కోవెల సంపత్కుమారాచార్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 75: పంక్తి 75:
* 1992 - దాశరథి అవార్డు
* 1992 - దాశరథి అవార్డు
* 1993 - భాగ్య అవార్డు
* 1993 - భాగ్య అవార్డు
===రచనల నుండి ఉదాహరణ===
<poem>
చేరా! ఆత్మీకృత సు
స్మేరా! మైత్రీ విచిత్ర మృదుతాధారా!
వారిత దురహంకార వి
చారా! బంధుర వచో విసారా! చేరా!

ఇది చిత్రము, బస్ పయనము
ముదురెండలు, నీదు వ్యాసములబడి ఊహల్
చెదరగ, నీవే మకుటము –
మొదలైనది శతక మొక్క ముచ్చట, చేరా!

ఎందాక పద్యముండునొ
అందాకను శతకముండునంటివి కాదా!
ఎందాక కవిత వుండునొ
అందాకను పద్యముండునందును, చేరా!

చేరాతలంతగా రా
సీ రాసీ ఏమిలబ్ధి చేకూరెను, మీ
వారూ, మా వారూ సాం
బారులు చిమ్ముటలు తప్ప, మధుమతి, చేరా!

రారా, కారా, బూరా
సీరా, బేరా, తిరా, వసీరా, నారా
కోరా, తారా, కేరా –
ఈ రాంతుల తోటి వేగుటెట్లా? చేరా!

భావాభ్యుదయమ్ముల శ్రీ
శ్రీ విప్లవ భావలయ రేఖలమీదన్
ధీ వెంచుచు నిజరీతుల
సేవించె విదూషకత్వ సీధువు, చేరా!

గిచ్చుట, కయ్యాలాడుట
మచ్చికయై పోయె నీదు మాటలకున్, నీ
దచ్చపు మనసగుటన్ పొర
పొచ్చెము మాకెపుడు రాక పోయెను, చేరా!

మన కవుల కేమి లోటగు
జనకవితలటంచు రాసి జనికవులై, చా
రణ కవులుగ తేలిరి, కా
రణ జన్ములుగ చరింతు, రౌరా, చేరా!

వ్యాకరణమ్మంటేనే
శోకిస్తారేల బాల శుద్ధాంత కవుల్
భేకం ఘూకం కేకా
బాకా వ్యాకృతులు తెలియబట్టక, చేరా!

నిస్త్రీక సభల కెళ్ళకు
ఇస్త్రీ లేనట్టి బట్టలేయకు, నీతో
కుస్తీ పట్టకు నీవే
బస్తీలో నిద్రపోకు – భద్రము, చేరా!

బతికేందుకు పోరాటం
కతికేందుకు మెతుకు మెతుకుకై ఆరాటం
ధృతి తప్పిన చెర్లాటం
ప్రతిదీ మనిషికి ఒక పితలాటం, చేరా!

టీచింగ్ సెంటర్లణగీ
కోచింగ్ సెంటర్లు పెరిగి కోకొల్లలుగా
దోచేస్తుంటే, చదువును
చాచేస్తుంటే జనమ్మశక్తము చేరా!

మత్తులు, గమ్మత్తులు, సం
పత్తులు, నిత్యానుషక్త భావోద్వృత్తుల్
చిత్తులు, బొత్తులు, పల్‌చుర
కత్తులు కందమ్ము లివ్విగదరా, చేరా!

అరసం విరసం వీరులు
పరస్పర విభేదముల పక్కకు తోసీ
వెరసి, అహో, పద్య ద్వే
ష రసమ్మును పుక్కిలింత్రు ససిగా, చేరా!

హైకూలం చుండంగా
లోకూలంచుండవా? విలోమ కవిత్వ
వ్యాకూతియు తక్కువదటె
నాకున్నీకున్నొకింత నచ్చదె, చేరా!

మనసారగ పోతన వే
మనల వలెన్ కాకపోతేమానె, నిజంగా
మనమన కవితలు పరిమిత
జనమైనా చదువునా హుషారుగ, చేరా!

ఇస్మాయిల్ స్మైలిస్తే
ఆస్మాన్‌లో పిట్ట వాలునా చెట్టు పయిన్
జాస్మిన్ ఖుష్‌బూలొలికే
అస్మితలే క్రొంబ్రతీక లౌనటె, చేరా!

