ఎల్లుట్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: సంఖ్యు → సంఖ్య (2) using AWB
చి →‎మూలాలు: clean up using AWB
పంక్తి 112: పంక్తి 112:


[[వర్గం:అనంతపురం జిల్లా గ్రామాలు]]
[[వర్గం:అనంతపురం జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]

01:53, 22 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

ఎల్లుట్ల, అనంతపురం జిల్లా, పుట్లూరు మండలానికి చెందిన గ్రామము [1]

ఎల్లుట్ల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం పుట్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,372
 - పురుషుల సంఖ్య 1,176
 - స్త్రీల సంఖ్య 1,120
 - గృహాల సంఖ్య 528
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

"పచ్చని లోగిలి .... ఎల్లుట్ల ""

  • పాడి పంటలుతో కళకళ

చుట్టూ కొండలు.... చెట్ల మధ్యన గ్రామం.... ప్రతి ఇంటిముందు చెట్లు. పాడి పశువులు, కోళ్ళు గొర్రెలు.... ఇది ఏదో కోనసీమలో ఉందనకుంటే పొరపాటే. అత్యల్ప వర్షపాతం ఉన్న అనంతపురము జిల్లా పుట్లూరు మండలంలో ఉంది. అదే ఎల్లుట్ల. పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల గ్రామపంచాయతీ పాడి పంటలుతో కళకళలాడుతుంది.ప్రకృతి అందాలు ఆ గ్రామం సొంతం. కొండల మధ్యన ఉండటం ఒక వరం.దశాబ్దకాలం నుంచి ఇక్కడి ప్రజలు ప్రభుత్వ పథకాలను సదివ్నియోగం చేసుకుంటూ లబ్ది పొందుతున్నారు. ఎల్లుట్ల గ్రామంలో 320 ఇళ్ళు ఉండగా అందరు ఉదయం అయ్యే సరికి చేతిలో అన్నం క్యారీలను చేతబట్టుకొని తోటలలోని పనులకు వెళ్తూ దర్శనం ఇస్తారు. అలాగే మరి కొందరు అరటిగెలలును లోడ్ చేయడానికి వాహనాలలో దర్శనం ఇస్తారు. ఉదయం అయ్యే సరికి గ్రామం యొక్క ప్రధాన సర్కిల్ రవాణా వాహనలుతో రద్దీగా కనిపిస్తుంది. గ్రామం చుట్టూ అరటితోటలు:- గ్రామం చుట్టూ అరటితోటలుతో,కొండల మధ్యనా పచ్చని చెట్ట్ల్లతో కళకళలాడుతుంది. ఈ గ్రామాన్ని చూడగానే మనము ఏమైనా కోనసీమకు వచ్చామా అన్నట్లుగా అనిపిస్తుంది. తోటలో ఇంట్లో వాడుకకు కావాల్సిన కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. తోటలో అరటి, మామిడి,దానిమ్మ,సీతాపలం పండిస్తున్నారు. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది. పాడి పుష్కలం :- ప్రతి ఇంటికి పాడి పశువులు సంవృద్దిగా ఉన్నాయి. చుట్టూ కొండలు ఉండటంతో అందరు వ్యవసాయం చేస్తున్నారు. గ్రాసం సమస్య లేక పోవటంతో ప్రతి ఇంటికి స్థాయి తగ్గటు పశువులు ఉన్నాయి. దీంతో గ్రామం పశువులతో కళకళలాడుతుంది. గొర్రెలు,మేకలు పెంపకంతో అదనపు ఆదాయం :- గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ గొర్రెలను,మేకలను, పొట్టేళ్లను పోషిస్తున్నారు. జీవాలను పోసిసించటం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లబిస్తుంది. వ్యవసాయ పనులు చేయలేని వృద్ధులు వీటిని పోషిస్తూ కుటుంబ పోషణకు తమ వంతు బాధ్యతనిర్వహిస్తున్నారు. వీటితో పాటు కోళ్ళను పెంచుతున్నారు. బిందు, తుంపర్ల సేద్యం ద్వారా పంటలు పండించడం:- ఏడాదికి మూడు పంటలను సాగు చేస్తూ ఇక్కడి రైతులు అభివృదిపథంలో ముందున్నారు. అరటి, దానిమ్మ, టమోటా, మిరప, వేరుసెనగ పెంచుతున్నారు. తక్కువ వర్షపాతం నయోదు అవుతున్నా .... గ్రామంలో వాటర్ షెడ్ వారు నిర్మించినా చెక్ డ్యాంలు, మరియు కుంటలు నిర్మించడంవల్ల వర్షపు నీరు వృధాగా వెళ్ళకుండా ఎక్కడ పడినటువంటి వర్షపు నీరు అక్కడే నిలువ ఉన్న్డటం వాళ్ళ కోద్దిగా భూగర్భ జలాలు ఉండటం తో ఏడాదిలో మూడు పంటలను పండింస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు ద్వారా అధిక విస్తిర్ణంలో సాగు చేస్తున్నారు. పల్లె చుట్టూ పచ్చని పందిరి వేసినట్లుగా కనిపిస్తున్నాయి.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎల్లుట్ల&oldid=1708288" నుండి వెలికితీశారు