తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43: పంక్తి 43:
==మహర్షుల వివరాలు==
==మహర్షుల వివరాలు==
===అత్రిమహర్షి===
===అత్రిమహర్షి===
===భృగు మహర్షి===
===[[భృగు మహర్షి]]===
భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి మరియు సప్తర్షులలో ఒకరు. మొట్టమొదటి జ్యోతిష రచయిత మరియు వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త. భృగు మహర్షి బ్రహ్మహృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.

===మౌద్గల్య మహర్షి===
===మౌద్గల్య మహర్షి===
ముద్గలుడు ఇతఁడు నిర్జితవిషయేంద్రియుఁడు అయి ఉంఛవృత్తిని జీవించుచు దేవపితృ పూజనములు ఆచరించుటయందు దుర్వాసాదిమునులను ప్రమోదమగ్న మానసులుగ చేసెను. మఱియు ఇతఁడు దేవలోకమును ఒల్లక కేవలసత్వమును చేకొని నిర్వికల్పము అయిన జ్ఞానయోగమును అవలంభించి తుల్యనిందాస్తుతియును, సమలోష్ఠకాంచనుఁడును అయి పరమసిద్ధిని పొందెను. 2. అజమీఢుని రెండవ కొడుకు అగు నీలుని వంశస్థుఁడు. తండ్రి భర్మ్యాశ్వుఁడు లేక హర్యశ్వుఁడు. కొడుకు దివోదాసుఁడు. కూఁతురు గౌతముని భార్య అగు అహల్య. ఇతఁడు క్షత్రియుఁడు అయినను తపోమహిమచే ఇతని వంశజులు బ్రాహ్మణులు అయిరి. వారే మౌద్గల్య గోత్రులు.
ముద్గలుడు ఇతఁడు నిర్జితవిషయేంద్రియుఁడు అయి ఉంఛవృత్తిని జీవించుచు దేవపితృ పూజనములు ఆచరించుటయందు దుర్వాసాదిమునులను ప్రమోదమగ్న మానసులుగ చేసెను. మఱియు ఇతఁడు దేవలోకమును ఒల్లక కేవలసత్వమును చేకొని నిర్వికల్పము అయిన జ్ఞానయోగమును అవలంభించి తుల్యనిందాస్తుతియును, సమలోష్ఠకాంచనుఁడును అయి పరమసిద్ధిని పొందెను. 2. అజమీఢుని రెండవ కొడుకు అగు నీలుని వంశస్థుఁడు. తండ్రి భర్మ్యాశ్వుఁడు లేక హర్యశ్వుఁడు. కొడుకు దివోదాసుఁడు. కూఁతురు గౌతముని భార్య అగు అహల్య. ఇతఁడు క్షత్రియుఁడు అయినను తపోమహిమచే ఇతని వంశజులు బ్రాహ్మణులు అయిరి. వారే మౌద్గల్య గోత్రులు.

18:12, 26 అక్టోబరు 2014 నాటి కూర్పు

పురాణాల కాలం నాటి ఇతిహాస చరిత్ర ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. సంగమేశ్వరస్వామి దేవాలయం మూడు నదుల కలయికతో ఏర్పడి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఖమ్మం జిల్లా లో మూడు నదులు కలిసే (కూడలి) ప్రాంతంలో వున్నది సంగమేశ్వరుని గుడి. అత్రి మహర్షి పేరు మీదుగా ఆకేరు, భృగు మహర్షి పేరు మీదుగా బుగ్గేరు, మౌద్గల్య మహర్షి పేరు మీదుగా మున్నేరు మహాశివరాత్రి రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కూడలి జాతర జరుగుతుంది. వేల సంవత్సరాల విశిష్ట పుణ్యచరిత్ర గల తీర్థాల శివాలయం భక్తుల విశేష ఆదరణ పొందుతూ ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, కృష్ణా జిల్లాలతో పాటు చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర భక్తుల పూజలందుకుంటోంది.