నండూరి యెంకిపాటలు
గుండెలలో గూళ్ళు కట్టి గుసగుసలాడున్
నిండారు బొండుమల్లెలు
పండించిన పరిమళాల వాగులు, చేరా!

శ్రీ విశ్వనాథ సాహి
త్యావాసము చేరినంత అది ఇది ఏలా
భావుకతా సీమలు రమ
ణావధులై పులకరింపులయ్యెను, చేరా!

మేధావులు, పలువార్గిక
మేధావులు మీడియాల మేధావులతో
సాధారణ జనమంతా
బాధాగ్రస్తమ్ము భ్రాంతి బద్ధము, చేరా!

చల్తీకానామ్ గాడీ
కల్తీకానామ్ ఇవాల్టికాలం, దాంతో
జల్తికానామ్ గుండియ
ఢల్తీహై గుండె దిటవిటన్, మరి చేరా!

బలవంతపు చదువుల వ
త్తిళులన్ బాల్యంపు సొగసు తీపిని దోచే
మలిన సమాజములో పి
ల్లలకన్ననూ దళితులెవరురా ఇట చేరా!

ప్రతివార్షుక హేమంతో
ద్యతనవ సన్మిత్రవలయ హార్దిక భాషా
ప్లుత సంతోష విహారా!
వితత విరాగానురాగ వేల్లిత చేరా!

('''చేరాకు శతమానం''' గ్రంథం నుండి)
</poem>


==మూలాలు==
==మూలాలు==

03:48, 14 డిసెంబరు 2014 నాటి కూర్పు

కోవెల సంపత్కుమారాచార్య
జననంకోవెల సంపత్కుమారాచార్య
(1933-06-26)1933 జూన్ 26
India వరంగల్ పట్టణం, తెలంగాణా రాష్ట్రం
మరణం2010 ఆగస్టు 05
వృత్తిఅధ్యాపకుడు
మతంహిందూ
భార్య / భర్తలక్ష్మీనరసమ్మ
తండ్రికోవెల రంగాచార్యులు
తల్లిచూడమ్మ

కోవెల సంపత్కుమారాచార్య 1933, జూన్ 26వ తేదీన కోవెల రంగాచార్యులు, చూడమ్మ దంపతులకు కనిష్ఠపుత్రుడిగా జన్మించాడు.[1] ఇతని సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ. సంపత్కుమార నలుగురు అన్నదమ్ములలో రెండవ అన్న లక్ష్మీనరసింహాచార్యులు కూడా కవి.

విద్య,ఉద్యోగం

బాల్యంలోనే ఇతడు తండ్రి దగ్గర వైష్ణవాగమాలను నేర్చుకుంటూనే వరంగల్లులోని సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు[2]. ఇతని విద్యాభ్యాసం ఎక్కువగా వరంగల్లులో జరిగింది. 1949-53 సంవత్సరాల మధ్య బందరు చిట్టిగూడూరు నారసింహ సంస్కృతిక కళాశాలలో భాషాప్రవీణ చదివాడు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందాడు. 1966లో ప్రైవేటుగా హిందీ ఎం.ఎ. చేశాడు[3]. కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత 1978లో ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ -సంప్రదాయరీతి అనే అంశంపై పరిశోధన చేసి ఆ విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి పి.హెచ్.డి. సాధించాడు. రజాకార్ల అల్లర్ల కారణంగా అన్న లక్ష్మీనరసింహాచార్యులు గుంటూరు జిల్లా రేపల్లె పక్కన గల నల్లూరి పాలెంకు మారి అక్కడ బడి నడిపాడు. అప్పుడు సంపత్కుమారాచార్య ఆ బడిలో హిందీ పాఠాలు చెప్పేవాడు. 1962లో వరంగల్లులోని మల్టీపర్పస్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ఇతడు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి 1993 లో ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు.

సాహిత్యం

ఇతడు తన పదమూడవ యేటే సోదరుని కుమారుడు ఇంచుమించు సమవయస్కుడు అయిన కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి జంటగా కవిత్వం చెప్పనారంభించాడు. 1950 ప్రాంతంలో విశ్వనాథ సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. అతని సాహిత్య ప్రభావం సంపత్కుమారపై జీవితకాలం పనిచేసింది. ఇతడు వ్యాకరణ, ఛందో గ్రంథాలను, విమర్శను, ఖండకావ్యాలను, సాహిత్య చరిత్రను, శతకాలను, ప్రాచీన గ్రంథాల పరిష్కరణలను, విపులమైన పీఠికలను,నాటికలను ఎన్నో వ్రాశాడు. 'మరుగునపడిన మన పండితులు' పేరిట జనధర్మలో ధారావాహికంగా 52 వారాలు వ్రాశాడు.

