"ఆగడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
585 bytes added ,  7 సంవత్సరాల క్రితం
బొమ్మలు జతచేసాను
(బొమ్మలు జతచేసాను)
(బొమ్మలు జతచేసాను)
మొదట ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ 2013 నెలలో మొదలుపెట్టాలని భావించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/2013/08/aagadu-go-sets-november-121238.html|title=నవంబర్ నుంచి మహేష్ బాబు ‘ఆగడు’|publisher=వన్ఇండియా|date=August 21, 2013|accessdate=April 1, 2014}}</ref> నవంబర్ 15న మొదలుపెట్టి ఏప్రిల్ 2014 కల్లా చిత్రీకరణ పూర్తిచేసి మే నెలలో విడుదల చెయ్యాలని భావించారు.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/node/14527|title=నవంబర్ 15 నుంచి మహేశ్ ఆగడు|publisher=ఆంధ్రజ్యోతి|date=October 26, 2013|accessdate=April 1, 2014}}</ref> అయితే మహేష్ ''[[1 - నేనొక్కడినే]]'' సినిమా చిత్రీకరణ చివరి దశలో పాల్గొనడం వల్ల చిత్రీకరణ నవంబర్ 28 నుంచి మొదలుపెట్టాలని భావించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/aagadu-starts-shoot-from-28th-november-125584.html|title=28 నుంచి మహేష్ కంటిన్యూగా...|publisher=వన్ఇండియా|date=November 17, 2013|accessdate=April 1, 2014}}</ref> ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం చిత్రీకరణ నవంబర్ 28, 2013న హైదరాబాదులో మొదలయ్యింది.<ref name="shoot begin"/> ఆపై డిసెంబర్ నెలమొదట్లో అక్కడే మహేష్, ఎం. ఎస్. నారాయణ, వెన్నెల కిశోర్ లపై హాస్యసన్నివేశాలు చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/aagadu-will-be-more-than-that-dookudu-126449.html|title=డబల్ డోస్ కామెడీతో మహేష్ బాబు 'ఆగడు'|publisher=వన్ఇండియా|date=December 3, 2013|accessdate=April 7, 2014}}</ref> మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని 1 - నేనొక్కడినే సినిమా చివరి షెడ్యూల్లో పాల్గొన్న మహేష్ డిసెంబర్ 27, 2013 నుంచి పోలీస్ స్టేషన్ సెట్లో ఈ సినిమా చిత్రీకరణను కొనసాగించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/spotnews/mahesh-babu-will-go-police-station-127755.html|title=రేపు పోలీస్ స్టేషన్‌కు మహేష్ బాబు!|publisher=వన్ఇండియా|date=December 26, 2013|accessdate=April 7, 2014}}</ref> జనవరి 2014 మొదటివారంలో శ్రీను వైట్ల, ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ లొకేషన్ల కోసం గుజరాత్ వెళ్ళారు. సంక్రాంతి తర్వాత రెండో షెడ్యూల్ మొదలవుతుందని స్పష్టం చేసిన దర్శకనిర్మాతలు జనవరి 18 నుంచి హైదరాబాదులో కొత్త షెడ్యూల్ మొదలవుతుందని వెళ్ళడించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-team-in-location-scouting-mode.html|title=లొకేషన్స్ కోసం గుజరాత్ వెళ్ళిన ‘ఆగడు’ టీం|publisher=123తెలుగు.కామ్|date=January 3, 2014|accessdate=April 7, 2014}}</ref> మహేష్ తాడిపత్రి శివార్లలో చిత్రీకరణలో పాల్గుంటే అక్కడికి తనని చూడటానికి వచ్చే అభిమానులని ఆపడం కష్టమని భావించి గుజరాత్ పరిసరాల్లో తాడిపత్రి సెట్స్ నిర్మాణం చేపట్టారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/is-mahesh-reviving-factionism-128273.html|title=నిజమా, మహేష్ కూడా ఫ్యాక్షనిజమా?|publisher=వన్ఇండియా|date=January 6, 2014|accessdate=April 8, 2014}}</ref> సంక్రాంతి పండగ వల్ల షూటింగ్ వాయిదా వేసిన తర్వాత జనవరి 18 నుంచి మహేష్ షూటింగులో పాల్గుంటాడని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/mahesh-to-join-aagadu-shoot-from-18th.html|title=18 నుంచి ఆగడు పై దృష్టి పెట్టనున్న మహేష్|publisher=123తెలుగు.