"పాట్నా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
|footnotes =
}}
'''పాట్నా''' [[బీహార్]] రాజధాని నగరం. దీని ప్రాచీన నామం ''పాటలీ పుత్ర''. ప్రస్తుతం ఈ నగరం [[గంగానది]] దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉన్నది. ఇదే నగరంలో కోసీ, సోన్, గండక, పున్‌పున్ అనే నదులు కూడా ఉన్నాయి. 25 కి.మీ పొడవు 9 నుంచి 10 కిమీ వెడల్పు ఉన్నది. భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 14వ స్థానంలో ఉంది.
 
పాట్నా చాలా కాలం నుంచి నిరంతరంగా ప్రజలు నివసిస్తున్నటువంటి నగరంగా పేరు గాంచింది. <ref>[http://www.etext.org/Politics/World.Systems/datasets/citypop/civilizations/citypops_2000BC-1988AD Populations of Largest Cities in PMNs from 2000BC to 1988AD]</ref>
== చరిత్ర ==
పూర్వం ఒకప్పుడు ''పుత్రుడు'' అనే ఒక రాజు, ఆయన భార్య ''పాటలి'' కలిసి ఈ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది.<ref>{{cite web|url=http://www.eslteachersboard.com/cgi-bin/asia/index.pl?read=129 |title=The Emerald Buddha |publisher=Eslteachersboard.com |date= |accessdate=2010-02-01}}</ref>
పూర్వ కాలంలో ఇది హర్యంక, నందులు, మౌర్య వంశం, సుంగ వంశం, గుప్తులు, పాల వంశస్తులు, సూరి వంశస్తులు పరిపాలించిన [[మగధ సామ్రాజ్యం|మగధ దేశపు]] రాజధాని. అంతే కాకుండా ఈ నగరం అనేక కళలకు, విజ్ఞానాన్ని పంచడంలో కూడా మేటిగా విలసిల్లింది. మౌర్యుని కాలంలో ఇక్కడ సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు నివసించేవారు.<ref>Omalley L.S.S., ''History of Magadha'', Veena Publication, Delhi, 2005, pp. 23</ref> ప్రాచీన నగరం ఇప్పుడు ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతోంది.
 
హిందూ, బౌద్ధ, జైన తీర్థయాత్రా స్థలాలైన వైశాలి, రాజ్‌గిర్, నలంద, బుద్ధగయ, పావాపూరి మొదలైన ప్రదేశాలు పాట్నాకు అతి సమీపంలోనే ఉన్నాయి. పాట్నా సిక్కులకు కూడా పవిత్రమైన నగరమే. 10వ సిక్కు గురువైన తక్త్ పాట్నా సాహిబ్ ఇక్కడే జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1191696" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