రచనలు

  1. హృద్గీత (కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి)
  2. ఆనందలహరి (కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి)
  3. అపర్ణ (కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి)
  4. లక్షణదీపిక (సులభ వ్యాకరణ గ్రంథం)
  5. ఛందోవికాసము
  6. మధురగాథలు
  7. చేతనావర్తము (1,2 భాగాలు)
  8. ఛందః పదకోశము[4]
  9. వచనపద్యం - లక్షణచర్చ (చేకూరి రామారావుతో కలిసి)
  10. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ - సాంప్రదాయికరీతి (పిహెచ్‌.డి. సిద్ధాంత గ్రంథం)
  11. తెలుగు సాహిత్య చరిత్ర
  12. పూర్వ కవుల కావ్య దృక్పథాలు
  13. అంతర్మథనము
  14. తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు
  15. కావ్యం-కవిస్వామ్యం
  16. కాలస్పృహ (ఖండకావ్య సంపుటి)
  17. ఆముక్త
  18. కిన్నెరసాని పాటలు - వస్తువిన్యాసం
  19. కన్యాశుల్కం-మరోవైపు
  20. చేరాకు ఒక శతమానం
  21. చింతయంతి
  22. ఛందోభూమికలు
  23. విశ్వనాథ సాహిత్య దర్శనం
  24. కల్హణ (అనువాదం)
  25. సుకవి మనోరంజనము (పరిష్కరణ)
  26. లక్షణసార సంగ్రహము (పరిష్కరణ)
  27. రంగనాథ రామాయణము (పరిష్కరణ)
  28. ఏకశిలా సాహిత్య సౌందర్యము (సంపాదకత్వం)
  29. పోతన భాగవత నీరాజనం (సహసంపాదకత్వం)
  30. మన కవులు,పండితులు,రచయితలు

పురస్కారాలు

  • 1992 - దాశరథి అవార్డు
  • 1993 - భాగ్య అవార్డు

రచనల నుండి ఉదాహరణ

చేరా! ఆత్మీకృత సు
స్మేరా! మైత్రీ విచిత్ర మృదుతాధారా!
వారిత దురహంకార వి
చారా! బంధుర వచో విసారా! చేరా!

ఇది చిత్రము, బస్ పయనము
ముదురెండలు, నీదు వ్యాసములబడి ఊహల్
చెదరగ, నీవే మకుటము –
మొదలైనది శతక మొక్క ముచ్చట, చేరా!

ఎందాక పద్యముండునొ
అందాకను శతకముండునంటివి కాదా!
ఎందాక కవిత వుండునొ
అందాకను పద్యముండునందును, చేరా!

చేరాతలంతగా రా
సీ రాసీ ఏమిలబ్ధి చేకూరెను, మీ
వారూ, మా వారూ సాం
బారులు చిమ్ముటలు తప్ప, మధుమతి, చేరా!

రారా, కారా, బూరా
సీరా, బేరా, తిరా, వసీరా, నారా
కోరా, తారా, కేరా –
ఈ రాంతుల తోటి వేగుటెట్లా? చేరా!

భావాభ్యుదయమ్ముల శ్రీ
శ్రీ విప్లవ భావలయ రేఖలమీదన్
ధీ వెంచుచు నిజరీతుల
సేవించె విదూషకత్వ సీధువు, చేరా!

గిచ్చుట, కయ్యాలాడుట
మచ్చికయై పోయె నీదు మాటలకున్, నీ
దచ్చపు మనసగుటన్ పొర
పొచ్చెము మాకెపుడు రాక పోయెను, చేరా!

మన కవుల కేమి లోటగు
జనకవితలటంచు రాసి జనికవులై, చా
రణ కవులుగ తేలిరి, కా
రణ జన్ములుగ చరింతు, రౌరా, చేరా!

వ్యాకరణమ్మంటేనే
శోకిస్తారేల బాల శుద్ధాంత కవుల్
భేకం ఘూకం కేకా
బాకా వ్యాకృతులు తెలియబట్టక, చేరా!

