"గుంతకల్లు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
'''గుంతకల్లు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం]] జిల్లాకు చెందిన ఒక పట్టణము, మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము.గుంతకల్లు పెద్ద రైల్వే జంక్షన్.
== చరిత్ర ==
బ్రిటీష్ ఈస్టిండియా, ఆపైన బ్రిటీష్ ఇండియా పరిపాలన కాలంలోనూ రైలుమార్గాలు వేయడం, రైలు ప్రయాణాలు ప్రాధాన్యత సంతరించుకోవడంతో జంక్షన్‌గా గుంతకల్లు ప్రాభవం పొందింది.<br />
1893లో సికిందరాబాద్‌కి ప్రయాణం చేస్తూ గుంతకల్లు బంగళాలో బసచేసిన ఆంగ్ల సైనికుల్లో ఒక యువతిని, ఒక మహిళని అత్యాచారం చేయబోగా అడ్డుకున్న గేట్ కీపర్ గొల్ల హంపన్నను కాల్చిచంపారు.
 
==నేపధ్యము==
[[అనంతపురము]] తరువాత మూడవ పెద్ద పట్టణము గుంతకల్లు. దక్షిణ మధ్య రైల్వే లోని 5 ప్రధాన డివిజన్ ల లో మూడవది గుంతకల్ డివిజన్. ముంబై చెన్నై మధ్య ప్రధాన జంక్షన్ గా గుంతకల్లు కి పేరు ఉంది. ఇక్కడ డీజిల్ లోకో షెడ్ ఉన్నది. ఇటీవలే ఇది 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. గుంతకల్లు కి ఆ పేరు ఎలా వచ్చింది అనగా ఇక్కడి పాత గుంతకల్లు లో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద అని చెబుతారు. గుంతకల్లు స్టేషన్ మీదుగా ప్రతినిత్యము వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు ఇక్కడినుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ ముస్లిం ప్రజలు కూడా చాలా మంది నివసిస్తున్నారు. ఇక్కడ పట్టాన జనాభాలో ముస్లిం లు రెండవ స్థానం లో ఉన్నారు. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన హజారత్ వలి మస్తాన్ దర్గా చాల ముఖ్యమైనది. ప్రతి సంవత్సరము మొహర్రము తరువాత 15 రోజులకు ఇక్కడ జరిగే ఉరుసు మహోత్సవానికి కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని పూజిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1355235" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