కోవెల సంపత్కుమారాచార్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 37: పంక్తి 37:
'''కోవెల సంపత్కుమారాచార్య''' [[1933]], [[జూన్ 26]]వ తేదీన కోవెల రంగాచార్యులు, చూడమ్మ దంపతులకు కనిష్ఠపుత్రుడిగా జన్మించాడు.<ref>{{cite news|last1=టి.|first1=శ్రీరంగస్వామి|title=కోవెల సంపత్కుమారాచార్యులు - ఒక తలపు|url=http://visalaandhra.com/literature/article-137450|accessdate=13 December 2014|work=విశాలాంధ్ర దినపత్రిక|publisher=విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్|date=04-08-2014}}</ref> ఇతని సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ. సంపత్కుమార నలుగురు అన్నదమ్ములలో రెండవ అన్న లక్ష్మీనరసింహాచార్యులు కూడా కవి.
'''కోవెల సంపత్కుమారాచార్య''' [[1933]], [[జూన్ 26]]వ తేదీన కోవెల రంగాచార్యులు, చూడమ్మ దంపతులకు కనిష్ఠపుత్రుడిగా జన్మించాడు.<ref>{{cite news|last1=టి.|first1=శ్రీరంగస్వామి|title=కోవెల సంపత్కుమారాచార్యులు - ఒక తలపు|url=http://visalaandhra.com/literature/article-137450|accessdate=13 December 2014|work=విశాలాంధ్ర దినపత్రిక|publisher=విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్|date=04-08-2014}}</ref> ఇతని సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ. సంపత్కుమార నలుగురు అన్నదమ్ములలో రెండవ అన్న లక్ష్మీనరసింహాచార్యులు కూడా కవి.
==విద్య,ఉద్యోగం==
==విద్య,ఉద్యోగం==
ఇతని విద్యాభ్యాసం ఎక్కువగా [[వరంగల్లు]]లో జరిగింది. [[బందరు]] చిట్టిగూడూరు నారసింహ సంస్కృతిక కళాశాలలో భాషాప్రవీణ చదివాడు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందాడు. 1966లో ప్రైవేటుగా హిందీ ఎం.ఎ. చేశాడు. కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత 1978లో ''ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ -సంప్రదాయరీతి'' అనే అంశంపై పరిశోధన చేసి ఆ విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి పి.హెచ్.డి. సాధించాడు. రజాకార్ల అల్లర్ల కారణంగా అన్న లక్ష్మీనరసింహాచార్యులు గుంటూరు జిల్లా రేపల్లె పక్కన గల నల్లూరి పాలెంకు మారి అక్కడ బడి నడిపాడు. అప్పుడు సంపత్కుమారాచార్య ఆ బడిలో హిందీ పాఠాలు చెప్పేవాడు. 1962లో వరంగల్లులోని మల్టీపర్పస్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ఇతడు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి 1993 లో ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు.
ఇతని విద్యాభ్యాసం ఎక్కువగా [[వరంగల్లు]]లో జరిగింది. [[బందరు]] చిట్టిగూడూరు నారసింహ సంస్కృతిక కళాశాలలో భాషాప్రవీణ చదివాడు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందాడు. 1966లో ప్రైవేటుగా హిందీ ఎం.ఎ. చేశాడు<ref>{{cite news|last1=కొలనుపాక|first1=కుమారస్వామి|title=కమనీయం కోవెల'కలం'|url=http://www.prabhanews.com/specialstories/article-317479|accessdate=14 December 2014|work=ఆంధ్రప్రభ దినపత్రిక|publisher=ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ లిమిటెడ్, హైదరాబాదు|date=11-08-2012}}</ref>. కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత 1978లో ''ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ -సంప్రదాయరీతి'' అనే అంశంపై పరిశోధన చేసి ఆ విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి పి.హెచ్.డి. సాధించాడు. రజాకార్ల అల్లర్ల కారణంగా అన్న లక్ష్మీనరసింహాచార్యులు గుంటూరు జిల్లా రేపల్లె పక్కన గల నల్లూరి పాలెంకు మారి అక్కడ బడి నడిపాడు. అప్పుడు సంపత్కుమారాచార్య ఆ బడిలో హిందీ పాఠాలు చెప్పేవాడు. 1962లో వరంగల్లులోని మల్టీపర్పస్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ఇతడు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి 1993 లో ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు.