నిస్త్రీక సభల కెళ్ళకు
ఇస్త్రీ లేనట్టి బట్టలేయకు, నీతో
కుస్తీ పట్టకు నీవే
బస్తీలో నిద్రపోకు – భద్రము, చేరా!

బతికేందుకు పోరాటం
కతికేందుకు మెతుకు మెతుకుకై ఆరాటం
ధృతి తప్పిన చెర్లాటం
ప్రతిదీ మనిషికి ఒక పితలాటం, చేరా!

టీచింగ్ సెంటర్లణగీ
కోచింగ్ సెంటర్లు పెరిగి కోకొల్లలుగా
దోచేస్తుంటే, చదువును
చాచేస్తుంటే జనమ్మశక్తము చేరా!

మత్తులు, గమ్మత్తులు, సం
పత్తులు, నిత్యానుషక్త భావోద్వృత్తుల్
చిత్తులు, బొత్తులు, పల్‌చుర
కత్తులు కందమ్ము లివ్విగదరా, చేరా!

అరసం విరసం వీరులు
పరస్పర విభేదముల పక్కకు తోసీ
వెరసి, అహో, పద్య ద్వే
ష రసమ్మును పుక్కిలింత్రు ససిగా, చేరా!

హైకూలం చుండంగా
లోకూలంచుండవా? విలోమ కవిత్వ
వ్యాకూతియు తక్కువదటె
నాకున్నీకున్నొకింత నచ్చదె, చేరా!

మనసారగ పోతన వే
మనల వలెన్ కాకపోతేమానె, నిజంగా
మనమన కవితలు పరిమిత
జనమైనా చదువునా హుషారుగ, చేరా!

ఇస్మాయిల్ స్మైలిస్తే
ఆస్మాన్‌లో పిట్ట వాలునా చెట్టు పయిన్
జాస్మిన్ ఖుష్‌బూలొలికే
అస్మితలే క్రొంబ్రతీక లౌనటె, చేరా!

నండూరి యెంకిపాటలు
గుండెలలో గూళ్ళు కట్టి గుసగుసలాడున్
నిండారు బొండుమల్లెలు
పండించిన పరిమళాల వాగులు, చేరా!

శ్రీ విశ్వనాథ సాహి
త్యావాసము చేరినంత అది ఇది ఏలా
భావుకతా సీమలు రమ
ణావధులై పులకరింపులయ్యెను, చేరా!

మేధావులు, పలువార్గిక
మేధావులు మీడియాల మేధావులతో
సాధారణ జనమంతా
బాధాగ్రస్తమ్ము భ్రాంతి బద్ధము, చేరా!

చల్తీకానామ్ గాడీ
కల్తీకానామ్ ఇవాల్టికాలం, దాంతో
జల్తికానామ్ గుండియ
ఢల్తీహై గుండె దిటవిటన్, మరి చేరా!

బలవంతపు చదువుల వ
త్తిళులన్ బాల్యంపు సొగసు తీపిని దోచే
మలిన సమాజములో పి
ల్లలకన్ననూ దళితులెవరురా ఇట చేరా!

ప్రతివార్షుక హేమంతో
ద్యతనవ సన్మిత్రవలయ హార్దిక భాషా
ప్లుత సంతోష విహారా!
వితత విరాగానురాగ వేల్లిత చేరా!

(చేరాకు శతమానం గ్రంథం నుండి)

మూలాలు

  1. టి., శ్రీరంగస్వామి (04-08-2014). "కోవెల సంపత్కుమారాచార్యులు - ఒక తలపు". విశాలాంధ్ర దినపత్రిక. విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్. Retrieved 13 December 2014. {{cite news}}: Check date values in: |date= (help)
  2. యు.ఎ., నరసింహమూర్తి. "విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార". ఈమాట. Retrieved 14 December 2014.
  3. కొలనుపాక, కుమారస్వామి (11-08-2012). "కమనీయం కోవెల'కలం'". ఆంధ్రప్రభ దినపత్రిక. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ లిమిటెడ్, హైదరాబాదు. Retrieved 14 December 2014. {{cite news}}: Check date values in: |date= (help)
  4. కోవెల, సంపత్కుమారాచార్య (1977). ఛందః పదకోశము. హైదరాబాదు: తెలుగు అకాడెమీ. Retrieved 14 December 2014.