కామ్|date=January 16, 2014|accessdate=April 8, 2014}}</ref> జనవరి 18 నుంచి హైదరాబాదులోని సారథి స్టూడియోసులో కోర్ట్ సెట్లో చిత్రీకరణ కొనసాగింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-shoot-progressing-in-sarathi-studios.html|title=సారధి స్టూడియోస్ లో ఆగడు షూటింగ్|publisher=123తెలుగు.కామ్|date=January 18, 2014|accessdate=April 8, 2014}}</ref> జనవరి 22న తమన్నా సినిమాలో తన పాత్ర చిత్రీకరణను మొదలుపెట్టింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/tammanah-starts-her-shoot-for-aagadu.html|title=ఆగడు షూటింగ్ మొదలు పెట్టిన తమన్నా|publisher=123తెలుగు.కామ్|date=January 23, 2014|accessdate=April 8, 2014}}</ref> ఆపై నానక్రామ్ గూడాలో పోరాట సన్నివేశాలతో కలిపి మరికొన్ని ముఖ్యసన్నివేశాలు అక్కడ నిర్మించిన ఒక సెట్లో చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-shooting-shifts-to-nanakramguda.html|title=నానక్రామ్ గూడాకి మారిన ఆగడు షూటింగ్|publisher=123తెలుగు.కామ్|date=January 27, 2014|accessdate=April 8, 2014}}</ref> ఆపై ఫిబ్రవరి నెలమొదట్లో మహేష్, తమన్నాలపై హైదరాబాద్ శివార్లలో సన్నివేశాలు చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-rolling-in-hyderabad.html|title=భాగ్యనగరంలో ఆగడు షూటింగ్|publisher=123తెలుగు.కామ్|date=February 3, 2014|accessdate=April 8, 2014}}</ref> రామోజీ ఫిల్మ్ సిటీలో మండువా హౌస్ ప్రాంతంలోని సెట్లో ఫిబ్రవరి 5న తమన్నా, గిరిధర్ నిశ్చితార్థం జరిపేందుకు రెండు కుటుంబాలు సిద్ధమవుతున్నప్పుడు మహేష్ వచ్చి ఆ నిశ్చితార్థాన్ని ఆపి తన ప్రేమను తెలియజేసే సన్నివేశాన్ని చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/mahesh-aagadu-at-rfc-129819.html|title=నిశ్చితార్దం ఆపు చేసిన మహేష్ బాబు|publisher=వన్ఇండియా|date=February 5, 2014|accessdate=April 8, 2014}}</ref><ref>{{cite web|url=http://www.andhraprabha.com/cinema/box-office/thamanna-movie-engagement-seen-shooting-at-hyderabd/11577.html|title=ఆగిన.. తమన్నా నిశ్చితార్ధం?|publisher=ఆంధ్రప్రభ|date=February 5, 2014|accessdate=April 8, 2014}}</ref> ఆపై ఫిబ్రవరి 23 నుంచి చిత్రీకరణ గుజరాత్ పరిసరాల్లో కాకుండా బళ్ళారిలో జరుగుతుందని, ఆ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, హీరో ఇంట్రడక్షన్ పాట తెరకెక్కిస్తామని స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-to-shift-to-bellary-from-23rd.html|title=23 నుంచి బళ్ళారికి వెళ్లనున్న ‘ఆగడు’|publisher=123తెలుగు.కామ్|date=February 17, 2014|accessdate=April 8, 2014}}</ref> మొదట బళ్ళారి షెడ్యుల్లో భాగంగా ఫిబ్రవరి 23 నుంచి ఇంట్రడక్షన్ పాట చిత్రీకరణ అక్కడున్న జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీలో మొదలయ్యింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-title-song-to-be-shot-in-bellary.html|title=బళ్ళారిలో మొదలైన ‘ఆగడు’ టైటిల్ సాంగ్|publisher=123తెలుగు.కామ్|date=February 23, 2014|accessdate=April 8, 2014}}</ref>
 
[[దస్త్రం:Aagadu Bellary working still.jpg|thumb|left|240px|బళ్ళారిలో "ఆగడు" పాట చిత్రీకరణలో మహేష్, మరికొందరు నృత్యకారులు.]]