==సాహిత్యం==
==సాహిత్యం==
ఇతడు తన పదమూడవ యేటే [[కోవెల సుప్రసన్నాచార్య]]తో కలిసి జంటగా కవిత్వం చెప్పనారంభించాడు. 1950 ప్రాంతంలో [[విశ్వనాథ సత్యనారాయణ]]తో పరిచయం ఏర్పడింది. అతని సాహిత్య ప్రభావం సంపత్కుమారపై జీవితకాలం పనిచేసింది. ఇతడు వ్యాకరణ, ఛందో గ్రంథాలను, విమర్శను, ఖండకావ్యాలను, సాహిత్య చరిత్రను, శతకాలను, ప్రాచీన గ్రంథాల పరిష్కరణలను, విపులమైన పీఠికలను,నాటికలను ఎన్నో వ్రాశాడు. 'మరుగునపడిన మన పండితులు' పేరిట జనధర్మలో ధారావాహికంగా 52 వారాలు వ్రాశాడు.
ఇతడు తన పదమూడవ యేటే [[కోవెల సుప్రసన్నాచార్య]]తో కలిసి జంటగా కవిత్వం చెప్పనారంభించాడు. 1950 ప్రాంతంలో [[విశ్వనాథ సత్యనారాయణ]]తో పరిచయం ఏర్పడింది. అతని సాహిత్య ప్రభావం సంపత్కుమారపై జీవితకాలం పనిచేసింది. ఇతడు వ్యాకరణ, ఛందో గ్రంథాలను, విమర్శను, ఖండకావ్యాలను, సాహిత్య చరిత్రను, శతకాలను, ప్రాచీన గ్రంథాల పరిష్కరణలను, విపులమైన పీఠికలను,నాటికలను ఎన్నో వ్రాశాడు. 'మరుగునపడిన మన పండితులు' పేరిట జనధర్మలో ధారావాహికంగా 52 వారాలు వ్రాశాడు.

02:05, 14 డిసెంబరు 2014 నాటి కూర్పు

కోవెల సంపత్కుమారాచార్య
జననంకోవెల సంపత్కుమారాచార్య
(1933-06-26)1933 జూన్ 26
India వరంగల్ పట్టణం, తెలంగాణా రాష్ట్రం
మరణం2010 ఆగస్టు 05
వృత్తిఅధ్యాపకుడు
మతంహిందూ
భార్య / భర్తలక్ష్మీనరసమ్మ
తండ్రికోవెల రంగాచార్యులు
తల్లిచూడమ్మ

కోవెల సంపత్కుమారాచార్య 1933, జూన్ 26వ తేదీన కోవెల రంగాచార్యులు, చూడమ్మ దంపతులకు కనిష్ఠపుత్రుడిగా జన్మించాడు.[1] ఇతని సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ. సంపత్కుమార నలుగురు అన్నదమ్ములలో రెండవ అన్న లక్ష్మీనరసింహాచార్యులు కూడా కవి.

