దాగుడు మూతలు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|
{{సినిమా|
name = దాగుడు మూతలు (1964 సినిమా) |
name = దాగుడు మూతలు (1964 సినిమా) |
image = daagudu_muthalu_1964.jpg|
caption = చిత్ర ప్రచార చిత్రము|
director = [[ ఆదుర్తి సుబ్బారావు ]]|
director = [[ ఆదుర్తి సుబ్బారావు ]]|
year = 1964|
year = 1964|

16:31, 21 ఆగస్టు 2014 నాటి కూర్పు

దాగుడు మూతలు (1964 సినిమా)
(1964 తెలుగు సినిమా)
దస్త్రం:Daagudu muthalu 1964.jpg
చిత్ర ప్రచార చిత్రము
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం డి.బి.నారాయణ
కథ ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం నందమూరి తారక రామారావు,
బి. సరోజాదేవి,
గుమ్మడి,
పద్మనాభం,
శారద,
అల్లు రామలింగయ్య
సంగీతం కె.వి.మహదేవన్
సహాయకుడు: పుహళేంది
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత
గీతరచన ఆచార్య ఆత్రేయ, దాశరథి
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న కార్ల్ మార్క్స్ సిధ్దాంతాన్ని ప్రతిబింబిస్తుంది ఈ చిత్ర కథ. నవ్యత ఆదుర్తి సుబ్బారావు గారి ట్రేడ్ మార్క్. ఆదుర్తి చిత్రాలు మూస చిత్రాలు కాదు. ఇటువంటి కథతో చిత్రం నిర్మించడం ఆదుర్తికే చెల్లు.

చిత్రకథ

ఒక శ్రీమంతుడి(గుమ్మడి) కుమారుడు తండ్రి అభీష్టానికి వ్యతిరేకం గా పెండ్లి చేసుకుంటాడు. ఐతే, శ్రీమంతుని కుమారుడు, కోడలు మరణిస్తారు. మనసు మారిన శ్రీమంతడి మనవడి కోసం పరితపస్తూ ఉంటాడు. వారసుడు రాడని ధృడనిశ్చయంతో ఉన్న శ్రీమంతుని దూరపు బంధువులు (రమణారెడ్డి, సావిత్రి) ఆస్తి కోసం గోతి కాడ నక్కల్లా కాసుక్కూర్చొంటారు. ఆబంధువులలో ఒకనికి కుమార్తె(శారద). ఒకామెకు కుమారుడు(పద్మనాభం). ఆ కుమారుని ఆ ధనవంతుడికి దత్తత ఇచ్చి ఆస్తంతా చుట్టేయాలని చూస్తారు. ఆ శ్రీమంతుడి ఫాక్టరీ ఎదురుగా ఒక క్యాంటీన్ నడుపూతూ ఉంటాడు ఒక యువకుడు (ఎన్.టి.రామారావు). మానవత్వమున్న అతడు, అనాధలను ఆశ్రయిస్తాడు. ఒక యువతి (బి.సరోజా దేవి) ఇష్టంలేని పెళ్లి తప్పించుకోడానికి అచ్చటకు వస్తుంది. ఆమెకు ఆ యువకుడు ఆశ్రయమిస్తాడు. శ్రీమంతుడు వారసుడు ఆ క్యాంటీన్ ఓనర్ అని తెలుస్తుంది. అతని దశ మారిపోతుంది.బంధువుల నోట్లో వెలక్కాయ పడుతుంది. ఐతే, బంధువు కుమార్తె(శారద)ను యువకునికి (ఎన్.టి.ఆర్)కి ఇచ్చి పెళ్లి చేసి ఆస్తి స్వంతం చేసుకోవాలని చూడడంతో వాళ్లతో విబేధాలు మొదలవుతాయి.యువకునితో పాటు యవతి కూడా శ్రీమంతుని ఇంటికి చేరుతుంది. ఈ లోగా శ్రీమంతుడు మరణిస్తాడు. ఆబంధువుల సంతానం (పద్మనాభం, శారద) పరస్పరం ప్రేమించుకుంటారు. యువకుడు ఆశ్రయమిచ్చిన యవతిని వదలాడానికి అంగీకరించడు. దానితో ఆ యువకునికి పిచ్చి పట్టిందని పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారు. బంధువుల డబ్బు పిచ్చి వదిలించి వాళ్ల ఆట కట్టిస్తాడా యువకుడు.

