భారతదేశ ప్రధానమంత్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Added links
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 15: పంక్తి 15:




రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన [[భారత ఎన్నికల కమిషను|ప్రధాన ఎన్నికల కమిషనరు]], ప్రధాన విజిలెన్సు కమిషనరు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, న్యాయమూర్తులు మొదలనిన వారి నియామకాల్లో రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు. పార్లమెంటు సమావేశాలు, లోక్‌సభను రద్దు చేయడం, ఎమర్జెన్సీ ప్రకటన, యుద్ధ ప్రకటన, యుద్ధ విరమణ మొదలైన కీలక ఆంశాలపై రాష్ట్రపతికి సలహా ఇస్తాడు.
రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన [[భారత ఎన్నికల కమిషను|ప్రధాన ఎన్నికల కమిషనరు]], ప్రధాన [[విజిలెన్సు కమిషనరు]], [[కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్]], న్యాయమూర్తులు మొదలనిన వారి నియామకాల్లో రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు. [[పార్లమెంటు]] సమావేశాలు, [[లోక్‌సభ]]ను రద్దు చేయడం, ఎమర్జెన్సీ ప్రకటన, యుద్ధ ప్రకటన, యుద్ధ విరమణ మొదలైన కీలక ఆంశాలపై రాష్ట్రపతికి సలహా ఇస్తాడు.



== ప్రధానమంత్రుల జాబితా ==
== ప్రధానమంత్రుల జాబితా ==

03:13, 7 జూన్ 2015 నాటి కూర్పు

మూస:Prime minister ప్రధానమంత్రి భారత ప్రభుత్వ అధినేత. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా రాష్ట్రపతి స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం అలంకారప్రాయము, నామమాత్రము కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.


భారత్ అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి లో లోక్‌సభ లో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి లోక్‌సభ లోగాని, రాజ్యసభ లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి.

ప్రధానమంత్రి నియామకం

ప్రధానమంత్రి ని రాష్ట్రపతి నియమిస్తాడు. లోక్‌సభలో ఆధిక్యత కలిగిన పార్టీకి చెందిన నాయకుడిని మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. కాని, ఏ ఒక్క పార్టీకి కూడా పూర్ణ ఆధిక్యత (సభ్యుల సంఖ్యలో సగానికంటే ఒకటి ఎక్కువ) లేనపుడు, అత్యధిక సభ్యుల మద్దతు కలిగిన సంకీర్ణం యొక్క నాయకుడిని గాని, లోక్‌సభలో అత్యధికుల మద్దతు కూడగట్టగలిగిన అతిపెద్ద పార్టీ నాయకుడిని గాని రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు.


విధులు, అధికారాలు

ప్రధానమంత్రి తన విధుల నిర్వహణలో సహాయపడేందుకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. తాను ఎంపిక చేసిన సభ్యులను రాష్ట్రపతి ప్రమాణ నియమిస్తాడు. మంత్రులకు శాఖలను ప్రధానమంత్రి కేటాయిస్తాడు. మంత్రులను తొలగించే అధికారం ప్రధానమంత్రిదే. మంత్రివర్గ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తాడు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వ్య సాధన, వివాదాల పరిష్కారం ప్రధానమంత్రి బాధ్యత. ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన ప్రణాళికా సంఘానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు.


రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రధాన ఎన్నికల కమిషనరు, ప్రధాన విజిలెన్సు కమిషనరు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, న్యాయమూర్తులు మొదలనిన వారి నియామకాల్లో రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు. పార్లమెంటు సమావేశాలు, లోక్‌సభను రద్దు చేయడం, ఎమర్జెన్సీ ప్రకటన, యుద్ధ ప్రకటన, యుద్ధ విరమణ మొదలైన కీలక ఆంశాలపై రాష్ట్రపతికి సలహా ఇస్తాడు.

ప్రధానమంత్రుల జాబితా

ఇప్పటి వరకు 12 మంది ప్రధానమంత్రులుగా పనిచేసారు. జవహర్‌లాల్ నెహ్రూ నాలుగు సార్లు చేసాడు (1947-1952, 1952-1957, 1957-1962, 1962-1964). ఇందిరా గాంధీ మూడు సార్లు (1966-1971, 1971-1977, 1980-1984), అటల్ బిహారీ వాజపేయి మూడు సార్లు (1996, 1998-1999, 1999-2004) ప్రధానమంత్రిగా పని చేసారు.. గుల్జారీలాల్ నందా రెండు సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసినా, ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే.


