"చాణక్యుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Chanakya.JPG|thumb|500px|చాణక్యుడు.]]
'''చాణక్యుడు''' ([[సంస్కృతం]]: चाणक्य ''Cāṇakya'') (c. 350-283 BC) మొదటి [[మౌర్య వంశము|మౌర్య]] చక్రవర్తి అయిన [[చంద్రగుప్త మౌర్యుడు|చంద్రగుప్తుని]] ఆస్థానంలో [[ప్రధానమంత్రి]] మరియు తక్షశిల విశ్వవిద్యాలయం లో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు.<ref>{{cite journal | first = Roger | last = Boesche | year = 2003 | month = January | title = Kautilya's ''Arthaśāstra'' on War and Diplomacy in Ancient India | journal = The Journal of Military History | volume = 67 | issue = 1 | pages = 9–37 | id = ISSN 0899-3718 }} "Kautilya [is] sometimes called a chancellor or prime minister to Chandragupta, something like a Bismarck…"</ref>. '''కౌటిల్యుడు''' మరియు '''విష్ణుగుప్తుడు''', అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు<ref name=Mabbett>{{cite journal | first = I. W. | last = Mabbett | year = 1964 | month = April | title = The Date of the Arthaśhāstra | journal = Journal of the American Oriental Society | volume = 84 | issue = 2 | pages = 162–169 | id = ISSN 0003-0279 }}</ref>. చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదైన 'అర్ధ' పురుషార్ధము గురించి అర్దశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ది చెందింది.<ref>L. K. Jha, K. N. Jha (1998). "Chanakya: the pioneer economist of the world", ''International Journal of Social Economics'' '''25''' (2-4), p. 267-282.</ref>. చాణక్యుడు [[తక్షశిల విశ్వవిద్యాలయం]]లో భోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు [[చాణక్య నీతి దర్పణము]] <ref>{{cite book|last1=చాణక్యుడు|last2=వెంకయ్యార్య|first2=ఆరమండ్ల|title=చాణక్య దర్ప నీతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Chanakya%20Neethi%20Darpanamu&author1=A.Venkaiahrya&subject1=-&year=1996%20&language1=telugu&pages=356&barcode=2020120034333&author2=&identifier1=&publisher1=GAYATRI%20ASRAMAMU&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/338}}</ref> అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని హిందీ భాషలో జగదీశ్వరానంద సరస్వతి, తెలుగులో ఆరమండ్ల వెంకయ్యార్య అనువదించారు
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఇతడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడి తండ్రి పేరు చణకుడు. ఆయన స్వయంగా అధ్యాపకుడు కావడం వల్ల విద్య యొక్క విలువ బాగా తెలుసు. తక్షశిల అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వ విద్యాలయం. చాణక్యుడు చిన్నవాడి గా ఉన్నప్పుడే వేదాలు చదవడం ప్రారంభించాడు.
 
 
==పాటలీపుత్ర ప్రస్థావన==
నందులు మహామంత్రియు నేర్పరియునగు రాక్షసుని మాటలేవియును పాటింపక మిగుల స్వతంత్ర భావముతో వర్తించుచుండిరి. ఒకదినమున చాణక్యు డను యువకుడు పండితవతంసుడు నందరాజుల సభకువచ్చి అందు గల యొక యున్నతాసనమున నాసీనుడై యుండెను. నందు లచటకువచ్చి యుత్తమ పీఠమునందున్న యాపేదబాపని మిగుల దిరస్కారభావముతో జూచి సింహాసనమునుండి పడ లాగిరి. అమాత్యరాక్షసుం డిది యక్రమమనియు బండితులు పూజనీయులనియు బోధించెను కాని లాభములేకపోయెను. సిగముడి వీడ నున్న తాసనమునుండి లాగబడిన చాణక్యుడు నందులను గోపముతో దేఱి పాఱజూచి "ఓ నందాధము లారా! బహుజనమధ్యమునందు నన్నిటల అవమానించితిరి. మిమ్మిటులే సింహాసనమునుండి లాగి మీతలలను నరికి గానీ మీచే నూడ దీయబడిన యీ తలవెండ్రుకల ముడి వేసు కొనను" అని శపధము చేసి సభామందిరమును వదలి వెడలిపోయెను.
 
చాణక్యు డిటుల గోపించి పోవుటజూచిన చంద్రగుప్తుడు మాఱుత్రోవను బోయి యొక యేకాంత ప్రదేశమున జాణక్యుని గలిసికొని సాగిలి పడి నమస్కరించి నందాదులచే దానొందు నవస్థలను దెలిపి తన్నను గ్రహింపుమని వేడుకొనెను. చంద్రగుప్తుని లేవనెత్తి చాణక్యు డాదరించి నందరాజ్యమునకు నిన్ను బట్టాభిషిక్తుని గావించుట నారెండవ ప్రతిజ్ఞయని చెప్పి, నాడు మొదలు చంద్రగుప్తుని తనయొద్దనే యుంచుకొని నందకుల నిర్మూలమునకై ప్రయత్నములు చేయుచుండెను.
 
 
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1651016" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