సినీమాల్లోకి రావడం ముళ్ళపూడికి మొదట ఇష్టం లేకున్నా డి.బి.ఎన్ కు ఎదురు చెప్పలేక 'దాగుడు మూతలు' సినిమాకు కథ అల్లారు. పూర్తి స్క్రిప్టు తయారైతే కానీ షూటింగు షెడ్యూలు మొదలు పెట్టించే అలవాటులేని ముళ్ళపూడి, ఈ సినిమా కోసం గ్యారీ కూపర్, జీన్ ఆర్థర్ నటించిన 'డాక్టర్ డీడ్స్ గోస్ టు టౌన్' అనే అమెరికన్ స్క్రూ బాల్ కామెడీ సినిమాని ప్రేరణగా తీసుకొని కథ అల్లి సినేరియా సమకూర్చారు. ఈ హాలీవుడ్ సినిమాకి ఆధారమైన 'ఒపెరా హ్యాట్' అనే కథే దాగుడు మూతలు సినిమాకి కూడా మూలం. ఇంచుమించు దాగుడుమూతలు సినిమాకూడా అదే ధోరణిలో సాగుతుంది. దాగుడుమూతలు ముళ్ళపూడికి మొదటి సినిమానే అయినా, తొలుత విడుదలైన సినిమా మాత్రం 'రక్తసంబంధం' సినిమానే. ఇక దాగుడుమూతలు కథలోకి వెళ్తే, కోటీశ్వరుడు విశ్వసుందరరావు (గుమ్మడి) తన అభీష్టాన్ని వ్యతిరేకించి పెళ్లిచేసుకున్నందుకు కొడుకును ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. తనకి మనిషి విలువేమిటో తెలిసేసరికి కొడుకూ, కోడలూ చనిపోతారు. అనాధగా మిగిలిన మనవడిని దారినపోయే దానయ్య చేరదీసి పెంచుతాడు. మనవడికోసం దేశమంతా గాలించినా అతని ఆచూకీ తెలియదు. కానీ తనవూళ్ళోనే, తన మిల్లు ప్రాంగణంలోనే చిన్న హోటలు నడుపుకునే సుందరయ్య తన మనవడేనని తెలుసుకోలేకపోతాడు జమీందారు. తనను పెంచిన దానయ్య బిడ్డల్ని సాకుతూ, పదిమందికీ సహాయపడుతూ హోటలు నడిపే సుందరయ్య జీవితంలోకి ఇష్టంలేని పెళ్లినుంచి తప్పించుకుని పారిపోయివచ్చిన సుబ్బులు (బి.సరోజాదేవి) అనే చిన్నది ప్రవేశిస్తుంది. వారిద్దరి మనసులు కలిసి ప్రేమ చిగురిస్తుంది. జమీందారు ఆస్తి దక్కించుకోవాలని ఆయన అన్న అల్లుడు భూషణం (రమణారెడ్డి) తన కూతురు (శారద)తోనూ, జమీందారు తమ్ముని కోడలు సూరమ్మ (సూర్యకాంతం) తన కొడుకు (పద్మనాభం)తోనూ ఆ బంగళాలో తిష్టవేసి పోటీలుపడి సేవల పేరుతో జమీందారుని హింసిస్తూ వుంటారు. సుబ్బులు జమీందారు దివాణంలో సేవలుచేసి నర్సుగా చేరి, జమీందారు అభిమానం చూరగొని, ఆ బంగళాలో సెక్రెటరీ స్థాయికి ఎదిగి ఆ ఇంట్లో అధికారం సంపాదించుకుంటుంది. నా కూతుర్ని నీ కోడలుగా చేసుకో: నీ కొడుకుని నేను జమీందారుకు దత్తు చేయిస్తాను అని భూషణం సూరమ్మతో చెప్పి, జమీందారును దత్తతకు ఒప్పిస్తాడు. జమీందారు వద్దవున్న ఫోటో, సుందరయ్యవద్ద వున్న అతని తల్లిదండ్రుల ఫోటో ఒక్కలాగే వుండడం గమనించిన సుబ్బులు సుందరయ్యే జమీందారు మనవడని గ్రహించి ఆయనకు సుందరయ్యను అప్పగిస్తుంది. సుందరయ్యను వారసుడిగా ప్రకటించి జమీందారు