వికీపీడియా:3RR నియమం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎Exceptions: విభాగం అనువాదం పూర్తి
→‎Enforcement: విభాగం అనువాదం పూర్తి
పంక్తి 41: పంక్తి 41:
దుశ్చర్యలు గానీ, కాపీహక్కులు గల టెక్స్టును పదే పదే చేర్చడం వంటి సందర్భాల్లో గానీ తిరుగుసేతల కంటే సభ్యులను నిరోధించడం, పేజీని సంరక్షించడం వంటివి మెరుగైన చర్యలు.
దుశ్చర్యలు గానీ, కాపీహక్కులు గల టెక్స్టును పదే పదే చేర్చడం వంటి సందర్భాల్లో గానీ తిరుగుసేతల కంటే సభ్యులను నిరోధించడం, పేజీని సంరక్షించడం వంటివి మెరుగైన చర్యలు.


==Enforcement==
==అమలు==
మూడు తిరుగుసేతల నియమాన్ని ఉల్లంఘించే సభ్యులను 24 గంటల వరకు, పదే పదే జరిగినపుడు అంతకంటే ఎక్కువ కాలం పాటు [[వికీపీడియా:నిరోధ విధానం|నిరోధించవచ్చు]]. సభ్యునిపై నిరోధాలు పెరిగే కొద్దీ నిరోధ కాలం పెంచుతూ పోతారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఈ నియమాన్ని ఉల్లంఘించినపుడు, నిర్వాహకులు అందరితోటీ ఒకే విధంగా వ్యవహరించాలి.


ఇంకా ఈ నియమాన్ని అమలు చేసే విధానాలివి:
Editors who violate the three-revert rule may be [[Wikipedia:Blocking policy|blocked from editing]] for up to 24 hours, or longer in the case of a repeated violation. Many administrators use escalating block lengths for users with prior violations, and tend to consider other factors, like edit warring on multiple pages or incivility, when assigning a block. In the cases where multiple editors violate the rule, administrators should treat all sides equally.


* ఈ విషయంలో వికీపీడియా విధానాల గురించి తెలియని వారికి తెలియజెప్పడం ద్వారా
Additionally, the rule is enforced by:
* తమ ప్రవర్తనతో సాటి వారికి ఉదాహరణగా నిలవడం ద్వారా

* Educating editors who may not be aware of good Wikipedia practice in the matter
* Peer pressure and leadership by example (see [[Wikipedia:Revert only when necessary]] and [[Wikipedia:Harmonious editing club]])

Apparent breaches of the rule may be reported at [[Wikipedia:Administrators' noticeboard/3RR]].


==I have violated 3RR. What do I do?==
==I have violated 3RR. What do I do?==

08:46, 8 జూన్ 2007 నాటి కూర్పు

ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు చూడండి
సంక్షిప్తంగా ఈ పేజీలోని విషయం: దిద్దుబాటు యుద్ధాలు హానికరం. 24 గంటల వ్యవధిలో, ఒకే పేజీలో, మూడు కంటే ఎక్కువసార్లు దిద్దుబాట్లను వెనక్కు తీసుకెళ్ళే వికీపీడియనులు నిరోధించబడే అవకాశం ఉంది.


మూడు తిరుగుసేతల నియమం (3RR అని అంటూ ఉంటారు) విధానం వికీపీడియనులందరికీ వర్తిస్తుంది. ఇది దిద్దుబాటు యుద్ధాలను నివారించేందుకు ఉద్దేశించబడింది:

ఒక రచయిత ఒక పేజీలో, 24 గంటల వ్యవధిలో, పూర్తిగా గానీ పాక్షికంగా గానీ, మూడు కంటే ఎక్కువ తిరుగుసేతలు చెయ్యరాదు. తిరుగుసేత అంటే వేరే సభ్యుడు చేసిన దిద్దుబాటును రద్దు చేసి, వెనక్కు తీసుకుపోవడం. రద్దు చేసే భాగం ఒకటే కావచ్చు, వేరు వేరైనా కావచ్చు.

అతిక్రమణదారును 24 గంటల పాటు నిరోధించవచ్చు. మళ్ళీ మళ్ళీ చేస్తే ఇంకా ఎక్కువ కాలం పాటు చెయ్యవచ్చు.

