సాదనాల వేంకటస్వామి నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
| native_name_lang = తెలుగు
| native_name_lang = తెలుగు
| image = Sadanala venkataswamy naidu.jpg
| image = Sadanala venkataswamy naidu.jpg
| image_size = 200 px
| image_size = 175 px
| alt =
| alt =
| caption = సాదనాల వేంకటస్వామి నాయుడు
| caption = సాదనాల వేంకటస్వామి నాయుడు

22:17, 25 మార్చి 2015 నాటి కూర్పు

సాదనాల వేంకటస్వామి నాయుడు సాహిత్య, సంగీత, నాటక, సాంస్కృతిక, సేవా రంగాలలో కృషి చేస్తున్న కళాపిపాసి.

సాదనాల వేంకటస్వామి నాయుడు
సాదనాల వేంకటస్వామి నాయుడు
సాదనాల వేంకటస్వామి నాయుడు
జననం (1961-02-15) 1961 ఫిబ్రవరి 15 (వయసు 63)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లులోకవిరోధి, మాధురీస్వామి, సాధన
విద్యఎం.ఏ, బి.ఎల్, బి.ఇడి, ఎం.ఫిల్, పి.హెచ్.డి.
వృత్తిరైల్వే ఉద్యోగి
దక్షిణ మధ్య రైల్వే
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గీత రచయిత
గుర్తించదగిన సేవలు
దృశ్యం, నాయుడుబావ పాటలు
జీవిత భాగస్వామిమాధురి
తల్లిదండ్రులుసత్యవతి,బాలకృష్ణారావు
పురస్కారాలుబంగారు నంది, తె.వి.వి బంగారు పతకం

జీవిత విశేషాలు

సాదనాల వేంకటస్వామి నాయుడు(Sadanala Venkata Swamy Nayudu) 1961, ఫిబ్రవరి 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా, ముమ్మడివరం మండలం, గేదెల్లంక గ్రామంలో సత్యవతి, బాలకృష్ణారావు దంపతులకు జన్మించాడు. విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి గ్రామంలో ఇతని బాల్యం గడిచింది. రాజమండ్రి వి.టి.జూనియర్, డిగ్రీ కాలేజీలో ఇంటర్‌మీడియెట్, డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ.(తెలుగు) పట్టా పొందాడు. రాజమండ్రి జి.ఎస్.కె.మెమోరియల్ లా కాలేజీలో లా పూర్తి చేశాడు. తెలుగు విశ్వవిద్యాలయం లో “కృష్ణాపత్రిక సాహితీసేవ ఒక పరిశీలన” అనే అంశంపై పరిశోధించి ఎం.ఫిల్.పట్టా సాధించాడు[1].ఆ తర్వాత అన్నామలై విశ్వవిద్యాలయం నుండి బి.ఇడి.చేసి కందుకూరి వీరేశలింగం ఆస్తిక డిగ్రీ కళాశాల, రాజమండ్రిలో ఆంధ్రోపన్యాసకులుగా కొంతకాలం పనిచేశాడు. తరువాత దక్షిణ మధ్య రైల్వేలో ప్రథమశ్రేణి తెలుగు పండితుడిగా డోర్నకల్ రైల్వే హైస్కూలులో పనిచేశాడు. ప్రస్తుతం సికిందరాబాదు డివిజినల్ కార్యాలయంలో ఛీఫ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్యపేరు మాధురి. కుమార్తె పేరు ఆర్యాణి.

సాహిత్య రంగం

ఇతడు కథలు, కవితలు, వ్యాసాలు, గేయాలు, నాటికలు అనేకం వ్రాశాడు. ఇతని రచనలు సమాచారం, కళాప్రభ, నేటి నిజం, అపురూప, అంజలి, రచన,ఎక్స్‌రే,ఆంధ్రజ్యోతి మొదలైన అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని కథలు, కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఇతడు రచించిన గీతాలు కేసెట్లుగా విడుదలయ్యాయి. ఆకాశవాణిలో ఇతడు వ్రాసిన గీతాలు, సంగీతరూపకాలు, నాటికలు ప్రసారమయ్యాయి. ఇతడి రచనలకు ఎన్నో బహుమతులు లభించాయి. పలు సాహిత్య సంస్థలతో ఇతనికి సంబంధాలున్నాయి. అనేక సెమినార్లలో పాల్గొని పత్రసమర్పణ గావించాడు.