కన్నుమూస్తాడు. సుందరయ్య దానధర్మాలు చేస్తూవుండటం మింగుడుపడని భూషణం. తన కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందని ఒక దొంగ వీలునామా సృష్టించి వలపన్నుతాడు. సుందరయ్య భూషణం పన్నాగాన్ని పసికట్టి ఎత్తుకు పైఎత్తు వేసి శారదతో కూడపలుక్కొని పెళ్లి చేసుకునేందుకు సరేనంటాడు. ఈ నాటకం తెలియని సుబ్బులు సుందర య్యను అపార్ధం చేసుకొని వెళ్ళిపోతుంది. బంగాళాకు వచ్చిన సుందరయ్య అక్కడ చేస్తున్న పెళ్లి ఏర్పాట్లను చూసి రెచ్చిపోయి ఆ ఏర్పాట్లను తన్నివేసి, అడ్డొచ్చిన వాళ్ళను తోసివేస్తాడు. దాంతో అతనికి పిచ్చెక్కిందని ప్రకటించి భూషణం సుందరయ్యను పిచ్చాసుపత్రిలో చేరుస్తాడు. అసలు విషయం తెలుసుకొన్న సుబ్బులు సహాయంతో, భూషణం, సూరమ్మల డబ్బు పిచ్చి వదిలించి సుందరయ్య సుబ్బుల్ని పెళ్ళాడటంతో సినిమాకి శుభం. కాదు కాదు 'జైహింద్' కార్డు పడుతుంది.

దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మార్కు కథనం

ఆదుర్తి సుబ్బారావు సినిమాను నడిపే పద్ధతి విలక్షణంగా వుంటుంది. ఆదుర్తి గొప్పతనం ఆయన తీర్చిదిద్దిన శిష్యుల పనితనంలో బయటపడుతుందనే మాట సత్యం. విక్టరీ మధుసూదనరావు, కళాతపస్వి విశ్వనాధ్, ఎడిటర్-డైరెక్టర్ టి.కృష్ణలు ఆదుర్తి స్కూలునుంచి వచ్చినవారే! ముళ్ళపూడి వెంకటరమణతోబాటు రచయిత సత్యానంద్ కు ఓనమాలు దిద్దించిందీ; సెల్వరాజ్ ని ఛాయాగ్రాహకుడిగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఆదుర్తిదే. సాధారణంగా సౌండ్ ట్రాక్ చెకింగ్ కి మూవియోలా మీద ఫిలిం నడపటం అందరూ అనుసరించే పద్ధతి. కానీ ఆదుర్తి మాత్రం ఫిలిం రీలుని కిటికీ వెలుతురులో చేత్తో తిప్పి సౌండ్ ట్రాక్ ఎక్కడ ఆగిందో చెప్పేవారు. పంటి బిగువున ఫిలిం ముక్కను అక్కడ తెంపి అతికించేవాడు. కచ్చితంగా శబ్దం సరిపోయేది. దాగుడుమూతలు సినిమా నిర్మాణం మాత్రం ఎందుకో చకచకా సాగలేదు. ఈ సినిమా రచన సాగుతున్న కాలంలోనే 'మూగమనసులు' సినిమాకి ముళ్ళపూడిని ట్రీట్మెంట్ రాయమన్నారు ఆదుర్తి. పాపం డి.బి.ఎన్ యేమీ అనేవాడు కాదు. ఈ సినిమా రచనాకాలంలో ముళ్ళపూడి పుచ్చుకున్న నెలజీతం నాలుగువేలు! అప్పట్లో అదే పెద్ద పారితోషికం కింద లెక్క. చివరకు వాహిని-విజయా స్టూడియోలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా నడిచిపోతుంది. అతితక్కువ డైలాగులతో ఎక్కడా విసుగు రానీయని రీతిలో చిత్రాన్ని నడిపించారు ఆదుర్తి. కొందరు అస్మదీయులైతే కావాలనే చిత్రనిర్మాణాన్ని ఆదుర్తి ఆలస్యం చేస్తున్నారనీ, అక్కినేని చిత్రాలు తీయడంలో వున్న శ్రద్ధ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం మీద ఆదుర్తికి లేదని విమర్శలు గుప్పించారు. ఆదుర్తి వాటిని పట్టించుకోలేదు. రమణారెడ్డిని కామెడీ విలన్ గా, నాగయ్యను పోలీసు అధికారిగా చక్కగా వాడుకున్నారు. 