"దక్షిణ కొరియా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(తర్జుమా - శుద్ధి)
== సంస్కృతి ==
దక్షిణకొరియా ఉత్తరకొరియాతో తన సంప్రదాయక సంస్కృతిని పంచుకుంటుంది. 1945 నుండి కొరియా ద్వీపకల్పం రెండుగా విడిపోయిన నాటి నుండి రెండు కొరియాలు రెండు ప్రత్యేక సంప్రదాయరీతులను ఏర్పరచుకున్నాయి. చారిత్రకంగా కొరియా సంస్కృతి మీద పొరుగున ఉన్న చైనా ప్రభావం అత్యధికంగా ఉంది. అయినప్పటికీ దక్షిణ కొరియా పొరుగుదేశమైన బృహత్తరమైన చైనాదేశ సంస్కృతికి భిన్నమైన సంస్కృతిని తనకంటూ ప్రత్యేకంగా ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ది సౌత్ కొరియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం సంప్రదాయక కళలను అలాగే ఆధునిక కళారూపాలను ప్రోత్సహిస్తుంది. సస్కృతిక సంస్థల స్థాపన మరియు అభ్యశించడానికి అవసరమైన వసతులను కల్పిస్తున్నది. దక్షిణకొరియా పారిశ్రామికీకరణ మరియు నగరాభివృద్ధి కార్యక్రమాలు కొరియన్ ప్రజాజీవితంలో పలు మార్పులను తీసుకువచ్చింది. ఆర్ధికస్థితిలో మార్పులు మరియు జీవితశైలి నగరాలలో ప్రజలు కేంద్రీకృతం కావడానికి దారి తీసింది. ప్రత్యేకంగా రాజధాని నగరమైన సియోల్ గృహాలలో భిన్నవయస్కులు నివసించడం అనే సంస్కృతి నుండి లఘు కుటుంబాలలా విడిపోవడానికి దారి తీసింది.
=== మతం ===
 
చైనా నుంచి ఉమ్మడి కొరియాకు బౌద్ధమతం క్రీ.శ.374లో ప్రాకింది. చైనాకు అప్పటికే భారతదేశం నుంచి పలువురు భిక్షువులు వెళ్ళి అందించిన బౌద్ధం 4వ శతాబ్ది నాటికి కొరియా చేరింది.
=== కళలు ===
దక్షిణకొరియా కళలు అత్యధికంగా బుద్ధిజం మరియు కంఫ్యూజియనిజంతో ప్రభావితమై ఉంటాయి. వాటిని అనేక సంప్రదాయక చిత్రాలు, శిల్పాలు, సెరామిక్స్ మరియు కళాప్రదర్శనలలో దర్శించవచ్చు. జోసియంస్ బీక్‌జా మరియు బంచియాంగ్ మరియు గోరియోస్ సెలాండన్ వంటి కొరియన్ పాటరీ మరియు పార్సిలియన్ కళాఖండాలు ప్రపంచప్రసిద్ధి చెందాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1350004" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