అరిస్టాటిల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి (Script) Duplicate: File:Aristotle with a Bust of Homer.jpgFile:Rembrandt - Aristotle with a Bust of Homer - Google Art Project.jpg Exact or scaled-down duplicate: [[commons::File:Rembrandt - Aristotle with a Bust...
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox_Scientist
{{Infobox_Scientist
|name = అరిస్టాటిల్
|name = అరిస్టాటిల్
|image = Aristotle with a Bust of Homer.jpg
|image = Rembrandt - Aristotle with a Bust of Homer - Google Art Project.jpg
|birth_date = క్రీ.పూ.384
|birth_date = క్రీ.పూ.384
|birth_place = ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరం
|birth_place = ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరం

19:02, 27 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

అరిస్టాటిల్
జననంక్రీ.పూ.384
ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరం
మరణంక్రీ.పూ.322
"యూబోయా" ద్వీపం
జాతీయతగ్రీసు
రంగములుతత్వ శాస్త్రము,రాజనీతి శాస్త్రము,గణిత శాస్త్రము,ఖగోళ శాస్త్రము,జీవ శాస్త్రము
పరిశోధనా సలహాదారుడు(లు)ప్లేటో
డాక్టొరల్ విద్యార్థులుఅలెగ్జాండర్
ప్రసిద్ధిజీవ శాస్త్రపిత

అరిస్టాటిల్ ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్త. ప్లేటో కి శిష్యుడు మరియు అలెగ్జాండర్ కి గురువు. క్రీ.పూ. 384లో గ్రీసు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు.[1]. తండ్రి నికొమేకస్ మేసిడోనియా రాజు అమిన్ టాస్ కొలువులో ఆస్థాన వైద్యుడు. ఈయన భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు.

విజ్ఞాన శాస్త్రంపై అరిస్టాటిల్ ప్రభావం

ప్రాచీన పాశ్చాత్య ప్రపంచంలో అరిస్టాటిల్ ను మించిన మేధావి లేడని ప్రతీతి. విజ్ఞాన రంగంలో అరిస్టాటిల్ స్పృశించని రంగం లేదు. ఖగోళ, భౌతిక, జంతు, వృక్ష, తర్క, తత్వ, నీతి, రాజనీతి, కావ్య, మనస్తత్వ శాస్త్రాలన్నింటినీ అవుపోసన పట్టి వెయ్యికి పైగా గ్రంధాలను రచించాడు. దాదాపు 2000 సంవత్సరాలు అనేక శాస్త్రాలను ప్రభావితం చేసాడు. క్రైస్తవ దేశాలలో సుమారు 1000 సంవత్సరాలు అరిస్టాటిల్ రచనలను పాఠ్యపుస్తకాలుగా ఉపయోగించారు. అతడి రచనలను కాదనడం మతద్రోహంగా పరిగణించేవారు.

విజ్ఞానార్జన, విద్యాబోధన

అరిస్టాటిల్ 17-18 సంవత్సరాల వయసులో ప్లేటో అకాడమీ లో చేరి ప్లేటో కు అత్యంత ప్రియమైన శిష్యుడయ్యాడు.తత్వ శాస్త్రం,రాజనీతి శాస్త్రము,గణిత శాస్త్రము,ఖగోళ శాస్త్రము మొదలైన వాటిని అరిస్టాటిల్ కూకంకషంగా అధ్యయనం చేసాడు. ఊహాగానాల కన్న పరిశోధనల ద్వారా రూఢి అయ్యే వాస్తవాలే విజ్ఞాన శాస్త్ర వికాసానికి దోహద పడాతాయని పదే పదే చెప్పేవాడు. ఆయన ఈ విద్యాలయంలో 20 ఏళ్ళపాటు గడిపాడు. ఆచరణలో కూడా అదే విధంగా ఉండేవాడు. క్రీ.పూ 347 లో ప్లేటో మరణించిన తరువాత ప్లేటో వారసునిగా స్పేయుసిప్పన్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగినది. ఇది నచ్చని అరిస్టాటిల్ హెర్మియన్ రాజ్యానికి వెళ్ళాడు. హిర్మియన్ సోదరిని పెళ్ళి చేసుకున్నాడు.మారిడోనియా రాజైన ఫిలిప్ - హెర్మియన్ ద్వారా అరిస్టాటిల్ ఘనతను విని తన కుమారుడైన అలెగ్జాండర్ కు విద్యా బోధన చేయవలసినదిగా కోరాడు. అరిస్టాటిల్ అందుకు సమ్మతించి అలెగ్జాండర్ కు విద్య నేర్పడం కోసం తన స్వస్థలమైన మాసిడోనియాకు చేరాడు.గురువుగారి పరిశోధనల కోసం అలెగ్జాండర్ ఎంతోమంది సేవకులను, భారీ నిధులను సమకూర్చిపెట్టాడు. క్రీ.పూ. 336లో అలెగ్జాండర్ తండ్రి హత్యానంతరం చదువుకు స్వస్తి చెప్పడంతో మళ్ళీ ఏథెన్స్ చేరుకుని ప్లేటో అకాడమీ కి పోటీగా లైజియం అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, జీవితాంతం బోధన, పరిశోధన, రచనా వ్యాసంగంలోనే గడిపాడు.

