నారింజ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 బైట్‌ను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
చి (Wikipedia python library)
మలబద్ధకం, చాలా రోగాలకు దారి తీస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం స్నానానంతరం రెండు పండ్లను తింటే మలవిసర్జన సులభంగా జరిగిపోతుంది. మలబద్దకం పోతుంది. కేవలం తీపి నారింజ ద్వారా ఉబ్బసాన్ని, శ్వాసనాళ వ్యాధులను వైద్యులు తగ్గిస్తూ ఉంటారు. జీర్ణం కాని కఠిన తిను పదార్ధలను, వేళాపాళా లేకుండా అతిగా తినటం వల్ల, ఈ రోగాలు సంక్రమిస్తుంటాయి. వారికి తేలికగా జీర్ణమయ్యే రోగ నిరోధక శక్తిగల నారింజ పండ్లను ఇస్తే, ఆ రోగాలు ఉపశమిస్తాయి. 'పయోరియా' వంటి దంతవ్యాధులు నారింజ రసాన్ని సేవిస్తే తగ్గిపోతాయి.
నారింజ పండు కఫ, వాత, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది. ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులోఊరించి, ఎండించి, కారం మరియు మెంతి చేరిస్తే, ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది.
నారింజ పళ్ల తొక్కలను నీడలో ఎండ బెట్టి మెత్తగా పొడి చేసి దానిని పెరుగులో కలిపి ముఖానికి లేపనంగా రాసుకొ పది నిముషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే ముఖం మీద ఏర్పడిన మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1189871" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