ఆలయ చరిత్ర

ఖమ్మం నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం తెలంగాణ జిల్లాల్లోనే ప్రసిద్ధిగాంచింది. ఈ స్వామిని వేడుకుంటే కోర్కెలు తీరుతాయని, దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు అమితంగా విశ్వసిస్తారు. అత్రి, బృగు, మౌత్గ ల్య మహా రుషులు శివునితో కలిసి వెంకటేశ్వరస్వామి కల్యాణానికి వెళ్లి వస్తూ మార్గమధ్యలో ఈ ప్రాంతంలో కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారని, ఈ ప్రాంతంలో మూడు నదులు ప్రవహిస్తుండటం చూసి గంగ, పార్వతీదేవితో శివుడు అక్కడే ఉండేటట్లు ప్రయత్నిస్తుండగా, పార్వతి వారించినా వినకుండా మనమందరం ఈ ప్రాంతంలోనే ఉండాల ని శివుడు రుషులతో చెప్పాడని, దీనికి పార్వతి సంతోషించిన పిదప శివుడు, పార్వతి, గంగలను ఇచ్చటనే ప్రతిష్ఠింప చేయాలని శివుడు రుషులను ఆజ్ఞాపించాడంటారు. ఆ మహారుషులు ఓ దివ్యముహూర్తాన గంగా సమేత స్వామి వారితో పాటు వినాయకున్ని, నందీశ్వరున్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. రుషులు ఈ శివాలయాన్ని గంగా సమేత సంగమేశ్వర స్వామి ఆలయంగా పేరుపెట్టారు. అక్కడ ప్రవహించే నదులైన మౌత్గల్య పేరున మున్నేరు, అత్రి మహర్షి పేరున ఆకేరుగా, బృగు మహర్షి పేరున బుగ్గేరుగా ఇక్కడ నదులు ప్రవహిస్తున్నాయి. కలియుగం మొదలైన తరువాత ఇక్కడ నిర్మించిన దేవాలయం అడవిలో పుట్టలతో నిండిపోవడంతో ఈ దేవాలయం కనబడకుండా పోయిందని ఒక పౌరాణిక కథనం

మళ్ళీ దేవాలయం వెలుగులోకి వచ్చిన విధం

ఎవరు కట్టించారో, ఎప్పుడు కట్టించారో తెలియక జనసంచారం లేని దట్టమైన అరణ్య ప్రాంతంలో ఈ దేవాలయం ఒంటరిగా ఎన్నాళ్ళుందో, ఎన్నేళ్ళుందో ఎవ్వరికీ తెలియదు. అయితే ఐదువందల ఏళ్ల క్రితం ఆయుర్వేద వైద్యులు బజ్జూరి నాగయ్య మూలికల కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా, ఈ గుడి బయట పడినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయాన్ని నాగయ్య పాకయాజ్ఞులనే బ్రాహ్మణుని సహాయంతో అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి తీర్థాల అనే నామకరణం చేసినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఇక్కడే నివాసాలు ఏర్పరచుకోగా, ఇక్కడ ఒక గ్రామం వెలసింది. అప్పటి నుంచి సంగమేశ్వరస్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ గుడి విశిష్ట త బయటకు తెలియలేదు.

ఆలయ అభివృద్ధి చర్యలు

వంద సంవత్సరాల క్రితం ఈ దేవాలయానికి పూజారిగా వున్న రాఘవవర్మ తండ్రి రామయ్య గుడిని అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేసారు. ఆయన వారసుడిగా వచ్చిన రాఘవవర్మ చుట్టుప్రక్కల గ్రామాల భక్తుల నుంచి విరాళాలను సేకరించి గుడికి ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, యాగశాలను నిర్మించారు. దేవాలయాభివృద్ధికి గతంలో పనిచేసిన రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా సహకారం అందించారట. 1968లో ఈ దేవాలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి ఈ దేవాలయానికి వచ్చే నిధులు, దాతల విరాళాలతో గుడిని అభివృద్ధి చేశారు. ఈ దేవాలయాని కి 80 ఎకరాలు, పక్కనే ఉన్న వెంకటేశ్వరస్వామికి 40 ఎకరాల మాన్యం ఉంది. 1972లో దేవాలయానికి ట్రస్ట్‌బోర్డు ఏర్పాటయ్యింది.

తీర్థాల సంగమేశ్వరాలయాన్ని పునర్నిర్మించేందుకు అభివృద్ధి పరచేందుకు ఖమ్మం డివిజన్ రెవెన్యూ అధికారి వాసం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో భక్తుల నుంచి 20శాతం నిధులను సేకరించి వాటికి ప్రభుత్వం 80 శాతం నిధులను జతచేస్తు కొంతమేరకు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ భక్తులు ఆలయానికి వెళ్ళేందుకు ప్రత్యేక రోడ్లు, బారికేడ్లు, మునే్నరులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్నానఘట్టాలు, తాగునీటి ఎద్దడి నివారించేందుకు వాటర్ ట్యాంక్‌లు మొదలైన మరికొన్ని పనులు పూర్తి చేయవలసి వున్నది.

