Coordinates: 30°39′N 81°27′E / 30.65°N 81.45°E / 30.65; 81.45

మానస సరోవరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox body of water
{{విస్తరణ}}
{{Infobox lake
| lake_name = Manasarovar<br>Mapam Yumco
| lake_name = Manasarovar<br>Mapam Yumco
| Sanskrit = मानस सरोवरः
| Sanskrit = मानस सरोवरः

14:06, 27 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

మానస సరోవరం
ప్రదేశంTibet
అక్షాంశ,రేఖాంశాలు30°39′N 81°27′E / 30.65°N 81.45°E / 30.65; 81.45
ఉపరితల వైశాల్యం410 km2 (160 sq mi)
గరిష్ట లోతు90 m (300 ft)
ఉపరితల ఎత్తు4,590 m (15,060 ft)
ఘనీభవనంwinter
మానస సరోవరపు శాటిలైట్ చిత్రం వెనుక భాగాన రక్షాస్థలం మరియు కైలాశపర్వతం కానవస్తున్నయి.
సరస్సు మరియు టిబెటన్ హిమాలయాలు.

మానసరోవరం (లేక మానస సరోవరము, లేక మానస్) అనేది చైనా (China) కు చెందిన టిబెట్ (Tibet) ప్రాంతంలో గల మంచినీటి సరస్సు (Fresh water lake). ఇది లాసా (Lhasa) నగరానికి 940 కిలోమీటర్ల దూరంలో భారత దేశానికి, నేపాల్ కు చేరువలో ఉన్నది. చైనా లో ఈ సరస్సును మపం యుం (Mapam Yum), మపం యు ట్సొ (Mapam Yu Tso) అనే పేర్లతో పిలుస్తారు.

భౌగోళిక స్వరూపం

మానసరోవరానికి పశ్చిమాన రాక్షస్తల్ అనే ఉప్పు నీటి సరస్సు, ఉత్తరాన హిందువులు శివుని నివాస స్థలంగా భావించే కైలాస పర్వతం ఉన్నవి. ఈ మంచినీటి సరస్సు సముద్రమట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉన్నది. 88 మీటర్ల చుట్టుకొలత, 300 అడుగులు లోతు, 320 చరదరపు కిలోమీటర్ల ఉపరితలము కలిగియున్న మానసరోవరం గంగా చు (Ganga Chu) చానల్ ద్వారా రాక్షస్తల్ సరస్సుకి అనుసంధానమైయున్నది. ఈ ప్రాంతంలో ఎండాకాలం మే నెల నుండి ఆగష్టు నెల వరకూ ఉంటుంది. ఎండాకాలం (Summer)లో గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. ఋతుపవనాలు (Monsoons) సెప్టెంబరు నెల నుండి నవంబరు నెల వరకూ ఉంటాయి. చలికాలం (Winter)లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుండి -15 డిగ్రీల మధ్య ఉంటుంది. అతి శీతలమైన ఈ సరస్సు ప్రాంతంలో ఎక్కడ చూచినా కొండలు, బండ రాళ్ళు, అక్కడక్కడా చిన్నపాటి గడ్డి జాతి మొక్కలు మాత్రమే కనిపిస్తాయి.

సాంస్కృతిక ప్రాధాన్యం

సంస్కృతములో మానస అనగా మనసు, సరోవరము అనగా సరస్సు. పూర్వ కాలములో భారత దేశం, టిబెట్, నేపాల్ సరిహద్దులతో నిమిత్తం లేకుండా కలిసియుండేవి. అందువలన మానసరోవరము భారతీయులకు, నేపాలీలులకు, టిబిటియన్లకు పవిత్ర స్థలమైయున్నది., అనగా హిందువులకు, బౌద్ధులకు, జైనులకు మనసరోవరం పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ఆలోచననుండి మానసరోవరం ఆవిర్భవించి భూమ్మీద పడినది. మానసరోవరంలోని నీరు త్రాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా నేరుగా కైలాసానికి చేరవచ్చని, సరస్సులో స్నానమాడితే నూరు జన్మల వరకూ పాపాలు పరిహారమైపోతాయని , జ్ఞానానికి మరియు అందానికి ప్రతిరూపాలైన హంసలు (Swans) మనసరోవరములో విహరించేవని హిందువులు నమ్ముతారు.

యాత్రలు

చలికాలము లో సరస్సు ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రీకులకు ప్రతికూలంగా ఉంటుంది కనుక యాత్రీకులు (Tourists) సాధారణంగా ఎండాకాలంలోను, ఋతుపవనాల కాలంలోను మనసరోవరాన్ని దర్శిస్తారు. భారత దేశంలో ఉత్తర కాశి నుండి మరియు నేపాల్ లో ఖట్మండు నగరం నుండి ప్రతి సంవత్సరము కైలాస మానసరోవర యాత్రలు జరుగుచున్నవి.

మూలాలు

బయటి లంకెలు