అక్కడ బాగా దుమ్ము, ధూళి నడుమ కూడా మహేష్ చిత్రీకరణ కొనసాగించాడు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/mahesh-babu-shoots-in-dusty-conditions.html|title=దుమ్ముదూళిలో షూటింగ్ చేస్తున్న మహేష్ బాబు|publisher=123తెలుగు.కామ్|date=February 25, 2014|accessdate=April 8, 2014}}</ref> అయితే ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన సన్నివేశం ఒకటి లీకైంది. బ్యాక్ గ్రౌండులో ఓ గనికి సంబంధించిన బ్లాస్టింగ్ జరుగుతుండగా ఫుల్ హ్యాండ్స్ షర్టు మడత పెట్టుకుంటూ మహేష్ నడుచుకుంటూ వస్తున్న సన్నివేశం ఆ వీడియోలో ఉంది.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1402/28/1140228034_1.htm|title='ఆగడు'కి లీకుల బెడద... షర్టు మడత పెడుతున్న మహేష్!|publisher=వెబ్ దునియా|date=February 28, 2014|accessdate=April 8, 2014}}</ref> ఆపై మార్చి నెలమొదట్లో బళ్ళారి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులూరులోని ప్రకృతి అందాల నడుమ మహేష్, తమన్నా మరియూ 50 డాన్సర్లు ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యదర్శకత్వంలో ఓ పాటను చిత్రీకరించారు. ఆ పాటలో ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని ప్రొడక్షన్ వర్గాలు చెప్పారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1403/01/1140301050_1.htm|title=బళ్లారిలో మహేష్‌ బాబు, తమన్నాల డాన్స్‌ డాన్స్|publisher=వెబ్ దునియా|date=March 1, 2014|accessdate=April 8, 2014}}</ref> ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-racing-ahead-in-bellary.html|title=బళ్ళారిలో ‘ఆగడు’ షూటింగ్|publisher=123తెలుగు.కామ్|date=March 4, 2014|accessdate=April 8, 2014}}</ref> అయితే చిత్రీకరణ జరుగుతుండగా మహేష్ కాలిలోని కండరాలకు బలమైన గాయమయ్యిందని, అందువల్ల వారం పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇవ్వడం వల్ల షూటింగ్ ఆగింది అని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/mahesh-babu-injured-on-the-sets-aagadu-131520.html|title=మహేష్ బాబుకు గాయం, ఆగడు షూటింగ్ ఆగింది?|publisher=వన్ఇండియా|date=March 5, 2014|accessdate=April 8, 2014}}</ref> అక్కడ చిత్రీకరణ పూర్తయ్యాక బళ్ళారి నుంచి సినిమా బృందం మార్చి 6న హైదరాబాదుకు తిరిగొచ్చింది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/aagadu-bellary-schedule-wrapped-up-131591.html|title=బళ్లారి నుండి ‘ఆగడు’ టీం తిరుగు ప్రయాణం|publisher=వన్ఇండియా|date=March 6, 2014|accessdate=April 8, 2014}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-team-returns-from-bellary.html|title=బళ్ళారి నుండి వచ్చేసిన ఆగడు బృందం|publisher=123తెలుగు.కామ్|date=March 6, 2014|accessdate=April 8, 2014}}</ref> వారం పాటు విశ్రాంతి తీసుకొమ్మని వైద్యులు సలహా ఇచ్చిన మాట నిజమే అయినా మహేష్ కాలికి ఎలాంటి గాయాలు తగల్లేదని, కాకపోతే బాగా అలిసిపోయి శక్తి కోల్పోయాడని, మార్చి 10 నుంచి హైదరాబాదులో జరగబోయే షెడ్యూల్లో మహేష్ పాల్గుంటాడని దర్శకనిర్మాతలు స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/aagadu-shoot-hyd-from-march-10-131680.html|title=మహేష్ బాబు క్షేమం, 10వ తేదీని నుండి రంగంలోకి...|publisher=వన్ఇండియా|date=March 7, 2014|accessdate=April 8, 2014}}</ref> మార్చి 16 నుంచి మహేష్, తమన్నా ఇద్దరూ చిత్రీకరణలో పాల్గొంటారని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/mahesh-babu-to-join-aagadus-sets-soon.html|title=త్వరలో ఆగడు షూటింగ్ లో పాల్గొనున్న మహేష్|publisher=123తెలుగు.