ఇబ్బందుల్లో అభివృద్ధి

ఊరికి చాలా దూరంలో వుండటం వల్ల సరైన రక్షణ లేదు. దేవాలయంలో పలుసార్లు దొంగతనాలు జరిగి ఉత్సవ విగ్రహాలు మాయమయ్యాయి. గుడి ఆధీనంలో ఉన్న 120 ఎకరాల మాన్యం భూముల కౌలుదారుల వద్ద నుంచి కౌలు వసూలు చేయడంలో సరైన వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం దేవాలయానికి రావలసిన ఆదాయం రావడం లేదనేది మరో సమస్య.

కూడలి జాతరకు మరింత గుర్తింపు రావలసి వుంది

ప్రతి సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా ఐదురోజుల పాటు ఇక్కడ కూడలి జాతరగా జరుగుతుంది. ఈ జాతరకు సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు హాజరవుతారు. ఈ జాతర ద్వారా సుమారు రూ.ఆరు లక్ష ల వరకు ఆదాయం లభిస్తుంది. ఇంతటి ప్రసి ద్ధి చెందిన కూడలి జాతరను అప్పటి కలెక్టర్‌ గిరిధర్‌ జిల్లా జాతరగా ప్రకటించారు. అయినప్పటికీ ఈ దేవాలయాన్ని 6సీ గ్రేడ్‌ కిందనే గుర్తిస్తున్నారని, ఈ దేవాలయాన్ని 6బీ గ్రేడ్‌ కింద గుర్తించాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడున్న అర్చకులతో పాటు మరొకరిని కూడా ప్రభుత్వ వారి జీతభత్యాలతోె నియమించాల్సిన అవసరం వుందనేది ప్రధానమైన డిమాండు.

వర్షాలు సమృద్ధిగా కురిసిన రోజులలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటి కొరత ఉండేది కాదు. కొన్ని సంవత్సరాలుగా నెలకొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా త్రివేణి సంగమాన చుక్కనీరు నిలవని దుస్థితి. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఎన్‌ఎస్‌పి కాల్వ నీటిని మునే్నరులోకి వదిలినప్పటికీ భక్తులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖాధికారులు సంగమేశ్వరాలయ త్రివేణి సంగమాన చెక్‌డ్యామ్ నిర్మించి నీటిని నిల్వ చేయాలని భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా స్నానఘట్టం ఇప్పుడు పూర్తిగా రాళ్ళు తేలి వుంది. దానిని శుభ్రపరచి నేలభాగాన్ని చదును చేయించి గుచ్చుకునే రాళ్లను తొలగించినట్లయితే శుభ్రమైన చాలినన్ని నీళ్ళతో స్నానాలు చేయడానికి అనువుగా ఉంటుంది. స్నానఘట్టం కూడా ఆకర్షణీయంగా వున్నట్లయితే మరింత పర్యాటక ఆదాయం సంవత్సరం పొడవునా వచ్చే అవకాశం వుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఈ ఆలయం చుట్టూ ఉన్న ఇప్పటికే దేవాలయం ఆదీనంలో వున్న భూమిలో మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించడం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా ఈ ప్రాంతంలో కావలసిన అవసరాలకోసం వచ్చే వ్యాపారస్తులకు వీలుగా వుండి కొన్ని షాపులు కూడా ఏర్పడే పరిస్థితి వస్తుంది. మంచి ఫలవంతమైన చక్కటి భూమి నీటిసౌకర్యం కూడా అందుబాటులో వుండటం వల్ల దీనిలో చక్కటి పార్కులు నిర్మించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

త్రికూటాలయం

సంగమేశ్వరాలయంలో ఒక్క గర్భగుడి కాకుండా పక్కపక్కనే వుండే మూడు గర్భగుడులు వుంటాయి. అయితే అందులో రెండు శైవానికి సంభందించి శివలింగాలున్న గుడులైతే మూడవది. వైష్ణవ సంభందమయిన నరసింహాలయం. అయితే నరసింహాలయంలో ప్రధాన విగ్రహం ప్రస్తుతం లేదు. ఆ గర్భగుడిపై మాత్రం శేషసాయి అయిన మహా విష్ణువురూపం ఇప్పటికీ కనిపిస్తుంటుంది.

సంగమేశ్వర లింగం ప్రత్యేకతలు

తెల్లటి నునుపైన ప్రత్యేక శిలతో చేసిన సంగమేశ్వరుని లింగాకారం. పానవట్టంలో విడిగా తీసి పెట్టిందుకు అనువుగా వున్నట్లు నిర్మించారు. పాలరాయిలా నునుపైన మెరుపుతో వుండే ఈ శివలింగం చాలా ఆకర్షణీయంగా వుంటుంది.

