Coordinates: 15°10′01″N 77°22′01″E / 15.166915°N 77.366981°E / 15.166915; 77.366981

గుంతకల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (3) using AWB
పంక్తి 45: పంక్తి 45:


{{అనంతపురం జిల్లా మండలాలు}}
{{అనంతపురం జిల్లా మండలాలు}}

{{గుంతకల్లు మండలంలోని గ్రామాలు}}
{{గుంతకల్లు మండలంలోని గ్రామాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}

{{ఆంధ్ర ప్రదేశ్}}
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:అనంతపురం జిల్లా గ్రామాలు]]
[[వర్గం:అనంతపురం జిల్లా గ్రామాలు]]

15:41, 16 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

గుంతకల్లు
—  మండలం  —
అనంతపురం పటంలో గుంతకల్లు మండలం స్థానం
అనంతపురం పటంలో గుంతకల్లు మండలం స్థానం
అనంతపురం పటంలో గుంతకల్లు మండలం స్థానం
గుంతకల్లు is located in Andhra Pradesh
గుంతకల్లు
గుంతకల్లు
ఆంధ్రప్రదేశ్ పటంలో గుంతకల్లు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°10′01″N 77°22′01″E / 15.166915°N 77.366981°E / 15.166915; 77.366981
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రం గుంతకల్లు
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,59,535
 - పురుషులు 80,867
 - స్త్రీలు 78,668
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.03%
 - పురుషులు 76.03%
 - స్త్రీలు 53.69%
పిన్‌కోడ్ 515801

గుంతకల్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణము, మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము.గుంతకల్లు పెద్ద రైల్వే జంక్షన్.

చరిత్ర

బ్రిటీష్ ఈస్టిండియా, ఆపైన బ్రిటీష్ ఇండియా పరిపాలన కాలంలోనూ రైలుమార్గాలు వేయడం, రైలు ప్రయాణాలు ప్రాధాన్యత సంతరించుకోవడంతో జంక్షన్‌గా గుంతకల్లు ప్రాభవం పొందింది.
1893లో సికిందరాబాద్‌కి ప్రయాణం చేస్తూ గుంతకల్లు బంగళాలో బసచేసిన ఆంగ్ల సైనికుల్లో ఒక యువతిని, ఒక మహిళని అత్యాచారం చేయబోగా అడ్డుకున్న గేట్ కీపర్ గొల్ల హంపన్నను కాల్చిచంపారు. వారి వ్యభిచరించడానికి హంపన్నను మధ్యవర్తిగా ఉపయోగించారని, ఆ సమయంలోనే హంపన్నకు-సైనికులకు వివాదం రేగి హంపన్న దాడిచేయబోగా కాల్చారని వాదించారు. ఈ వాదనను ప్రత్యేకంగా బ్రిటీషర్ల కోసం ఏర్పరిచిన జ్యూరీ అంగీకరించి నిర్దోషులని తీర్పునిచ్చింది. ఐతే ఇదంతా జాత్యహంకారంగా పరిగణించి హిందూ పత్రిక, నిష్కళంకులైన హంపన్న, స్త్రీలపై కళంకం ఆపాదించినందుకు గ్రామస్తులు వ్యతిరేకిస్తూ గ్రామంలో ఓ స్మారక స్తూపాన్ని నిర్మించారు.[1]

నేపధ్యము

అనంతపురము తరువాత మూడవ పెద్ద పట్టణము గుంతకల్లు. దక్షిణ మధ్య రైల్వే లోని 5 ప్రధాన డివిజన్ ల లో మూడవది గుంతకల్ డివిజన్. ముంబై చెన్నై మధ్య ప్రధాన జంక్షన్ గా గుంతకల్లు కి పేరు ఉంది. ఇక్కడ డీజిల్ లోకో షెడ్ ఉన్నది. ఇటీవలే ఇది 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. గుంతకల్లు కి ఆ పేరు ఎలా వచ్చింది అనగా ఇక్కడి పాత గుంతకల్లు లో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద అని చెబుతారు. గుంతకల్లు స్టేషను మీదుగా ప్రతినిత్యము వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు ఇక్కడినుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ ముస్లిం ప్రజలు కూడా చాలా మంది నివసిస్తున్నారు. ఇక్కడ పట్టాన జనాభాలో ముస్లిం లు రెండవ స్థానం లో ఉన్నారు. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన హజారత్ వలి మస్తాన్ దర్గా చాల ముఖ్యమైనది. ప్రతి సంవత్సరము మొహర్రము తరువాత 15 రోజులకు ఇక్కడ జరిగే ఉరుసు మహోత్సవానికి కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని పూజిస్తారు.

దర్శనీయ ప్రదేశాలు

గుంతకల్లు పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరం లో ఉన్న నేట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా కర్ణాటక రాష్ట్రము నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. శ్రావణమాసము లో ఇక్కడ స్వామి వారిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతారు. ప్రతి శనివారము, మంగళవారము కసాపురం దేవాలయము భక్తులతో కిట కిట లాడుతుంది. ఇక్కడ స్వామి వారిని తమ కోరికలను కోరుకొని తీరిన తరువాత స్వామి వారికి చెక్కతో చేసిన పాదరక్షలు సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు. స్వామి వారికి సమర్పించిన పాదరక్షలు సంవత్సరము తరువాత అరిగిపోయి ఉండడము స్వామి వారి మాహాత్మ్యము అని ఆలయ పూజారులు చెబుతారు. ఇక్కడికి దగ్గరిలోనే కొండమీద కాశి విశ్వేశ్వర స్వామి వెలసినాడు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటో లు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వము గుంతకల్లు నుండి కసాపురము కి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది.

మండలంలోని గ్రామాలు

మండలంలోని పట్టణాలు

  • గుంతకల్లు - పట్టణము
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=గుంతకల్&oldid=1485672" నుండి వెలికితీశారు