కామ్|date=March 11, 2014|accessdate=April 8, 2014}}</ref> ఈలోపు హైదరాబాదులో చిత్రీకరణ జరుగుతుండగా ఏప్రిల్ నెలలో చిత్రీకరణ గుజరాత్ పరిసరాల్లో జరుగుతుందని, అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-to-be-shot-in-gujarath-in-april.html|title=ఏప్రిల్ నుండి గుజరాత్ లో ‘ఆగడు’ షూటింగ్|publisher=123తెలుగు.కామ్|date=March 12, 2014|accessdate=April 8, 2014}}</ref> ఇంతలో మార్చి నెలచివర్లో చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక సెట్లో కొనసాగింది. అక్కడ తమన్నా స్వీట్ షాప్ యజమానిగా కనిపించే దృశ్యాలు కూడా తెరకెక్కించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-shoot-progressing-in-rfc-2.html|title=రామోజీ ఫిలిం సిటీలో ఆగడు|publisher=123తెలుగు.కామ్|date=March 22, 2014|accessdate=April 8, 2014}}</ref> అయితే భారీ ఎండల దృష్ట్యా గుజరాత్, రాజస్థాన్లకు బదులుగా ఏప్రిల్ 10 నుంచి చిత్రీకరణ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతుందని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/105475.html|title=తండ్రి బాటలో కూల్ మహేష్|publisher=ఇండియాగ్లిట్స్|date=March 30, 2014|accessdate=April 8, 2014}}</ref> మార్చి నెలచివర్లో రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/rajendra-prasad-and-mahesh-babu-as-father-and-son.html|title=మహేష్ బాబు తండ్రిగా కనిపించనున్న రాజేంద్ర ప్రసాద్|publisher=123తెలుగు.కామ్|date=March 30, 2014|accessdate=April 9, 2014}}</ref> సోనూ సూద్ ముంబైలో షారూఖ్ ఖాన్ "హ్యాపీ న్యూ ఇయర్" చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్ 3న హైదరాబాదులో ఈ సినిమా షూటింగులో పాల్గొని మళ్ళీ సాయంత్రం ముంబై వెళ్ళి "హ్యాపీ న్యూ ఇయర్" చిత్రీకరణలో పాల్గొన్నాడు. దాదాపు ఒక వారం పాటు ఇదే చర్య కొనసాగింది. ఆ వారం రోజుల్లో మహేష్, సోనూ సూద్ లపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/scenes-between-mahesh-and-sonu-sood-shot-for-aagadu.html|title=మహేష్, సోను సూద్ మధ్య ‘ఆగడు’ సన్నివేశాలు|publisher=123తెలుగు.కామ్|date=April 7, 2014|accessdate=April 9, 2014}}</ref>
 
ఆ తర్వాత హైదరాబాదులోని చిరాన్ ఫోర్ట్ క్లబ్ భవనం దగ్గర సినిమా యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్లను తెరకెక్కించారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1404/11/1140411045_1.htm|title=శరవేగంగా ఆగడు షూటింగ్.. హైదరాబాద్‌లో ఫ్లాష్‌బ్యాక్ సీన్స్!|publisher=వెబ్ దునియా|date=April 11, 2014|accessdate=April 12, 2014}}</ref> కొంత విరామం తర్వాత తదుపరి షెడ్యూల్ హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎండల మధ్య ఏప్రిల్ 27 నుంచి మొదలయ్యింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-next-schedule-to-begin-from-april-27.html|title=ఏప్రిల్ 27 న మొదలు కానున్న ‘ఆగడు’ తదుపరి షెడ్యూల్|publisher=123తెలుగు.కామ్|date=April 26, 2014|accessdate=April 26, 2014}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/mahesh-babu-braves-the-summer-heat.html|title=సమ్మర్ హీట్ ని తట్టుకొని షూట్ చేస్తున్న మహేష్ బాబు|publisher=123తెలుగు.కామ్|date=May 1, 2014|accessdate=May 3, 2014}}</ref> ఆపై శంషాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ కొనసాగింది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/312531433095307430953134-3078309531053137-telugu-news-107140|title=వేగంగా ఆగడు|publisher=ఇండియాగ్లిట్స్|date=May 7, 2014|accessdate=May 7, 2014}}</ref> మే 7న రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం రానున్న కాలంలో తమ తదుపరి షెడ్యూల్ గుజరాత్ రాష్ట్రంలో మొదలుపెట్టనున్నారని, అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలు, పాటలు చిత్రీకరిస్తారని వెళ్ళడించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-completes-rfc-schedule.html|title=ఆర్.