జాంబవంతుడు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
11 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
[[File:Rama’s allies, from the left, all standing in profile, Sugriva, king of the vanaras, followed by Angada and Jambavan, king of the bears..jpg|thumb|రాముని మిత్రులైన వానర రాజు సుగ్రీవుడు, తరువాత అంగదుడు, చివరన భల్లూక రాజైన జాంబవంతుడు (ఎడమ నుంచి కుడి వైపుకి).]]
'''జాంబవంతుడు''' [[బ్రహ్మ]] ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. [[కృత యుగం]] నుండి [[ద్వాపర యుగం]] వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. [[క్షీరసాగర మధనం]] సమయంలోను, [[వామనావతారం]] సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో [[రాముడు|రాముని]] పక్షాన పోరాడాడు. [[కృష్ణుడు|కృష్ణునికి]] శ్యమంతకమణిని, [[జాంబవతి]]ని ఇచ్చాడు.
 
 
[[రామాయణం]]లో వయోవృద్ధునిగాను, వివేకవంతునిగాను, మహా బలశాలిగాను జాంబవంతుని ప్రస్తావన [[సుందర కాండ]], [[యుద్ధకాండ]]లలో తరచు వస్తుంది. ముఖ్యంగా హనుమంతుని జవ సత్వాలు ఎరిగిన వివేకిగా జాంబవంతుని వ్యక్తిత్వం గోచరిస్తుంది. సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.
 
 
 
 
[[ఇంద్రజిత్తు]] [[బ్రహ్మాస్త్రం]] వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు -
మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం [[విభీషణుడు]], [[హనుమంతుడు]] వెదుకసాగారు. అప్పుడు [[జాంబవంతుడు]] కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో [[వాయువు]]తోనూ, పరాక్రమములో [[అగ్ని]]తోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది [[మృత సంజీవని]], విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.
 
 
 
==వనరులు==
* వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనము – రచన: బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2005)
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1182788" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