"గుండమ్మ కథ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సినిమా కథని చక్రపాణి తిరగరాసిన తర్వాత మాటల రచయిత నరసరాజు, దర్శకుడు కామేశ్వరరావు, స్క్రీన్ ప్లే రచయిత చక్రపాణిల మధ్య జరిగిన కథాచర్చల్లో నటీనటుల ఎంపిక జరిగింది. ఆ చర్చల్లోనే వెంటనే [[ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]]లను తీసుకుందామని నిర్ణయించుకున్నారు. సినిమా అనుకున్ననాడే గుండమ్మ పాత్రకు [[సూర్యకాంతం]] అయితేనే సరిపోతారని భావించారు. గుండమ్మ నిజానికి తెలుగుపేరు కాదు కన్నడపేరు. కన్నడంలోని ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధానపాత్రగా చేసుకున్నారు. ఆ పాత్రకు ఏ పేరుపెట్టాలా అని తర్జనభర్జనలు పడుతుంటే, మరో పేరు ఎందుకు గుండమ్మ అన్న పేరే పెట్టేద్దామని నిర్ణయించారు చక్రపాణి. అంత కీలకమైన పాత్రకి పెట్టే పేరు తెలుగుపేరు కాకపోవడమా అన్న సందేహాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తే, "ఇందులో ఏముంది, పెడితే అదే తెలుగు పేరు అవుతుంది" అని కొట్టిపారేసి గుండమ్మ అన్న పేరు ఖాయం చేసేశారు.<br />
సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు.<ref name="ఈనాడు ఆదివారం.. 50 వసంతాల" />
=== చిత్రీకరణ ===
సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా [[మార్కస్ బార్ట్లే]] వ్యవహరించారు.<ref name="movie titles">గుండమ్మ కథ సినిమా టైటిల్స్</ref> సినిమాలో ముఖ్యపాత్రలు చేసిన [[ఎన్టీ రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి (నటి)|సావిత్రి]], [[ఎస్.వి. రంగారావు]], [[సూర్యకాంతం]] తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు. వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదు. కాల్షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకూ అలా కుదిరిన కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు. ఏ షాట్, ఎవరెవరి కాంబినేషన్లో షాట్ తీయాలన్నా సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు. విజయా వారికి చెందిన [[వాహినీ స్టూడియో]]లో గుండమ్మ ఇంటి సెట్ వేసివుంచారు. రోజూ ఉదయం చక్రపాణి ఆఫీసుకు వచ్చేసి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, ఎస్వీఆర్ మొదలై నటులకు ఫోన్ చేసేవారు. ఫోన్లో ఆరోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కునేవారు. ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్ కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాతి రెండ్రోజుల సంగతి తెలుసుకుని ఫోన్ పెట్టేసేవారు. మరెవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే పిలిపించేవారు. వచ్చినవాళ్ళలో స్క్రిప్ట్ ని బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకుని వాళ్ళతో షూటింగ్ చేసేవారు. సినిమాలో "కోలో కోలోయన్న" పాట ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జమున జంటలు పక్కపక్కనే ఉండి పాడుకుంటున్నట్టు చూపించారు. కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయనేలేదు. ఎవరికి ఎప్పుడు ఖాళీవుంటే వారితో అప్పుడు పాటను తీసేశారు. ఎడిటింగ్ లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీగా ఎ.కృష్ణన్, సౌండ్ ఇంజనీర్ గా వి.శివరాం వ్యవహరించారు.
 
== సంభాషణలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1606105" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