటర్మీనన్ట్స్, రిస్క్స్, అండ్ పాలిసి ఆప్షన్స్ - ఫైన్డిన్గ్స్ ఆఫ్ యన్ ఇండిపెండెంట్ టాస్క్ ఫోర్స్, వాషింగ్టన్ D. C., ఏప్రియల్ 30, 2003.
 • ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్, వరల్డ్ ఎకనామిక్ ఔట్లూక్ 2006 - గ్లోబలైసేషన్ అండ్ ఇంఫ్లేషన్, వాషింగ్టన్ D. C., ఏప్రిల్ 2006.
 • ఒత్మార్ ఇస్సింగ్, ది యూరో ఆఫ్టర్ ఫోర్ యియర్స్ : ఇస్ తెర ఎ రిస్క్ ఆఫ్ దేఫ్లేషన్?, 16థ్ యురోపియన్ ఫైనాన్స్ కన్వెన్షన్, 2002 డిసెంబరు 2, లండన్, యూరోపైస్చే సెంట్రల్బ్యాంకు, ఫ్రాంక్ఫర్ట్ అం మెయిన్
 • పాల్ క్రుగ్మన్, ఇట్స్ బాఆఆక్ : జపాన్స్ స్లంప్ అండ్ ది రిటుర్న్ ఆఫ్ ది లిక్విడిటి ట్రాప్, : బ్రూకింగ్స్ పేపర్స్ ఆన్ ఎకనామిక్ అక్టివిటి 2, (1998), pp 137–205
 • స్టీవెన్ B. కామిన్, మేరియో మరజి & జాన్ W. స్కిండ్లర్, ఈస్ చైనా "ఏక్ష్పోర్టింగ్ డిఫ్లేషన్"?, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ డిస్కషన్ పేపర్స్ No. 791, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ది ఫేడేరల్ రిసేర్వ్ సిస్టం, వాషింగ్టన్ D. C. జనవరి 2004.

వేలుపరి వలయాలు[మార్చు]