వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15: పంక్తి 15:
===గింజలనుండి నూనెను తీయువిధానము===
===గింజలనుండి నూనెను తీయువిధానము===


నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనె తీయు యంత్రాల ద్వారా, సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు<ref>http://www.plasmaneem.com/neem-oil-extraction.html</ref>. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరుల ద్వారా కోల్డ్ ప్రెస్సింగ్<ref>http://www.essentialoils.co.za/neem-oil-extraction.htm</ref> (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్‌ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా ఉన్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె ఉండి పోవును. సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేప పళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె ఉండును. పళ్లను నేరుగా గానుగ ఆడిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును.వేపపిండి లో 6-8% వరకు నూనె ఉండిపోవును. ఇలా ఉండిన నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. పిక్కలో అయినచో 45% వరకు నూనె ఉండి,35-37% వరకు నూనెను పొందవచ్చును.
నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనె తీయు యంత్రాల ద్వారా, సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు<ref>{{citeweb|url= http://www.plasmaneem.com/neem-oil-extraction.html|title=Pure Neem oil extraction methods|publisher=www.plasmaneem.com/|date=accessdate=6-2-2014}}</ref>. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరుల ద్వారా కోల్డ్ ప్రెస్సింగ్<ref>{{citeweb|url=http://www.essentialoils.co.za/neem-oil-extraction.htm|title=
Extraction of Neem oil|publisher=www.essentialoils.co.za/|date=accessdate=6-2-2014}} </ref> (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్‌ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా ఉన్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె ఉండి పోవును. సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేప పళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె ఉండును. పళ్లను నేరుగా గానుగ ఆడిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును.వేపపిండి లో 6-8% వరకు నూనె ఉండిపోవును. ఇలా ఉండిన నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. పిక్కలో అయినచో 45% వరకు నూనె ఉండి,35-37% వరకు నూనెను పొందవచ్చును.


===నూనె===
===నూనె===

12:45, 6 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

ఎక్సుపెల్లరు(నూనెతీయు యంత్రం)ద్వారా తీసిన వేప నూనె

వేప గింజల నుండి నూనె ను తీయుదురు. ఇది శాక తైలం (vegetable oil). వంటనూనె కాదు. పారిశ్రామికంగా వినియోగిస్తారు. వేపచెట్టు మెలియేసి కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్రనామం:అజాడిరక్టా ఇండికా(azadirachta indica)[1] .ఈ చెటు యొక్క పుట్టుక స్థానంభారతదేశం.వేప ఉష్ణ మండలప్రాంతంలో పెరుగు సతతహతిత వృక్షం. 4 వేలసంవత్స్రాలనుండియే ఆయూర్వేదవైద్య ప్రక్రియలో వాడబడుచున్నది.వేపచెట్టు యొక్క బెరడు,ఆకులు,వేరు పుష్కలంగా ఓషధి గుణాలను కలిగివున్నది[2].

వేపపండ్లు

వేప చెట్టు
వేప పువ్వు
వేప పండ్లు.
వేప గింజలు.

పూలు : చిన్నవిగా,తెల్లగా,గుత్తులుగా పూయును. పూత సమయం జనవరి నుండి ఏప్రిలు నెలవరకు.

ఎదిగినచెట్టు నుండి ఏడాదికి 50-60 కె.జి.ల వేపపండ్లు లభించును. 3-4 సంవత్సరాలకే పుష్పించడం మొదలైనప్పటికి, పళ్లదిగుబడి 7 సం.ల నుండే ప్రారంభమగును. వేపకాయలు మే-ఆగస్టుకల్లా పక్వానికి వచ్చును. పండులో విత్తనశాతం 4:1 నిష్పత్తిలో వుండును. ఎండిన వేప పండులో నూనె 20-22% ఉండును. ఎండినపండు (dry fruit)లో పిక్క 23-25%, పిక్క(kernel)లో నూనెశాతం 45% ఉండును. పండు పైపొర (epicarp) 4.5%, గుజ్జు (mesocarp) 40%, గింజపెంకు (husk/shell)15-20% వరకు ఉండును. వేపనూనెలో 'అజాడిరక్టిన్‌' (Azadirachtin) అను ట్రిటెరిపెంటెన్ 0.03-0.25% (32-2500 ppm) ఉండును. పళ్ళు 1-2 సెం.మీ. పొడవులో దీర్ఘ అండాకారంగా ఉండును. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో ఉండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి ఉండును. వేపగింజలోని విత్తనం/పిక్క(kernel)బ్రౌనురంగులో ఉండును. విత్తనసేకరణ ఉత్తరభారతదేశంలో జూను-జులై లలో, దక్షిణభారతదేశంలో మే-జూను లలో చేయుదురు[3].

గింజలనుండి నూనెను తీయువిధానము

నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనె తీయు యంత్రాల ద్వారా, సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు[4]. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరుల ద్వారా కోల్డ్ ప్రెస్సింగ్[5] (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్‌ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా ఉన్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె ఉండి పోవును. సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేప పళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె ఉండును. పళ్లను నేరుగా గానుగ ఆడిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును.వేపపిండి లో 6-8% వరకు నూనె ఉండిపోవును. ఇలా ఉండిన నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. పిక్కలో అయినచో 45% వరకు నూనె ఉండి,35-37% వరకు నూనెను పొందవచ్చును.