విద్య,ఉద్యోగం

ఇతని విద్యాభ్యాసం ఎక్కువగా వరంగల్లులో జరిగింది. బందరు చిట్టిగూడూరు నారసింహ సంస్కృతిక కళాశాలలో భాషాప్రవీణ చదివాడు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందాడు. 1966లో ప్రైవేటుగా హిందీ ఎం.ఎ. చేశాడు[2]. కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత 1978లో ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ -సంప్రదాయరీతి అనే అంశంపై పరిశోధన చేసి ఆ విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి పి.హెచ్.డి. సాధించాడు. రజాకార్ల అల్లర్ల కారణంగా అన్న లక్ష్మీనరసింహాచార్యులు గుంటూరు జిల్లా రేపల్లె పక్కన గల నల్లూరి పాలెంకు మారి అక్కడ బడి నడిపాడు. అప్పుడు సంపత్కుమారాచార్య ఆ బడిలో హిందీ పాఠాలు చెప్పేవాడు. 1962లో వరంగల్లులోని మల్టీపర్పస్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ఇతడు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి 1993 లో ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు.

సాహిత్యం

ఇతడు తన పదమూడవ యేటే కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి జంటగా కవిత్వం చెప్పనారంభించాడు. 1950 ప్రాంతంలో విశ్వనాథ సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. అతని సాహిత్య ప్రభావం సంపత్కుమారపై జీవితకాలం పనిచేసింది. ఇతడు వ్యాకరణ, ఛందో గ్రంథాలను, విమర్శను, ఖండకావ్యాలను, సాహిత్య చరిత్రను, శతకాలను, ప్రాచీన గ్రంథాల పరిష్కరణలను, విపులమైన పీఠికలను,నాటికలను ఎన్నో వ్రాశాడు. 'మరుగునపడిన మన పండితులు' పేరిట జనధర్మలో ధారావాహికంగా 52 వారాలు వ్రాశాడు.

రచనలు

  1. హృద్గీత (కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి)
  2. ఆనందలహరి (కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి)
  3. అపర్ణ (కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి)
  4. లక్షణదీపిక (సులభ వ్యాకరణ గ్రంథం)
  5. ఛందోవికాసము
  6. మధురగాథలు
  7. చేతనావర్తము (1,2 భాగాలు)
  8. ఛందః పదకోశము[3]
  9. వచనపద్యం - లక్షణచర్చ (చేకూరి రామారావుతో కలిసి)
  10. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ - సాంప్రదాయికరీతి (పిహెచ్‌.డి. సిద్ధాంత గ్రంథం)
  11. తెలుగు సాహిత్య చరిత్ర
  12. పూర్వ కవుల కావ్య దృక్పథాలు
  13. అంతర్మథనము
  14. తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు
  15. కావ్యం-కవిస్వామ్యం
  16. కాలస్పృహ (ఖండకావ్య సంపుటి)
  17. ఆముక్త
  18. కిన్నెరసాని పాటలు - వస్తువిన్యాసం
  19. కన్యాశుల్కం-మరోవైపు
  20. చేరాకు ఒక శతమానం
  21. చింతయంతి
  22. ఛందోభూమికలు
  23. విశ్వనాథ సాహిత్య దర్శనం
  24. కల్హణ (అనువాదం)
  25. సుకవి మనోరంజనము (పరిష్కరణ)
  26. లక్షణసార సంగ్రహము (పరిష్కరణ)
  27. రంగనాథ రామాయణము (పరిష్కరణ)
  28. ఏకశిలా సాహిత్య సౌందర్యము (సంపాదకత్వం)

మూలాలు

  1. టి., శ్రీరంగస్వామి (04-08-2014). "కోవెల సంపత్కుమారాచార్యులు - ఒక తలపు". విశాలాంధ్ర దినపత్రిక. విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్. Retrieved 13 December 2014. {{cite news}}: Check date values in: |date= (help)
  2. కొలనుపాక, కుమారస్వామి (11-08-2012). "కమనీయం కోవెల'కలం'". ఆంధ్రప్రభ దినపత్రిక. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ లిమిటెడ్, హైదరాబాదు. Retrieved 14 December 2014. {{cite news}}: Check date values in: |date= (help)
  3. కోవెల, సంపత్కుమారాచార్య (1977). ఛందః పదకోశము. హైదరాబాదు: తెలుగు అకాడెమీ. Retrieved 14 December 2014.