'పెండ్లిపిలుపు' (1961) సినిమా విడుదలైన మూడేళ్ళకుగానీ దాగుడుమూతలు రిలీజు కాలేదంటే యెంత నిర్మాణజాప్యం జరిగిందో బోధపడుతుంది. విచిత్రమేమిటంటే, 'డాక్టర్ డీడ్స్ గోస్ టు టౌన్' సినిమా తయారీ కూడా ఇలాగే ఆలస్యమేకావటం కొసమెరుపు!

పాటలు

ఆచార్య ఆత్రేయ, దాశరథి, ఆరుద్ర రాసిన రసవత్తర గీతాలకు తేనెలూరు మట్లు కట్టి, సాహిత్య సమలంకృతం చేసిన ఘనత కె.వి. మహదేవన్ ది. ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. గోరొంక గూటికే చేరావు చిలకా, గోరొంక కెందుకో కొండంత అలక అనే రెండు పాటలూ దాశరథి రాసినవే. ఇష్టంలేని పెళ్లి తప్పించడానికి ఇంట్లోంచి పారిపోయి ఎన్టీఆర్ గూటిలోకి చేరిన సరోజాదేవి ఆసరాకి భరోసా ఇస్తూ ఘంటసాల పాడేది మొదటి పాట కాగా, సరోజాదేవి మీద అలకబూని బెట్టుచేసే ఎన్టీఆర్ ని మచ్చికచేసుకోనే సందర్భంగా వచ్చేది సుశీల పాడిన రెండో పాట. ఈ రెండు పాటలూ శంకరాభరణం రాగంలోనే వున్నా, వాటి టెంపో మాత్రం భిన్నంగా వుంటుంది. గోరొంక గూటికే చేరావు చిలకా పాట టెంపో స్లోగా వుంటుంది. రాత్రివేళ సరోజాదేవికి భద్రతపై అభయమిస్తూ పాడే పాట కావడంతో మహదేవన్ ఈ పాటను స్లో టెంపోలో స్వరపరిచారు. గోరొంక గూటికే చేరావు చిలకా అన్నప్పుడు పంజరంలోకి చిలకను పంపటం, భయమెందుకే నీకు బంగారు మొలక అన్నప్పుడు ఆ పంజరం తలుపు మూయటం ఆదుర్తి చూపిన గొప్ప సింబాలిజం. రాత్రివేళ పాట కావడంతో ఎన్టీఆర్ ని కేవలం బనియను, తువ్వాలు మీద చూపడం ఆదుర్తి నేటివిటీకి ఎంత విలువ ఇస్తారో తెలుస్తుంది. నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి చరణంలో సరోజాదేవి హావభావాలు వర్ణించనలవికాదు. అలాగే సరోజాదేవి పాడే పాటలో టెంపో వేగం పుంజుకుంటుంది. మాటేమో పొమ్మంది - మనసేమో రమ్మంది. మాటకు మనసుకు మధ్యన తగువుందీ ప్రయోగం అద్భుతమైతే, మరి సరోజాదేవి హావభావాలు మహాద్భుతంగా వుంటాయి. ఈ పాటలో సరోజాదేవికి బాల నటీమణులు బేబి, సుమ, లత, తార, అవంతి సహకరించారు. తెరమీద ముద్దులపై ప్రభుత్వం నిషేధం విధించిన సందర్భంగా, ముద్దులంటే కేవలం లిప్-లాకే కాదు, మనం చూసే ప్రకృతిలో, ప్రవృత్తిలో అడుగడుగునా ముద్దులు మురిపిస్తాయని చెప్తూ ఆచార్య ఆత్రేయ రాసిన ముద్దుపాట ఆ రోజుల్లో విశేషంగా ఆకట్టుకుంది. నటభైరవి రాగంలో రూపుదిద్దుకున్న