ఎఫ్.సి షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ బాబు|publisher=123తెలుగు.కామ్|date=May 8, 2014|accessdate=May 16, 2014}}</ref> ఈలోపు హైదరాబాదులో చిత్రీకరణ జరుగుతుండగా మే 11న తమన్నా సెట్లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసిన తమన్నా ఒక వర్కింగ్ స్టిల్ పోస్ట్ చేసి తద్వారా సినిమాలో తన వేషధారణను విడుదల చేసింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/tamannaah-is-back-on-the-sets-of-aagadu.html|title=‘ఆగడు’ సెట్లో అడుగుపెట్టిన తమన్నా|publisher=123తెలుగు.కామ్|date=May 11, 2014|accessdate=May 16, 2014}}</ref> కొన్ని రోజుల తర్వాత చిత్రబృందం హైదరాబాదులో షెడ్యూల్ పూర్తవ్వగానే మే 20 నుంచి తదుపరి షెడ్యూల్ లడఖ్ ప్రాంతంలో మొదలవుతుందని స్పష్టం చేసింది. రెండు పాటలు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్న ఈ షెడ్యూల్లో మహేష్, తమన్నా పాల్గుంటారని దర్శకనిర్మాతలు స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/mahesh-babu-to-shoot-in-ladakh.html|title=లడఖ్ బయలుదేరిన ‘ఆగడు’ చిత్ర బృందం|publisher=123తెలుగు.కామ్|date=May 17, 2014|accessdate=May 17, 2014}}</ref> లడఖ్ లోని పన్గాంగ్ లేక్ వద్ద మహష్ బాబు, తమన్నాలపై ఓ పాటని చిత్రీకరించారు. ఈ పాటకి దినేష్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసాడు. లడఖ్ షెడ్యూల్ మే 30 వరకు అక్కడ కొనసాగింది. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక మరలా చిత్రీకరణ జూన్ మొదటి వారంలో రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతుందని చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-audio-release-on-mahesh-babu-birthday.html|title=మహేష్ బాబు బర్త్ డే కానుకగా ‘ఆగడు’ ఆడియో|publisher=123తెలుగు.కామ్|date=May 26, 2014|accessdate=May 26, 2014}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-rfc-schedule-to-commence-next-week.html|title=రామోజీ ఫిలిం సిటీలో ‘ఆగడు’ తదుపరి షెడ్యూల్|publisher=123తెలుగు.కామ్|date=May 29, 2014|accessdate=May 29, 2014}}</ref> ఆ తర్వాత జూన్ రెండోవారంలో చిత్రీకరణ ముంబైలో కొనసాగింది. అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కించాక సినీబృందం కొన్ని కీలకమైన ప్రేమ సన్నివేశాలను 15 రోజుల పాటు కేరళలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/mahesh-s-aagadu-shooting-mumbai-137547.html|title=ముంబై తర్వాత కేరళ...మహేష్|publisher=వన్ఇండియా|date=June 10, 2014|accessdate=June 11, 2014}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-team-to-head-to-kerala.html|title=త్వరలో కేరళ వెళ్లనున్న ‘ఆగడు’ టీం|publisher=123తెలుగు.కామ్|date=June 12, 2014|accessdate=June 12, 2014}}</ref> ముంబై షెడ్యూల్ జూన్ 18న పూర్తవ్వగా తదుపరి షెడ్యూల్ బళ్ళారి, కేరళలో జూన్ 22 నుంచి జరుగుతాయని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/srinu-vaitla-thanks-his-cast-and-crew.html|title=తన టీంకి థాంక్స్ చెప్పిన శ్రీను వైట్ల|publisher=123తెలుగు.కామ్|date=June 18, 2014|accessdate=June 18, 2014}}</ref> బళ్ళారిలోని జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పరిసరాల్లో కొన్ని ముఖ్యమైన పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు. విపరీతమైన దుమ్ము-ధూళి మధ్య చిత్రీకరణ జరపడం వల్ల మహేష్ అనారోగ్యానికి గురయ్యాక వైద్యులు జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని ధృవీకరించడంతో కొంతసేపు షూటింగ్ ఆగింది.