అజీజ్ బెల్గామీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 65: పంక్తి 65:
==చిత్రమాలిక==
==చిత్రమాలిక==
<gallery/>
<gallery>
దస్త్రం:Azeez Belgaumi - Mangalore.jpg|మంగళూరు కార్యక్రమంలో అజీజ్
దస్త్రం:Azeez Belgaumi - Mangalore.jpg|మంగళూరు కార్యక్రమంలో అజీజ్
<gallery/>
</gallery>

==మూలాలు==
==మూలాలు==
* [http://www.azeezbelgaumi.com / Official website]
* [http://www.azeezbelgaumi.com / Official website]

00:41, 27 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

అజీజ్ బెల్గామి (عزیز بلگامی) Azeez Belgaumi
దస్త్రం:Azeez Belgaumi Urdu Poet.JPG
జననం1954 , మే 01
కుడిచి, బెల్గాం జిల్లా, కర్ణాటక
నివాస ప్రాంతంబెంగళూరు , కర్ణాటక
ఇతర పేర్లుఅజీజ్ బెల్గామి
వృత్తిరచయిత, సాహిత్యం, ఇస్లామీయ తత్వం
ప్రసిద్ధిపాత్రికేయుడు, పరిశోధకుడు, రచయిత, ఉర్దూ కవి
మతంఇస్లాం (ముస్లిం)
పిల్లలు3 కుమారులు, ఇద్దరు కుమార్తెలు
తండ్రిముహమ్మద్ ఇస్ హాక్
తల్లిఖుదేజాబి
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్

అజీజ్ బెల్గామీ (Azeez Belgaumi) ( ఉర్దూ - عزیز بلگامی ) - (జననం మే 01 1954.) దక్షిణ భారత దేశంలో ఒక ప్రఖ్యాత ఉర్దూ కవి మరియు సాహితీకారుడు. ఇతని ప్రత్యేకత ముషాయిరా లలో తన కవితలను శ్రావ్యంగా పాడుతూ శ్రోతలకు సాహితీప్రియులకు ఉర్రూత లూగిస్తాడు.

బాల్యం, విద్య

కర్ణాటక , బెల్గాం జిల్లా లోని కుడిచి గ్రామంలో జన్మించాడు. విద్యాభ్యాసం, బి.ఎస్.సి., ఎం.ఎ., ఎం.ఫిల్., వరకూ. ప్రధమంగా స్టేట్ బేంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్స్ ఉద్యోగం. బ్రాంచ్ అకౌంట్స్ మేనేజర్ వరకూ ఎదుగుదల, ఆతరువాత వాలంటరీ రిటైర్మెంటు. ఆతరువాత సాహితీ ప్రస్థానం. ఓ జూనియర్ కాలేజి లో ప్రిన్సిపాల్ గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.

సాహితీ ప్రస్థానం

ఉర్దూ సాహిత్యం పట్ల ప్రగాఢమైన అభిమానమే ఈ రంగంలో తీసుకొచ్చింది. పలు రచనలు, ఓ ఉర్దూ పత్రిక "సహారా ఉర్దూ" కు సబ్ ఎడిటర్ గానూ బాధ్యతలు చేపట్టాడు. ఇంటర్వ్యూవర్ గానూ, కాలమిస్టుగాను మంచి గుర్తింపు పొందాడు. భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ ఉర్దూ దిన వార పత్రికలకు వ్యాసాలు వ్రాసాడు.

యావత్ భారతదేశంలోనూ అనేక కవిసమ్మేళనాలు, సెమినార్లు, చర్చా గోష్టులలో పాల్గొన్నాడు. శాంతి సద్భావన, పరమత సహనం లాంటి విషయాలపై సెమినార్లలో పాల్గొని వక్తగా అనుభవం. అలాగే శ్రీశ్రీ రవిశంకర్ గారి "ఆర్ట్ ఆఫ్ లివింగ్" కార్యక్రమాల్లోనూ అనేక ప్రసంగాలిచ్చాడు.

రచనలు

మూడు పుస్తకాలు రచించాడు. అవి అన్నీ కవితలే.

  1. హర్ఫ్-ఒ-సౌత్ (Harf-o-saut) - అక్షరాలూ - శబ్దాలు
  2. సుకూన్ కే లమ్హోన్ కి తాజగి (Sukun ke lamhouN ki tazagi) - ప్రశాంత క్షణాల తాజాతనం
  3. జంజీర్-ఎ-దస్త్-ఒ-పా (Zanjeer-e-Dast-o-paa) - కాళ్లుచేతుల సంకెళ్ళు.

ముషాయిరాలలో అజీజ్ బెల్గామి

ముషాయిరాలలో ఇతడిని వినడానికి శ్రోతలు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇతడి రచనల్లో నాత్ మరియు గజల్ లు ప్రసిద్ధి. "మేరే ముస్తఫా ఆయే" అనే నాత్ విని శ్రోతలు చాలా ఆనందిచే ముషాయిరాలు సర్వసాధారణం. ఇతరదేశాలనుండీ ముషాయిరాలకు ఆహ్వానాలు అందుకున్న్డాడు.

మీడియాలో అజీజ్ బెల్గామీ

  • ఇతడి కవితలను ఇతనే గానం చేస్తూ అనేక ఆడియో కేసెట్లు విడుదల అయ్యాయి. వీటిలో "దుఆ హై హమారే పాస్" అనే కేసెట్, ఐ.పి.ఎస్. అధికారి ఖలీల్ మామూన్ (నేడు కర్నాటక ఉర్దూ అకాడెమీ చైర్మెన్) చే విడుదల చెయ్యబడినది.
  • అలాగే అనేక ఆడియో సి.డి.లు విడుదల అయ్యాయి.
  • ఇతడి కవితలకు అనేక గజల్ గాయకులూ పాడారు.
  • యూట్యూబ్ లో యితడు పాల్గొన్న అనేక ముషాయిరాల ప్రోగ్రామ్లు లభ్యమవుతాయి.
  • దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ఇతడి కార్యక్రమాలు అనేక ఇంటర్వ్యూలు వచ్చాయి.

ఇతరత్రా

  • ఇతని సాహితీ రచనలపై, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఓ విద్యార్థి ఎం.ఫిల్. రీసెర్చ్ చేసాడు.

నివాసం

ప్రస్తుతం ఇతను బెంగళూరులో కుటుంబంతో నివాసం. కుమారులు ముహమ్మద్ అత్హర్, ముహమ్మద్ జకారియా, ముహమ్మద్ యూనుస్, కుమార్తెలు సాజిడా మరియు సాదికా లు. ప్రచురణారంగంలో "ప్రింటెక్ పబ్లికేషన్స్" నిర్వహిస్తున్నాడు.

చిత్రమాలిక

మూలాలు