బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
 
నాగరత్నమ్మ మాతృభాష కన్నడము అయిననూ సంస్కృత, తెలుగు, తమిళ భాషలలో ప్రావీణ్యమును గడించింది. [[తిరుపతి వేంకటకవులు]] రచించిన [[శ్రవణానందము]] అనే పుస్తకములో [[ముద్దు పళని]] విరచితమగు [[రాధికా సాంత్వనము]] గురించి చదివి ఆ పుస్తకమును కొని చదువగా అందులో చాల తప్పులున్నాయని గ్రహించింది. వ్రాతప్రతులకు ముద్రిత ప్రతులకు చాల తేడాలున్నాయి. వ్రాతప్రతులన్నీ సంపాదించి 1911లో వావిళ్ళవారిచే పరిష్కృత పుస్తకము ప్రచురింపచేసింది. పుస్తకములో బూతు పద్యాలున్నాయని బ్రిటీష్ ప్రభుత్వము అభియోగము చేసింది. ప్రసిద్ధులైన కవులు, పండితులు, న్యాయవాదులు వావిళ్ళ వారి తరఫున అర్జీ పెట్టుకొన్నారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వము పట్టు విడవలేదు. వావిళ్ళ దుకాణాలపై దాడి 1927లో జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తరువాత టంగుటూరు ప్రకాశం పంతులు గారి హయాములో బహిష్కారము తొలగించబడింది. ఆ సమయానికి నాగరత్నమ్మ [[తిరువైయ్యారు]]లో ఒక యోగినిగా మారింది.
ఈమె రచించిన గ్రంథములు కొన్ని: #1. శ్రీ త్యాగరాజ అష్టోత్తర శతనామావళి (సంస్కృతం), #2. మద్యపానం (తెలుగు సంభాషణం), #3. దేవదాసీ ప్రబోధ చంద్రోదయం (తెలుగు), #4. పంచీకరణ భౌతిక వివేక విలక్కం(తమిళం)
 
==ముగింపు==
68,799

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1337610" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