బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21: పంక్తి 21:
[[వర్గం:1920 జననాలు]]
[[వర్గం:1920 జననాలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:సంపాదకులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]

06:24, 8 ఆగస్టు 2014 నాటి కూర్పు

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకులు మరియు ఉపన్యాసకులు.

వీరు 1920 జూన్ 28 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అళహా సింగరాచార్యులు మరియు సుభద్రమ్మ. వీరు తెలుగు మరియు సంస్కృత భాషలలో విద్వాన్ పట్టాలను, తెలుగులో ఎం. ఏ. పట్టాను పొందారు. వీరు నూజివీడులోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల, ఆగిరిపల్లి ఎస్.ఎం.ఓ. కళాశాలలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు.

వీరు తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణలో సంగ్రాహకులుగా; శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీకి సహాయ సంపాదకులుగా; దక్షిణ భాషా పుస్తక సంస్థలోను మరియు విస్‌డమ్ మాసపత్రికకు తెలుగు సంపాదకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీకి సలహాదారుగా ఉన్నారు.

రచనలు

  • ఓవరి (ఖండకావ్యం)
  • నివాళి (తాత్త్విక శతకం)
  • సిరినోము (ద్రవిడ ప్రబంధాలకు తెలుగు అనువాదం)
  • అన్యాపదేశం (సంస్కృత భల్లట శతకానికి తెలుగు అనువాదం)
  • తెలుగు చాటువు
  • బొమ్మల రామాయణం
  • ఎమెస్కో తెలుగు-ఇంగ్లీషు పాకెట్ డిక్షనరీ
  • గోపురం - సందేశం
  • తిరువళికలు
  • ప్రపంచ కథలు
  • ప్రబంధ కథలు
  • అనుష్టుప్ భగవద్గీత