స్వాతంత్ర్యం తరువాత, 30 ఏళ్ళపాటు కాంగ్రెసు వారే ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చారు. 1977 లో మొట్టమొదటి సారిగా మొరార్జీ దేశాయ్ కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. భాజపా కు చెందిన అటల్ బిహారీ వాజపేయి 1996 లో మొదటిసారి ఎన్నికయ్యాడు. మళ్ళీ, 1998 లో ప్రధానమంత్రి అయ్యాడు. 2004 ఎన్నికలలో కాంగ్రెసు నేతృత్వంలోని సంకీర్ణం అధికారంలోకి వచ్చి డా.మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు.

ప్రధాని అధికార నివాసం 7, రేస్‌కోర్సు రోడ్డు, న్యూఢిల్లీ.


రంగుల సూచీ: కాంగ్రెసు
భారత జాతీయ కాంగ్రెస్
జనతా
జనతా పార్టీ
దళ్
జనతా దళ్
భాజపా
భారతీయ జనతా పార్టీ
క్ర్.సం. పేరు నుండి వరకు పార్టీ
01 జవహర్‌లాల్ నెహ్రూ ఆగష్టు 15, 1947 మే 27, 1964 కాంగ్రెస్
* గుల్జారీలాల్ నందా మే 27, 1964 జూన్ 9, 1964 కాంగ్రెస్
02 లాల్ బహదూర్ శాస్త్రి జూన్ 9, 1964 జనవరి 11, 1966 కాంగ్రెస్
* గుల్జారీలాల్ నందా జనవరి 11, 1966 జనవరి 24, 1966 కాంగ్రెస్
03 ఇందిరా గాంధీ జనవరి 24, 1966 మార్చి 24, 1977 కాంగ్రెస్
04 మొరార్జీ దేశాయ్ మార్చి 24, 1977 జూలై 28, 1979 జనతా పార్టీ
05 చరణ్‌సింగ్ జూలై 28, 1979 జనవరి 14, 1980 జనతా పార్టీ
** ఇందిరా గాంధీ జనవరి 14, 1980 అక్టోబర్ 31, 1984 కాంగ్రెస్
06 రాజీవ్ గాంధీ అక్టోబర్ 31, 1984 డిసెంబర్ 2, 1989 కాంగ్రెస్***
07 వి.పి.సింగ్ డిసెంబర్ 2, 1989 నవంబర్ 10, 1990 జనతా దళ్
08 చంద్రశేఖర్ నవంబర్ 10, 1990 జూన్ 21, 1991 జనతా దళ్
09 పి.వి.నరసింహారావు జూన్ 21, 1991 మే 16, 1996 కాంగ్రెస్
10 అటల్ బిహారీ వాజపేయి మే 16, 1996 జూన్ 1, 1996 భాజపా
11 దేవెగౌడ జూన్ 1, 1996 ఏప్రిల్ 21, 1997 జనతా దళ్
12 ఐ.కె.గుజ్రాల్ ఏప్రిల్ 21, 1997 మార్చి 19, 1998 జనతా దళ్
** అటల్ బిహారీ వాజపేయి మార్చి 19, 1998 మే 22, 2004 భాజపా
13 డా.మన్మోహన్ సింగ్ మే 22, 2004 మే 25 , 2014 కాంగ్రెస్ సంకీర్ణం
14 నరేంద్ర మోడీ మే 26, 2014 భాజపా
రంగుల సూచీ: కాంగ్రెసు
భారత జాతీయ కాంగ్రెస్
జనతా
జనతా పార్టీ
దళ్
జనతా దళ్
భాజపా
భారతీయ జనతా పార్టీ

* ఆపద్ధర్మ
** మళ్ళీ అధికారానికి వచ్చారు
*** ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చీలి కాంగ్రెస్ ఐ గా మారింది. అదే వర్గం తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా గుర్తింపు పొందింది.

బయటి లింకులు