"గమ్యం (2008 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ, replaced: → (31), → (2) using AWB
చి (Wikipedia python library)
చి (సవరణ, replaced: → (31), → (2) using AWB)
{{సినిమా|
image = Gamyam-2008.jpg‎|
name = గమ్యం|
year = 2008|
image = Gamyam.jpg |
starring = [[అల్లరి నరేష్|అల్లరి నరేష్]],<br/>[[శర్వానంద్]],<br/>[[కమలినీ ముఖర్జీ]]|
director = [[ రాధాకృష్ణ(క్రిష్)]]|
story =|
writer = [[నాగరాజు గంధం]]|
lyrics = |
producer = [[జాగర్లమూడి సాయిబాబు]]|
distributor = |
release_date = [[ఫిబ్రవరి 29]],[[2008]]|
runtime = |
language = తెలుగు |
music = [[అనిల్, ఇ యస్ మూర్తి ]] |
cinematography = [[హరి ఆనుమోలు]]|
choreography = |
art = |
lyrics = |
editing = [[శ్రవణ్ కటికనేని]]|
production_company = పస్ట్ ప్రేమ్|
awards = |
budget = |
imdb_id = }}
ఇది 2008లో విడుదలైన తెలుగు చిత్రం.
==చిత్రకథ==
చిత్రప్రారంభంలో ఒక టీ కొట్టు దగ్గర ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంది. దానికి కారణమైన అభిరామ్ పెద్ద పారిశ్రామికవేత్త కుమారుడు. ఆసుపత్రిలో అభిరామ్ జానకి పేరు పలవరిస్తుంటాడు. ఆసుపత్రి నుండి వచ్చేశాక స్నేహితునితో చెప్పి జానకి కోసం వెతకటం మొదలు పెడతాడు. ఆమె యాగంటి లో ఉందని తెలిసి అక్కడకు బయలుదేరతాడు. అతని ఖరీదైన మోటారు సైకిల్ దొంగిలించాలని గాలి శీను (నరేష్) అతనికి దారి చూపిస్తానని వెంబడిస్తాడు. యాగంటిలో పూర్ణయ్య (గిరిబాబు)ను అనాధశరణాలయం వద్ద కలుస్తాడు. తను చేసిన రోడ్డు ప్రమాదంలో తల్లిని కోల్పోయిన బాలుడ్ని అక్కడ చూస్తాడు అభిరామ్. ఆ అబ్బాయిని అక్కడ చేర్చి జానకి వెళ్ళిపోయిందని గుంటూరు జిల్లా అమరావతి లో ఉందవచ్చని గిరిబాబు చెబుతాడు. శీను తనని వెంటాడే ఉద్దేశం తెలిసిన అభిరామ్ కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపొమ్మంటాడు. కొద్ది సేపట్లోనే చిన్న ప్రమాదానికి గురికాగా అతన్ని శీను కాపాడతాడు. దారి పక్క హోటల్లో జరిగిన సంఘటనలో చిన్న ముఠానాయకున్ని ఎదిరించి శీనుని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ముఠానాయకుడు అభిరామ్ ను కాల్చబోతుండగా ఒక ఆగంతుకుడు వచ్చి వీరిని కాపాడతాడు. అభిరామ్ చూపిన ఆదరణతో చలించిన శీను తను అభిరామ్ కు తోడుంటానని తనకి రెండు పూటలా తిండి కొంచెం ''''నమ్మకం'''' ఇస్తే చాలని చెబుతాడు. ఇద్దరూ కలసి అమరావతి వెళతారు. అక్కడ జానకి స్నేహితురాలి ద్వారా ఆమె నర్సీపట్నం వెళ్ళిందని తెలుస్తుంది. నర్సీపట్నం దగ్గరలో చిన్న రోడ్డుప్రమాదంలో శీను గాయపడతాడు. దగ్గరలో ఉన్న అసుపత్రి లో చికిత్స చేయించుకుంటాడు. తరువాత దారిలో ఒక రికార్డింగు డాన్స్ దగ్గర శీను కు పరిచయమున్న నాట్యగత్తె తారసపడుతుంది. ఆమెను అక్కడి నాయకులు బుల్లెబ్బాయ్ బ్రదర్స్ నుండి శీను, అభిరామ్ లు రక్షిస్తారు. జానకి సీలేరులో ఉందని తెలుసుకుని అక్కడకు బయలు దేరుతారు. సీలేరు లో వారికి, తమని యాగంటిలో రక్షించిన వ్యక్తి కలుస్తాడు. అతను ఒక లొంగిపోయిన నక్సలైటు. అతన్ని కోవర్టు గాభావించి ఉద్యమంలోని వ్యక్తులు దాడి చేస్తారు. అభిరామ్ ఉద్యమకారులతో మాట్లాడుతూ ధనవంతులకీ , తుపాకీ చేతిలోఉన్న వారికీ కొన్ని పోలికలు ఉన్నట్టు వాళ్ళు వీళ్ళూ జీవితానికి దూరంగా ఉన్నట్టూ చెబుతాడు. అంతలో అక్కడికి పోలీసులు వస్తారూ. ఎన్ కౌంటర్లో అభిరాం, శీను వారి మిత్రుడూ తప్పించుకొనే ప్రయత్నంలో శీనుకు బుల్లెట్ తగులుతుంది. జానకి ఫొటో చూసి ఆమెను తను నర్సీపట్నం హాస్పిటల్లో చూశానని చెప్పి మరణిస్తాడు. అభిరామ్ తరువాత జానకి ని కలిసి, తన ప్రయాణంలో గమ్యం చేరేలోపు జీవితాన్ని చూశానని చెబుతాడు. చిత్రకథనంలో అనేకసార్లు ఫ్లాష్ బాక్ లో అభిరామ్, జానకిల పరిచయం ,అది ప్రేమగా మారే లోపు వారు విడిపోవడం చూపబడుతుంది.
 
==సంభాషణలు==
# రెండు పూటల తిండి తో కొంచెం నమ్మకం ఇవ్వండి
# ప్రదేశాలను కాదు చూడవలసింది ప్రపంచాన్ని
# ప్రయాణంలో నన్ను నేను చూసుకున్నాను
 
==పాత్రలు==
చిత్రం లో ఎక్కువభాగంపాత్రలు మంచివే. జానకి పాత్ర ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. చిత్రం కొన్నిసార్లు 'గజని' చిత్రాన్ని గుర్తు తెస్తుంది. హీరో, హీరోయిన్ల కలయిక, వారి మధ్య సంఘటనలు, ఐతే ఇక్కడ హీరో ధనవంతుడని జానకికి ముందేతెలుసు. కమలినిముఖర్జి, అసిన్ పాత్రలకు కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సంఘంపట్ల బాధ్యత నెరవేర్చ దల్చుకున్నవారే.మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల మేఘమాల లో కథానాయకుడు ,మేఘమాల కోసం ఇలాగే గాలిస్తాడు. చిత్రంలో హీరో పాత్ర మోటారు సైకిల్ యాత్ర ,చే గువేరా పై వచ్చిన 'మోటారు సైకిల్ డైరీ'జ్ఞప్తికి తెస్తుంది.
2,16,328

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1452104" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