ప్రత్యక్ష దైవం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రత్యక్ష దైవం
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.శంకర్
తారాగణం లత,
జయచిత్ర,
చంద్రకళ,
ఫటాఫట్ జయలక్ష్మి,
నగేష్,
నంబియార్
నిర్మాణ సంస్థ సుబ్బు ప్రొడక్షన్స్
భాష తెలుగు

ప్రత్యక్ష దైవం అదే పేరుతో వెలువడిన మలయాళ సినిమాకు తెలుగు డబ్బింగ్ చిత్రం.

సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధ్యదైవంగా పూజిస్తూ, ఆయన వర ప్రసాదం వల్ల కుమారుని పొందాలని కలలు కనే భక్తురాలికి దుష్టుడు, స్మగ్లర్, నాస్తికుడు అయిన భర్త లభిస్తాడు. అతనిలో మార్పు తేవాలని ప్రయత్నించిన ఆ స్త్రీ భర్తకే దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా దైవం ఆమెను అనుగ్రహిస్తాడు.ఆమెకు వరప్రసాది అయిన కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారస్వామి తన లీలలతో విచ్ఛిన్నమైన ఆ కుటుంబాన్ని మళ్ళీ కలుపుతాడు. అదే విధంగా వివిధ ప్రాంతాలలో భక్తులు కుమారస్వామిని ఆరాధించి తరించిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించారు. విజ్ఞానశాస్త్రం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో దేవుడు వచ్చి మనుషులను కాపాడడం అసంభవమని నమ్మే ఒక డాక్టరు ప్రమాదవశాత్తు తన చూపును కోల్పోయి దైవప్రార్థనతో తిరిగి తన చూపు మళ్ళీ రావడంతో అతడు కూడా కుమారస్వామి భక్తుడౌతాడు. సింగపూర్, మలేషియా, సిలోన్ వంటి దేశాలలోని అందమైన దృశ్యాలు, పెక్కు పుణ్యక్షేత్రాలు ఈ సినిమాలో చూపించారు[1].

మూలాలు

[మార్చు]
  1. గాంధి (21 January 1979). "చిత్రసమీక్ష - ప్రత్యక్షదైవం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంపుటి 286. Retrieved 8 December 2017.[permanent dead link]