ఆలయ ప్రాంగణంలోని విగ్రహాలు

ఆలయప్రాంగణంలో అత్యంతపురాతనమైనవిగా భావించ బడుతున్న లజ్జాగౌరి ని పోలిన ఒక శిల్పం కనిపిస్తుంది. అదే విధయం సాదకులు నిర్మించుకున్నట్లుగా అనిపించే వామ దిశను చూస్తున్న హనుమంతుని విగ్రహం కూడా శతాబ్ధాల వెనుకటిదిగా కనిపిస్తుంటుంది.

దేవాలయం గోడలపై చిత్రాలు

దేవాలయపు గోడలపై మచ్చావతారాన్ని సూచించేల వున్న ఒక చేపబొమ్మ, ఏనుగులూ, గుర్రాలూ, ద్వారపాలకుల వంటివే కాకుండా సృష్టికార్యం రహస్యాన్ని వివరిస్తున్నట్లున్న కొన్ని శిల్పాలు కూడా వున్నాయి.

నదులు వివరాలు

ఆకేరు

మున్నేరు

మున్నేరు కృష్ణా నదికి ఉపనది. మున్నేరు వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు వద్ద పుట్టి, ఖమ్మం, నల్గొండ, కృష్ణా జిల్లాల గుండా ప్రవహించి, పులిచింతలకు 20 కిలోమీటర్ల దిగువన కృష్ణా నదిలో కలుస్తుంది. మున్నేరు సముద్రమట్టం నుండి 238 మీటర్ల ఎత్తున ప్రారంభమై కృష్ణానదిలో కలిసే సరికి మొత్తం 195 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. మున్నేరు యొక్క పరీవాహక ప్రాంతపు వైశాల్యం 10,490 చ.కి.మీలు. ఆకేరు, వైరా నదులు మున్నేరు యొక్క ప్రధాన ఉపనదులు. ఆకేరు ఖమ్మం గ్రామీణ మండలంలోని తిర్తల గ్రామం వద్ద మున్నేరులో కలుస్తుంది. వైరా నది దక్షిణానికి ప్రవహించి కృష్ణా జిల్లా, కంచికచెర్ల మండలంలోని కేసర వద్ద మున్నేరులో కలుస్తుంది.

మున్నేరు ఖమ్మం పట్టణపు శివార్లలోని దానవాయిగూడెం నుండి ప్రవహిస్తుంది. ఖమ్మం పట్టణ ప్రజలకు మంచినీటి వనరు మున్నేరే. ఖమ్మం జిల్లాలోని గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించబడింది. మున్నేరును ఆనుకొని పెనుగంచిప్రోలు పక్కన ప్రసిద్ధి గాంచిన శ్రీ గోపయ్య నమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మ వారి దేవాలయము ఉన్నది.

బుగ్గేరు

మహర్షుల వివరాలు

అత్రిమహర్షి

భృగు మహర్షి

భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి మరియు సప్తర్షులలో ఒకరు. మొట్టమొదటి జ్యోతిష రచయిత మరియు వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త. భృగు మహర్షి బ్రహ్మహృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.

మౌద్గల్య మహర్షి

ముద్గలుడు ఇతఁడు నిర్జితవిషయేంద్రియుఁడు అయి ఉంఛవృత్తిని జీవించుచు దేవపితృ పూజనములు ఆచరించుటయందు దుర్వాసాదిమునులను ప్రమోదమగ్న మానసులుగ చేసెను. మఱియు ఇతఁడు దేవలోకమును ఒల్లక కేవలసత్వమును చేకొని నిర్వికల్పము అయిన జ్ఞానయోగమును అవలంభించి తుల్యనిందాస్తుతియును, సమలోష్ఠకాంచనుఁడును అయి పరమసిద్ధిని పొందెను. 2. అజమీఢుని రెండవ కొడుకు అగు నీలుని వంశస్థుఁడు. తండ్రి భర్మ్యాశ్వుఁడు లేక హర్యశ్వుఁడు. కొడుకు దివోదాసుఁడు. కూఁతురు గౌతముని భార్య అగు అహల్య. ఇతఁడు క్షత్రియుఁడు అయినను తపోమహిమచే ఇతని వంశజులు బ్రాహ్మణులు అయిరి. వారే మౌద్గల్య గోత్రులు.


ఎలా చేరుకోవాలి ?

చిత్రమాలిక

చిత్రాలు

ఇతర లంకెలు