ఈ పాట చివరిదాకా సరోజాదేవి ఇచ్చే లిప్ మోవ్మెంట్ ఎంత ముద్దుగా వుంటుందో చెప్పలేం. వాహినీ గార్డెన్లో చిత్రీకరించిన ఈ పాట చరణం చివర్లో నువ్వు నేనూ ముద్దుకు ముద్దు అని ఆత్రేయ రాస్తే, సెన్సారు అధికారులు ఆ ప్రయోగానికి అభ్యంతరం చెప్పి తొలగించమన్నారు. అప్పటికే పాట చిత్రీకరణ పూర్తికావడంచేత ముద్దుకు ముద్దు అనే పదాల స్థానంలో వూహుహు వూహు అని చేర్చి రీ-రికార్డింగు చేసారు. నిశితంగా పరీక్షిస్తే ఎన్టీఆర్, సరోజాదేవిల లిప్ మూవ్మెంట్ 'ముద్దుకు ముద్దు'గానే కనిపిస్తుంది. విరిసి విరియని పువ్వే ముద్దు అన్నప్పుడు ఎన్టీఆర్ చేతిలో అరవిరిసినపూల రెమ్మ వుండటం. నడకలలో నాట్యంచేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు అనే ప్రయోగం వచ్చినప్పుడు సరోజాదేవి వెనక్కి నడవటం మనం గమనిస్తాం. ఆ నడకలో హొయల బ్యాక్ ప్రొజెక్షన్లో చిత్రీకరించడం ఆదుర్తి ప్రతిభకు గీటురాయి. పచ్చనిచేలే కంటికి ముద్దు అన్నప్పుడు ఎన్టీఆర్ పాలకంకి చేతిలో వూపటం కూడా పాట చిత్రీకరణలో ఆదుర్తి ఎంతశ్రద్ధ కనపరుస్తారో తెలియజేస్తుంది. ఇక చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు అనే చరణంలో సరోజాదేవి జడను ముందుకు వేసుకుంటూ నడుస్తుంటుందే కానీ, పిరుదల చకచకలు మాత్రం కనిపించనీయదు. ఏదైనా గుప్పెట్లో ఉంటేనే అందం అనే విషయాన్ని ఆదుర్తి తెలివిగా, విశేషణ పూర్వకంగా చూపించారు. అందలం ఎక్కాడమ్మా - అందకుండా పోయాడమ్మా పాట ఆత్రేయ రచన. ఈ పాటను గుమ్మడి ఎన్టీఆర్ తన మనవడని తెలుసుకున్న సందర్భంగా వచ్చే వేడుకలో సరోజాదేవి చేసే స్టేజ్ డ్యాన్స్ సీక్వెన్స్‌గా మలిచారు. పాటలో రెండో చరణం వచ్చేసరికి ఎన్టీఆర్ సరోజాదేవితో గళం కలుపుతాడు. ఎంతవాణ్ణి ఎంతైనా నే నీలో ఇమిడిపోతానమ్మా అనడంలో, కాఫీ హోటలు నడిపే ఎన్టీఆర్ ఒక్కసారి జమీందారు అయిపోతే తనని మరచిపోతాడేమోనని సంశయించే సరోజాదేవికి అభయం ఇవ్వడమే ఉద్దేశ్యం. ఈ పాటతోబాటు యెంకొచ్చిందోయ్ మావ ఎదురొచ్చిందోయ్ అనే ఆరుద్ర పాటలో సరోజాదేవి ఆహార్యం నండూరివారి ఎంకిని గుర్తుకు తెస్తుంది. మెల్లమెల్లమెల్లగా- ఆనువణువూ నీదెగా అనే టైటిట్ సాంగ్ వెస్ట్రన్ బీట్ తో యెంతో హృద్యంగా సాగుతుంది. నీదికానిదేది లేదు నాలో - నిజానికి నేనున్నది నీలో - ఒక్కటే మనసున్నది ఇద్దరిలో, ఆ ఒక్కటీ చిక్కె నీ గుప్పిటిలో అనే ఆత్రేయ ప్రయోగం ఇంకెవ్వరూ చెయ్యలేనిది. నేనున్నది నీలో అన్నప్పుడు ఇద్దరినీ నీటినీడలో పరోక్షంగా చూపించడం ఆదుర్తి ప్రతిభకు మచ్చుతునక. ఈ పాటలో ఎన్టీఆర్ పిల్లిగంతులేస్తూ యెంతో హుందాగా నటించారు. విగ్గులేని ఎన్టీఆర్ తలకట్టు ఈ సినిమాలో ఎంతో బాగుంటుంది. శంకరాభరణ రాగంలోనే స్వరపరచిన మరో ఆత్రేయ గీతం దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం విషాద సన్నివేశపు పాట. ఎన్టీఆర్ పాడే పల్లవి, చరణాలు నైట్ లైట్ డార్క్ షేడ్‌లో, ఇండోర్లో చిత్రీకరిస్తే, సరోజాదేవి పాడే చరణాలను మూన్ లైట్ బ్యాక్ డ్పాప్‌లో, పూదోటలో చిత్రీకరించారు. అలతి పదాలతో అనంతార్థాన్ని చెప్పగల ప్రజ్ఞావంతుడు ఆత్రేయ. తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ: తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ: నేను నవ్వితే ఈలోకం చూడలేక ఏడ్చింది: నేనేడిస్తే ఈలోకం చూసి చూసి నవ్వింది వంటి లోతైన భావాలు స్పురించే పాటలు ఆత్రేయ కాక మరెవ్వరు రాయగలరు? ఎన్టీఆర్, ఆదుర్తిల కలయికతో వచ్చిన దాగుడుమూతలు సినిమా నూరురోజుల పండగ జరుపుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో తరవాత సంవత్సరంలో వచ్చిన 'తోడూ-నీడా' సినిమాకూడా శతదినోత్సవం చేసుకొంది. తదనంతర కాలంలో డి.బి.నారాయణ 'ప్రైవేట్ మాష్టారు', 'అన్నదమ్ములు', 'అబ్బాయిగారు-అమ్మాయిగారు' వంటి కొన్ని నిర్మించినా 70వ దశకం తొలి రోజుల్లోనే చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నారు.

పాట రచయిత సంగీతం గాయకులు
అడగక యిచ్చిన మనసే ముద్దు - అందీ అందని అందమే ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు - తెలిసి తెలియని మమతే ముద్దు
ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
గోరంక గూటికే చేరావు చిలకా - భయమెందుకే నీకు బంగారు మొలకా దాశరధి కె.వి.మహదేవన్ ఘంటసాల
గోరొంక కెందుకో కొండంత అలక - అలకలో ఏముందో తెలుసుకో చిలకా దాశరథి కె.వి.మహదేవన్ పి.సుశీల
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చేను అనుమానం
ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
మెల్లమెల్లమెల్లగా అణువణువు నీదెగా - మెత్తగ అడిగితే లేదనేది లేదుగా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
అందలం ఎక్కాడమ్మా అందకుండ పోయాడమ్మా ఇంతవాడు ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల, ఘంటసాల
ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయి ఎదురొచ్చి నీ కోసం ఏదో తెచ్చిందోయి కె.వి.మహదేవన్ పి.సుశీల
డివ్వి డవ్వి డివ్విట్టం నువ్వంటే నాకిష్టం డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది కె.వి.మహదేవన్ పిఠాపురం, స్వర్ణలత