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-gossips/mahesh-babu-agadu-shooting-in-ballari-114063000040_1.html|title=విపరీతమైన దుమ్ములో ఆగడు షూటింగ్... మహేష్‌కు జ్వరం!|publisher=వెబ్ దునియా|date=June 30, 2014|accessdate=July 3, 2014}}</ref><ref>{{cite web|url=http://www.sakshi.com/news/state/mahesh-babu-agadu-shoting-in-jindal-steel-plant-144194|title=జిందాల్‌లో ‘ఆగడు’ సినిమా షూటింగ్|publisher=సాక్షి|date=June 30, 2014|accessdate=July 3, 2014}}</ref> బళ్ళారిలో చిత్రీకరణ ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చాక జులై 3, 2014 నుంచీ ఒక ప్రత్యేకమైన సెట్లో మహేష్, శ్రుతి హాసన్ లపై ఒక పాటను తెరకెక్కించారు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/31203143311431033135-31123137307431053135-3126313931083135-31293134312831123149-30883103314231183149-31283134307430953149-telugu-news-109791|title=రేపటి నుండి శృతి హాసన్ ఐటెమ్ సాంగ్|publisher=ఇండియాగ్లిట్స్|date=July 2, 2014|accessdate=July 3, 2014}}</ref>
 
[[దస్త్రం:Aagadu Switzerland working still.jpg|thumb|left|240px|యూరప్ లోని స్విట్జర్ల్యాండ్ లో పాట చిత్రీకరణలో పాల్గొన్న తమన్నా, కొంతమంది విదేశీ నృత్యకారిణిలు.]]
చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట శివారులోని సుచిరిండియా వెంచర్‌లోని మైదాన ప్రాంతంలో పవర్‌ ప్రాజెక్ట్‌ సెట్‌ వేశారు. భారీ క్రేన్‌లతో పవర్‌ ప్రాజెక్ట్‌ వద్ద వందల మంది కూలీలు పనిచేసే సన్నివేశాలను, ప్రాజెక్ట్‌ నిర్మాణం సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్ గన్‌పేల్చుతూ రౌడీలను అడ్డుకోవడం; సోనూసూద్‌, రౌడీలతో ఫైటింగ్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలుసుకున్న అభిమనులు, పరిసర ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చారు.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/node/112603|title=కొనసాగుతున్న ఆగడు|publisher=ఆంధ్రజ్యోతి|date=July 10, 2014|accessdate=July 10, 2014}}</ref> ఆ తర్వాత హైదరాబాదులో చిత్రీకరణ పూర్తికాగానే ఆగస్ట్ 12, 2014 నుండి నార్వే దేశంలో మహేష్, తమన్నాలపై ఒక పాటను చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి. నార్వే వెళ్ళేముందు హైదరాబాదులో కొన్ని సన్నివేశాలు, శ్రుతి హాసన్ ఐటెం సాంగ్ తెరకెక్కించాలనుకున్నారు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/31123134312031493125314330933135-312531423123313731083137311231493112-3078309531053137-telugu-news-110228|title=నార్వేకి వెళుతున్న 'ఆగడు'|publisher=ఇండియాగ్లిట్స్|date=July 10, 2014|accessdate=July 10, 2014}}</ref> అందులో భాగంగా రామానాయుడు స్టూడియోలో పరిసరాల్లోని ఓ భవంతిలో టాకీకు సంబంధించి ప్యాచ్‌ వర్క్‌ పూర్తిచేశారు. శ్రుతి హాసన్ ఐటెం సాంగును జులై 18, 2014 నుండి చిత్రీకరించాలని ప్రయత్నించి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో నాలుగు రోజులపాటు రిహార్సల్స్ చేసారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/shruti-hassan-aagadu-movie-item-song-114071700080_1.html|title=మహేష్ బాబుతో శ్రుతి హాసన్ ఐటెం సాంగ్... ఆగడు కోసం...|publisher=వెబ్ దునియా|date=July 17, 2014|accessdate=July 22, 2014}}</ref> పాట కోసం శ్రుతి హాసన్ 3 రోజుల కాల్ షీట్లు కూడా ఇచ్చింది. కానీ అప్పుడు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డుల ప్రదానం చెన్నైలో జరగడంతో ఆ 3 రోజులు వృధా అయ్యాయి.<ref>{{cite web|url=http://www.andhrabhoomi.net/node/156243|title=ఆగాల్సిందే మరి..!