"వీరశైవ మతం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== మత ప్రచారం ==
 
నాటి వైదిక మతం కంటే ఒక అడుగు వెనకకు వేసి, కేవలం మూఢ భక్తి ప్రధానమైన మత ప్రచారానికి పూనుకుంది. కనుకనే, ఈ ఉద్యమం రెండు వందల సంవత్సరాలలో నశించింది. కులభేదాలను రూపుమాపటానికి పూనుకున్న జంగములు తామొక కులమ ఐనారు. కన్నడ దేశంలో లింగాయుతులను పేరుతోను, ఆంధ్రదేశంలో జంగాలు అను పేరుతో వేరు సమాజంలో ఒక భాగంగా మిగిలిపోయారు. బ్రాహ్మణ అధికారంపట్ల ప్రజలలో గల నిరసన భావం వేరశైవ మత రూపం లో వ్యక్తమైంది.
ఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ద, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది.
 
వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు.
 
మిగతా పీఠాలు:-
ఉజ్జయిని-మరుళారాధ్య
కేదారనాథ్-ఎకోరామారాధ్య
శ్రీశైల-పండితారాధ్య
కాశీ-విశ్వారాధ్యులు.
 
వీరి గురించి ఆగమాల్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పీఠాదిపాతులను జగద్గురువులుగా సంబోదిస్తారు.కాగా పస్తుతం రేణుకాచార్య పీఠం శాఖ వారు మాత్రం కొలనుపాకలో కాక కర్ణాటకలోని బాలేహోన్నూరులో కొనసాగాబడుతుంది.
 
== పండిత త్రయం ==
కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వేరశైవ మతం ఆంధ్ర దేశంలో అదుగుపెట్టే సమయానికి ఏ దేశమ్లో మరొక రూపంలో వేరశైవమతం అప్పుడే ప్రారంభం ఐంది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో శైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1341556" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