ఈ నియమం ఒక రచయితకు అమలౌతుంది. ఒకే వ్యక్తి అనెఖ ఖాతాలు, లేక ఐపీఅడ్రసుల నుండి చేస్తే వాటన్నిటినీ ఒకే రచయిత చేసినవిగానే భావిస్తాం.

ఈ నియమం ఒక పేజీకి అమలౌతుంది. ఒక రచయిత రెండు వేరు వేరు పేజీల్లో చేరో రెండు తిరుగుసేతలు చేసాడనుకుందాం. ఈ రచయిత చేసే పనులు వికీపీడియాకు నిరోధకంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, అవి రెండు వేరు వేరు పేజీల్లో జరిగాయి కాబట్టి 3RR నియమం అమలు కాదు.

అయితే రోజుకు మూడు సార్లు తిరుగుసేతలు చెయ్యొచ్చని ఈ నియమం అనుమతి ఇచ్చినట్లు కాదు. రచయిత చేసిన తిరుగుసేతలు వికీపీడియాకు నష్టకరంగా, అడ్డుకునేలా ఉన్నాయని స్పష్టంగా తెలిస్తే మూడు సార్లకు మించకున్నా నిరోధించవచ్చు. మరీ ముఖ్యంగా తిరుగుసేతలను ఒక ఆటగా చేసేవారికి ఇది వర్తిస్తుంది. ఓసారి నిరోధానికి గురైన వారి విషయంలో నిర్వాహకులు మరింత నిక్కచ్చిగా ఉంటారు. వాళ్ళు మూడు కంటే ఎక్కువ సార్లు తిరుగుసేత చెయ్యకపోయినా, నిరోధానికి గురయ్యే అవకాశం ఎక్కువ. అలాగే, సాంకేతికంగా మూడు కంటే ఎక్కువ సార్లు తిరుగుసేత చేసిన రచయితలను కూడా సందర్భాన్ని బట్టి నిరోధించక పోవచ్చు.

ఏతావాతా తేలిందేమంటే: ఇంగితాన్ని వాడండి, దిద్దుబాటు యుద్ధాల్లో పాల్గొనవద్దు. పదే పదే తిరుగుసేత చేసేకంటే ఇతర రచయితలతో చర్చించండి. వ్యాసం లోని విషయం తిరుగుసేత చేసి తీరాల్సిందే అయితే ఎవరో ఒకరు చేస్తారు — దానివలన సముదాయపు విస్తృతాభిప్రాయం కూడా వెలుగులోకి వస్తుంది. వివాద పరిష్కారం కోసం ప్రయత్నించడమో లేక పేజీ సంరక్షణ కోసం అర్ధించడమో తిరుగుసేత కంటే నయం.

తిరుగుసేత అంటే ఏమిటి?

తిరుగుసేత అంటే, ఇతర సభ్యులు చేసిన దిద్దుబాట్లను పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ రద్దు పరచడం. పేజీలో చేసిన దిద్దుబాట్ల రద్దు, పేజీ తరలింపుల రద్దు, నిర్వాహకత్వానికి సంబంధించిన మార్పుల రద్దు, తొలగించిన పేజీని పదే పదే సృష్టించడం మొదలైనవన్నీ ఈ కోవలోకి వస్తాయి.

అదే దిద్దుబాటును మూడు కంటే ఎక్కువ సార్లు చేస్తేనే ఈ నియమాన్ని అతిక్రమించినట్లు కాదు. 24 గంటల వ్యవధిలో, ఒక పేజీలో ఒక సభ్యుడు చేసిన అన్ని తిరుగుసేతలనూ లెక్కిస్తారు.

ఒక రచయిత వెంటవెంటనే చేసే తిరుగుసేతలన్నిటినీ ఒకే తిరుగుసేతగా ఈ నియమం గుర్తిస్తుంది.

