91,609
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
}}
హిందువులు [[మాఘ శుద్ధ సప్తమి]] రోజున '''రథసప్తమి''' [[పండుగ]] జరుపుకుంటారు. [[దక్షిణ భారతము]] నందు ఈరోజున [[మకర సంక్రాంతి]] పండుగను జరుపుకొందురు.
ఇతర మాసములలోని [[సప్తమి]] తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది.
==కాల నిర్ణయం==
==విధి విధానాలు==
మాఘ శుద్ధ సప్తమి [[సూర్య గ్రహణము]] తో సమానము. ఆరోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు [[జిల్లేడు]] ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.
|