"నాయనార్లు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
41 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి (clean up, replaced: మహత్యము → మాహాత్మ్యము (4) using AWB)
[[బౌద్ధ]], [[జైన]] మతములు స్థిరపడడానికి తోడ్పడిన ముఖ్యవిధానము "ఆహార-అభయ-భైషజ్య-శాస్త్రదానము". వీటిలో ఆహార-అభయ-భైషజ్యములు జనులకు నిత్యమున్ను కావలసినవే. మిషనరీ లందరూ ఏమతమువారైనా ఈమూడింటిని వినియోగించే తమ మతమును వ్యాప్తిలోనికి తెచ్చుకొనేది. ఆపద్ధతినే అవలంబించకపోతే శైవమతమును వ్యాప్తిలోనికి వచ్చి బౌద్ధజైనమతప్రచారము నిలువదని ఆకాలములో తోచినది. దానికి తోడు కేవలము శాస్త్రముగాక భక్యవేశముకూడా పుట్టిస్తేగాని మొదటి మూడున్ను నిష్ప్రయోజనములు అవుతాయని తోచినది. ఈపద్ధతులన్నింటినీ ఆనాటి శైవమతావేశాపరు లాచరణలోనికి తెచ్చినారు. అందులో భక్తివ్యాప్తికి భక్తచరిత్రములు చాలా ఉపయోగపడినవి. ఆశైవభక్తులకే "నాయనార్లు" అనిపేరు.
 
నాయనారు అంటే పూజ్యుడు అని అర్ధము. శివభక్తులెవరినా పూజ్యులే. అయినా, వారిలో ఎక్కువ ప్రసిద్ధిపొదినవారి పేళ్ళు జనశ్రుతిలో స్థిరముగా నిలచినవి. అసంఖ్యాతమహేశ్వరులలో అరవైముగ్గుర పేళ్ళు మాత్రము రానురాను జనుల వాడుకలోను, శైవప్రచారములోను నిలిచినవి. వీరినే '''అరవత్తుమూవురు'''(అఱుబత్తుమూవర్) అని అంటారు.
 
నాయనార్ల సంఖయ్ 63గా ఏర్పడడానికి కారణములేకపోలేదు. జైనబౌద్ధమత ప్రచారమును అరికట్టడానికి పూనుకొనిన మతప్రచారకులు వాతిలో ఉన్న పోలికలతో నూతన మతనిర్మాణములోనికి దిగుమతిచేసి జనులకు నమ్మకము పుట్టించి ఉంటారు. ఒకప్పుడున్న పేరునట్లే ఉంచి తత్సంబధమైన కథను వేరేగా చెప్పబడినది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1545773" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