సంస్థాగత సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు
→ప్రాథమిక అంశాలు: ఎద్గార్ హెచ్ షైన్ - నిర్వచనం |
→ప్రాథమిక అంశాలు: ఇతర నిర్వచనాలు |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
సంస్థాగత సంస్కృతి లో మార్గదర్శక పరిశోధకులు అయిన ఎద్గార్ హెచ్ షైన్ సంస్థాగత సంస్కృతిని ఈ విధంగా నిర్వచించాడు. "బాహ్య స్వీకరణకీ, అంతర్గత అనుసంధానానికి మధ్య ఉద్భవించే సమస్యలని పరిష్కరించుకొనటానికి ఒక సమూహం నేర్చుకొన్న, నిరూపించబడిన, ఆమోదించబడిన, అందువల్లే కొత్త సభ్యులకి హేతుబద్ధ కోణంలో మరియు భావోద్రేక కోణంలో సమస్యలని పరిష్కరించుకోవటానికి సరియైన విధానంగా అందివ్వబడే సాధారణ ప్రాథమిక ఊహల నమూనా." |
సంస్థాగత సంస్కృతి లో మార్గదర్శక పరిశోధకులు అయిన ఎద్గార్ హెచ్ షైన్ సంస్థాగత సంస్కృతిని ఈ విధంగా నిర్వచించాడు. "బాహ్య స్వీకరణకీ, అంతర్గత అనుసంధానానికి మధ్య ఉద్భవించే సమస్యలని పరిష్కరించుకొనటానికి ఒక సమూహం నేర్చుకొన్న, నిరూపించబడిన, ఆమోదించబడిన, అందువల్లే కొత్త సభ్యులకి హేతుబద్ధ కోణంలో మరియు భావోద్రేక కోణంలో సమస్యలని పరిష్కరించుకోవటానికి సరియైన విధానంగా అందివ్వబడే సాధారణ ప్రాథమిక ఊహల నమూనా." |
||
ఇతర నిర్వచనాలు: |
|||
"సంస్కృతి అనే పదం నృశాస్త్రం నుండి వచ్చినది. దీని అర్థం పై ఏకాభిప్రాయం లేదు. అందుకే సంస్థాగత అధ్యయనాలలో దీని అనువర్తనాలు విధవిధాలుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు." - QSmircich, 1983 |
|||
"సంస్థాగత సంస్కృతి సంస్థలో సర్వత్రా ఉనికిలో ఉన్న వివిధ సందర్భాలలో మనం ఏం చేస్తాం, ఏం ఆలోచిస్తామో వాటిలో ఇమిడి ఉన్న సాంప్రదాయాల, విలువల, విధానాల, నమ్మకాల మరియు ధోరణుల సముదాయం." - McLean and Marshall, 1985 |
|||
"పని చేయటానికి మనం ఏమేం చేయాలో అవి చేయటం." - Bright and Parkin, 1997 |
|||
05:48, 23 జూన్ 2015 నాటి కూర్పు
సంస్థాగత సంస్కృతి (ఆంగ్లం: Organizational Culture) సంస్థలలో సాంస్కృతిక విలువల పద్ధతుల మూలాలని, అభివృద్ధిని వివరించే సంస్థాగత సిద్ధాంతం లోని ఒకానొక అంశం. సంస్థలు, పరిపాలకులు ఈ ప్రక్రియనే Corporate Culture లేదా Administrative Culture (పరిపాలనా సంస్కృతి) అని కూడా వ్యవహరిస్తారు.
సంస్థాగత సంస్కృతి నిర్వహణ యొక్క అని అంశాల పై ప్రభావితం చూపుతుంది. ఉదా:
- నిర్ణయం తీసుకొనే విధానం
- నాయకత్వం
- సహోద్యోగులతో, వినియోగదారులతో మరియు సరఫరాదారులతో సత్సంబంధాలు మరియు భావ వ్యక్తీకరణ
సంస్థ యొక్క ప్రతి కార్యాచరణ యొక్క సృష్టి సంస్థాగత సంస్కృతితోనే నిర్దేశించబడటమే గాక, సాంస్కృతికంగా ప్రభావం చూపబడుతుంది. సంస్థాగత సంస్కృతిని సంస్థలు వాటికై అవి అర్థం చేసుకొనటం వలన సంస్థ యొక్క సభ్యులు సమర్థవంతంగా లక్ష్యాలని చేరుకోవటంలో దోహదపడుతుంది. ఈ పరిజ్ఞానంతో బాహ్య జనులు కూడా సంస్థని అర్థం చేసుకొనటానికి అవకాశం ఉన్నది.
ప్రాథమిక అంశాలు
సంస్థాగత సంస్కృతి యొక్క భావన, సాంస్కృతిక నృశాస్త్రం లో సంస్కృతి పై ఉన్న భావన నుండి ప్రసరిస్తుంది. అందుకే నిర్ధిష్ట సంస్కృతిని రూపుదిద్ది తద్వారా సామూహిక సంస్థాగత ప్రవర్తనని మరియు సంస్థలలో వ్యక్తుల ప్రవర్తనలని ప్రభావితం చేయగలిగే సంస్థలే మనగలుగుతాయి. విలువల, ప్రమాణాల, ఆలోచనావిధానాల మరియు నమూనాల పరస్పర సంకర్షణల వలన సంస్థాగత సంస్కృతి ఉద్యోగులని సమిష్ఠిగా వర్గీకరిస్తుంది. సంస్థాగత సంస్కృతి పైన, సంస్థ యొక్క రూపురేఖల పైన బాహ్య ప్రపంచపు ప్రభావమే అధికం ఉంటుంది.
సంస్థాగత సంస్కృతి లో మార్గదర్శక పరిశోధకులు అయిన ఎద్గార్ హెచ్ షైన్ సంస్థాగత సంస్కృతిని ఈ విధంగా నిర్వచించాడు. "బాహ్య స్వీకరణకీ, అంతర్గత అనుసంధానానికి మధ్య ఉద్భవించే సమస్యలని పరిష్కరించుకొనటానికి ఒక సమూహం నేర్చుకొన్న, నిరూపించబడిన, ఆమోదించబడిన, అందువల్లే కొత్త సభ్యులకి హేతుబద్ధ కోణంలో మరియు భావోద్రేక కోణంలో సమస్యలని పరిష్కరించుకోవటానికి సరియైన విధానంగా అందివ్వబడే సాధారణ ప్రాథమిక ఊహల నమూనా."
ఇతర నిర్వచనాలు:
"సంస్కృతి అనే పదం నృశాస్త్రం నుండి వచ్చినది. దీని అర్థం పై ఏకాభిప్రాయం లేదు. అందుకే సంస్థాగత అధ్యయనాలలో దీని అనువర్తనాలు విధవిధాలుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు." - QSmircich, 1983 "సంస్థాగత సంస్కృతి సంస్థలో సర్వత్రా ఉనికిలో ఉన్న వివిధ సందర్భాలలో మనం ఏం చేస్తాం, ఏం ఆలోచిస్తామో వాటిలో ఇమిడి ఉన్న సాంప్రదాయాల, విలువల, విధానాల, నమ్మకాల మరియు ధోరణుల సముదాయం." - McLean and Marshall, 1985 "పని చేయటానికి మనం ఏమేం చేయాలో అవి చేయటం." - Bright and Parkin, 1997