శ్రీనివాస కధా సుధాలహరి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
70 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
# శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రం దండకం
# శ్రీనివాసుని జలక్రీడోత్సవము
==కొన్ని పద్యాలు==
<poem>
శా !! శ్రీమద్వేంకట శైలమందు విభవ శ్రీమీరనాంచారియున్
భామారత్నము మంగ మాంబయును సంభావించి సేవింప గా
కామారాతి మహేంద్ర ముఖ్యులు నుతుల్ గావింప భక్తాలికిన్
సేమంబుల్ సమ కూర్చు దేవు గొలుతున్ శ్రీ వెంకటేశ ప్రభున్ ‌!!
 
మ !! ఒక హస్తంబభయం బొసంగ మరి వేరొండొక్క హస్తంబుతో
బ్రకట ఖ్యాతి సముద్ధ రింతు నిదె నా పాదార్చనల్ సేయుడం
చ కలంక స్తితి జూపుచున్ వెలిగె దీ వార్తా వన ఖ్యాతి ,నం
దక చక్రాదుల దాల్చి భక్త వరదాతా ! వెంకటేశ ప్రభూ !!
స్వామీ !
ఎన్ని మారులు చూచిన నే మొగాని
తనివి దీరదు నీ దివ్య దర్శనంబు
చూచినను చూచు చున్నను ,చూడగోరు
చూపుమికెప్పుడు నీ దివ్య రూపమభవ !!
 
దేవాది దేవా !
చ ! ఒకపరి నీయనంత మహిమోజ్వల దర్శన భాగ్య మీశ్వరా
సు కవిత కల్గ జేసి యతి సుందరమౌ భవదీయ తత్వమున్
బ్రకట మొనర్ప జేసె నవ పద్మ దళేక్షణ !సంతతంబు నీ
యకలుష దివ్యనామ జప మద్భుత మెట్టి ఫలంబు లిచ్చు నో !
సీ ! కామించి సుందరాకారముల్ గనగోరు కనులు నిన్ గనుగొన మనసు పడవు
వివిధ దుర్విషయముల్ వినగోరు చెవులు నీ విమల ప్రభావముల్ వినగరావు
సంసార విషయమౌ స్వార్ధ చింతల నుండు చిత్తంబు నీదరి జేరబోదు
కలుష సంకల్ప వికల్ప నిమగ్నమౌ మనము నిన్ ధ్యానింప మరులు కొనదు
</poem>
 
1. శ్రీ శ్రీ వైఖాన సకులాలంకార శ్రీ మద్వైయాకరణ పంచానన విద్వత్కవి సార్వభౌమ పండిట్ R. పార్ధసారధి భట్టాచార్య సెక్రటరీ శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్దనీ సభ.(తిరుపతి) ..శ్రీ వడ్డూరి అచ్యుతరామయ్య గారిని నేను ప్రప్రధమంగా తిరుమలలో కలియుట సంభవించినది. వారు శ్రీ శ్రీ నివాసమూర్తి సన్నిధిలో ఆర్ష సంస్కృతీ సదస్సు వేదిక యందు శ్రీ శ్రీనివాస కళ్యాణము చదివినప్పుడు అచ్చటి శ్రోతలు పలువురితో నేనునూ విని పరమానందము జెందితిని. వారి ఇతర కృతులను కూడా నేను చూచి వారి కవితా ప్రతిభకు కూడా ఆనందము చెందితిని. శ్రీ శ్రీ నివాస ప్రభువు శ్రీ అచ్యుతరామయ్య గారిని అధికమగు భక్తి శ్రద్ధలను, దీర్ఘాయురారోగ్యై స్వర్యములనిచ్చి యనుగ్రహించు గాక యని ప్రార్ధించు చున్నాను. - (Sd) R. పార్ధసారధి అయ్యంగార్., ఆస్తాన విద్వాన్., తిరుమల తిరుపతి దేవస్తానములు. 05.01. 1967.
 
2. కళా ప్రపూర్ణ డాక్టర్ దివాకర్ల వేంకటావధాని, M.A, (ఆనర్స్) P.Hd, శ్రీ వడ్డూరి అచ్యుత రామకవి గారు రచించిన శ్రీ శ్రీనివాస కథాసుధాలహరి అను పద్య కావ్యము ను పఠించి మందానమందితిని. ఇది జగత్ కళ్యాణ సంధాయకుడు, సర్వ జనారాధ్యుడు నైన శ్రీ వేంకటేశ్వరుని వృత్తాంత మగుటచే సుధా లహరి అను నామము సార్ధక మొనరించు చున్నది. కవి గారి పద్యములు కూడా సుధా మధురములై యుండుటచే ఆ నామము సార్ధకత్వమును ద్విగుణీ కృతము గావించుచున్నది. ఈ కథను సూత పౌరాణికుడు, శౌనకాది మహర్షులకు చె ప్పి యుండెను. బ్రహ్మదేవుని ప్రార్ధన ననుసరించి శ్రీ మన్నారాయణుడు శ్రీ వేంకటేశ్వరుని గా శేషాద్రి పై అవతరించెను. భ్రుగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట, ద్వితీయ తరంగమందలి శ్రీ రామకథ, పద్మావతి పూర్వ జన్మ వృత్తాంతములు, తృతీయ తరంగమందలి శ్రీ కృష్ణావతార ఘట్టములు, పద్మావతి శ్రీనివాసుల వివాహ ఘట్టములు మిక్కిలి హ్రుద్యములు గా నున్నవి. కవి గారి వర్ణనలు సహజములును, భావ గంభీరములునైన దృశ్యములను సాక్షత్కరింప జేయుచున్నవి. - డాక్టర్ .దివాకర్ల వేంకటావధాని, హైదరాబాదు ,01.02.198౦.
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1217396" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