మినహాయింపులు

ఈ నియమం దిద్దుబాటు యుద్ధాలను నివారించేందుకు ఉద్దేశించింది కాబట్టి, యుద్ధాల్లో భాగం కాని తిరుగుసేతలు ఈ నియమాన్ని అతిక్రమించినట్లు కాదు. దిద్దుబాటు యుద్ధాలు అవాంఛనీయం కాబట్టి, మినహాయింపులకు అతి తక్కువ విలువ ఉంటుంది.

ఇతర సభ్యులు చేసిన దిద్దుబాట్ల రద్దునే ఇక్కడ పరిగణించబడతాయి. మీ దిద్దుబాట్లను మీరే రద్దు చేస్తే అవి ఈ నియమం పరిధిలోకి రావు. అలాగే మరికొన్ని సందర్భాల్లో జరిగే తిరుగుసేతలు కూడా ఈ నియమం పరిధిలోకి రావు:

  • పేజీలో కంటెంటును పూర్తిగా తొలగించి వెల్ల వెయ్యడం వంటి స్పష్టంగా తెలిసిపోతూ ఉండే దుశ్చర్యలను తొలగించే సందర్భాల్లో చేసే తిరుగుసేతలు ఈ నియమం పరిధిలోకి రావు. అయితే, దుశ్చర్య చూడగానే ఎవరికైనా స్పష్టంగా తెలిసిపోయే సందర్భాల్లో మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.
  • స్పష్టమైన కాపీహక్కు ఉల్లంఘనలు జరిగినపుడు చేసే తిరుగుసేతలు;
  • జీవించి ఉన్నవారి వగురించి రాసిన వ్యాసాల్లో సరైన ఆధారాలు లేని వివాదాస్పద విషయాల తిరుగుసేతలు;
  • నిరోధాలు, నిషేధాలు ఎదుర్కొంటున్న సభ్యులు దొడ్డిదారిన చేసిన దిద్దుబాట్ల తిరుగుసేతలు;
  • సభ్యుడు/సభ్యురాలు తన సభ్యుని స్థలంలో చేసే తిరుగుసేతలు - అవి కాపీహక్కు ఉల్లంఘనలు, ఇతర వికీపీడియా విధానాల ఉల్లంఘనలు కాకుండా ఉంటేనే.

పై మినహాయింపులు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది కూడా; అంచేత అత్యంత స్పష్టమైన కేసుల్లో మాత్రమే మినహాయింపులను పరిగణిస్తారు. సందేహంగా ఉంటే తిరుగుసేత చెయ్యొద్దు; దాని బదులు, వివాద పరిష్కారం కోసం ప్రయత్నించండి లేదా నిర్వాహకుల సహాయం అడగండి.

దుశ్చర్యలు గానీ, కాపీహక్కులు గల టెక్స్టును పదే పదే చేర్చడం వంటి సందర్భాల్లో గానీ తిరుగుసేతల కంటే సభ్యులను నిరోధించడం, పేజీని సంరక్షించడం వంటివి మెరుగైన చర్యలు.

అమలు

మూడు తిరుగుసేతల నియమాన్ని ఉల్లంఘించే సభ్యులను 24 గంటల వరకు, పదే పదే జరిగినపుడు అంతకంటే ఎక్కువ కాలం పాటు నిరోధించవచ్చు. సభ్యునిపై నిరోధాలు పెరిగే కొద్దీ నిరోధ కాలం పెంచుతూ పోతారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఈ నియమాన్ని ఉల్లంఘించినపుడు, నిర్వాహకులు అందరితోటీ ఒకే విధంగా వ్యవహరించాలి.

ఇంకా ఈ నియమాన్ని అమలు చేసే విధానాలివి:

  • ఈ విషయంలో వికీపీడియా విధానాల గురించి తెలియని వారికి తెలియజెప్పడం ద్వారా
  • తమ ప్రవర్తనతో సాటి వారికి ఉదాహరణగా నిలవడం ద్వారా

I have violated 3RR. What do I do?

If you have broken 3RR by mistake and now realize it, or if another user has left you a note on your talk page that points out that you broke 3RR, then you should revert your change back to the "other version," even though you may not like the previous version. In general, this should be enough to prevent you from being blocked, although there are no guarantees. If you seem to be the only person who feels that the article should be the way that you have made it, perhaps it is better the way everyone else thinks it should be.

Notes

See also