పరిశోధనలు

అరిస్టాటిల్ స్పృశించని విషయాలంటూ లేవు కాని "జీవ శాస్త్ర పిత" గా బహళ ప్రాచుర్యం పొందాడు. వివిధ జీవ జాతుల వర్గీకరణ పట్ల ఎక్కువగా శ్రద్ద చూపి - దేహనిర్మాణం, సంతానోత్పత్తి విధానాలు, రక్త గుణాలు, జంతువుల ప్రవర్తన ఆధారంగా వర్గీకరణం చేశాదు. 18 వ శతాబ్దం లో లిన్నెయస్ వర్గీకరణ వచ్చేదాకా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ అరిస్టాటిల్ వర్గీకరణన నే ప్రామాణికంగా తీసుకునేవారు.

భూమి ఆవిర్భావం,పర్వతాలు రూపొందే విధానం గురుంచి కూదా ఈయన విపులంగా చర్చించాడు. ఈ చర్చలో వాస్తవం లేకపోలేదని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆంగీకరిస్తున్నారు.

రచనలు

ఈయన రాసిన "ఆర్గనోన్" సుప్రసిద్ధమైన గ్రంధం. ఇంద్రియాల పరిజ్ఞానం, యోచనా శక్తి, జ్ఞాపక శక్తి, కలలు-మనోగతాలు వీటి ఆధారంగా మనస్తత్వ శాస్త్రాన్ని రూపొందించాడు. ఈయన సుమారు 1000 రచనలు చేసి యుంటారని ప్రతీతి. వీటిలో ఆర్గనోన్,యూడెమన్, ప్రోటిష్టికన్ వంటివి ముఖ్యమైనవి.సృష్టి జ్ఞాన మీమాంస నితి శాస్త్రం ఈయనకు గననీయమైన ప్రతిష్ట తెచ్చి పెట్టింది.

పరిశోధనలలో లోపాలు

  • బరువైన వస్తువు తేలికైన వస్తువు కంటే త్వరగా భూమిని చేరుతుందని చెప్పాడు. ఇది తప్పని గెలీలియో ఋజువు చేశాడు.
  • శూన్య ప్రదేశం సృష్టించడం అసాధ్యమన్నాడు. కాని సాధ్యమేనని తదుపరి తెలిసింది.
  • వస్తువు కదలాలంటె శక్తి అవసరమని మామూలుగా వస్తువు స్థిరంగా ఉంటుందని చెప్పాడు. కాని న్యూటన్ తప్పని ఋజువు చేశాడు.
  • విశ్వానికి భూమి కేంద్రమని, చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి ఉన్నదని చెప్పాడు. కాని ఈ రెండు తప్పే కదా!

ఆరిస్టాటిల్ భావవాదం

ఆరిస్టాటిల్ భావవాద విశ్వాసమైన ఆత్మని నమ్మేవాడు. ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు. పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు.

మరణం

అలెగ్జాండర్ మరణం తర్వాత ఏథెన్స్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని అరిస్టాటిల్ పై దైవద్రోహిగా అభియోగం మోపడంతో తన తల్లి స్వస్థలమైన చాల్సిస్ నగరానికి పారిపోయాడు. అక్కడ ఒక ఏడాది జీవించి అనారోగ్యంతో బాధపడుతూ క్రీ.పూ. 322లో కాలధర్మం చెందాడు.

ఇవి కూడా చూడండి

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు