నూనెలో సపొనిఫికేసను విలువ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 19: పంక్తి 19:
===రసాయన పధార్దములు===
===రసాయన పధార్దములు===

1. ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం: 35-40 గ్రాం.ల పోటాషియం హైడ్రాక్సైడ్‌ను మొదట 10 మి.లీ.ల డిస్టిల్ వాటరులో కరగించి, దాన్ని ఒకలీటరు ప్యూర్ ఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్యవలెను. గాలి చొరబడని విధంగా బిరడాను బిగించి, వెలుతురు తగలని విధంగా భద్రపరచవలెను.

2. ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణం: ఒక గ్రాం.ఫినాప్తలీన్ పౌడరును 100 మి.లీ.ల ఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్యబడినది.
2. ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణం: ఒక గ్రాం.ఫినాప్తలీన్ పౌడరును 100 మి.లీ.ల ఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్యబడినది.

19:14, 6 జూన్ 2014 నాటి కూర్పు

సపొనిఫికెసన్ ప్రయోగం

సపొనిఫికేసన్ విలువ[1]

ఒకగ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్ (సబ్బుగా మార్చుటకు) చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క భారం, మిల్లి గ్రాములలో ఆ నూనెయొక్క సపొనికెసన్ విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును. అలాగే సంతృప్త, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వివిధ శాతాలలో వుండును. ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలను బట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది. తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.

సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరమగు పరికరాలు

1. B24 మూతి వున్న కొనికల్/ఎర్లెన్మెయిర్ ఫ్లాస్కు,250మి.లీ, కెపాసిటి వున్నది. లేదా 250మి.లీ, రిసివరు ఫ్లాస్కు.

2. B24 కొన్(cone) వున్న రెఫ్లెక్సు (reflux) కండెన్సరు లేదా లెబెగ్ కండెన్సరు.

3. హట్ ప్లెట్ లేదా వాటరుబాత్ లేదా మాంటిల్ హీటరు,

4. అనలైటికల్ బ్యాలెన్సు: 200 గ్రాం.లది.0.01మి.గ్రాం.వరకు తూచ గల్గినది.

5. 50 మి.లీ.ల బ్యూరెట్:0.1మి.లీ. విభజన గీతలు వున్నది.

6. 25 మి.లీ.ల బల్బు పిపెట్.

రసాయన పధార్దములు

1. ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం: 35-40 గ్రాం.ల పోటాషియం హైడ్రాక్సైడ్‌ను మొదట 10 మి.లీ.ల డిస్టిల్ వాటరులో కరగించి, దాన్ని ఒకలీటరు ప్యూర్ ఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్యవలెను. గాలి చొరబడని విధంగా బిరడాను బిగించి, వెలుతురు తగలని విధంగా భద్రపరచవలెను.

2. ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణం: ఒక గ్రాం.ఫినాప్తలీన్ పౌడరును 100 మి.లీ.ల ఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్యబడినది.

3. ప్రమాణీకరించిన హైడ్రొక్లొరిక్ ఆమ్లం: 0.5 (N) నార్మాలిటి వున్నది.

పరీక్షించు విధానం

పరీక్షించవలసిన నూనె/కొవ్వు లోని మలినాలను తొలగించుటకై మొదట ఫిల్టరుపేపరులో నూనెను ఫిల్టరు చెయ్యవలెను. సుమారు 1.5-2.0 గ్రాం.ల నూనె/కొవ్వును కచ్చితంగా తూచి, B24 మూతి గల కొనికల్ ఫ్లాస్కు లేదా ఎర్లెన్‍మెయిర్ ఫ్లాస్కులో తీసుకొనవలెను. దీనికి 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంను పిపెట్ ద్వారా తీసి కలుపవలెను. ఇప్పుడు ఫ్లాస్కును హీటరు మీద వుంచి, ఫ్లాస్కు మూతికి రెఫ్లెక్షు కండెన్సరు అమర్చవలెను. హీటరును ఆన్ చేసి ఒకగంట మించకుండ /లేదా ఫ్లాస్కులోని నూనె ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్‌తో పూర్తిగా సపోనిపికేసను చెందువరకు వేడి చెయ్యవలెను. సపొనిపికెసన్ పూర్తయినప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పారదర్శకంగా, జిడ్డులేకుండ కనిపించును. ఇప్పుడు హీటరును ఆపివేసి, కండెన్సరుపై లోపలి అంచునుండి 10 మి.లీ.ఆల్కహల్‌తో రిన్స్ చెయ్యాలి. ఫ్లాస్కులోని ద్రవానికి కొన్నిచుక్కల ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావాణాన్ని కలపాలి. ఇండికెటరు కలిపిన వెంటనే ఫ్లాస్కులోని ద్రవం పింక్‌రంగులోకి మారును. బ్యూరెట్‌లో 0.5 నార్మాలిటి వున్న పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రవంను నింపి ఫ్లాస్కులోని ద్రవాన్ని టైట్రెసన్ చెయ్యడం ప్రారంభించాలి. బ్యూరెట్‌నుండి ఆసిడ్‌ను చుక్క చుక్కలుగా వదులుతూ, ఫ్లాస్కును కదుపూతూ టైట్రెసన్ చెయ్యవలెను.ఫ్లాస్కును కదపటం వలన ఆసిడ్ ఫ్లాస్కులోని ద్రవం అంతట సమంగా కలిసి చర్య సమానంగా జరుగును. ఇలా టైట్రెసన్ చెయ్యునప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పింక్‌రంగు పోగానే టైట్రెసన్ చెయ్యడం నిలిపివెయ్యాలి. బ్యూరెట్‌లోని రిడింగ్‌ను నమోదు చెయ్యాలి..

బ్లాంక్‍టెస్ట్

250 మి.లీ.ల రిసివరుఫ్లాస్కు తీసుకొని అందులో పిప్పెట్/పిపెట్ ద్వారా తీసిన 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్‌ను వేసి, 2-3 చుక్కల ఫినాప్తలీన్ ఇండికెటరుద్రావణంను కలపాలి.ఇప్పుడు ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లంతో పింక్‌కలరు పోయేవరకు టైట్రెసన్ చెయ్యాలి.పింక్ కలరు పోగానే టైట్రెసన్‌ను ఆపి వేసి బ్యూరెట్ రీడింగ్ నమోదు చేయాలి.ఈ బ్యూరెట్ రిడింగ్ యే బ్లాంక్ టెస్ట్ రిడింగ్ .

కాలిక్యులెసన్/సమీకరణం

'

56.1(B-A)N/W

వివరణ

B=బ్లాంక్‍టెస్ట్ టైట్రెసన్‍లో వాడిన 0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లం.మి.లీ.లలో

A=టెస్ట్ టైట్రెసన్ లో వాడిన 0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లం,మి.లీ.లలో

W=పరీక్షకై తీసుకున్న నూనె భారం.గ్రాములలో.

మూలాలు/ఆధారాలు

  1. Determination of Saponification value.Indian Standard,Methods of Sampling and test for Oils and Fats,IS:548(Part I)-1964
  • B.S.684:1958 Methods of Anylysis Of Oils And Fats.British Standards Institution.