మొనగాళ్ళకు మొనగాడు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
19 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (Wikipedia python library)
{{సినిమా|
name = మొనగాళ్ళకు మొనగాడు |
image = TeluguFilm_DVD_Mongallaku_Monagadu.JPG |
year = 1965|

== చిత్రకథ ==
రమేష్ (హరనాథ్) ఒక యవ ఇఇజనీర్. అతనికి ఒక ధనికుని కూతురు (కృష్ణకుమారి) తో పరిచయమై, అది కాస్తా ప్రణయంగా మారుతుంది. రమేష్ దగ్గర ఉన్న ఫాక్టరీ ప్లాన్ అతని ప్రియురాలి తండ్రికి నచ్చుతుంది. ఫ్యాక్టరీ సైట్ కి వెళ్తున్న తోటి ప్రయాణికురాలి పెట్టె రమేష్ పెట్టె మారతాయి. మారిన పెట్టెలో భ్యాంక్ నుండి దోచుకోబడ్డ డబ్బు ఉంది. దానితో రమేష్ ను అరెస్ట్ చేస్తారు. రమేష్ ను జైల్ లోనే చంపాలని కత్తుల రత్తయ్య (ఎస్.వి.రంగారావు) అనే కిరాయి రౌడిని దొంగలముఠా సంప్రదిస్తుంది. రమేష్ ని జైల్ నుండి తప్పించి దొంగల ముఠాతో బేరసారాలు సాగిస్తాడు కత్తల రత్తయ్య. కత్తుల రత్తయ్యపై కొందరు దుండగులు దాడి చేసినప్పుడు రమేష్ ప్రియురాలు అతనికి ప్రాధమిక చికిత్స చేసి, ఊరట కలగ చేస్తుంది. రమేష్ ప్రియురాలు త న చెల్లెలు వంటిదని, రమేష్ ని దొంగల ముఠా బారి నుండి కాపాడతానని కత్తులరత్తయ్య అంటాడు. ప్రకాష్ (బాలయ్య) అనే పోలీస్ అధికారి కత్తల రత్తయ్యని వెంబడిస్తూ రమేష్ ని కలిసి, కత్తల రత్తయ్య మోసగాడని, దొంగల ముఠాతో బేరం కుదిరితే రమేష్ కి ఆపద తలబెడతాడని హెచ్చరిస్తాడు. దొంగలముఠాకి, కత్తుల రత్తయ్యకి మధ్య దోబుచులాట జరుగుతంది. చివరకు ప్రకాష్ దొంగల ముఠానాయకుడని, కత్తుల రత్తయ్య పోలీస్ ఆఫిసర్ అని తెలుస్తుంది. ప్రకాష్ రమేష్ ను,అతని ప్రియురాలిని షీల్డ్ చేసి మోటారు బోట్ లో పారి పోవాలని చూస్తాడు. కానీ, రమేష్, ప్రకాష్ పోటీ బడి బోట్ గమనాన్ని మార్చే ప్రయత్నంలో బోట్ స్టీరింగ్ విరిగి పోతుంది. రమేష్, ప్రియురాలు ఒడ్డుకు చేరతారు. బోట్ కొండని ఢీకొంటుంది. బయటపడ్డ ప్రకాష్నుపోలీసులు అరెస్ట్ చేస్తారు.
== ప్రత్యేకతలు ==
* ఇది మోడరన్ ధియోటర్స్ నిర్మించిన 102 వ సినిమా.

* ఈ సినిమాలో '''వచ్చామే నీకోసం.. మెచ్చామే నీ వేషం''' అనే ఒక ఖవాళి జుగల్ బందీ పాట ఉంది. ఆ పాటను ఎస్.వి.రంగారావు, హర్ నాధ్ లతో నటి సావిత్రి అభినయించారు,

* ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు నటన అమోఘం . కత్తుల రత్తయ్య పచ్చి నెత్తురు తాగుతాడు డైలాగ్ చాలా పాపులర్.

* బాలయ్య పాత్ర పోషణ కూడా ప్రత్యేకంగా పేర్కోనదగినదే.

* మూలంలో దొంగలముఠా నాయకుడి పాత్ర మరణిస్తుంది. తెలుగులో కథను మార్చి పాత్రను బ్రతికించారని బాలయ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

*సినిమా చివరి దాకా కత్తుల రత్తయ్య పోలీస్ ఇన్సెపెక్టర్ అని, ప్రకాష్ దొంగల నాయకుడని ఆలోచన రానీయకుండా సస్పెన్స్ ను కడదాకా కొన సాగించడం గొప్ప విషయం.

* ఒక సారి సినిమా చూసిన తరువాత సస్పెన్స్ విడిపోతుంది. కానీ సినిమా పదేపదే చూడడానికి కూడా బాగుంటుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1203811" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