|publisher=ఆంధ్రభూమి|date=July 21, 2014|accessdate=July 22, 2014}}</ref> దాంతో రామోజీ ఫిల్మ్ సిటీలో జులై 18, 2014న మహేష్, సోనూ సూద్, మరికొందరిపై ఇంటర్వెల్ ఫైట్ తెరకెక్కించడం మొదలుపెట్టారు. అది పూర్తయ్యాక జులై 25 నుండి శ్రుతి హాసన్ ఐటెం సాంగ్ తెరకెక్కించాలని భావించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-movie-interval-fight-at-rfc.html|title=ఇంటర్వెల్ ఫైట్ లో ‘ఆగడు’ బిజీ..!|publisher=123తెలుగు.కామ్|date=July 18, 2014|accessdate=July 22, 2014}}</ref> ఆ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక ప్రత్యేకమైన సెట్లో జులై 26, 2014 నుండీ చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/shruti-haasan-ready-for-item-song-in-aagadu.html|title=ఆగడు ఐటెం సాంగ్ కి శృతి రెడీ|publisher=123తెలుగు.కామ్|date=July 26, 2014|accessdate=July 27, 2014}}</ref><ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/sreenu-vytla-ramoji-rao-114072600075_1.html|title=రామోజీరావు ఆశీర్వాదం... 'ఆనందం'లో శ్రీనువైట్ల...|publisher=వెబ్ దునియా|date=July 26, 2014|accessdate=July 27, 2014}}</ref> పాట చిత్రీకరణ పూర్తయ్యాక సినిమా పతాక సన్నివేశాలను హైదరాబాదులో తెరకెక్కించారు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/3093314931223144311831343093314931283149-30983135310831493120313630933120310731223147-3078309531053137-telugu-news-111306|title=క్లైమాక్స్ చిత్రీకరణలో 'ఆగడు'|publisher=ఇండియాగ్లిట్స్|date=August 2, 2014|accessdate=August 2, 2014}}</ref> ఆగస్ట్ 11, 2014 ఉదయం పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసిన మహేష్ ఆ రాత్రి యూరప్ బయలుదేరాడు. అక్కడ కొన్ని అందమైన ప్రదేశాల్లో తమన్నాతో కలిసి రెండు పాటల చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆగస్ట్ 23, 2014న ఈ షెడ్యూల్ ముగించాలనుకున్నా ఆగస్ట్ 25న ఈ షెడ్యూల్ ముగిసింది. తద్వారా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/mahesh-babu-heading-to-europe.html|title=యూరప్ పయనమైన మహేష్ బాబు|publisher=123తెలుగు.కామ్|date=August 11, 2014|accessdate=August 11, 2014}}</ref><ref>{{cite web|url=http://www.indiaglitz.com/311431343103-311431383120314931083135-309831433128313730933137311231493112-31183129314331273149-telugu-news-112388|title=పాట పూర్తి చేసుకున్న మహేష్|publisher=ఇండియాగ్లిట్స్|date=August 20, 2014|accessdate=August 21, 2014}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-europe-schedule-to-be-wrapped-up-today.html|title=నేటితో ముగియనున్న మహేష్ యూరప్ షెడ్యూల్|publisher=123తెలుగు.కామ్|date=August 25, 2014|accessdate=August 25, 2014}}</ref><ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/spotnews/aagadu-s-europe-schedule-be-wrapped-142287.html|title=యూరఫ్‌లో జెండా ఎత్తేసిన మహేష్ బాబు అంట్ టీం|publisher=వన్ఇండియా|date=August 25, 2014|accessdate=August 26, 2014}}</ref> ఊటీలో మిగిలిన ఒక్కపాట చిత్రీకరణ పూర్తవడంతో సెప్టెంబర్ 5, 2014న సినిమా షూటింగ్ ముగిసింది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/-3098--3135--3125--3120--3135--3128--3134--3074--3095--3149--3098--3135--3108--3149--3120--3136--3093--3120--3107--3122--3147--3078--3095--3105--3137--telugu-news-113415|title=చివరి సాంగ్ చిత్రీకరణలో 'ఆగడు'|publisher=ఇండియాగ్లిట్స్|date=September 5, 2014|accessdate=September 8, 2014}}</ref>
 
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1321640" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