నూనె

విత్తనముల నుండి తీసిన నూనె ముదురు ఎరుపుగా లేదా పచ్చని ఛాయ ఉన్న ఇటుక పొడుము రంగులో కాని ఉండి, ఘాటైన వాసన కల్గి ఉండును. వేపనూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన మిరిస్టిక్‌, పామిటిక్, స్టియరిక్‌ ఆమ్లాలు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలైన ఒలిక్‌, లినొలిక్‌ ఆమ్లాలు ఉన్నాయి. నూనెలో ఉన్న అజాడిరిక్టిన్ కారణంగా వంటనూనెగా ఉపయుక్తం కాదు.

'వేపనూనెలోని కొవ్వుఆమ్లాల పట్టిక'

కొవ్వు ఆమ్లం పేరు శాతం
మిరిస్టిక్ ఆమ్లం 2.6%
పామిటిక్‌ ఆమ్లం 1 6-18%
స్టియరిక్ ఆమ్లం 1 4-19%
ఒలిక్ ఆమ్లం 45-58%
లినొలిక్ ఆమ్లం 7-15%

'వేపనూనె భౌతికధర్మాల పట్టిక'

భౌతికధర్మం మితి
తేమ,మలినాలు 1% వరకు
వక్రీభవన గుణకం 1.4615-1.4705/400C
సాంద్రత 0.908-0.934/300C
ఐయోడిను విలువ 65-80
సపొనిఫికెసను విలువ 175-205
అన్‌సపొనిఫియబుల్‌ పదార్థము 2%గరిష్టంగా
టైటరు 35.80C

వేపనూనెలో ఇంకను స్టెరొలులు (sterols), టెర్పొనొయిడులు (terpenoids), అల్కలైడు (alkalniods)లు, ఫ్లవొనొయిడులు (flavonoids) మరియు గ్లైకొసిడులు (glycosids) ఉన్నాయి.

  • అయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన(గ్రహింపబడిన) అయోడిన్ గ్రాముల సంఖ్య. ప్రయోగ సమయంలో నూనెలోని,కొవ్వు ఆమ్లాల ద్విబంధంవున్న కార్బనులతో అయోడిన్ సంయోగం చెంది, ద్విబంధాలను తొలగించును. అయోడిన్‌ విలువ నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాల ఉనికిని తెలుపును. నూనె అయోడిన్‌ విలువ పెరుగు కొలది, నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం పెరుగును.
  • సపొనిఫికెసన్‌విలువ: ఒక గ్రాము నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలన్నింటిని సబ్బుగా(సపొనిఫికెసను)మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు, మి.గ్రాములలో.
  • అన్‌సపొనిఫియబుల్ మేటరు: నూనెలో ఉండియు, పోటాషియం హైడ్రాక్సైడ్‌తో చర్య చెందని పదార్థములు. ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు(sterols), వర్ణకారకములు(pigments), హైడ్రోకార్బనులు, మరియు రెసినస్(resinous)పదార్థములు.

నూనె ఉపయోగాలు

  • వేపనూనెకున్న ఔషధగుణం కారణంగా, సబ్బుల తయారీలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బు నురుగు ఎక్కువగా ఇచ్చును[6].
  • వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నివారిణిగా పిచికారి చేసి వాడెదరు[7] .
  • ఆయుర్వేద, యునాని మందుల తయారీలో ఉపయోగిస్తారు.
  • కీళ్ళనొప్పుల నివారణకు మర్దన నూనెగా వాడెదరు.
  • పేల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది[8] రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి ఉదయం వరకు ఉంచిన, తలలోని పేలు చనిపోవును.
  • వేప నూనెను ప్రస్తుతం ఎక్కువగా క్రిమి సంహారకం గా వాడుతున్నారు. రైతులు తమ పంటలపై చీడ పీడల నివారణకు వేప నూనె ఆధారిత మందులను వాడు తున్నారు. దీనిని ప్రభుత్వం కూడ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. దీనివలన పర్యావరణానికి ముప్పు ఉండదు. భూమి, జల వనరులు కలుషితం కావు. ఇటు వంటి మందులు వాడిన ఆహార పంటల వలన ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు[9] .
  • నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలాలకు,వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
  • నూనె తీసిన వేపచెక్క (oil cake) ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లెదరు. నూనె తీసిన చెక్కలో 5.2-5.6 వరకు నత్రజని ఉన్నది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% ఉన్నది.

ఇవికూడా చూడండి

మూలాలు/ఆధారాలు

  1. "Neem". accessdate=6=2=2014. {{cite web}}: Check date values in: |date= (help); Missing pipe in: |date= (help); Text "http://www.allayurveda.com/" ignored (help); Text "publisher" ignored (help)
  2. "The Neem Tree". www.organeem.com/. accessdate=6-2-2014. {{cite web}}: Check date values in: |date= (help); Missing pipe in: |date= (help)
  3. SEA,HandBook-2009,By TheSolvent Extractors' Association of India
  4. "Pure Neem oil extraction methods". www.plasmaneem.com/. accessdate=6-2-2014. {{cite web}}: Check date values in: |date= (help); Missing pipe in: |date= (help)
  5. "Extraction of Neem oil". www.essentialoils.co.za/. accessdate=6-2-2014. {{cite web}}: Check date values in: |date= (help); Missing pipe in: |date= (help)
  6. Chemical characteristics of toilet soap prepared from neem ,(Azadirachta indica A. Juss) seed oil ,E. E. Mak-Mensah٭ and C. K. Firempong
  7. http://www.organeem.com/neemoilitsuses.html
  8. http://www.stylecraze.com/articles/amazing-benefits-of-neem-oil-for-skin-and-hair/
  9. http://www.indiamart.com/dkcorporation/neem-oil.html
"https://te.wikipedia.org/w/index.php?title=వేప_నూనె&oldid=1017371" నుండి వెలికితీశారు