ముద్రిత రచనలు

  1. దృశ్యం (వచన కవితాసంపుటి)
  2. కృష్ణాపత్రిక సాహిత్య సేవ - ఒక పరిశీలన (సిద్ధాంత గ్రంథం)
  3. నాయుడు బావ పాటలు
  4. సర్వసమ్మత ప్రార్థన

ఆడియో కేసెట్లు

  1. పుష్కర గోదావరి
  2. కట్టెమిగిల్చిన కన్నీటి గాధ
  3. అక్షరదీపం
  4. సుముహూర్తం
  5. మహనీయుల స్ఫూర్తితో
  6. తెలుగుతేజం
  7. విజయకెరటం

సాహితీ సంస్థలు

  1. ది పొయెట్రీ సొసైటీ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) - సభ్యుడు
  2. కవిత్వం (రాజమండ్రి) - కార్యదర్శి
  3. వాగర్ధ సమాఖ్య (రాజమండ్రి) - సభ్యుడు
  4. సాహితీ సమితి (ఖమ్మం జిల్లా) - ఉపాధ్యక్షుడు
  5. ఇండియన్ హైకూ క్లబ్ (అనకాపల్లి) - ప్రాంతీయ కార్యదర్శి

పత్రికా రంగం

ఇతని రచనలు పలు దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని గురించి పరిచయ వ్యాసాలు కూడా పలుపత్రికలలో వచ్చాయి. ఇతడు అక్షరవర్ధిని అనే పత్రికకు, సంవీక్షణం అనే ద్వైమాసపత్రికకు సంపాదకునిగా పనిచేశాడు.

సంగీత, నాటక రంగాలు

ఇతడు ఆకాశవాణిలో ఆడిషన్ పాసై గాయకుడిగా అనేక జానపద గేయాలు పాడాడు. డ్రామా ఆడిషన్ పాసై బి గ్రేడ్ కళాకారుడిగా పాతికకు పైగా రేడియో నాటకాలలో నటించాడు. విజయశంకర్ ప్రభుత్వ సంగీత,నృత్య కళాశాల రాజమండ్రిలో మృదంగం, గాత్రం అభ్యసించాడు. మూషిక మరణం నాటకంతో నాటకరంగ ప్రవేశం చేశాడు. అనేక నాటకాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేసి స్వయంగా నటించాడు. పల్లెరథం, సంధ్యారాగం, సువ్వీ సువ్వన్నలాలి, గోదావరి చెప్పిన సుబ్బారావు కథ, అదిగో భద్రాద్రి మొదలైన సంగీత రూపకాలను వ్రాసి ఆకాశవాణిలో ప్రసారం కావించాడు.

సినిమా రంగం

ఇతడు ఆంధ్రకేసరి, సుర్ సంగం, గాలి శ్రీను మొదలైన చిత్రాలలో చిన్న పాత్రలను ధరించాడు. మహానంది డాక్యుమెంటరీ చిత్రానికి టైటిల్ సాంగ్ వ్రాశాడు. దక్షిణ కాశి - ద్రాక్షారామం , శ్రీకాళహస్తి మొదలైన డాక్యుమెంటరీ చిత్రాలకు రచనాసహకారం అందించాడు.

సాంస్కృతిక రంగం

క్రీడారంగం

సేవా రంగం

పురస్కారాలు, సత్కారాలు

మూలాలు

  1. న్యూస్ టుడే (1990-01-06). "కవిత ఏదయినా అది సమాజం కోసమే - సాదనాల మనోదృశ్యం". ఈనాడు దినపత్రిక తూర్పుగోదావరి జిల్లా సంచిక.