చల్లా రాధాకృష్ణ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 8: పంక్తి 8:


==ఇతర రచనలు==
==ఇతర రచనలు==
* [https://ia600502.us.archive.org/20/items/tamilashahityach024255mbp/tamilashahityach024255mbp.pdf తమిళ సాహిత్య చరిత్ర] (1976)
* [[ఆర్కాటు సోదరులు]] (1988)
* [[ఆర్కాటు సోదరులు]] (1988)



07:25, 4 నవంబరు 2014 నాటి కూర్పు

చల్లా రాధాకృష్ణ శర్మ (1929 - 1999) ప్రముఖ రచయిత, కవి, బహుభాషావేత్త మరియు అనువాదకులు.

వీరు కృష్ణా జిల్లాలోని సోమవరప్పాడు గ్రామంలో జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం అనంతరం మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో చాలాకాలం ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరు తమిళం నుండి చాలా పుస్తకాల్ని అనువాదం చేశారు. పిల్లల కోసం అనగా, అనగా, బెకబెకలు, అన్నదమ్ములు, దయావీరులు, అంతా ఒక్కటే, శ్రీసాయి కథామృతం అనే కథా సంకలనాలను వెలువరించారు. వాన కురిసింది, చందమామ అనే గేయాల పుస్తకాలు రాశారు. ప్రసిద్ధ వ్యక్తులను ' చరిత్ర కెక్కిన చరితార్థులు ' అనే పేరుతో మూడు భాగాలుగా పిల్లలకు పరిచయం చేశారు. దీనిలో భారతదేశానికి చెందిన ఎందరో ప్రసిద్ధిచెందిన మహాపురుషుల పరిచయాలు ఉన్నాయి. జయదేవుడు జీవితచరిత్ర రాశారు.

తమిళ భాషలో ప్రసిద్ధిచెందిన కొన్ని పిల్లల పుస్తకాలను కూడా తెలుగు బాలలకు పరిచయం చేశారు. చిట్టికి చిరుగంట, కడుపులో గారడీ, అడవి ఏనుగు కథ, టైం ఎంతయింది, దారిచూపిన తాత గాంధీ, భారతి చెప్పిన పిల్లల కథలు, బాల రామాయణం, భారతి జీవిత కథ, రంగు రంగుల పూలు చెప్పుకోదగ్గవి. ఆంగ్లంలో పిల్లల కోసం రాసిన కథల పుస్తకం టేల్స్ ఫ్రమ్‌ తెలుగు (1975) మరాఠీ, మళయాళం, తమిళం, హిందూ భాషలలోకి అనువాదం అయింది.

వీరు ఎన్నో సమావేశాలలో సాహిత్యం గురించి ప్రసంగాలు చేశారు. పత్రికలలో వ్యాసాలు ప్రకటించారు.

ఇతర రచనలు

మూలాలు

  • రాధాకృష్ణశర్మ, డాక్టర్ చల్లా, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 497-8.